Tuesday, October 19, 2010

ఆలోచనల స్రవంతి - 10

నేను వ్రాసిన blog మీద comments
1 . నేను చాలా cynical గా వ్రాస్తున్నాను
2 . నేను నా శైలిని కొంచం smooth గా మార్చాలి
3 . అన్ని విషయాలు కలగా పులగంగా కాకుండా ఏదో ఒక topic తీసుకుని వ్రాయాలి
4 .కొంచం positive గా వ్రాయాలి.
5 . నా ఫ్రెండ్ ఒకడికి chirpy jokes కావాలి  - మళ్ళీ వాడే చెప్పాడు అందరూ చెప్పింది విను, నీకు నచ్చింది వ్రాయి
6 . ఇలా అందరి గురించి చెడ్డగా వ్రాస్తే తీసుకెళ్ళి జైల్లో పెడతారు - ఏమిటి దీనికే??
7 . నాకు కొంచం టైం సరిపోవడం లేదు చదవడానికి - తరువాత చూస్తాను - Thankyou very much
8 . నేను మొన్న వెళ్ళిన భద్రాచలం ట్రిప్ గురించి వ్రాయమని suggestion కూడా వచ్చింది. సరే దాని గురించి తరువాత ప్రయత్నిద్దామనిపించింది - ఎందుకంటే జీవితం మీద నా దృక్పథం, నాకు తెలిసిన వేదాంతాలు, topics వేగంగానే అయిపోతాయి  - తరువాత current affairs మీద,  అవి ఎప్పటికప్పుడు వ్రాయొచ్చు  - ఇక వ్రాయడానికి మిగిలేవి నా travelogues , ఆత్మ కథలు అంతే.


ముందు శైలిని smooth చేసి,  ఒక topic తీసుకుని, పాజిటివ్ గా ఎలా మొదలెట్టాలి -
శైలి  గురించి మాట్లాడితే నాకు చెలం గారి definition గుర్తుకు వస్తుంది  - " ఆత్మే శైలి"  - మరి నా ఆత్మ ఇంత క్షోభిస్తే శైలి smooth గా ఎలా వస్తుంది.
ఇక positive topic
"భారతదేశం చాలా సుభిక్షమైన దేశం "
వెంటనే నా స్మ్రుతి పధం లో ఒక ICWAI మెరుపు మెరిసింది. నేను ICWAI చదివే రోజులలో ఒక economics ప్రొఫెసర్ ఉండేవారు - ఆయన క్లాసు మొదలు పెట్టడమే" India is the richest country with the poorest people " అని మొదలుపెట్టేవాడు. ఆయన పేరు గుర్తు లేదు కానీ వైజాగ్ లో ICWAI చేసిన ప్రతీ వాడికి ఈ డైలాగు తెలుసు.మళ్ళీ cynical  గా .....


OK - now be positive -
"ఈ ప్రపంచం ఎంతో శాంతియుతంగా ఉంది "
మెరుపుల సంగతి తరువాత   - ఈ సారి ఏకంగా నా బుర్ర block అయిపొయింది.


సరే ఇలా కాదు - నాకు తెలిసిన ఒక chirpy joke of santa banta చెప్దామనిపించింది
ఒక 18 years అమ్మాయి. నాకు నెల తప్పింది అని తల్లీ తండ్రులకి చెప్పింది. వాళ్ళిద్దరూ అగ్గి మీద గుగ్గిలం.
ఎవరని అడిగారు. ఆ అమ్మాయి పేరు చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చింది. తండ్రీ నెంబర్ కాల్ చేసి ఆ అబ్బాయిని ఇంటికి రమ్మని పిలిచాడు.
అబ్బాయి వచ్చాడు. తండ్రి  విషయం వివరించాడు. వెంటనే ఆ అబ్బాయి సరే నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కుదరదు. నాకు నా problems ఉన్నాయి మీ అమ్మాయికి అబ్బాయి పుడితే నాలుగు లక్షలు, అమ్మాయి పుడితే ఆరు లక్షలు, twins పుడితే పది  లక్షలు ఇస్తాను. అలా కాకుండా mis -carriage అయితే అని ఇంకా ఏదో చెప్పబోయాడు -
వెంటనే తండ్రి gun తీసి గురిపెట్టి అన్నాడు - "ఇంకేమీ చెప్పకు మళ్ళీ try చెయ్యాల్సిందే"
ఎన్ని jokes చెప్తే నా sense of humour కి certificate ఇస్తాడో నా friend .


తెలియదు కానీ నాకైతే నీ blog చదవడానికి time లేదు అన్నవాళ్ళ పై చాలా గౌరవం, సంతోషం .
ఎందుకంటే నా బుర్రని తొలుస్తున్న విషయాలు వాళ్ళ బుర్రకి ఎక్కితే - -వాళ్ళకీ సుఖంగా నిద్ర ఉండదు - ఇలాటి చిద్ర, భగ్నకవిత్వాన్ని ఇంత acid లాటి negative thoughts అన్నీ చూసి, చదివి ఆలోచించి  బాధ పడేకంటే ,  దాని మీద చదవకపోడమే మంచిది కదా.


జైలు లో పెడతారు. ఇది కొంచం ఇబ్బందే. ఇంక ఈ మాత్రం freedom of speech మిగిలింది అనుకుంటున్నాను. ఇలా చెప్పినా బొక్కలో తోసేస్తే ఇంక before independence మనవాళ్ళు కుట్ర చేసినట్టు secret  గా   మాట్లాడుకోవటమే.




పవర్ గురించి వ్రాస్తున్నప్పుడు  - మత గురువులు అని మొదలెట్టి ఆపేసాను - వచ్చే సారి దాని గురించి నాకు తెలిసింది


సశేషం

1 comment:

  1. sir
    ignore suggestions.
    upto now you are writing your own way without trying to sell your brilliance or whatever.my feeling is when we try to write according to peoples wishes your version fades and what remains is .............
    even i suggested. you ignore me

    ReplyDelete