"పవర్"
నేను భౌతిక శాస్త్రం లో పవర్ గురించో, Electrical పవర్ గురించో, Maths లో పవర్ గురించో, Economics లో పవర్ గురించో మాట్లాడటం లేదు. Social Power గురించి, ఒక మనిషి తన చుట్టుపక్కల పరిస్థితులని మనుషులని తన అదుపులోకి తీసుకోవడం గురించి నాకు అనిపించింది వ్రాద్దామని.
కీర్తి కి కారణమైన రెండిట్లో ఇదొకటి. అసలు ఇది దేనికి అవసరం???
నేను పవర్ గురించి పుస్తకం వ్రాయదల్చుకోలేదు. ఎందుకంటే అవి already ఉన్నాయి. "Anatomy of Power " by J .L .Galbraith చదివితే పవర్ తాలూకు classifications అన్ని తెలుస్తాయి.Giddens అనే ఆయన Sociology , Theory of structuration అని ఒక నలభై, ఏభై పుస్తకాలైనా వ్రాసి ఉంటాడు. ఇవన్నీ నేనూ చదవలేదు. అలా చదువుకుంటూ పొతే నేను మిగతా పనులు మానేసి చదువుకుంటూ ఉండిపోతానేమో. నాకు అనిపించింది తెలిసింది వీలయినంత సులభమైన మాటలలో వ్రాద్దామని ప్రయత్నం. కానీ నాకు ఇక్కడ ఒకటి అనిపించింది.ఏ సబ్జెక్టు అయినా సరే, analyse చేస్తున్నవాళ్లు వాళ్ళకి తెలిసిన subject ని విప్పుకుంటూ చెప్పుకుంటూ పోతున్నారు. వాళ్ళు ఆ సబ్జెక్టు లో ఏ స్టేజికి వెళ్ళిపోతారు అంటే అవి అందరికి అర్ధం అయ్యేలా ఉండవు.అవి అర్ధం చేసుకుని ప్రజలకి చెప్పగలిగిన వాళ్ళు , వాటిని వాళ్ల వాళ్ల ప్రయోజనార్ధం వాడుకుంటారు కానీ అవి అర్ధం చేసుకొని ప్రజలకి ఉపయోగ పడేలా చేద్దామనుకోరు.ఉదాహరణకి Economics లో ప్రతి సంవత్సరం Nobel prize ఇస్తారు. Economics ఇంతలా అభివృద్ది చెందిన సబ్జెక్టు అయితే అది అందరి మంచికి ఉపయోగపడేదే అయితే మరి rich అండ్ poor కి మధ్య ఈ differntiation దినదినాభివృద్ది ఎలా చెందుతున్నాదో ???
నేను ఊహించిన ఒక situation . ఇలాగే అనుకోవఖ్ఖరలేదు - వేరే వేరే పరిస్థితులలో కూడా అనుకోవచ్చు - నేను అనుకున్నది ఇలా - - - -
అనాదిలో మనిషి పూర్తిగా అభివృద్ది చెందని రోజుల్లో అంటే రాతి యుగంలో జంతువుని వేటాడి తినే time లో బలమైన వాడు పరిగెత్త గలిగేవాడు, వేటాడి తెచ్చుకుని తినగలడు - మరి సత్తువ లేని వాడో - ఏమి చేస్తాడు? -
1 . బలమైన వాడిని ఆకట్టుకుని/ కాకా పట్టి వాడి దగ్గిర తీసుకుని తినచ్చు
2 . బలమైన వాడిని ఏమార్చి / మోసం చేసి
3 . బలమైన వాడిని కంట్రోల్ లో పెట్టుకుని
ఇందులో మొదటి రెండిటి ఫలితం అప్పటికప్పుడు మాత్రమె ఉంటంది. మూడో దానికి ఫలితం long term లో ఉంటుంది.
మొదటిది సత్తువ లేక తెలివి కూడా లేకపోతే వాడాల్సింది. రెండవది సత్తువ లేక ఒక రకమైన తెలివితేటలూ ఉంటే.
మరి ఈ సత్తువ లేని వాడికి మూడోది better కదా.కానీ దానికి చాలా తెలివి తేటలు కావాలి. బలమైన వాడి మీద కంట్రోల్ సాధించాలి. బలమైన వాడిని కంట్రోల్ చేసే పద్ధతులేమిటి. వాడి ఆలోచనల మీద పట్టు సాధించడం. వాడి ఆలోచనల మీద పట్టు సాధించాలంటే
1 . వాడిని భయ పెట్టాలి - వాడి భయానికి relaxation ఇచ్చేది వీడి దగ్గిర ఉండాలి
2 . వాడి అవసరాన్ని పట్టాలి - వాడి అవసరానికి వీడి దగ్గిర solution ఉండాలి.వాడికి అవసరం లేకపోతే create చెయ్యాలి.
బలమైన వాడికే తెలివితేటలూ ఉంటే -వాడింక ఎవడిని లెఖ్ఖ చేయ్యఖ్ఖరలేదు - ఇవే పద్ధతులు వాడి పీల్చుకు తినేయడమే
ఒక సమూహంలో ఒకడు powerful శక్తిగా ఎదగాలంటే కూడా ఈ పైన చెప్పినవి use చేస్తే చాలు - కానీ ఒకడి మీద కాదు - general గా సమూహం తాలూకు psychology మీద వాడి కంట్రోల్ చెయ్యడమే
nation to nation dealings లో కూడా ఇదే పద్ధతి - latest technical terms ఏవో వాడతారు - కానీ పద్ధతి ఇంతే
ఇప్పుడు latest situtations కి కూడా ఇదే వర్తిస్తుంది.
పాత యుగాల్లో ఇప్పటిలా rations ఉండి ఉండవు. మనిషి ఆలోచన తన చుట్టు పక్కల వాటి పైన ఒక అవాగాహనా ఇప్పుడు ఉన్నంత ఉండేవి కావు. అప్పటిలో మెరుపులకి, ఉరుములకి కూడా మనిషి భయపడేవాడు. అలాటప్పుడు తెలివైనవాడు ఒక మత గురువై , బలమైనవాడి అనుచరుడై - వీడి తెలివి వాడికి, వాడి భుజబలం వీడికి - ఒకరికి ఒకరు తోడై నలుగురి మీద కంట్రోల్ పెట్టుకుని సుఖంగా బతికేవారు. కాలక్రమేణా అవే రాచరికాల క్రింద , బ్రాహ్మణత్వం క్రింద మారాయి. ఇంకొంచం తెలివైన వాళ్ళు- వీళ్ళ combinations తో పోటీ పడలేని వాళ్ళు- వేరే వేరే వృత్తులతో వాళ్లకు వీలైనంతలో సంఘం ఏర్పాటులో బతికే వారు.
వాళ్ళే వైశ్యులని, సూద్రులని చేసే వృత్తిని బట్టి పేరు.
ఇప్పుడు already తెలివైనవాడు స్థాపించిన సంఘంలో తెలివైన వాడి కొడుకు ఒక తెలివిలేని దద్దమ్మ అయితే - ఆ దద్దమ్మ కూడా సుఖపడడానికి తెలివైన వాడు చేసే rules and regulations . తెలివైన వాడు , వాడు పొందిన సుఖం వాడి తర తరాలకి ఏర్పాటు అయ్యేలా - వేరే వాళ్ళకి ఇవ్వకుండా / అందకుండా ఉండేలా ఒక దమన కాండ/ ప్రయోగాలు.
సిద్ధాంతాలు - వేదాంతాలు తో నిజంగా ఒక వెలుగు వెలిగిన హైందవ జాతి పతనానికి ఈ internal దమనకాండ - జాతుల ,కులాల విభేదాలు
- ఈ విబేధాలని ఆసరాగా చేసుకుని ఈ జాతిపై జరిగిన external దమనకాండ , ముస్లిం invasions (eg . ఘజిని & గోరి , మోఘులులు etc .,) - వ్యాపారం పేరుతొ కాళ్ళ దగ్గిర చేరి తరువాత Divide and rule పద్ధతులు పాటించి పాలించిన British , Portuguese ,Dutch ఆక్రమణలు
-ఈ external దమనకాండకి కారణం భారతదేశంలో ఉన్న సహజ నిధి నిక్షేపాలు.
ఎవడు అపార సంపత్తిని, అందరికి అవసరమైన వనరులని గుప్పిట్లో పెట్టుకున్టాడో వాడు powerful.
మరి ఈ అణగ తొక్కబడిన వర్గాలలో తెలివైన వాళ్ళు పెరిగి - తిరగబడితే - అదో revolution - వాళ్ళు తిరగబడలేని పరిస్థితులలో వేరే వాళ్ళతో చేతులు కలిపి అధికారంలో ఉన్నవాళ్ళని కూలతోయ్యలని ప్రయత్నం - అంటే conspiracy
ఇంతకు ముందు రాజులు యుద్ధాలు చేసి వారి వారి అస్తిత్వానికి భంగం కలగకుండా చూసుకునేవారు -
రాచరికాలు పోయిన తరువాత - ఇప్పుడు Trade , Economy , Business పేరుతొ ధనిక దేశాలు పేద దేశాలని control చెయ్యడం.
పేరు మారినా పని అదే - పవర్ politics - ఏ కాలానికి తగ్గట్టుగా ఆ కాలపు దారులు వేరు.
బ్రిటిష్ వాళ్ళు మన దేశం మీదకి దండయాత్ర చేసే సమయానికి ఈ రాజులు, బ్రాహ్మణుల ఆధిక్యం ఉండేది - వారు ఈ రెండు జాతులనీ almost అణగ తొక్కి - వారి పాలన స్థిరం చేసుకున్నారు
భారత దేశానికి స్వతంత్రం????? వచ్చిన తరువాత నాశనమైన వీరు మళ్ళీ నిలద్రోక్కుకో లేదు - కుదిరిన చోట ఎక్కడో కుదిరించుకున్నారు- కానీ చాలా తక్కువ చోట్ల - ఎవరైతే వ్యాపారము, వాణిజ్యము కంట్రోల్ చేస్తారో - ప్రస్తుతం ఆంధ్ర లో అయితే రెడ్డిలు, కమ్మలు, ఇప్పుడు కొంచం కాపులు - రిజర్వేషన్ సాయం తో ఎదిగిన బీసీలు , పాత చరిత్ర అవశేషాలతో కొంతమంది రాజులు , బ్రాహ్మలు - ముస్లిం సామ్రాజ్య అవశేషాలు కొంతమంది నిజాంలు - కర్ణాటకలో గౌడలు, లింగాయతులు - రక రకాల రాష్ట్రాల్లో ఇలాగ చెప్పుకోవచ్చు - ఎవడికి దొరికిన పవర్ వాడు వదులుకోకుండా ఎదగడానికి ప్రయత్నం.
ఇప్పుడు power లో ఉన్న తెలివైన కులాలు మళ్ళీ పాత పద్ధతే - దద్దమ్మ వారసులు కూడా సుఖపడడానికి తెలివైన అధికారంలో ఉన్న వాడు చేసే rules and regulations . తెలివైన వాడు , వాడు పొందిన సుఖం వాడి తర తరాలకి ఏర్పాటు అయ్యేలా - వేరే వాళ్ళకి ఇవ్వకుండా / అందకుండా ఉండేలా ఒక దమన కాండ/ ప్రయోగాలు
ఒక సమాజ హితం, హితమైన మతం గోడే లేదు ఎవడికి. మతాల politics , కులాల politics , communal politics etc ., అసలు పవర్ కంట్రోల్ చెయ్యడానికి ఎవడు పడితే వాడు వాడని తురపు ముక్కే లేదు
ఏమీ వాడకుండా కూర్చున్నవాడు చేతకానివాడు
దీనికి ఒక ఉదాహరణ
నా చిన్నప్పుడు లంచం తీసుకుంటే వాడి గురించి చాలా నీచంగా చెప్పుకునే వారు
నేను డిగ్రీ చదివే టైం లో ఎవరికి దొరక్కుండా లంచం తీసుకోవడం ఒక heroism లా చూసేవారు - సంపాదనే లక్ష్యం
ఇప్పుడు లంచం బహిరంగంగా తీసుకుంటూ, వాడిని ఎవడూ ఏమీ చెయ్యలేకపోతే వాడు హీరో
లంచం తీసుకొని వాడు - -శుద్ధ వెధవ - ఇదీ కాలం తో పాటు వచ్చిన మార్పు
ఇదనే కాదు - చాలా విషయాలకి ఇది వర్తిస్తుంది
పవర్ ని కంట్రోల్ చెయ్యడానికి - మతం techniques - conversions
సంపన్న దేశాల నించి డబ్బు ముందు ప్రవాహంలా మత మార్పిడి చేసుకున్న చోటికి ప్రవహిస్తుంది - తరువాత అదే రక్తం పీల్చబడుతుంది -
ఏవో కొన్ని హిస్టరీ పుస్తకాలు చదివాను - మతాల గురించి నా స్నేహితుడు రామకృష్ణ చెప్పాడు - Zorastrianism మూలమతం నించి పుట్టుకొచ్చిన మతాల గురించి - Paganism గురించి - Christianization గురించి - అదో సముద్రం - వాటి మూలల్లో వెతికితే పవర్ కోసం పాకులాటే కనపడుతుంది -
IMF నించి, world bank నించి,ఇతరత్రా సాధనాలనించి అప్పులు ఇవ్వబడతాయి - తీర్చలేని చోట పీల్చివేయబడతాయి-
కారా మాస్టారి యజ్ఞ్యం ప్రపంచ పవర్ చరిత్ర macro ని ఒక చిన్న micro లో చూపించిన అద్భుతం
ఇక్కడ already రాష్ట్రాల పేరుతొ,మతాల పేరుతొ, కులాల పేరుతొ తోక్కేసారు - అణగ తొక్కబడిన వర్గాల వారు కొంచం రిలీఫ్ దొరికినా చాలని ఈ మత మార్పిడి కి ఒప్పుకోవడం - చావడం కంటే మత మార్పిడి సుఖం కదా
పైకి కనపడని ముప్పేట దాడి -
తెలిసిన వాళ్లకి - -సులువు తెలుసుకొని సుఖపడ్డం మానేసి ఎందుకు అనిపించేలా పరిస్థితి
బానిసత్వం నుండి బయటపడి వచ్చిన భారత స్వతంత్రం వేరే పేరుతొ మళ్ళీ బానిసత్వం లోకి దిగజారుతున్న వైనం
ఆంధ్ర జనాభా ఆఖరికి Internet లో కూడా ఎవరో, రెడ్డి రాజులు, కమ్మ తేజాలు, కాపు సంఘాలు, ఆర్య వైశ్య సంఘాలు, విశ్వ బ్రాహ్మణ, brahmin groups etc ., - శుద్ధ nonsense .
నిజం గా అన్ని కులాలలోను లేని వాళ్ళు ఉన్నారు - వాళ్ళ గురించి ఎవరూ ఆలోచించారు - -చివరికి అమెరికా వెళ్లి అక్కడ కూడా తెలుగు వాళ్ల groups లో మళ్ళీ కులాల groups - తాన, బాన, ఆట , పాట ఏవిటో?
ఇక ముస్లిమ్స్ లో సున్ని, షియా అని దెబ్బలాట
వేరే దేశాలలో తెల్లవాళ్ళు , negroes , aboriginees , రెడ్ ఇండియన్స్ etc - ఏవో పేరులు ఇవే కుమ్ములాటలు
ప్రపంచ చరిత్రలో ఇవి చాలదన్నట్టు Hisotry ని dupe చెయ్యడం - దీని గురించి చెప్పాలంటే ఇదో మహా సముద్రం - " హిస్టరీ అంటే గెలిచినవాడు రాసుకునే autobiography " అన్నాడు ఒక philosopher
హిస్టరీ గురించి నా ఫ్రెండ్ రామకృష్ణ చాలా బాగా చెబుతాడు - మొన్న నేను భద్రాచలం వెళ్ళినప్పుడు - వాడు చాలా చెప్పాడు - నాకు కొంచం అర్ధం అయ్యింది - -కొంచం కాలేదు -
ఇక్కడ వాడి గురించి కొంత చెప్పాలి - తెలిసింది పదిమందికీ పంచడానికి వాడో స్కూల్ పెట్టి బ్రహ్మ ప్రయత్నం చేస్తున్నాడు - వాడి ప్రయత్నం ఎంత సఫలమైందో - వాడి విద్యార్ధులు, కాలం చెప్తాయి
సరే ఇక విషయానికి వస్తే ఎన్నో యుద్దాలతో, కొట్లాటలతో విసిగి విసిగి ఇప్పుడే ప్రపంచం కొంత సుఖంగా ఉండడం నేర్చింది.
ఈ రకమైన power concentration , repression - ఇంకో ప్రపంచ యుద్ధానికి తెర తీస్తాయి
శ్రీశ్రీ
" ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం
నరజాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వం"
తిలక్
" జడంగా ఉన్న ప్రపంచం నించి
ఎడంగా తప్పుకుంటుంది శాంతి"
ఇది భారతదేశ చరిత్ర ఒక్కటే కాదు - ఇది వేరు వేరు పేరులతో, వేరు వేరు ప్రదేశాలలో, జరిగిన, జరుగుతున్న ప్రపంచ చరిత్ర -
ఒక power చరిత్ర - ఒక రక్త చరిత్ర - ఒక మనిషి అవివేక చరిత్ర
నేను ఇందులో ఏవేవో చెప్పుకుంటూ పోయాను - చెప్పవలసింది చాలా ఉంది - ఒకే విషయం కాకుండా అన్నీ టచ్ చెయ్యాలని అనుకుని ఇలాగ ఏదో - -
మనందరి జీవితాలు సుఖమయం కావాలంటే - తెలివైన ప్రతీవాడు ఆలోచించాలి - అందరూ సుఖపడడం ఎలాగని - ఆచరించాలి - పదిమందికి ఈ నీతి పంచాలి - నిజం చెప్పాలి -
అప్పుడు ఒక నిజమైన మానవీయ సంఘం - సంఘం లో ఆనందం
అప్పుడు మానవాళి చరిత్రలో ఒక నిజమైన మరో ప్రపంచం - utopia
సశేషం
No comments:
Post a Comment