Monday, October 4, 2010

naa paata kavitvam - 8

20.09.1994
ఒకే రకం బాధని రకరకాల మాటలలో ఎన్ని సార్లు చెప్పడం. అదేమన్న తీరే బాధ,  కాదే. తీరేదే అయితే బాధపడ్డ, బాధపడి దాన్ని సాధించడానికి కష్టపడ్డ ఒక అర్ధం ఉంది.
ఆకలిని జయించలేను.
ప్రేమని సాధించలేను.
పోనీ అందరిలాగే బ్రతికేద్దమంటే తెలిసింది నాకు తెలియదని మోసం చేసుకోలేను. ఏం చేసినా ప్రయోజనం లేదు. సమాధనపడటానికి ఆలోచన అంగీకరించడం లేదు. ఒక నిర్వికార చేతనావస్థ లోకి పోతున్నాను. ఇక ఐహికం లో లేదు. ఆలోచన ఒకటే ఆధారం. ఆలోచించడం మానలేను.నా చేతిలో లేదు. ఈ పద్ధతి మారేలా కూడా కనిపించడంలేదు.
ఇక ఈ జీవితానికి అంతే.  
1997
ఈ విషయం రామానికి చెప్పాలనిపించింది. ఎంత దూరం వెళ్ళిపోయాడో ఎంతో. మురళీ వింటాడా , అర్ధం కాదేమో. అమ్మలూ నమ్ముతావా నువ్వైనా నన్ను. చెప్పుకోలేని ఒక అవస్థ. ఒంటరితనం వేరేక్కడో లేదు . ఆలోచనలలో ఉంది. అప్పుడు అనిపించింది ఎంత ఒంటరివాడిని నేనని . భద్రత ఎక్కడ ఉందిరా. రామా ఒళ్ళు వొంచడానికి కష్టమైతే అన్ని బాధలేరా. ఈ ప్రపంచంలో నీ కోసం ఎప్పుడు ఒక తలుపు తెరిచే ఉంటుంది. వెళ్ళడం నీ ఇష్టం. నన్ను తిట్టకురా. నేనూ నీ లాటి వాడినే.

No comments:

Post a Comment