Monday, October 4, 2010

naa paata kavitvam - 5

1994
ఓ కవితా
నీ కెంజాయ పాదాల తార మంజీరాల సడులతో 
నా హృదయ సంస్పందన నిర్వచిస్తావు

నీ కనుదోయి చటులతో చిరునగవు శిఖలతో 
నా మేథో ప్రాంగణపు జ్యోతిని వెలిగిస్తావు

నీ అపార అవ్యాజ కరుణా రసామృత ధారలతో
నా ఇహ నరనరాలలో ప్రవహిస్తావు

త్రుణీకరించినా తరగని దయ ప్రసరిస్తావు
ఈ వచస్సుదా సుమనస్కుని పూల వనంలో కుసుమిస్తావు 
1994
అలుపులేని అవసరంలేని నిరంతరాన్వేషణ 
నాలో నేను, నాతొ ప్రపంచంతో
సమాధానపడే స్వర్గానికి ఆరోహణ 
ఆద్యంత రహితమైన అనుభవాల స్వరాల సరాల 
దాల్చిన జీవిత గమ్యపు సమాలాపన 
జ్వలించే జగత్తు మొత్తం 
నీలో నాలో ప్రవహించి 
తనలో శమింప చేసే సమారాధన 

No comments:

Post a Comment