Thursday, October 27, 2011

New poetry - 14

నేను దాటని నా జీవితం 


నేను అన్న అహం  - నేను చూసిన భవం
కలిస్తే, జ్ఞ్యాపకంలో నిలిస్తే - అనుభవం


అనుభవం స్మరిస్తే  - అంతరంగం తెరిస్తే
అర్ధమయ్యే పరమార్ధం  - నిజం


నాకెదురైన అనుభవాల
నేను నమ్మిన నిజాల
కనుసన్నలలో నడిచే నేను
కరిగి ప్రవహించే క్షణాల
చెలగి విరచించే పదాల
మెరిసి రవళించే గీత కావ్యం - నా జీవితం