Friday, November 30, 2012

ఆలోచనల స్రవంతి -42


నేను ఈ భారతదేశం గురించి వ్రాసిన తరువాత “ ద్వేషానికున్న శక్తి ప్రేమకి లేదు” అన్న caption తో వ్రాద్దామనుకున్నాను. కానీ రామకృష్ణ ఇచ్చిన comments మీద నా opinion చెప్పకుండా ముందుకి పోవడం కూడా నచ్చలేదు. దీని మీద నా opinion చెప్తే ద్వేషం, ప్రేమ మీద కూడా నాకు అనిపించింది చెప్పినట్టు ఉంటుంది అనిపించింది. అయినా నేను చెప్పిన ఆ points ఎవరైనా దేశం గురించి ఏమి చేశావు, ఏమి చెయ్యాలి అన్నప్పుడు ఎందుకు చెయ్యాలి అని అడిగే logic base చేసుకుని చెప్పిన వాదన. అది నా అభిప్రాయం కాదు. నిజంగా రామకృష్ణ criticism లో చాలా strong dose ఉంది. ఇంకా ప్రస్తుత పరిస్థితికి criticism అవసరం చాలా ఉంది. ఈ criticism వలన మనకి ఎక్కడ correction అవసరమో తెలుస్తుంది. కానీ దాని solution, corrective measure ఏమిటి అన్నది తెలుసుకుని దానిని ఉపయోగించడంలో ఉంది. ఆ corrective measure ని implement చెయ్యడానికి చాలా wisdom, commitment, పట్టుదల, సహనం అవసరం ప్రేమ లాగ. ఉదాహరణకి చరిత్రలో రామ మందిరం కూల్చి బాబ్రీ మసీదు కట్టారు అని ఒప్పుకుందాం. ఇప్పుడు మనవాళ్లు ఆ మసీదుని క్షణాలలో కూల్చేశారు. ఆ తరువాత ఏమి చెయ్యాలో ఎవరికీ తెలియదు. ఇప్పుడు headlines లో ఆ విషయం లేదు కాబట్టి మనకి కూడా అవసరం లేదు. అది కూల్చడానికి, నాశనం చెయ్యడానికి ద్వేషం సరిపోయింది. కొన్ని లక్షల మంది పోగయ్యారు. అదీ ద్వేషానికి ఉన్న శక్తి. కానీ తిరిగి నిలబెట్టడానికి ఎవడికీ ఓపిక, interest లేదు. నేను కూడా నా జీవితంలో ఎన్నోమార్లు మా అమ్మ, నాన్నగారి తోటి ఇలాగే ప్రతీ విషయం మీద logical arguments చేసే వాడిని. వాదనలో గెలిచేవాడిని. కానీ జీవితానికి నా వాదనని ఎక్కడ అన్వయించాలో తెలిసేది కాదు. అన్వయించడం తెలిసిన తరువాత ప్రేమ విలువ అర్ధం అయ్యింది.
ఇప్పుడు నా post మీద వచ్చిన comments సంగతి చూద్దాం. నిజమే. స్వతంత్రం ఒక condition/ దశ .condition ఉన్నంతవరకు మనం మనకి నచ్చింది చేసుకోగలిగే Freedom/ స్వేచ్ఛని ఇస్తుంది. మనకి నచ్చింది మనం చేసేటప్పుడు కలిగే ఆనందాన్ని enjoy చేస్తాము. ఉదాహరణ కూడా బాగానే ఉంది. జీతాన్ని మనం direct గా enjoy చేయలేము. కానీ ఆ డబ్బు నించి వచ్చే physical comforts enjoy చేస్తాము. ఒప్పుకోవలిసిందే. కానీ ఆ స్వతంత్రాన్ని ఎలా కాపాడుకోవాలి. ఆ దశని చేయి జారిపోకుండా ఎలా చూసుకోవాలి అన్నదానికి ఒక పధ్ధతి, ప్రణాళికా అవసరం. అందుకే స్వతంత్రం గురించి నాకు తెలిసి స్వతంత్రం అంటే విచ్చలవిడితనం తో కూడిన స్వేచ్ఛ కాదు, అది ఒక భాద్యత. అందుకే అందరికీ అదంటే భయం.” . అందరూ హక్కుల గురించి మాట్లాడతారు కానీ బాధ్యతలంటే భయం అని అన్నాను. మనిషి ఎప్పుడూ సర్వ స్వతంత్రుడే. వాడికి వాడు తన ఆలోచనల ద్వారా వేసుకునే సంకెళ్లే ఎక్కువ. వాడికి నచ్చినట్టు వాడు బ్రతకొచ్చు. కానీ ఇంకొకరితో కలిసి బ్రతకవలిసి వస్తే అప్పుడు adjustments, compromises అవసరం అవుతాయి. అలాటిది ఒక సమాజం లో, ఒక constitution based governance క్రిందన బ్రతకాలిసి వస్తే ఒక బాధ్యత అవసరం అవుతుంది. సమాజం పట్ల బాధ్యత లేనప్పుడు మనిషి ఎలాగైనా argue చెయ్యొచ్చు. వ్యక్తివాదం ఎప్పుడూ సమాజ హితం పట్ల ఉండాలి అన్నది నా అభిప్రాయం.
Reform exists. అవును పునరుధ్ధరణ జరగాల్సిందే. నేను కూడా అది జరగాలనే  కోరుకుంటున్నాను. అదే చెప్పాను కూడా. ఆ పునరుధ్ధరణ కూడా పైన చెప్పిన కారణం కోసమే జరగాలి. మారుతున్న పరిస్థితులకి, వాతావరణానికి, కాలానికి తగ్గట్టుగా ఆ reform ఉండాలి. భగవంతుడు ఈ దేశాన్ని రక్షించే ముందు మనమేమి చెయ్యగలిగితే అది చెయ్యడం ఉత్తమం. మరేమి చెయ్యాలి. దాని అవగాహనలో clarity కోసమే ఈ ప్రయత్నం అంతా. ముందు ఏమి చెయ్యాలో తెలిస్తే అప్పుడు అది ఎలా చెయ్యాలి అని decide చెయ్యొచ్చు.

అవును ఈ భూమి, plate tectonics వల్ల తన తాలూకు positions మారుస్తూనే ఉంది. ఈ పర్వతాలూ, లోయలు, కనపడకుండా పోయిన నదులు అన్నీ ఆ ప్రభావమే. ఈ మట్టి తాలూకు ప్రభావం మనకే ఉందా, ఇంకెక్కడా లేదా అన్న దాని గురించి చెప్పుకునే ముందు నాకు Volcanic eruptions అంటే నాకు Toba catastrophe గుర్తుకు వచ్చింది. 
సశేషం