నిరంతరాన్వేషిని ఎవరాపగలరు నన్ను
07-03-1994
ఏటవాలు చీకటి గదుల్లో
అర్ధం కాని బాధల పాటవాలు
నరాలు మెలితిప్పితే
మెదడు మరలు గతి తప్పి
ఎటు పోతాను అమ్మలూ ఈ కటిలో
నవ్వేమిటో ఒక్కసారి చెప్పవూ
నీతో ఒక్క క్షణం ఉండనివ్వవూ
అమ్మలూ నేను మనిషిని అమ్మలూ
ఈ ఎడారిలో చివురెత్తిన పిచ్చి మొక్కను
కన్నీట తడిసి ఊపిరి తీసిన జీవాన్ని
అమ్మలూ నన్ను నీతో తీసుకు పోవూ
నాకు ఆ రహస్యం తెలియదనేగా
నీకింత చులకనఏం పాపం చేసానని అమ్మలూ
నాకీ వేదన
అన్ని దిక్కులూ మూసావే
ఏడవటానికి కూడా వీలు లేకుండా
శిల్పం కాదు అమ్మలూ వీళ్ళు చెక్కుతున్నది
రుధిరాశ్రువులు చిమ్మే అనాక్రుతి
సాహసం ,కర్తవ్యం, ప్రయత్నం, భాద్యత
అన్నీ పొరలే
నేను చేతకాని వాడిని , నాకు సిగ్గు లేదు ఒప్పుకుంటాను
నన్ను నీతో తీసుకుపోతావా
అమ్మలూ నీ చుట్టుపక్కల ఎక్కడో అక్కడ ఇంత చోటిస్తావా
నాకు గెలుపు వద్దు
నా విజయానికి నీ కళ్ళల్లో మెరుపు వద్దు
నాకు శాంతి కావాలి "
అమ్మలూ శాంతి కా...వా...లి
No comments:
Post a Comment