05-06-2009
హలో బ్రదర్స్
పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు పై నించి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా స్మశానం దారి పట్టాడు
అప్పుడు శవంలోని భేతాళుడు ఓ రాజా నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది
నీకు మార్గాయాసం లేకుండా అప్పారావు కథ చెబుతాను విను అన్నాడు
అప్పుడు భేతాళుడు ఇలా చెప్పా సాగాడు
అప్పారావు గొప్ప వేదాంతి - అని అనుకునేవాడు
పెళ్లి కాకముందే ఎన్నో కష్టాలు, బాధలు,ఆనందాలు,సుఖాలు, ఎత్తులు, పల్లాలు చూసాడు - ఇది కొంత వరకు నిజం
ప్రపంచాన్ని, జీవితాన్ని ముందునించి, వెనకనించి, కింద నించి, మీదనించి, పక్కనించి కూడా చదివేసాడు - అని తనకు తనే అనుకున్నాడు
అంతా తెలిసిపోయింది అని అనుకున్న తరువాత పెళ్లి అయింది
పెళ్ళానికి అప్పారావు కి ఇన్ని తెలుసని తెలియదు
కాబట్టి మామూలుగానే ఏ పని అయిన ఆవిడకి తెలిసినంతలో చెయ్యడానికి ప్రయత్నించింది
కానీ అప్పారావు ఆలోచనా పరిధి అనంతం - కానీ రోజువారీ జీవితం లో తనకన్నా తక్కువ పరిధి ఆలోచనలు ఉన్నవాళ్ళతో బ్రతకాలి
అప్పారావు ఈ ఖాళీని నింపడానికి ప్రయత్నించినాడు - తనే మామూలు మనిషిలా (ఎందుకంటే ఆయన వేదాంతి కదా) మారడానికి ప్రయత్నించినాడు
కాని అయన లోని ఆ వేదాంతి ఆయన్ని క్షమించలేదు - ఈ అంతస్సంఘర్షణలో ఆయన తప్ప తాగాడు (మనసుకి శాంతి కలుగుతుందేమోనని)
అందులో దొరకలేదు కాని మందు అలవాటు అయిపోయింది
పరస్త్రీ పొందు లో ప్రయత్నించాడు - కొంత శరీరానికి సుఖం అనిపించింది
ఇదే మనసు కి శాంతి అనుకుని అందులోనే ప్రయత్నించాడు
కాని అందులో లేదని తెలిసే లోపే అది కూడా అలవాటు అయిపొయింది
ఇక ఈ అలవాట్లన్నిటికి డబ్బు కావాలి
వేదాంతం లో బ్రతికి ఇప్పుడు జీవితం లో ఇన్ని అవసరాలకి ఎలా సమకూర్చుకోవాలి
ఇప్పుడు అప్పారావు జీవితం తో దొమ్మరి ఆట (సర్కస్) మొదలెట్టాడు
(సశేషం)

Hello Sir,
ReplyDeleteThanks for posting a good moral story