1992
అమృతాన్ని మాంసపు మందసంలో బిగించి
అరిషడ్వర్గాలు చేరని చీకటి కోణంలో దాచా
దాని అవసరం లేదు - ఎందుకో చెప్పనా
లోకంలో ఉన్నవి కావాలంటే - లోకాన్నేలే దాన్ని పట్టాలి
ఒకే ఇరుకు దారి, ఎటు పోతావు - -అందుకు
దాని అవసరం లేదు తెలిసిందా
అభిమానం అమ్ముకో దమ్ముంటే
పైసా రాలదు, అదీ దాని విలువ
అనురాగం, ఆప్యాయత భయ పీఠం పై బలైపోయాయి
వేదాంతం సులువే, సిద్ధాంతం నిజమే కానీ
బ్రతుకు ఈడ్చాలంటే, ఎందుకమ్మా ఇవన్నీ
కరుణ కావ్యాల్లో తప్ప ఇంకెక్కడా దొరకదు
నీ పరిస్థితికి నువ్వు నవ్వుకోవడం హాస్యం
ఆధిపత్యం ఎల్లవేళలా భీభత్సందే
శృంగారం చీకటి గదుల్లో అక్రమంగా
అరాచకంగా అవసరం కోరల్లో నలిగిపోతోంది
ఇంకే రసం మిగిలింది - ఆ ! గుర్తుకొచ్చింది
ఒంట్లో శక్తులన్నీ నశించి
ఆలోచనలు ఆకృతులు మార్చుకుని కృశించి
అందం వెతికినా నీ కందక
చివరికి మిగిలే నీరసం
1992
వేదనేలనో జాలి కరుగునెద
విధి తలచి, చింతలేలనో
సుధ చిందు మధుర రసానుభవ
నిధులను చిలికి గ్రోలిన ఎడద
కన్నీరు చిందనేలనో
దయలేని శార్వరి విధించిన
ఖైదు చూడ ఎదకింత - వేదనేలనో
No comments:
Post a Comment