Monday, October 4, 2010

naa paata kavitvam - 25

20-02-2006
ఎన్నో మారులు వ్రాయడానికి కూర్చుని ఏమీ వ్రాయకుండా వదిలేసాను. ఎందుకంటే ఆలోచనలో ఉన్నది, కళ్ళ  ముందు కనిపిస్తే చూడటానికి భయం వేసేది . కానీ ఈ వ్రాయాలనే బలహీనత వదలలేదు. ఒక సారి అనిపించేది, జ్ఞ్యాపకాలు తప్ప ఏమీ మిగలని జీవితం, నీతో పాతే నసిన్చిపోయే నీ జ్ఞ్యాపకం - దీనికి ఇంత ఆలోచనా అంతస్సంఘర్షణ అవసరమా అని. చరిత్రలో ఉత్సాహం లేదు, భవిష్యత్తుకి గమ్యం లేదు. ప్రస్తుతం చెయ్యడానికి ఏమీ లేదు. ఏదో అసంబద్ధం గా ఉన్న ఆలోచనలని ఒక క్రమం లేకుండా దించడం. ఒకడు కళల్లో, ఒకడు సైన్సు లో రకరకాలు, ఏదో కాలక్షేపం కోసం సృష్టించుకున్న సాధనాలు . నేను ఆలోచించినది, ఆలోచిస్తున్నది, వ్రాస్తున్నది ఎన్నో యుగాల నుండి నా జాతి వాళ్ళందరూ తరచి, తరచి ఎవడికి తోచిన స్థాయిలో వాళ్ళు తృప్తి పొంది  - తరువాత తెలియక -  తెలిసినది అందరి ముందూ ప్రదర్శించి, పదిమంది అనేది, చూసి మేచ్చేది, వాళ్ళకి ఇవ్వడానికి, తమలో ఉన్నది ఆ మూసలో దించుతూ - తమని తాము వెతుక్కుంటూ - అంతులేని వింత యాత్ర. ఇంకా లోపలుండేది స్తిమితం ఇవ్వకపోతే ఎవడికీ అర్ధం కానీ శక్తి ఒకటి ఉందని దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తూ - దీనికేలాగూ అంతం లేదు. ఈ సమూహం ప్రయాణం ఎటు. ఇది ఒక చక్ర భ్రమణం అనిపిస్తుంది. ఏమీ లేకపోవడం నుండి విడిపోయి, రకరకాల సంయోగాలతో జనించి, తన్ని తానూ పెంచుకుంటూ పోయి, తిరిగి నశింప చేసుకుంటూ మళ్లీ ఏమీ లేకపోవడంలో కలిసిపోయి, అంతరించి  - తిరిగి విడిపోయి మళ్లీ మొదలు. ఇలా ఆలోచించిన  తరువాత  నిజం భయపెట్టడం మానేసింది. తరువాత ఇంకేమి లేదు. అప్పుడు ఇంకేమీ లేకపోవడం భయపెట్టింది. వెంటనే వెలిసిపోయిన చింకి బొంత మీద రంగులు అద్ది, కుట్లు కుట్టి తిరిగి వెచ్చగా కప్పుకుని జాతిలో ఐక్యం. 
కాలక్షేపం కోసం మళ్లీ మొదలెట్టాను 

No comments:

Post a Comment