Friday, February 17, 2012

ఆలోచనల స్రవంతి - 24

ఇన్నాళ్లూ ఒక positive note లో blogలో వ్రాసిన తరువాత ఒక negative thought బుర్ర  తొలిచేసింది.
ఇది కూడా చెప్పేసి ఇంక వ్రాయడం మానేద్దామనిపించింది. అందుకే ఈ ప్రయత్నం. 
rk గాడు ఏదో రకంగా వ్రాయరా అని అన్నాడు. కానీ???

చాలామంది మార్పు కోరుకుంటున్నారు. బాగుంది. 
కానీ ఏమి మార్పు కావాలి? దేన్ని మార్చేయాలి?
కొంతమంది ప్రపంచాన్నిమార్చేయాలి అంటారు. 
కొంతమంది corruption ని రూపు మాపేసి ప్రపంచాన్ని శాంతివంతం చేసేస్తామంటారు.
కొంతమంది governance మార్చమంటున్నారు. 
కొంతమంది మనుషుల నైజాన్నిమార్చేద్దామంటారు. నాలాటివాడు చిన్నప్పటి నించి పిల్లలకి తర్ఫీదు ఇచ్చేద్దామని ఒక idea.
ఆహారపుటలవాట్లు మారిస్తే మంచిదని కొందరు, జీవన విధానాన్ని మారిస్తే మంచిదని కొందరు ఇలాగ ఎవడి definition  వాడికి ఉంది. 

మరి వీటిని మార్చడానికి ఎవడి style వాడికి ఉంది.
కొంతమంది literature వ్రాసేసి మార్చేద్దామని, నాకు చిన్నప్పుడు తెలిసిన శ్రీశ్రీ నించి latest గా చేతన్ భగత్ వరకు. నాలాటి వాడు blogs  వ్రాసేసి ప్రపంచం మారిపోతుందని ఒక వెర్రి expectation.
కొంతమంది ఉపన్యాసాలు ఇచ్చి మార్చేద్దామనుకుంటారు. మళ్ళీ ఇందులో personality development  ఉపన్యాసాలు, ధార్మిక ఉపన్యాసాలు, రాజకీయ ఉపన్యాసాలు ఇలాటివి ఎన్నో.
కొంతమంది media ని  వాడుకుని మర్చేద్దామని. Newspaper , TV , cinema ఇలాటివి పట్టుకుని.
సత్యాగ్రహాలు చేసి, ఆందోళనలు చేసి మార్చేద్దామని కొందరు.
కానీ ఎందుకు మార్పు వెంటనే రాదు.


అసలు మార్పు కావాలనుకుంటున్న వాళ్ళెవ్వరు???
నా observation ఏంటంటే ప్రతీ వాడికి కావాల్సినవి అవే. ఐశ్వర్యం,సుఖం. అవి దొరకని వాడు మార్పు కావాలనుకుంటారు. పైకి చెప్పడానికి, discussion చెయ్యడానికి intellectual platform లో మంచి emotional గా ఉండడానికి మార్పు ,అదీ, ఇదీ ok . మంచి conviction కూడా ఉంటుంది. నిజానికి వాడు ఆ crisis లోంచి బయటపడగానే చల్లారిపోతుంది. అంతకు మించి ఏమీ లేదు. 
కొంత మంది ఐశ్వర్యం, సుఖం ఉండి కూడా, కొంత ప్రపంచం, మార్పు అని మాట్లాడుతూ ఉంటారు. అది వాడికి జీవితం bore కొట్టి కావాలనుకుంటున్నమార్పు. వాడు ఉన్న సుఖమైన సామ్రాజ్యం లోంచి కష్ట పడు బాబు అంటే?? అప్పుడు చూడాలి. ఇంకా నేను చెప్పిన gamut లో లేకుండా బాధ పడుతుంటే దాని అర్ధం - ఎవడి chemical concentration  బట్టీ వాడు ఇబ్బంది పడుతూ ఉండడమే.
అందుకే ఆ కొంతమంది కలలు కనే utopia అయిపోయే లాగ మార్పు రాదు. utopia కలలు కనేవాడు కూడా comfort zone  లోకి వెళ్ళగానే అన్నీ మర్చిపోతాడు. ఆ comfort zone  కాపాడుకోడానికి నానా ఆలోచనలు చేసి ఏంటో కష్టపడుతున్నాననుకుంటాడు. మళ్ళీ కష్టం కలగగానే మార్పు అని గెంతడం. 


కష్టపడే వాళ్ళు, అశాంతి తో ఉండే వాళ్ళ percentage ఎక్కువైతే కొంత అలజడి. ఏదో కొట్టుకు చచ్చి మళ్ళీ మామూలే. మనం చదివిన history, మనం చూస్తున్న current affairs  ఇవీ దానికి ప్రత్యక్ష ఉదాహరణలు.


మరి ఇంత సొద చేస్తున్న నేను కూడా దీనికి exception కాదు. 


ప్రపంచం మారుతూనే ఉంది, ప్రతీ discovery తో ప్రతీ invention తో  - ప్రతీ కాలం లోను తెలివైన వాడు సుఖంగా బ్రతుకుతూనే ఉన్నాడు. వాడి సుఖాన్ని వేరే వాళ్ళతో పంచుకోడానికి వాడికి కష్టం. అది మనిషిలోని స్వార్ధం  - అది వాడి నైజం. అది తప్పా అంటే ఏమో కానీ  - అది అంతే. 


ఏది ఎలా నడిస్తే అలా నడవనీ అని చెప్పడానికి ఇంత గొడవ ఎందుకు అంటే
అది నాలోని chemical  problem.


ఇంక నేను వ్రాయకూడదు అని అనుకుంటున్నాను. ఈ resolution ఎంతకాలమో తెలియదు. మళ్ళీ మరీ బాగా నొప్పి పెడితే ఏదైనా బయటపడతానేమో. అంతవరకూ సెలవు.


ఇన్నాళ్ళూ నా ఆవేశాన్ని చదివి ఈ blog కి 10,000  hits  ఇచ్చిన వాళ్ళందరికీ పేరు పేరునా కృతజ్ఞ్యతలు.


ముసాఫిర్ అఫ్ ఇండియా