Monday, October 4, 2010

naa paata kavitvam - 4

1991

నీలో విశాలత్వం పెరిగే కొద్దీ నీలో తేడాలు నశించు
నీలో ఆలోచనలు పెరిగే కొద్దీ నీలో ఆవేశం నశించు
సంకుచితత్వం కార్య శూరుడి లక్షణం
కార్యశూరుడు అవుతావో కర్మ యోగివవుతావో నీ ఇష్టం
1991
విచిత్ర వలయాకృతుల
విభిన్న సమీకరణాల 
వినూత్న సృష్టి
మిథ్య
1988
చేర పిలిచానే
చేరి వలచానే
వలచి వగచానే
వగచి విసిగానే
విసిగి  వేసారానే నీ వలపు ముంగిట వేచి వేచి
1988
శాస్త్ర జ్ఞ్యాన అంగుళులు మీటే 
హేతువాద విపంచి పాట
భావ లోకపు సరిహద్దులు దాటి 
మిథ్యా మరీచికల సోలుచున్నది
1988
నీ కోసం
నన్ను నేను చంపుకుని
కలిసి విడిపోయే పెదాల 
ఎగసి మెరిసి విరిసే ఆనందం అంచున
వేచి ఉంటాను వస్తావు కదూ

No comments:

Post a Comment