Monday, October 4, 2010

naa paata kavitvam - 20

January 93
కోరిక 
ఆలోచనలు రేపే అసంతృప్తి
నా గుండె మీద నా కత్తితో 
నేను చేసుకున్న గాయపు నెత్తుటి చార 
వేళ్ళ సందుల్లోంచి జారిపోయే
ఇసుక రేణువుల కాలం
అలుపు లేకుండా ఎంత పరిగెత్తినా
ఎడ తెగని పందెం లాంటి జీవితం

క్షణం లో అటు వైపు
దాటితే మరో మలుపు
శిధిలమైన మెదడు స్రవించే 
వెచ్చటి ఎర్రటి కన్నీటి చుక్కలు
బ్రతుకు ఒక మొసాయిక్ 
కేటాబాలిజం ఆవరించేవరకు 
కాలుష్యం పీలుస్తూ ఇలాగే 

ఇది నిరాశ కాదు, నిస్పృహ లేదు 
ఇది నిజం అంతే

ఒక చూపు, ఒక నవ్వు
కన్నీట ఒదిగిన ఓదార్పు
కావాలనే ఒంటరితనం కాదు 

ప్రతి క్షణం చైతన్యం తో 
వెల్లివిరిసి, ప్రతి క్షణం 
అందమైన అనుభూతులు
మిగిల్చి, ఆలోచనలు రగిల్చే
ఆవేశం కావాలి
కట్టేసిన ఈ చేతులకు
విముక్తి కావాలి

నాలోని ప్రతి అణువుని
నా జిజ్ఞ్యాసని 
నాలోని విజ్ఞ్యాన జిఘ్రుక్షని 
నా ప్రతి కదలికని 
శాసిస్తున్న సంఘ కాళి
నా ఎముకల మాల 
తన మెడను అలంకరించుకోక  ముందే 
" నాకు స్వేచ్చ కావాలి" 




No comments:

Post a Comment