Friday, June 5, 2015

New Poetry - 23

కిటికీ చువ్వల మధ్యలోంచి నీలాకాశంలో వెండి మబ్బు తునక
అంతులేని స్వేచ్ఛని చూపిస్తూ బందీననే విషయం మరిపించింది
ఎన్నో సందర్భాలు, కలతపెట్టే నిదురరాని నిట్టూర్పుల విభావరీ వినోదాలు
కలల కావిళ్లు, వేకువ వాకిళ్ళు, ఎగసిపడే గాలి కెరటాలు, ఏవో మౌనరాగాలు
నవ్వుకీ నవ్వుకీ మధ్యలో నిశ్శబ్దం, కన్నీటికి రక్తానికి మధ్యలో వారధి కట్టింది
గాలికి రాలిపడిన మందారం కాళ్ళ కింద నలిగి నవ్వడానికి ప్రయత్నించింది
వెర్రితలలు వేయని వ్యవసాయం చేద్దామని ప్రయత్నిస్తే
అధివాస్తవికతో అయోమయావస్తో తెలియని ఒక విచిత్రం
మనన్సులో మెదిలి ఉషస్సులో వెలిగి తమస్సులో కరిగింది