Wednesday, January 1, 2014

New Poetry -22

వేదాంతపు వెలుగులతో మినుకుమనే 
అనంతమైన ఈ విశ్వం పరిణామం ఎంత
నా ఆలోచనలో మెలితిరిగే అణువుకున్నంత
అర్ధం కాని ఏ ప్రచోదనలో బుధ్ధిని ఎనిపి 
కాలం సులోచనాలు ధరించిన ఆలోచనలు 
నమ్మించే సకారణత్వపు శూన్యావిష్కరణ  
శూన్యం, కాలం కలిసి అంతర్బుధ్ధి కారకాలైతే 
బుధ్ధి క్రోడీకరించే అనుభవాలు జీవితమైతే 
జీవితానికి అర్ధం ,బుధ్ధి చూపించే పరమార్ధం 
విధిలేని కడచిన కాలంలో, అవధి లేని శూన్యం 
కాలబిలం కౌగిలిలో ఆలోచన కలియతిరిగి 
తిరిగి ప్రవహిస్తే ఎంత, ప్రవహించకపోతే ఎంత 
ఎవడికి కావాలి బోడి సిధ్ధాంత చర్చ, విమర్శ 
తెలిసిన పరిణాహంలో తెలియని భవిష్యత్తుకోసం
సామనస్యత మరిచి, సౌశీల్యము విడిచి  
తడబడుతూ తరగల తీరు ఎగసిపడే మనం 
ప్రస్తుతం మరచి, తీరం, తెన్ను కానలేని జనం 
నిజం ఎవరికవసరం, ఏదో అందాం, ఏదో విందాం 
అసలు నిజం వదిలేసి, ఎదోలా జీవించేద్దాం