Sunday, October 10, 2010

ఆలోచనల స్రవంతి - 6

ఈ నాలుగైదు రోజుల నించి నేను వ్రాస్తున్నవి చూసుకుంటే - ఎన్ని విషయాలలో అవగాహన లోపం ఉందా అనిపించింది. 
ఏదో తాపత్రయం- నాకు తెలిసింది అందరి తోనూ పంచుకోవాలి అనే ఒక భావన. 
మొదలు పెట్టిన ఆనందంలో గాభరాగా వ్రాసేశాను. 
మనిషి తాలూకు మూలాల్లోనే ఉందేమో ఇలాటి భావన.  సమాజం  తాలూకు ప్రభావం start అయ్యేది ఇలాగే ఏమో. 
లేకపోతే నేను , నాకు తెలిసింది నా తోనే ఉంచుకోవచ్చు కదా. ఈ పంచుకోవడం ఎందుకు.
NTR సినిమా లో ఒక dialogue  - సినిమా పేరు సామ్రాట్ అశోక అనుకుంటాను - -"సంఘోప జీవి అయిన మానవుడు  - సంఘాన్ని విడి మనలేడు , మనుగడ సాగించలేడు"   
సరే ఇదంతా బాగానే ఉంది. నిన్న 2012 గురించి ఏదో వ్రాద్దామనుకున్నాను. మళ్ళీ doubt వచ్చింది. ఈ 2012 గురించి discussion వచ్చి  చాలా రోజులు అయ్యింది కదా. ఈ పాటికి ఎవడో net లో detail పెట్టేసి ఉంటాడు.బ్లాగ్ మొదలెట్టిన తరువాత అనుభవాలు అలా ఉన్నాయి.  అసలు ఇంకా ఎవరెవరు ఏమేమి అన్నారో చూస్తె ఒక ఐడియా వచ్చి better గా  రాయొచ్చు అనిపించింది. రాయడమేమిటి, వీడియొలు కూడా పెట్టేసారు - ఒకడు జపాన్ వాడితో interview - ఒకడు NASA నించి statement ,  ఒకడు graphics - ఇంకోడు - బొమ్మలు with details - అసలు అందులో ఎవడికి ఏం కావాలంటే అది ఉంది. నీరసం వచ్చేసింది. TV9 మిగతా channels వాళ్ళు కూడా ఏదో program run చేసేస్తున్నారు. ఇంతకంటే detailed గా నేను ఏమి చెప్పగలను అనిపించింది.
 తరువాత అనిపించింది, నాకు తోచింది నేను రాసేస్తే, ఎవరో చదివిన వాళ్ళు , అదీ వాళ్ళకి ఓపిక ఉంటే తప్పో ఒప్పో చెప్తారు కదా అని. రాద్దామనుకున్నాను కాబట్టి - -చాలా brief గా ముగిద్దామనిపించింది. ఇంతకీ విశేషమేమిటంటే - ఒక పెద్ద గ్రహ శకలం భూమిని గుద్దేస్తుందని -దాని నించి అయితే ఇప్పుడున్న దానికి మూడో వంతు భూభాగం నీట మునిగి పోతుందని ఒకడు, గ్రహాలూ ఏదో alignment కి వచ్చేస్తాయని దాని వల్ల solar waves లో భూమి దానితో పాటు మానవ జాతి మొత్తం నాశన మైపోతుందని ఒకడు, ఇదంతా నమ్మద్దు ఎవడో నాలుగు డబ్బులు సంపాదించడానికి చేస్తున్నాడని ఒకడు,ధ్రువాలు గతులు మారిపోతాయని ఒకడు, జాతకాలు , జ్యోతిష్యం, భవిష్య వాణి -- conspiracy theory , super wave theory , free masons ideology , అసలు అవన్నీ చూస్తే వణుకు వచ్చేసింది. 
ఇవన్నీ బాగానే ఉన్నాయి - అసలు నిజంగా "నిబిరు" ఆ శకలం పేరట -   అంత పెద్దది గుద్దితే ఎవడి దగ్గరైన ఏదైనా ప్లాన్ ఉందా తప్పించుకోడానికి.
ఇలాటి శకలాలు  గుద్దినప్పుడు  భూమి  ముక్కలైపోతే ఏమి చెయ్యాలి. మాడిపోతే ఏమి చెయ్యాలి. ఎవడికీ  తెలియదు
పోనీ ఎవడి దగ్గిరైన light years / hour స్పీడ్ తో travel చేసే rocket ఏదైనా ఉందా. .
అసలు చేతిలో ఉన్నవి చక్కపెట్టుకోవటం రాదు ఎవడికి - -గ్రహాంతర యానం గురించి ఆలోచనలు
మొన్న ఏదో టీవీ ఛానల్ లో చూశాను. వేరే గ్రహాల మీద మనం బ్రతకడానికి అనుకూల  వాతావరణం ఏమైనా ఉందేమో వెతుకుతున్నారుట.
చాలా మంచి  ఆలోచన. ముందు జాగా చూసుకుంటే, తరువాత అక్కడికి ఎలా వెళ్ళాలో ఆలోచించచ్చు. అక్కడ ఇల్లు కట్టచ్చు.
వినడానికి ఒక వైపు ఇవన్నీ బాగానే ఉంటాయి.  
ఇంకో వైపు  అక్కడ ఏవైనా power sources ఉంటే ముందుగా కబ్జా చెయ్యొచ్చు.  మళ్లీ ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవచ్చు.ఇలాగ అన్న మాట.  ఇరాక్ యుద్ధం ఎందుకు జరిగిందో అందరికీ తెలుసు. ఎవడూ మాట్లాడాడు. శాంతి స్థాపించడం కోసం అని sam పెద్దన్న చెపితే ఇంకంతే. కొంతమంది అరిచారు. boards పట్టుకుని నినాదాలు చేసారు. ఇంకేమయ్యిందో తెలియదు. మళ్ళీ ఏమీ లేదు.
సద్దాం హుస్సేయిన్ ని చాలా దారుణంగా ఉరి తీసారు. మరి అతను నియంత కదా. అందుకు అది కొంత justified . మరి కనపడని ఈ కసాయి వాళ్ల సంగతి ఏమిటి. పెద్దన్న కసిరితే ఎవడికి ధైర్యం లేదు. కడుపు కాలిన వాడో, నిజంగా కిరాతకుడో ఎవడో ఒకడు plane పెట్టి towers పెల్చేస్తే -కొంప మునిగి పోయిందని కంట తడి.నిజమో అబద్ధమో ఎవడికి తెలియదు.నాకు అనిపించింది వీళ్ళ ఏడుపు వీళ్ళు మెల్లిగా పీల్చడానికి రక్తం తగ్గించేసేడని. చచ్చిపోయిన వాళ్ళ  కుటుంబాలని అడగాలి - బాధ అంటే ఏమిటో. 
అసలు వీడు plane తీసుకుని  వెళ్లి గుద్దే పరిస్థితి create చేసింది ఎవరో. నాకైతే వీళ్ళ కంటే plane తో గుద్దినవాడే వాడే బెటర్ అనిపించింది. తొందరగా ముక్తి ఇచ్చేడని.  నాలో ఇంత ద్వేష భావం ఉందని ఇప్పుడే అర్ధం అయ్యింది. సరి  2012 వదిలేసి మళ్ళీ నా కడుపు మంట మీద పడ్డాను. 
ఇంతకీ అదీ సంగతి. గ్రహ శకలం గుద్దితే చెయ్యడానికి ఏమీ లేదు. information తెలుసుకుంటే ఒక వేళ నిజం గా మాడిపోయే లాగ అయితే      తెలుసుకుని మాడిపోతాము. అదన్న మాట. 


మా అమ్మ దీని  మీద ఒక స్పెషల్ ఒపీనియన్ కూడా ఇచ్చింది. అదేంటంటే" పాపం పండిపోయింది రా, అందుకే ఇవన్నీ" 


సశేషం 



1 comment: