శిధిలమైన గోడల మధ్య
చెద పట్టిన పుస్తకాల మధ్య
నిస్తేజమైనట్టి నా బుర్రలో
నిద్రాణమైన ఆలోచనలు ఎన్నో
నా హిపోక్రాటిక్ ప్రియురాళ్ళ
వలయంలో చిక్కి స్రుక్కి
బలహీనతల బావుటా ఎగరేసిన నేను
భావ దరిద్రుడిని కాక ఎమౌతాను
1987
నీర్నిది ఘోష ఘోషాలమాటున
శంకాకుల హృదయం పాడే
తరంగిణీ తరంగాల మాటున
కీలగ్ని జ్వాలలు రేగే.......
..............యామినీ నికుంజ ప్రాంతమున
నా చెలి చలిత పద విన్యాసం
విచలిత వక్షోజ వికాసం
లోచన చలన విలాసం
అధరాన్చల హాసం
ఆమె సర్వ సర్వస్వం
ఎద కదిలించు వేళ కూడా
అవ్యక్త వేదనా వలయా నిలములు వీడకున్నవే ఏమి చేతు
1987
మరపుకు రాదా ముంచే ఆకలి
తలపుకు రాగా నీ వలపే
తెలుపగా రాదా కదిలే మోయిలే
నెర నేచ్చెలికి నా వలపే
1987
(మందు కొట్టి)
కైపెక్కు నిషా కనుల ముందు తమాషా
నవ్వాలి గురూ నువ్వు హమేషా
No comments:
Post a Comment