Thursday, May 26, 2011

నేను వ్రాసిన మొదటి కథ

 నేను degree 2nd year తరువాత సెలవల్లో ఒక కథ వ్రాశాను. ఇది నేను వ్రాసిన మొదటి చిన్న కథ . ఇప్పటి దాక ఇదెవరితోను పంచుకోలేదు. ఇప్పుడెందుకో చెప్పాలనిపించింది.

అది విశాఖపట్నం. వేసంకాలం వేడెక్కిస్తే అది తట్టుకోవడానికి సాయంకాలం జనాలు బీచ్ ఒడ్డుకి చేరుకున్నారు. ఎవడి గోల వాడిది.  కెరటాలతో ఆడే వాళ్ళు కొందరైతే, ఇసుకలో గూళ్ళు కట్టే వాళ్ళు కొందరు. ఐస్ ఫ్రూట్లు , బజ్జీలు మావిడికాయ ముక్కలు అమ్మేవాళ్ళు, balloons అమ్మేవాళ్ళు అటూ ఇటూ తిరుగుతున్నారు. అంతా సందడిగా కోలాహలంగా ఉంది. ఆ గోలలో ఎవరికీ పట్టనట్టు కూర్చున్న ఆ 50 ఏళ్ళ ముసలతని పేరు విశ్వేశ్వరరావు. AVN కాలేజీ లో ప్రొఫెసర్. ఏదో పోగొట్టుకున్న వాడిలా ముఖం. ఏమి ఆలోచిస్తున్నాడో కాని చాల సేపటి నించి కూర్చున్న position నించి కదలటం లేదు. మెల్లిగా జనాలు పల్చబడటం మొదలెట్టారు. రాత్రి పదయ్యే వరకు అక్కడే అలాగే కూర్చుని ఉన్నాడు. అప్పుడు నెమ్మదిగా లేచి ఇంటి ముఖం పట్టాడు.
విశ్వేశ్వరరావు కి పెళ్లి కాలేదు. ఎందుకో అతను పెళ్లి చేసుకోలేదు. చిన్నతనం నించి అతని ధోరణి అతనిదే. తల్లితండ్రులు చెప్పేది వినేవాడు కాదు. వాళ్ళు ఏదైనా చెప్తే అది ఎందుకు, ఇది ఎలాగా అని ప్రశ్నించేవాడు. వాళ్ళు విసుగెత్తి వీడికి వితండ వాదన ఎక్కువ అనేవారు. అయినా అతను తన పద్ధతి మార్చుకోలేదు. అలాగే జీవితంలో ఎన్నో వసంతాలు. అతను జీవితాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించేవాడు. అతను చదవని పుస్తకం లేదు. చెయ్యని ప్రయోగం లేదు. ఇతని నలభయ్యో పడిలో తల్లీ, తండ్రీ ఇద్దరూ ఒకరి తరువాత ఒకరు కాలం చేసారు. ఆ తరువాత అతను ఇంటిని పూర్తి స్థాయి ప్రయోగశాల లాగ మార్చేశాడు. చేసిన ప్రయోగాలనీ, వాటి results నీ అన్నీ notes వ్రాసేవాడు. ఇలాగ మరో పది సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు అతనికి ఏభై ఏళ్ళు.
బీచ్ నించి బయలుదేరిన అతను తిన్నగా ఇంటికి చేరుకున్నాడు. తన diary లో last page open చేసి చూశాడు. అందులో ఉన్నది మరొక్కసారి చదువుకున్నాడు. తరువాత poison bottle తీసి మూత open చేసాడు. అది table మీద పెట్టి, diary మీద pen పెట్టి పట్టుకుని, ఆ poison bottle ఒక్క గుటకలో తాగేసాడు. విషం తన ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. అతని కళ్ళు మూతలు పడుతున్నాయి. అప్పుడు diary లో ఏదో వ్రాద్దామని కొంత వ్రాసి ఆఖరి శ్వాస వదిలేసాడు. అతను ఆఖరి సారిగా diary లో వ్రాసినది -"నేను దేముణ్ణి చూ.........."- ఆ వాక్యం ముగియకుండానే అతని జీవితం ముగిసింది.
ఇంతకీ విషం తాగే ముందు అతను తన diary లో చదువుకున్న తన ఆఖరి పేజి.
" ఇన్ని చదివిన తరువాత , చూసిన తరువాత -  ఎంత వెతికినా నాకు దేముడు కనిపించలేదు. ఆ దేముడిని చూడాలని, చూసింది పదిమందితో పంచుకోవాలని ఈ ప్రయోగం చేస్తున్నాను. నిజంగా చనిపోయే ముందు దేముడు కనపడితే నేను వ్రాసిన note చూసి దేముడిని నమ్మండి. లేదా నమ్మఖ్ఖరలేదు. నాకు ఈ జీవితంలో ఇంకా కావలిసింది ఏమి లేదు. నా చావుకి నేనే భాద్యుడిని."
ఇంతకీ విశ్వేశ్వరరావు దేముడిని చూశాడా, చూడలేదా అతనికే తెలుసు. చూ....తరువాత అతను ఏమి వ్రాయాలనుకున్నాడో  కూడా అతనికే తెలుసు. దేముడు ఉన్నాడో లేడో ప్రపంచానికి ఇప్పటికీ, ఎప్పటికీ అది ఒక  ప్రహేళికే.

నేను ఈ కథని ఆంధ్రభూమి కి single పేజి కధలకి పంపిద్దామనుకుని  ఎందుకో పంపించలేదు.

Thursday, May 19, 2011

Status of my life


I am not a prophet to preach, but I presume that I am a human who can understand the reality of this materialistic world with my limited knowledge and who is in search of the ultimate truth.
I never thought that there is a requirement to think when I was novice and everything is going on smoothly without any disturbance. I was an enthusiastic observer of everything in this world and I am just living my life. Only failure is the reason in my life which gave me sorrow, frustration and forced me to think and after that my understanding of life changed subsequently so many meanings changed and ultimately duality of life vanished. I am grateful to that situation in my life which I thought as failure. It doesn’t mean situations changed, it is simply my perspective of life changed.
During this travel from when I started questioning life to understanding of life in its complexity there was a question which bothered me the most. It is “Why I am here and what is my destiny?”
After so much of logic and reasoning and understanding life scientifically to my knowledge’s best the answer I found was rather vague. It is like “It happened and I am here and whatever things I am doing I have least control of situations and maybe whatever I am doing have some impact on the surroundings in and out and the stream is continuing”. I am lost. I am afraid. There is nothing more to think or say. I stopped logic and reasoning and tried to focus to just have control on my nerves. It happened one night and I burst into tears. The experience that engulfed me has given me immense ecstasy. The feeling is beyond comprehension. I got my world back. Till that time what seemed to me as impossible has become trivial. From then onwards nothing bothered me anymore.
For me further there is nothing left to conquer or prove to anybody.  I am subdued in my own world. Then I wondered are there any people who are having such experiences other than me. I read about so many people, their faiths, religions, history and at one point of time the things seemed like alliteration and I stopped further reading about anybody. I found that there are so many people around me floating with the same experience. I stopped asking the question which bothered me the most because it has lost its meaning.
Then I thought if I am having such an ecstasy sitting amidst all my surroundings and focussing then what immense pleasure those people sitting away from these surroundings and doing penance may be deriving. Whether to give up this family and other earthly pleasures to have that ecstasy continuously or to continue the same way as it is going. I tried to get aloof for some time and kick start that feel again. Then I found still there are some things in my life which I am still attached to and till that time I don’t detach myself completely whether I stay in it or out of it means same thing. Place has nothing to do with mental status but to some extent it affects till you get total grip of your internal things. This is the phase in life where I am now.
Why today I wanted to share this experience of mine is my friend RK said his student wants to donate all the ancestral property to some orphanage and he is trying to give clarity that instead of doing that he can do that charity works directly because may be the orphanage is properly run or not and after affects of not having money can be crucial and even I expressed the same idea.
My question to that student is whether he is ready after all introspection of himself or he simply wants to buy a feeling for a second and feeling bad taste for balance of his life. Because definitely money can’t buy happiness but it will give physical comforts. After so much of introspection, logic, reasoning and mystic experiences I am still struggling to leave this physical comfort zone, is he ready to be totally detached from this earthly pleasures. If he has gone through the phase through which RK Paramahamsa has gone through and reached pinnacle maybe he might have traversed a different path to reach there then it is up to him to do it his way or otherwise refrain.