Monday, October 4, 2010

naa paata kavitvam - 11

1991
అనవసరంగా శ్రమించకు 
ఆలోచనలతో రమించకు
విధి కేకురింతలకు
విరక్తితో చలించకు
అర లేచిన ఆవేశంతో 
విను వీధుల్లో చరించకు
1991
విలోల పంజరాలు 
విషాద మందిరాలు 
విలోమ విధి విధాలు 
వ్యధా స్మ్రుతి పదాలు 
నిజా నిజాలు తేలి 
విధూత మనము కాలి
నిషాద తమము కరిగి
విశాల జగము మెరిసే
ముత్యాల సరాలు 
కలలు కనడం నేరమాయని 
జాలిగొలిపే మూగ భాషన
పిల్ల తెమ్మెర నిలిచి ముంగిట
నన్ను ప్రస్నించెన్

కరడు కట్టిన నిషధ తమమును 
చీల్చి పరుగిడు వెలుగు రేఖలు 
ముసురు పట్టి తెన్ను కానక 
బయట పడవాయే

యామిని క్షేపమా ఇది ఒక
శాపమా పాపమా కల ఇక 
భారమా ఘోరమా కలయిక 
కాదు ఎ రీతిన్ 
కందం
మొన్నటి కన్నీటి చుక్కలు 
నిన్నటి సన్నటి నగవులు ఈ కటి నిశినన్
ఎ గతి మన్నించగలవు 
విస్మృతి లేనీ మనసును నిర్లిప్తముగా 

నింజిలి బడబాగ్ని శిఖలు 
రాజుకు రేగన్ తలపులు మాయగా ఇంకా
సుందరి మందాక్షమని
సంతసింతువేల నీది మనసా కాదా

వెరపే ఎరుగని ఘనుడవు
సుమాళపు ఘడియ బిగించి విమలిమ కొరకై 
లషిత మనస్కుడవు నీకు
విధిచే తప్పదు పొరలిక వాస్తవ క్షితిలో  

No comments:

Post a Comment