Tuesday, October 5, 2010

old thought process - -5

03-06-2009
హలో బ్రదర్స్
ఇవాళ మన ఆలోచనా విధానము ఇలా నడిచింది 

శ్రీ శ్రీ 
"మనాసాని నిసిన సీమా
మనసా మసి మనిసి మనసు మాసిన సీనా 
సినిమా నస మాసనమా
సినిమా నిసి సీమసాని సిరిసిరిమువ్వా"

ఇలా రాసేద్దామని ఎంతో ప్రయత్నించాను  - కానీ కుదరలేదు 
మరి మనలో ఫీలింగ్స్ కి ఎలా ఔట్లెట్ ఇవ్వాలని చాలా ఆలోచించాను
ఫ్రీ వెర్స్ బెటర్ అనిపించింది
సరే ఒక రోజు పేపర్ తీసి కెలకడం మొదలెట్టాను
అది ఇలా తేలింది

"మళ్లీ తెల్లారింది
ప్రొద్దున్న లేవగానే
అవే ముఖాలు
అలాగే ఎప్పటిలాగే
విసుగులేకుండా
అవే ముసుగులు" ఇలా మొదలై ఎలాగో ఎండ్ ఐపోయింది 

 ఆ తరవాత కూడా క్షమించ లేదు ఇంకా రాసేసాను 
కాని రాసేసిన తరువాత ఎందులోనూ నేను పూర్తిగా కనిపించలేదు

ఈ మధ్యలో యమ ధర్మ రాజు టైపు లో మన ఆళ్ళ వాస్తుల హ్యాండ్ కూడా ఉంది 
వారు నన్ను క్షమించలేదు  - వదల లేదు - వదులు అంటే లూస్ గా  ఉందా అని ఇంకొంచం టైట్  చేసారు 

దాంతో ఏదేదో రాసేసి ఇంకేమి రాయలో తెలియక ఇంకో కొత్త కాన్సెప్ట్ తీసాను - జీవితానికి అర్ధం ఏమిటి అని
కొన్నాళ్ళు అవి ఇవి చదువుతూ బాగానే గడిచింది - కాని మళ్లీ మన శ్రీ వారు సింపుల్ గా బుచ్చిబాబు గారిలా తేల్చేసారు - ఏమీ లేదని
ఇప్పుడు ఏం చెయ్యాలి- అర్ధం కాలేదు

ఇదేంటో ఆలోచన విధానం చెప్దామంటే ఆత్మకథ లా తయారవుతోంది
చదివిన చదువు బుర్రకెక్కలేదు - బుర్రకేక్కిన పైన చెప్పిన ఆత్మ కథ ఎందుకు పనికి రాలేదు
ఇప్పుడు మనలోని కోనేటి రావు గారిని నిద్ర లేపాము  - దాంతో ఎనభై శాతం సమస్యలు చచ్చి పోయాయి
మిగిలినవి సమస్యలు అనిపించడం మానేసాయి
ఆ తరువాత చాలా సుఖమనిపించింది

ఎవడి కాన్సెప్ట్ తో వాడు బతుకుతాడు
మన కాన్సెప్ట్ ఎవడికి కావాలనిపించింది 
పోనీ మనం చెప్పిన కాన్సెప్ట్  మీద ఎవడైనా కొచ్చెన్ వేస్తే మనకి ఏం చెప్పాలో తెలియదు - కాని బోల్డు కోపం వచ్చేస్తుంది ఎందుకో
ఇంతా తట్టుకుని నిలబడి చెప్తే అది ఎవడికీ పనికి రాదు 
ఇలా తయారయ్యింది

ఇప్పుడు మన లేటెస్ట్ కాన్సెప్ట్

మనకి నచ్చింది మనం చేసేసి దానికి ఏదో రీసనింగ్  గొప్ప ఫిలొసొఫికల్ గా చెప్పేస్తే ప్రాబ్లం సాల్వ్ 

No comments:

Post a Comment