Showing posts with label Kotta Bhetala Kathalu. Show all posts
Showing posts with label Kotta Bhetala Kathalu. Show all posts

Saturday, August 27, 2016

Kotta Bhetala kathalu - Aloukikananda the Philosopher (Part-1)


విక్రమ్ కి ప్రస్తుతం చాలా bore కొడుతోంది. శవాల వేటలో శ్మశానం వెళ్లినప్పుడు, భేతాళుడి కథలు వింటూ బుర్రకి పదును పెట్టడం లో ఉన్న మజా ఇప్పుడు దొరకటం లేదు. జీవితానికి సంబంధించి ఏదో వెలితి feeling. ఒక ధ్యేయం లేకుండా పోయిందన్న బాధ. తన Laptop తీసి net open చేసి ఏదో చూద్దామని ప్రయత్నించాడు. కానీ అదీ చిరాకనిపించింది. ప్రతీసారి భేతాళ కథలతో చిరాకుపడే తనకి, మొదటి సారి భేతాళుడు తనకి ఎంత అలవాటుగా మారాడో తెలిసి వచ్చింది. ఎక్కడున్నావు భేతాళా అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా భేతాళుడు ప్రత్యక్షం అయ్యాడు. అతన్ని చూడగానే విక్రమ్ కి ఎంతో relief అనిపించింది. అప్పుడు భేతాళుడు “నువ్వు నాకు ఇంకేమీ explain చేయొద్దు. నాకు నీ పరిస్థితి అర్ధం అయ్యింది. నీకు Philosopher అలౌకికానంద కథ చెప్తాను విను” అన్నాడు. అప్పటిదాకా తన ముఖం మీద miss అయిన చిరునవ్వుని వెనక్కి తెచ్చుకున్న విక్రమ్ మరేమీ ప్రశ్నలు వేయకుండా కథ వినడానికి ready అయిపోయాడు. భేతాళుడు చెప్పడం మొదలెట్టాడు.

ఆశ్రమంలో జ్ఞ్యానబోధ చెయ్యడానికి ఉపక్రమించాడు ఆలౌకికానంద స్వామి .

శ్లో: హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వావా భోక్ష్యసే మహీమ్
తస్మాదుత్తిష్ఠ కౌంతేయా యుధ్ధాయ కృతనిశ్చయః
తా: ఓ కౌంతేయా రణరంగమున మరణించినచో వీరస్వర్గం పొందేదవు. యుధ్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవించగలవు. కనుక కృతనిశ్చయుడివై యుధ్ధమునకు లెమ్ము.

విరక్తి చెందిన రామరావు కూడా జనాలలో ముందు వరసలో ఉన్నాడు. “Yes యుధ్ధం ఆపకూడదు” అనుకున్నాడు. ఎలాగైనా మళ్ళీ ఆ సుఖాలన్నీ పొందాలంటే వదలకూడదు. మంచి ఉద్యోగం సంపాదించాలి. కానీ రావటం లేదే...ఎలాగ? 

శ్లో: కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచనా
మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగో౭స్త్వకర్మణి
తా: కర్తవ్య కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు. కానీ ఎన్నటికీ దాని ఫలములయందు లేదు. కర్మ ఫలములకు నీవు హేతువు కారాదు. కర్మలను మానరాదు. ఫలాపేక్షరహితుడవై కర్మలనాచరింపుము. 

నిజమే అనిపించిది. ఇందాక వీర స్వర్గం, రాజ్య భోగం అని అర్జునుడిని tempt చేసిన కృష్ణ పరమాత్మ ఫలాపేక్ష వదలమంటాడే. ఫలాపేక్ష వదిలేస్తే జీవితంలో ఏదైనా ఎందుకు చెయ్యాలి అనిపించింది. పోనీ ప్రయత్నం చేస్తూ కూర్చుంటే, ఉద్యోగం రాకపోతే, పరిస్థితులు మారవు. ఎలాగ ...?

అనిపించిందే తడవు ఈ ఆశ్రమానికి రావడానికి ముందు జరిగినవి ఆలోచనలో మెదిలాయి.

“ రామారావు కి జీవితం మీద bore కొట్టింది. ఎంతసేపు ఉద్యోగం, పెళ్ళాం పిల్లలు, డబ్బులు, ఆరోగ్యాలు ఇవన్నీ చూసుకుంటూ గడపడంతోనే రోజు తెల్లారిపోతుంది. చాలీ చాలని జీతం, పెళ్ళాం కోరికలు తీర్చలేక గొడవలు, పిల్లల కోరికలు తీర్చలేక విరక్తి- జీవితం లో సుఖం కనపడలేదు. ఇంకా ఏదో కావాలి, ఏదో జరగాలి, ఏదో variety ఉండాలి. ఇలాగ అనుకుంటూ office కి బయలుదేరాడు.
తను office లో అడుగు పెట్టాడో లేదో Manager నించి కబురు. ఈసురోమని boss room లో దూరాడు. అక్కడ వినవలసిన music విని, వేయించుకోవలిసిన అక్షింతలు వేయించుకుని బ్రతుకు జీవుడా అని బయట పడ్డాడు.
ఇంతకీ Manager చెప్పినదేమిటంటే official tour మీద Odisha mines కి వెళ్ళి రావాలి. ఆలోచించి చూస్తే Odisha వెళ్ళడమే better అనిపించింది. ఈ routine నించి విముక్తి. అలాగ Odisha వెళ్ళిన రామరావుకి అక్కడ గిరిజనుల నించి బోలెడంత గౌరవ మర్యాదలు, కావల్సిన సేవ సత్కారాలు, శారీరిక సుఖాలు అన్నీ లభించాయి. అక్కడ సరుకులు తెచ్చి పట్నంలో అమ్ముకొని సొమ్ము చేసుకోవడం, ఇక్కడ office లో bore కొట్టగానే ఏదో పేరు చెప్పి mines తనిఖీ అని వెళ్ళడం, రామారావు కి జీవితం తిరిగి వచ్చినట్టు అయ్యింది.
అలాటి సందర్భంలో రామరావు మేనేజర్, రామరావుకి శిఖండిలా తయారు అయ్యాడు. ఆ Mines దగ్గర వాటాలు, అమ్మాయిల గొడవల్లో ఇద్దరు ఢీ అంటే ఢీ అనే పరిస్తితి వచ్చి Manager పుణ్యమా అని రామరావు ఉద్యోగం పోయింది. ఆ తర్వాత రామరావు ఎన్నో ఉద్యోగాలు మారాడు. మరి ఆ mines లో ఉండే kick , సుఖం దొరకలేదు. మారుతున్న ఉద్యోగాల సంఖ్య పెరిగిపోవడం మొదలెట్టింది. అలవాటైన సుఖం లేని, మళ్ళీ మొదటికే వచ్చిన జీవితం.
ఈ నరకం నించి పారిపోవాలా లేక చచ్చిపోవాలా? నిస్పృహతో నడుస్తూ ఎదురుగా కనిపించిన ఆశ్రమంలోకి నడిచాడు.”
ముందు వరసలో కూర్చుని విన్న రామరావుకి కోరికలని వదిలేస్తే జీవితంలో ఏం చెయ్యాలి అనిపించింది.
ఇంతలో ప్రవచనం ముగిసింది. భక్తులు ఒక్కొక్కరే కానుకలు సమర్పించుకుని వెళ్తున్నారు. అందరూ అయ్యారు. రామరావు మిగిలాడు. స్వామి ప్రశ్నార్ధకంగా చూశారు.
రా: (అయోమయంగా ఆలోచిస్తూ భక్తిగా) స్వామీ
స్వామి: (విశాలంగా చిరునవ్వుతూ) చెప్పు నాయనా
రా: ఫలాపేక్ష లేకుండా పనులు చెయ్యడం ఎలాగ స్వామి?
స్వామి: (చెదరని అదే నవ్వుతో) జరిగేది జరుగుతుంది. నీ కర్మ నువ్వు చెయ్యడమే.
రా: అలాంటప్పుడు ఏదైనా ఎందుకు చెయ్యాలి స్వామి. జరిగేది జరుగుతుంది.
స్వామి: (ఖంగుతిని మళ్ళీ సర్దుకుని) అప్పుడు నువ్వేమీ చేయకపోతే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది.
రా: జీవితం మీద విరక్తిగా ఉంది. నచ్చిందేమీ జరగదు. చావాలని ఉంది.
స్వామి: (మళ్ళీ చిరునవ్వుతో) చావు పరిష్కారం కాదు నాయనా. పుట్టినందుకు అనుభవించవలసిందే. చచ్చినా మళ్ళీ పుడతావు. ఇందాకా చెప్పినప్పుడు నువ్వు సరిగ్గా వినలేదు అనుకుంటా.(గడ్డం నిమురుకుని)

శ్లో: వాసాంసి జీర్ణాని యథా విహాయా నవాని గృహ్ణాతి నరో౭పరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ
తా: మానవుడు చిరిగిన పాత బట్టలను వదిలి, కొత్త బట్టలను ధరించినట్లు జీవాత్మ పాత శరీరములను వదిలి నూతన శరీరములను పొందుతుంది.

రా: (బాధగా) అంటే చచ్చినా తప్పదా స్వామి?
స్వామి: తప్పదు నాయనా.
రా: (గాభరాగా) ఇలా ఎన్ని సార్లు పుట్టాలి స్వామి?
స్వామి: కర్మ ఫలం ముగిసే వరకు.
రా: కర్మ చేస్తే పుడతాము. పుడితే కర్మ చెయ్యాలి. ఇది తేలేలా కూడా కనిపించటం లేదు. దీనికి అంతం ఏమిటి స్వామి?
స్వామి: ముక్తి లభించేవరకు.
రా: ముక్తి అంటే ఏంటి స్వామి?
స్వామి: జన్మ రాహిత్యం నాయనా
రా: ఏమి చేస్తే వస్తుంది స్వామి?
స్వామి: సత్కర్మలు చెయ్యాలి నాయనా.
రా: ఇప్పటిదాకా నాకు అర్ధం అయినంత వరకు అవే చేస్తున్నాను స్వామి. అయినా ఏంటి?
స్వామి: (ఆశ్చర్యంగా) ఏం చేస్తున్నావు నాయనా?
రా: నేను అడగలేదు. నా తల్లితండ్రులు కన్నారు. చదివించారు. వచ్చినంత వరకు చదువుకున్నాను. పెళ్లి చేశారు. నేను చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నందుకు నా భార్యా బిడ్డలని పోషిస్తున్నాను. వాళ్ళ కోరికలు తీర్చటం కోసం కష్టపడుతున్నాను. ఇవన్నీ సత్కర్మలే కదా?
స్వామి: మరి విరక్తి ఎందుకు నాయనా?
రా: ఉన్న పరిస్థితులలో ఇమడలేక. నాకు నచ్చినట్టు బతకలేక. వాళ్ళ కోరికలు తీర్చలేక.
స్వామి: నీకు నచ్చినట్టు అంటే?

తన కథంతా చెప్పుకొచ్చాడు రామరావు . అంతా విన్న తరువాత ...

స్వామి: నీ కోరికలు విడిచిపెట్టు నాయనా
రా: అన్నీ వదిలేస్తే ఇంకా ఏమైనా చెయ్యడమెందుకు స్వామి?
స్వామి: అంతా ఈశ్వరేచ్చ. అన్నిటిని నడిపించేది వాడే. నీ ప్రతి కదలికా ఈశ్వరానుగ్రహమే.
రా: అంటే నేనిలా ఉండడానికి కారణం ఈశ్వరుడే అయితే నాకు ఈ ఇబ్బందులు ఎందుకు పెట్టాడు స్వామి.
స్వామి: నీ కర్మ ఫలం.
రా: నేను కర్మ చేస్తే ఆ కర్మఫలమే నేను అనుభవిస్తే మళ్ళీ ఈశ్వరుడు నడిపించేది ఏమిటి?
స్వామి: నువ్వే ఈశ్వరుడివి.

రామరావు కి బుర్ర తిరిగిపోయింది. ఈ జిలేబీకి అంతం కనపడలేదు. ఇంకో రకంగా తెలుసుకుందామని అడిగాడు.

రా: (కొంచెం ఆవేశంగా) ఎన్ని జన్మల తర్వాత ముక్తి వస్తుంది స్వామి?
స్వామి: ఎన్ని సత్కర్మలు చేస్తే అంత వేగంగా వస్తుంది నాయనా
రా: మరి నేను నా బుధ్ధిని అనుసరించి చేస్తున్నానే. నా బుధ్ధి కూడా ఈశ్వరుడే అయి, నేను కూడా ఈశ్వరుడినే అయితే మరి నాకు వెంటనే జన్మరాహిత్యం రావాలి కదా?
స్వామి: (విసుగు కనపడనీయకుండా) ఈశ్వరేచ్చ
రా: అంటే నేను ఈశ్వరేచ్చ ప్రకారం ఎన్నో జన్మలు ఎత్తి, ఎత్తి ఎప్పటికో ఒకప్పటికి ముక్తి పొందేస్తాను. మరి ఏం చేస్తే ఏంటి స్వామి?
స్వామి: (కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టి, దాన్ని మించిపోయేలా చిరునవ్వు నవ్వి) పరమేశ్వరనుగ్రహ ప్రాప్తిరస్తు.

రామరావు కళ్ళు పొరలు లేచిపోయాయి. ఒకటే విషయం అర్ధం అయ్యింది. ఎలా కొట్టుకున్నా తన కష్టం తానే తీర్చుకోవాలి. ఎవడూ తీర్చలేడు. చావో, బ్రతుకో తానే తేల్చుకోవాలి. ఒక నమస్కారం పెట్టి తిరిగి పోయాడు.

discussion అయిన తరువాత ఎంతో చిరాకుతో కూర్చున్నాడు స్వామి అలౌకికానంద . పేరులో తప్పితే అలౌకికంగా, లౌకికంగా జీవితంలో అతనికి ఆనందం దొరికినట్టు కనపడటం లేదు. ఎప్పుడూ ఇంతే తను ఉపదేశించే దానికి, తన జీవితంలో జరిగే దానికి చుక్కెదురు. మొన్ననే ఏదో tv channel లో interview కి వెళ్లినప్పుడు వాళ్ళు వేసే ప్రశ్నలకి జవాబులు చెప్పలేక కోపం కూడా వచ్చింది. తనేమో పరిపూర్ణమైన జ్ఞ్యానం ఈ జనాలకి అందించాలని ప్రయత్నం, వీళ్ళు తన జీవితంలో జరిగిపోయిన వాటిని తీసుకుని ప్రశ్నలు. మొన్నటకి మొన్న కామ, క్రోధ, మద, మాత్సర్యాలు విడవాలి అని చెప్తే తన గత జీవితంలో వదిలేసిన పంకజం గురించి, ప్రస్తుతం ఆశ్రమం పేరు మీద ఉన్న భూముల గురించి, తన competitor స్వామి అభేదానంద గురించి అడిగితే మరి కోపం రాదా. ఇవాళ Christian missionaries’ అని చెప్పి బొల్డు డబ్బు పెట్టి జనాలని పోగేసి కళ్ళు వచ్చాయి, asthma తగ్గింది, రక్షకుడు కరుణామయుడు అని చెప్పి ఎంత ప్రచారం చేసినా ఎవడూ comment చేయడు. డబ్బు మహిమ అలాటిది. వాళ్లెమో కోట్లకి పడగలెట్టడం. తను ఎంత local, indigenous స్వామి అయితే మాత్రం తనకేమో harassment. అసలు ప్రజలకి వేదాలు, ధర్మం అంటే గౌరవం పోయింది. తను కూడా కొద్దిగా foreigners ని పోగేసి art of living, level of thinking అని కొద్దిగా political propaganda కలిపితే తప్పితే ఇది కుదుటపడేలాగా కనపడటం లేదు. ఇది కాకుండా ఈ మధ్య పురాణాల మీద టీకా, తాత్పర్యాలు చెప్పే బ్రహ్మశ్రీ లు ఎక్కువై తనకి అక్కడి నించి కూడా stiff competition. ఈ next generation కి అసలివేమీ పట్టటం లేదు. వీళ్ళు computers, dollars, abroad అని, అదే తాపత్రయం. ఇలాటి conditions లో ఎలాగైనా తన సత్తా నిరూపించుకోవాలి. ఎలా?..... ఆలోచిస్తూ కూర్చున్నాడు.


Monday, June 25, 2012

Kotta Bhetala kathalu – Tyagi the opportunist


శవం concept close అవ్వడం తో ఏమీ తోచని భేతాళుడు కాలక్షేపం కోసం కొండపూర్ లో ఉన్న విక్రమ్ ఇంటికి వెళ్ళాడు. విక్రమ్ చాలా relaxing mood లో ఉండి “ఏంటి భేతాళా ఇలా వచ్చావు, టీ ఏమైనా తాగుతావా” అని అడిగాడు. భేతాళుడు సరే అనడంతో విక్రమ్ టీ, biscuits తెప్పించాడు. టీ తాగిన తరువాత విక్రమ్ “ఏంటి విషయాలు భేతాళా” అని అడిగాడు. “ఏముంటాయి, ఇంతకు ముందు నువ్వు శవం వెతుక్కుంటూ రావడంతో నాకు నిన్ను వెతికే అవసరం లేకపోయేది. ఇప్పుడు నువ్వు ఆ పధ్ధతి మార్చడంతో నేను నిన్ను వెతుక్కుంటూ రావలసి వస్తోంది. నా గురించి తెలిసింది నువ్వోక్కడివే. అందుకే ఇలా” అన్నాడు. దానికి విక్రమ్ “సరే బాధపడకు. అవసరం అన్నది ఎవడి చేతైనా, ఎంత పనైనా చేయిస్తుంది”. ఇప్పుడు నువ్వు కూడా exception కాదని తేలిపోయింది. సరే ఇంతకీ కథ ఏమైనా చెప్తావా, లేకపోతే మనం latest movie దేనికైనా వెళ్దామా. ఎందుకంటే ఇప్పటి సినిమాలు అన్నీ horror పుట్టిస్తున్నాయి. మనిద్దరికీ శ్మశానం feel కూడా వచ్చేస్తుంది” అన్నాడు. దానికి భేతాళుడు ”వద్దు నా మీద ఏమైనా కోపం ఉంటే, పొమ్మంటే పోతాను, శ్మశానం కంటే భయంకరమైన విషయాలు నాకు చెప్పకు”అన్నాడు.”అయితే దేని మీద కథ చెప్తావు” అని అడిగాడు విక్రమ్.” నువ్వు అవసరం అన్నావు కదా, అవసరం కోసం ఎవరినైనా వంచించగలిగే సూచిత్ త్యాగి కథ చెప్తాను విను”అని భేతాళుడు కథ చెప్పడం మొదలెట్టాడు.
Bus stop లో wait చేస్తున్న నీలమ్ కి తన boy friend వస్తున్న జాడ కనపడటం లేదు. ఎప్పుడూ late చెయ్యని అతను ఇవాళ ఎందుకు ఇంత late అవుతున్నాడో అంతు పట్టటంలేదు. నిన్న అతను ఏదో సరదా పడదాం అంటే పెళ్ళికి ముందు ఇవన్నీ తను వద్దంది. అందుకనేమో రాలేదు అనుకుంది. తనేమో bank ఉద్యోగి. మరి అతను ఇప్పుడు రికామీగా తిరుగుతున్నాడు. అతనికున్న time తనకి ఉండదు. ఇప్పటికే bank manager దృష్టిలోకి తను వెళ్లిపోయింది late comer అని. మరి ఇతనేమో అన్నీ easy గా తీసుకుంటాడు. సరే ఇంకొంతసేపు wait చేసి చూద్దాం అనుకుంది. ఆ తరవాత ఒక గంట గడిచింది. నీలమ్ కి ముందు వెనకా ఎవరూ లేరు. ఒంటరి జీవితం గడిపే ఆడపిల్ల ఎన్ని కష్టాలు పడుతుందో అన్నీ అనుభవించింది. కానీ ఎప్పుడూ తను గాడి తప్పలేదు. తన bank manager కూడా ఇన్నిసార్లు తనని క్షమిస్తున్నాడంటే కారణం అర్ధం చేసుకోలేనంత చిన్న పిల్ల కాదు. కానీ ఇప్పుడున్న boy friend తన మాటలతో, చేతలతో తనని చాలా impress చేశాడు. సరే office hours అయిన తరువాత అతని ఇంటికి వెళ్ళి చూస్తే సరిపోతుందని అనుకుని auto తీసుకుని office కి బయలుదేరింది.
భర్త పోయినతరువాత కోమల్ త్యాగి తన కొడుకు మీదే ప్రాణం పెట్టుకుని బ్రతుకుతున్నాది. వాడు చదివినంత కాలం బాగానే ఉండేవాడు. Degree పూర్తి చేసిన తరువాత వాడు ఇంటికి ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు వెళ్తాడో, ఏమి చేస్తున్నాడో, ఏమీ తెలియటం లేదు. ఏమైనా అడిగితే విసుక్కుంటున్నాడు. ఏదైనా ఉద్యోగం చూసుకుంటే బాగుండేది వీడు. భాద్యత తెలిస్తే కొంత కుదుట పడుతుంది.తన ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. ఇప్పుడా అప్పుడా అన్నట్టు ఉంటున్నది. వీడు వస్తే బాగుండును.  కోమల్ త్యాగి నిట్టూర్చింది
సరితా మల్హోత్రా కి నిన్న రాత్రి జరిగింది తలుచుకుంటుంటే మంచి relaxing గా అనిపించింది. తన భర్త రాకేష్ ఎప్పుడూ business పనుల మీదే ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాడు. తనకేమో ఇక్కడ local office లో in charge కింద ఉంచాడు. నిన్న interview కి వచ్చిన కుర్రాళ్లలో ఒకడు బాగా impress చేశాడు. రాత్రి office hours అవ్వగానే hotel కి వెళ్ళి అక్కడ room లో అతను తనని escort చేసిన విధానం, శారీరకంగా, మానసికంగా అతను తనతో ప్రవర్తించిన విధానం, తనకి ఎంతో నచ్చింది. అతనిని office లో పెట్టుకుంటే తనకి అన్నీ రకాలుగా ఉపయోగపడతాడు.  ఇన్నాళ్ల బట్టీ life లో ఉన్న vacuum పోతుంది అనుకుంటూ కార్ start చేసి office వైపు పోనిచ్చింది.
రాజేష్ తన friend కోసం wait చేస్తున్నాడు. వాళ్ళ వీధి కోసన ఉండే ఇంట్లో ఉండే తన ఫ్రెండ్ చాలా కాలం నించి తన చెల్లెలితో చూపుల సందేశాలు నడపడం తన దృష్టిని దాటి పోలేదు. వాడు నిన్న నాకు ఉద్యోగానికి అవసరం రా అని కొంత డబ్బులు అడిగాడు. తన చెల్లెలి పెళ్లి కోసం ఉంచిన డబ్బుఉంది అని చెప్పడంతో నీ చెల్లెలిని పెళ్లి చేసుకుంటాను నాకు ఇప్పుడు నువ్వు సాయం చెయ్యి, ఉద్యోగం రాగానే పెళ్లి అని confident గా చెప్పడంతో ఆ డబ్బు తీసి ఇచ్చాడు. ఇవాళ వాడు ఇంకా కనపడలేదు. ఏం జరిగుంటుందో, ఎప్పుడు వస్తాడో ఏంటో అని తన ఇంటి ఎదురుగా ఉండే బడ్డీ కొట్లో సిగరెట్ కాలుస్తూ కూర్చున్నాడు.
సోనాలీకి గాల్లో తేలిపోతున్నట్టు ఉంది. తన తండ్రి పెద్ద business magnet. అయనకి తెలియకుండా తను పెళ్లి చేసుకోబోతుంది. ఇవాళే registrar  office లో పెళ్లి. ఇంట్లోంచి తన నగలు, కొంత డబ్బు pack చేసుకుని బయలుదేరింది. ఇంకొద్ది గంటలు అంతే. తరువాత సినిమా లో చూపించినట్టు అతన్ని ఇంటికి తీసుకు వెళ్ళి daddy కి పరిచయం చేస్తుంది. అతను కూడా smart. ఇన్నాళ్ళు తను అడిగినదేదీ daddy కాదనలేదు. ఇది కూడా కాదనడని తనకి తెలుసు.
Registrar office దగ్గిర నిల్చున్న సూచిత్ త్యాగి ఆలోచనలు రకరకాలుగా సాగుతున్నాయి. ముందు నీలమ్ తో జీవితం అనుకున్నాడు. కానీ సోనాలీ కలిసిన తరువాత life లో security ఉంటుందనిపించింది. నీలమ్ తో అయితే తను middle class కిందే settle అవ్వాల్సి వస్తుంది. అదే సోనాలీ అయితే ఒక్కతే కూతురు. పెళ్లి చేసుకుంటే సోనాలీ తండ్రి కూడా కాదనడు. ఇంక సరిత తో తన setup అలా సాగుతుంది. ఒకసారి పెళ్లైతే రాజేష్ డబ్బులు తీర్చేస్తే వాడు కూడా ఏమీ అనుకోడు. వాడి చెల్లితో చూపులే తప్పిస్తే commitment ఏమీ లేదు. అప్పుడు తన తల్లి గురించి ఆలోచించొచ్చు. ఇంకొద్ది గంటలు అంతే. తను ఎవరినీ మోసం చేయలేదు. ఇవన్నీ అవసరానికి ఏర్పడ్డ సంబంధాలు. నీలమ్ కూడా ఏముంది. తరువాత ఎవరినో చూసుకుని settle అయిపోతుంది.
ఇంతవరకు కథ చెప్పి భేతాళుడు ఆగాడు. విక్రమ్ ప్రశ్నార్ధకంగా చూశాడు కథ అయిపోయిందా ఏంటి అన్నట్టు. భేతాళుడు లేదు ఇంకా ఉంది అన్నట్టు సైగ చేసి కంటిన్యూ చేశాడు.
ఆ తరువాత సంఘటనలు చాలా తొందరగా జరిగాయి. సోనాలీ ని పెళ్లి చేసుకున్న త్యాగి ని సోనాలీ తండ్రి ఇంట్లోకి రానిచ్చాడు ఇల్లరికం రావాలనే ఒక షరతుతో. కొన్ని రోజుల తరువాత ఎక్కడున్నాడో అని వెతుక్కుంటూ అతని ఇంటికి చేరిన నీలమ్ కి ఆ ఇంటికి తాళం వేసుండడంతో enquiry చేసుకుంటూ రాజేష్ చెల్లెలి విషయం రాజేష్ ద్వారా తెలిసి ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. నీలమ్ వ్యవహారంతో అనుమానం వచ్చిన రాజేష్ ఆరా తీస్తే త్యాగి వేరే పెళ్లి చేసుకున్నవిషయం తెలిసి, అతనింటికి వెళ్తే, అక్కడ సోనాలీ రాజేష్ ద్వారా త్యాగి విషయం తెలుసుకుని అతనితో తెగ తెంపులు చేసుకుంది. సోనాలీ తండ్రి త్యాగిని ఇంట్లోంచి బయటకి గెంటేశాడు. ఉన్న డబ్బులు కూడా పోయాయి అని తెలుసుకున్న రాజేష్ తన చెల్లెలికి వేరే సంబంధాలు వెతకడం మొదలెట్టాడు. తరువాత కొన్నాళ్లు సరిత దగ్గిర పనిచేసిన త్యాగిని, తన సరదా తీరడంతో, సరిత కూడా తన security ఆలోచించుకుని త్యాగిని ఉద్యోగంలోంచి తీసేసింది. ఇంటికి తిరిగి చేరిన త్యాగికి తన తల్లి కనపడకపోవటంతో ఇరుగుపొరుగు వాళ్ళని కనుక్కుని ఎట్టకేలకు తన తల్లి చేరిన old age  home చేరేసరికి తల్లి మరణించిన వార్త విని బాధపడ్డాడు. నీలమ్ ఎప్పటికప్పుడు త్యాగి గురించి కనుక్కుంటూనే ఉంది. ఇలా ఆరు నెలలు గడిచిన తరువాత తిరిగి ఉద్యోగాల వేటలో bus stop కి చేరిన త్యాగికి నీలమ్ కనపడింది. త్యాగి తననే సమీపిస్తుండడంతో అతని వైపు భావరహితంగా చూసింది.
మళ్ళీ భేతాళుడు ఆగాడు. విక్రమ్ ఇప్పుడేంటి అన్నట్టు చూశాడు. భేతాళుడు అడిగాడు “ఇప్పుడు నీలమ్ ఏం చేస్తే correct?”.  విక్రమ్ నవ్వాడు – “నువ్వు త్యాగి జీవితం మీద question వేస్తావు అనుకున్నాను. నీలమ్ గురించి అడుగుతున్నావు” అన్నాడు. సరే ఏదో ఒకటి చెప్పు “ఇప్పుడు నీలమ్ ఏం చేస్తే correct?”. విక్రమ్ అన్నాడు” అసలు కథలో stuff లేదు భేతాళా, ఇలాటి delusions నువ్వు ఎన్నో సంవత్సరాలుగా చెప్తున్నావు. నీలమ్ ఏది తోస్తే అది, ఏదైనా చెయ్యొచ్చు.ఇందులో controversy ఉన్న point ఏమీ లేదే.” అన్నాడు. భేతాళుడు సర్దుకున్నాడు. “ పోనీ త్యాగి లాటి మనుషులు ఈ society కి అవసరమా”. విక్రమ్ అన్నాడు” నేనెవడిని అది finalize చెయ్యడానికి. ఈ society నించి వచ్చిన product త్యాగి. అంటే అలాటి వాడిని తయారు చేస్తున్న ఈ society కి వాడి అవసరం ఉండే ఉంటుంది. ఇందులో నన్నేమిటి చెప్పమంటావు. ఆస్థులు పంచుకుని బాధ్యత వదిలేసే కొడుకులు,కూతుళ్ళు, చిన్న చిన్న కోరికల కోసం జీవిత భాగస్వాములని మోసం చేసే సంసారులు, జీతాలు తీసుకుని పైరాబడి కోసం ఆశపడే ఉద్యోగులు, స్వంత లాభం కోసం దేశాన్ని కూడా తాకట్టు పెట్టగలిగే entrepreneurs, రాజకీయ నాయకులు, అవసరం కోసం స్నేహాలు చేసే friends, అసలు ఎవడు opportunist కాదు. అందరూ అంతే. చిన్న శృతి భేదాలు. Opportunist అనేవాడు ఎవడూ లేని కాలం అంటూ ఏమైనా ఉందా. ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందన్న త్రేతా యుగంలో, రామ పట్టాభిషేకం సమయంలో లక్ష్మణుడు నవ్వితే, అక్కడ ఉన్న విభీషణుడు, అంగదుడు, హనుమంతుడు, రాముడు మిగతా పరివార జనాలే కాదు ఆఖరికి సీత కూడా తల వంచుకుందిట. వాళ్ళల్లోని opportunist ని చూసి లక్ష్మణుడు నవ్వాడని. ఏ కాలంలో opportunist లు లేరు భేతాళా? ” “అయితే నువ్వు opportunist ని సమర్ధిస్తావా” అని అడుగుదామనుకున్న భేతాళుడు  ఆవేశంగా సాగుతున్న విక్రమ్ ఉపన్యాసం తో గాభరాపడి conclusion తీసుకోకుండా, చెప్పా పెట్టకుండా మాయమైపోయాడు.  

Thursday, June 21, 2012

Kotta Bhetala kathalu -Ramakrishna the Dreamer




పట్టువదలని విక్రమ్ తన laptop తీసి అందులో భేతాళ శవం తాలూకు details కోసం surfing మొదలెట్టాడు. Google search లో భేతాళ శవం అని type కొట్టగానే ఆంధ్ర communist వరవరరావు వ్రాసిన కవిత open అయ్యింది.అది చదువుతూ కాసేపు కూర్చున్నాడు. ఆ కవితలో అదేదో lockup శవం అనగానే విక్రమ్ కి అనుమానం వచ్చింది తను police stations చుట్టూ తిరగాల్సి వస్తుందేమోనని. మళ్ళీ తను శవాన్ని తీసుకుపోవడం, మళ్ళీ తనకి మౌనభంగం అవ్వగానే శవం ఏ mortuary లోకో, చెట్టు మీదకో పోవడం తో విసుగెత్తి, విక్రమ్ కి తెలియకుండా భేతాళుడు ఈ sequence break చెయ్యడానికి శవాన్ని ఎక్కడో దాచేసి ఉంటాడనిపించింది. అసలు ఇన్నాళ్ళు “ఈ శవాన్ని వెతకడం, మొయ్యడం , అది మళ్ళీ మాయమవ్వడం” ఈ confusion లో పడి అసలు తనకి శవం అవసరం ఏమిటో మర్చిపోయాడు. ఎవడికి కావాలి ఈ శవం, అసలు ఈ గొడవ అంతా ఎందుకూ? ఎంచక్కా ఏదైనా pub కి వెళ్ళి ఒక chilled beer తాగి అప్పుడు ఆలోచిద్దామని తన Toyota car తీసుకుని pub కి వెళ్ళాడు. అక్కడ beer order చేసి కూర్చున్నాడు. “Yes విక్రమ్ ఏంటి సంగతి –శవాన్ని వదిలేసి నువ్వే శవం అయిపోడానికి ఏదో తాగుతున్నట్టు ఉన్నావు –శవాల వేట మానేశావా ఏంటి” అని ఒక గొంతు వినిపించింది. విక్రమ్ కి అర్ధం అయ్యింది అది భేతాళుడి గొంతే అని. తను తాగుతున్న మందు glass మీద నుంచి దృష్టి మరల్చకుండా “ఈ శవాన్ని మోసే అవసరం నాకు లేదు, నేను ఎందుకు మోస్తున్నానో నాకే తెలియదు. నువ్వేదో కథ అంటావు, జవాబు చెప్పగానే అది మాయమైపోవడం. నాకేమో శవాన్ని మోస్తూ కథ వినడం ఎందుకు, మోత దండగ. ఇప్పటి నించి నువ్వు కథలు చెప్పు నేను జవాబులు చెప్తాను. శవం గోల వదిలేద్దాం , అవును నీకేమైనా కావాలా తాగడానికి అన్నాడు. అప్పుడు భేతాళుడు “ok so be itlet me also have one chilled” అని తన గ్లాస్ కూడా నిండగానే ఒక గుక్క తాగి కథ start చేశాడు.
రామకృష్ణ నవ్వుకున్నాడు. అతని చేతిలో ఆనాటి దినపత్రిక రెపరెపలాడింది. ప్రజలు మూర్ఖులు. వీళ్ళు ఎవరైతే తమని దోచేస్తారో వాళ్ళకే ఒట్లేసి గెలిపిస్తారు. లేకపోతే ఈ జనాలు ఒక CM కోసం చావడం ఏమిటి. వాడి కొడుకు black money మీద enquiry వేయించిన ఇంకో black money party ని ఓడించి వాడి కొడుకుని గెలిపించడమేమిటి. ఈ పత్రికల వాళ్ళు వాడిని ఆకాశానికి ఎత్తడమేమిటి. ఉన్న రాజకీయ పార్టీలన్నీ ex –CM కొడుకు party లాటివే. ఎవడిని గెలిపించాలి, గెలిపించకూడదు అని కూడా వదిలేస్తే అసలు “ఈ ప్రజలు” - వీళ్లకేమి కావాలో వీళ్లకే తెలియదు. కానీ తనకి తెలుసు. అందుకే Orissa border దగ్గర మొదలుపెట్టిన తన “ఆంధ్రా cycle యాత్ర” లో రకరకాల గ్రామాలు సందర్శించి, అక్కడి ప్రజలకి నిజాన్ని తెలియబరుస్తూ సాగుతున్నాడు. ఈ జనాలని చైతన్యపరిచి ఈ క్షుద్ర రాజకీయాల నడ్డి విరవాలి. ఈ సమాజంలో ఒక విప్లవం రావాలి. అందుకు ఈ cycle యాత్ర ఒక మైలురాయి కావాలి. దీనికి prologue లో రామకృష్ణ “The motor cycle diaries” పుస్తకం చదువుతున్నాడు. “Ernesto Che Guevara” అంటే అతనికి విపరీతమైన అభిమానం ఏర్పడింది.
విక్రమ్ కి విసుగొచ్చింది, భేతాళుడితో” నువ్వు కూర్చున్న place కి, తాగుతున్న మందుకి, ఇప్పుడు చెప్తున్న కథకి ఏమైనా match అయ్యిందా. ఉన్న mood పాడు చెయ్యడం కాకపోతే” అన్నాడు. అప్పుడు భేతాళుడు “ఏం బాబు విప్లవం కథలు bar లో వినకూడదని ఏమైనా rule ఉందా “కథ చెప్తున్నాను కదా –cool గా మందు కొడుతూ విను –లేకపోతే మళ్ళీ శవం మోస్తూ వింటావా  -అది నీ ఇష్టం” అన్నాడు . విక్రమ్ అయిష్టంగానే వినడం మొదలెట్టాడు.
ఎలాగైతే Che Guevara motorcycle మీద తిరుగుతూ జీవితానికి ఒక అర్ధం కనుక్కున్నాడో అలాగే తను cycle మీద తిరుగుతూ జీవితాన్ని సార్ధకం చేసుకోవాలని బయలుదేరాడు. ఎంత వరకు సాధిస్తాడో కాలం నిర్ణయిస్తుంది. ముందుగా సోంపేట లో చిన్న బడ్డీకొట్టు meeting పెట్టాడు. అప్పుడు అక్కడ 2640 MW coal based power plant పెట్టకూడదని జనాలు ఆందోళన జరుగుతున్నది. కాకరాపల్లి, సోంపేట power plants కి environmental clearance ఎవరు ఇచ్చారు. ఆ factory లు అక్కడ పెడితే అక్కడి నీటిలో arsenic, lead లాటి విష పదార్ధాలు పెరిగిపోయి జనజీవితాలు అస్తవ్యస్తమైపోతాయని జనవాక్యం. ఆ బడ్డీకొట్టు meeting లో రామకృష్ణ government ని దాని policies ని తూర్పార బట్టాడు. జనాలు మౌనంగా విని టీ తాగడం అవ్వగానే “బాగా చెప్పావు బాబు” అని రామకృష్ణ తో అని వెళ్ళిపోయారు. రామకృష్ణ కి బోలెడంత ఉత్సాహం వచ్చింది. Yes ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు అని అలా ముందుకి సాగాడు. విజయనగరం చేరగానే అక్కడ పరిస్థితి ఆరా తీశాడు. అక్కడ Centre లో ఉన్న ruling party తాలూకు ఆంధ్ర local party chief , CM ఇద్దరు liquor scam అని ఒకళ్ల మీద ఒకళ్లు బురద చల్లుకుంటూ పత్రికల ద్వారా బండబూతులు తిట్టుకుంటూ కనపడ్డారు. వెంటనే రామకృష్ణ అక్కడ cinema hall  బయట ఉండే వెరుశెనగబడ్డీ దగ్గిర తన వాక్ప్రవాహంతో జనాల్ని కట్టి పడేశాడు. అసలే NTR భీష్మ సినిమా ఆడుతోంది. మంచి ఓపిక మిగిలిపోయిన ముసిలివాళ్ళందరూ చూడటానికి వచ్చారు. అంతా విన్న ఇద్దరు మూసిలాళ్ళు మాకు వినబడటంలేదు,కొంచెం గట్టిగా చెప్పమన్నారు. రామకృష్ణ వాళ్ళ స్వార్ధరహిత కుతూహలాన్ని గమనించి మరింత ఉత్సాహంతో గట్టిగా అరిచి చెప్పడం మొదలెట్టాడు. ఇంకొక మూసిలాయన “గొంతెడిపోద్ది బాబూ, సోడా తాగు“ అని సోడా కూడా ఇప్పించాడు. అలాగ అక్కడినించి విశాఖపట్నం చేరే సరికి అక్కడ ఒక super land scam గురించిన వార్త చదివాడు. VUDA వాళ్ళు అప్పుడే ప్రపంచాన్ని చూసినట్టు” ఏమిటి ఋషికొండ, మధురవాడ, ఎండాడ, పరదేశిపాలెం, కూర్మన్నపాలెం, పేదవాల్టేర్ ఇన్ని చోట్ల భూ కబ్జానా” అని ఆశ్చర్యపోవడం –VUDA vice chairman, మినిస్టర్ అందరూ enquiry జరిపిస్తామని హామీ ఇవ్వడం, ఇవన్నీ చదివి రామకృష్ణ ఉడికిపోయాడు. ఎవరి సొమ్ముని ఎవరు తినేస్తారు. ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలి అని VUDA ఆఫీసు బయట బజ్జీ  తయారు చేసేవాళ్లకి, xerox shop వాళ్ళకీ హోరాహోరీ వివరించాడు. వాళ్ళు కూడా RTO office shift చెయ్యడం నించి కలిగిన సాధకబాధకాలు అవి చెప్పుకుని బాధపడ్డారు. ఇలాగే గోదావరి జిల్లాల్లో liquor scam లు,bank fraud లు వీటి మీద ఉపన్యసించి గుంటూరు చేరేసరికి అక్కడ ఇందిరమ్మ housing scam లు, దేవాదాయ భూముల scam, ఆఖరికి నీళ్ళలో కలిపే Alum కూడా scam చేసేస్తుంటే బాధ భరించలేకపోయాడు. నెల్లూరు,చిత్తూర్, కడప లో జరుగుతున్న భూ కబ్జా,  money circulation & laundering, micro financing scam లు,  మహబూబునగర్ లో counterfeit currency, mining scam లు ఇవన్నిటి మీద వేరు వేరు ప్రదేశాలలో మాట్లాడి హైదరాబాద్ చేరేసరికి ex – CM కొడుకు ఓదార్పు యాత్ర ముగించి black money scam ని handle చేస్తున్నాడు. ఇవే కాకుండా national level లో Raja spectrum scam,  Laloo fodder scam, Harshad Mehta share market scam, Telgi stamp papers, Bofors, Common wealth games scam etc., ఇవీ చాలావన్నట్టు question paper కొనేసి పరీక్షలు రాయించే schools, colleges వల్ల చదువుల్లో కూడా scam అయిపోయి భావి తరాలు నాశనమౌతుంటే  రగిలిపోయిన రామకృష్ణ టాంక్ బండ్ మీద నిలబడి తనలోని ఆవేశాన్ని, విప్లవాన్ని కలగలిపి చెప్తూ ఉంటే, ఆ ప్రవాహానికి ప్రజలు మా leader నువ్వే అని హారతి పడుతుంటే, ఇంతలో police van వచ్చి అక్కడ ఆగింది. అందులోంచి దిగిన పోలీసులు జనాలని చెదరగొట్టి రామకృష్ణ ని jail లో పడేశారు. అప్పుడు అతని లోని Che Guevara విజృంభించి ధనమదాంధులైన బూర్జువా పాలక వర్గం కీళ్ళు విరిచే విధంగా guerilla warfare start చేశాడు.
“రామకృష్ణా” అన్న పిలుపుతో తనున్న upper primary school 8th std లో ఈ లోకం లోకి వచ్చిన రామకృష్ణ మాస్టర్ class వైపు నిర్వేదంగా చూశాడు. Principal తన వైపు తీక్షణంగా చూస్తుండడంతో, తడబడుతూ “చెప్పండి సార్ “అన్నాడు. అప్పుడు Principal “చూడు రామకృష్ణా, మీ నాన్న మంచి దేశభక్తుడు, నాకు close friend. అందుకే నువ్వేన్ని సార్లు class room లో నిద్రపోతున్నా నిన్ను క్షమిస్తున్నాను. నీ emotion నాకు తెలుసు. Class room లో నిద్రపోయి కొన్ని సార్లు నువ్వు పిచ్చి పిచ్చిగా కలవరించావు. అప్పుడు నాకు అర్ధం అయ్యింది. ప్రపంచం గోల మనకెందుకయ్యా. ముందు class ముగించి ఇంటికి నడు. ఇంట్లో కూడా రాత్రుళ్లు నిద్రలో పెద్ద పెట్టున అరుస్తున్నావట. ఎవరైనా మంచి doctor కి చూపించుకో” అని ఒక ఉచిత సలహా పారేశాడు. రామకృష్ణ తన చూపులతోనే “మనం బ్రతుకుతున్నది ఈ ప్రపంచం లో కాదా, ప్రపంచం గోల మనకెందుకంటావు, నీకు అసలు social awareness ఉందా” అన్నట్టు చూశాడు. Principal” చూసింది చాలు, నేను చెప్పింది చెయ్యి ”అని వెళ్లిపోయాడు.
ఇంతవరకు కథ చెప్పిన భేతాళుడు విక్రమ్ వైపు చూశాడు. అప్పుడు విక్రమ్ “కథ బాగుంది ఇంతకీ నీ question ఏంటి అది చెప్పి తగలడు” అన్నాడు.భేతాళుడు “రామకృష్ణ ఏమి చేస్తే correct” అని అడిగాడు. దానికి విక్రమ్ “ఏడ్చినట్టే ఉంది నీ question. రామకృష్ణ దేశభక్తుడి కొడుకు, బడిపంతులు కాబట్టి కలలు కంటున్నాడు. అదే businessman అయితే ఇలాటి కలలు కంటాడా. వాడికి పని తప్పితే ఆలోచించడానికి కూడా తీరిక ఉండదు. కలలు కనే outlet కూడా లేకపోతే రామకృష్ణ కి పిచ్చి ఎక్కుతుంది. మనిషి ఆశాజీవి కాబట్టి రామకృష్ణ కలలు కనడమే ఉత్తమం. ఇప్పుడున్న ప్రపంచంలో విప్లవాలు రావాలంటే ఇంకా పాకం బాగా ముదరాలి. అప్పుడు రామకృష్ణ కి జీవితం నిత్యసమరమైపోయి కలలు కనే అలవాటు, ఆలోచించే ఓపిక రెండూ పోతాయి. ఇంతేనా ఇంకేమైనా ఉందా” అన్నాడు. విక్రమ్ మందు పూర్తి చేసేలోపల భేతాళుడు నవ్వుకుంటూ మాయమైపోయాడు.

Sunday, January 9, 2011

Kotta Bhetala Kathalu - Joseph Vankayala the Achiever - Conclusion-1

విక్రమ్ చెప్పడం మొదలుపెట్టాడు. చూడు భేతాళా నీ కథలో చాలా gaps ఉన్నాయి. ఆ inbetween lines నువ్వు fill చేస్తే గానీ ఎవడూ దీనికి సమాధానం చెప్పలేడు. ఎవడైనా వాడి స్వానుభవం నించి తెలుసుకున్న దానినే జీవితంలో పాటిస్తాడు కొన్ని వంశ పారంపర్యంగా వచ్చినా కూడా. చిన్నప్పుడు ముద్దుగా పెరిగిన వాడు మొండివాడుగా తయారవ్వడంలో ఆశ్చర్యం లేదు. వాడు తెలివైనవాడా కాదా అన్నది వాడి జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా మనం ఒక inference కి రావొచ్చు. నువ్వు చెప్పిన కథ ప్రకారం Joseph చాలా తెలివైనవాడు. అతని జీవితంలో జరిగిన సంఘటనలు అవి చెప్పకనే చెబుతాయి. అతనేమనుకున్నాడో ఆ లక్ష్యం సాధించడంలో అతను విజయం సాధించాడు. ఆ రకంగా అతను successful . నువ్వనే ఓడిపోవడం బహుశా నైతిక విలవుల గురించి అనుకుంటాను. ఏది నైతికం ఏది అనైతికం. ఎవరికీ తెలియదు. మారే కాలం, మారే విలువలు, మారుతున్న ప్రపంచం తో పాటు మారే సమాజం. నువ్వు చెప్పు ఈ ప్రపంచంలో నైతిక విలువలకి ఏది గీటురాయి. ఇది ఇలా చెయ్య కూడదని ఏదైనా rule ఉందా. భేతాళుడి నోట్లోంచి cuban సిగార్ కింద పడిపోయింది. విక్రమ్ continue చేశాడు.
అతని జీవితంలో జరిగిన సంఘటనలని తీసుకుందాం.
సవతి తల్లి జీవితంలోకి వచ్చిన తరువాత అతను ఇంటి నించి వెళ్ళిపోయాడు. ఇక్కడ సవతి తల్లి ఎలాటిదో చెప్పావా? చెప్పలేదు.
స్నేహితులు ఎవరైతే జీవితంలో major role play చేస్తారో వాళ్ళు ఎలాటి వాళ్ళో చెప్పావా? చెప్పలేదు. సాయం చేసారు చెయ్యలేదు, ఆ స్నేహితుల పరిస్థితి ఏమిటో చెప్పవా? చెప్పలేదు.
steno మహాలక్ష్మి ఏమి చెయ్యకుండానే వీడు అంత దూరం దూసుకు పోయాడు అంటావా?   - మహాలక్ష్మి  గురించి ఏమి చెప్పలేదు.
మార్వాడి కూతురు దాని జీవితం దానిది. ఎవరినీ గాభరా పెట్టలేదు. మార్వాడి తల్లి అలా ఎందుకు ప్రవర్తించింది? మార్వాడి తండ్రి ఎలాటి వాడో చెప్పవా?  చెప్ప లేదు.
అతను shares ,lottery ,  మట్క జూదం లో డబ్బులు పెట్టాడని చెప్పావు. అవి  governament ఎందుకు అనుమతి ఇస్తుందో నీకు తెలుసా? తెలిస్తే చెప్పు.
అతను బ్యాంకుల దగ్గిర డబ్బులు ఎగ్గొట్టి, financing company పెట్టాడన్నావు  . ఎగ్గోట్టగలిగే వెసులుబాటు ఉంది? ఎగ్గోట్టాడు.
అతను MLA అవ్వడం తరువాత high level lobbying , అయినా వాళ్లకి కాంట్రాక్ట్స్ ఇప్పించి commission తీసుకోవడం, ఎగుమతి దిగుమతి వీటిలో చట్టంలో ఉన్న లోసుగులతో ఎదగడం, డబ్బు సంపాదించడం  ఏ రకంగా తప్పు. అవకాశం ఉంది కాబట్టి చేశాడు.
కీర్తి గురించి మనిషి అన్నవాడు ఎవడైనా తహతహలాడతాడు. పది మందిలో గుర్తింపు కోసం ఏదో తాపత్రయపడ్డాడు , కానీ అతను చేసినవి hospital ,  blood bank , school , college , అనాధ శరణాలయం పెట్టటం లాటివి మంచి పనులే కదా? కానీ వాటిలో ఏదైనా గందరగోళం ఉందా? అది కూడా చెప్పలేదు.
అతను మతం మార్చుకున్నాడన్నావు. అందులో తప్పేంటి. ఎవడి personal జీవితం వాడిది. మత మార్పిడులు ప్రోత్సహించాడన్నావు. మారే వాళ్ళు ఉన్నప్పుడు మార్చడం తప్పేమిటి? అతను బలవంతంగా మార్పించాడా? అదీ నువ్వు సరిగ్గా చెప్పలేదు.
ప్రత్యర్థుల వర్గాలని అణగ తోక్కాడన్నావు. అక్కడ అతనికి ఆ అవసరం వస్తే అలా చేసి ఉంటాడు. అతను చచ్చిన తరువాత అతని కోసం ఎంతో మంది చచ్చిపోయారన్నావు. అతని కోసమే చచ్చారా, గొడవల్లో చచ్చిన వాళ్ళ list ఇతనికోసమని link చేశారా, clarity లేదు. 
చచ్చిన తరువాత జరిగే సంఘటనలో అతని ప్రమేయం ఏముంది?
ఇవి నువ్వు clarity ఇవ్వగలిగితే అప్పుడు నేను చెప్తాను అన్నాడు విక్రమ్.
భేతాళుడు toyoto లో ఇబ్బందిగా కదిలాడు. నీకు ఇంతకు ముందోసారి చెప్పాను. నేను అడిగితె నువ్వు సమాధానం చెప్పాలి అంతే గాని నువ్వు నన్ను ప్రశ్నలు వేస్తే నేను చేప్పడమేంటి? అన్నాడు.
విక్రంకి విసుగెత్తింది . ముందు నువ్వు సరిగ్గా కథ చెప్పడం నేర్చుకో. తరువాత ప్రశ్నలు అడుగు. అంతే కానీ రాముని తోక పీకి లా కథల చెప్పకు. ఇంతకీ నువ్వు వాడు ఎందుకు ఓడిపోయాడు అనుకుంటున్నావో  చెప్పగలవా? అన్నాడు.
భేతాళుడు తన ఆలోచన చెప్పడం మొదలుపెట్టాడు. 


my dear friends - ఇది మీరు చెప్పిన comment ని బల పరిచే వాదం. భేతాళుడికి  ఏమి reasoning ఉంటుందో చెప్పగలరా?



Friday, January 7, 2011

Kotta Bhetala Kathalu - Joseph Vankayala the Achiever

పట్టు వదలని విక్రమ్ తన toyoto car లోంచి దిగి mortuary freezer లో పెట్టిన  శవాన్ని పైకి లాగి తన వెంటే తెచ్చుకున్న పెద్ద PVC bag లో pack చేసి  కార్ డిక్కీ లో పడేసి తిరిగి car start చేసి బయలుదేరాడు. అప్పుడు కార్ బ్యాక్ సీట్ లో బేతాళుడు cuban cigar తాగుతూ చూస్తుంటే ఇంతకు ముందు నీలాగే over action చేసి  ఓడిపోయిన  Mr . Joseph Vankayala  కథ గుర్తుకు వస్తోంది.  "If you have enough time I can  tell you the story " అన్నాడు 
దానికి విక్రమ్ "yes please go ahead " అన్నాడు 

Mr. Joseph Vankayala అసలు పేరు వంకాయల వెంకట్రావు. అతని తండ్రి గాజుల మల్లారం పట్టుకుని ఇంటింటికీ తిరిగి అమ్ముతూ ఉండేవాడు. పెద్ద సంపన్నులు కాకపోయినా కూడు,గూడు, గుడ్డకి లోటు ఉండేది కాదు. వెంకట్రావు తల్లి ఒక సాధారణ గృహిణి. అతని చిన్నతనం ఆనందంగా గడిచిందనే చెప్పాలి. ఒకడే కొడుకు కావడం మూలాన చాలా గారాబంగా పెంచారు. దాని కారణంగా వెంకట్రావు చాలా మొండివాడుగా తయారయ్యాడు. ఏది కావాలంటే అది దెబ్బలాడి కొనిపించుకోవడం, అడిగినది ఇవ్వకపోతే ఏడ్చి గోలపెట్టి యాగీ చెయ్యడం అలవాటయిపోయింది. తల్లి తండ్రులకి అతని చిన్నప్పుడు అల్లరి చేస్తే ముద్దు అనిపించేది. కానీ అతను పెరిగి పెద్దవుతున్నకొద్దీ వాళ్ళు అతని అల్లరి భరించలేక పోయేవారు. కానీ ఒకడే కొడుకు మూలాన ఏమీ అనలేకపోయేవారు. వెంకట్రావు చదువు సంధ్యలలో బాగానే ఉండేవాడు. పెంకితనం మూలంగా బడిలో కూడా ఉపాధ్యాయులతో దెబ్బలు తింటూ ఉండేవాడు. అలాగే వెంకట్రావు జీవితం పదిహేను ఏళ్ళ వరకు సుఖంగానే గడిచింది. అతని జీవితం లో అప్పుడు కోలుకోలేని పెద్ద దెబ్బ తగిలింది. అతని తల్లి కాలం చేసింది. తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లిని ఆ వయసులో అతను భరించలేకపోయాడు. అందుకని వీలయినంత ఇంటికి రాకుండా తిరిగే వాడు. అలాటి సమయంలో అతనికి చాలామంది స్నేహితులు దొరికారు.
స్నేహితులే ప్రాణం, ప్రపంచం అయిపొయింది అతనికి. తండ్రి ఇలా తిరిగితే పెద్దయిన తరువాత నువ్వేమి అవుతావురా అని బాధపడేవాడు. కానీ ఎందుకో వెంకట్రావు కి సమాధానం చెప్పాలనిపించేది కాదు. పట్టించుకునే వాడూ కాదు. ఇలా ఇంకో అయిదేళ్ళు గడిచింది. వెంకట్రావు తండ్రి కాలం చేశాడు. వెంకట్రావు కి ఇంకా ఆ ఇంటితో సంబంధం తెగిపోయింది. ఈ ఆవేశాలలో పడి చదువు కూడా అలక్ష్యం చేశాడు. కానీ తెలివైనవాడు కావటం మూలాన ఏదో అత్తెసరు మార్కులతో డిగ్రీ పాస్ అయ్యాడు. తండ్రి పోయిన తరువాత సవతి తల్లి ఆస్తి లో చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. ఇతను అడగలేదు. ప్రాణమని నమ్మిన స్నేహితులు ఎవరి కారణాలు చెప్పి వారు తప్పించుకున్నారు. అతను తిండికి లేక బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. అతను చదివిన డిగ్రీ తో ఒక ప్రైవేటు కంపెనీ లో బాయ్ కింద జాయిన్ అయ్యాడు. అలా మొదలైంది వెంకటరావు ప్రస్థానం.
విక్రమ్ ఆపుకోలేక అడిగాడు "ఇందాక ఏదో పెద్ద english professor లాగ english  లో  మాట్లాడవు. ఇప్పుడేమిటి తెలుగులో కథ చెబుతున్నావు "
దానికి భేతాళుడు "You see Mr . Vikram don 't interrept the flow  of narration - నువ్వు మాట్లాడితే నేను చేట్టేక్కాలి - కానీ నాకూ చెట్టెక్కి చెట్టెక్కి bore కొట్టింది. Anyway your Toyoto seems to be comfortable than tree. So I will excuse you for this time . Don 't make noise and listen to the story .
Vikram వీడితో మనకెందుకని వినడం మొదలెట్టాడు. 
వంకాయల వెంకట్రావు కి జీవితంలో చాలా తొందరగా ఎదిగిపోదామని కోరిక. తానేమిటో నిరూపించుకోవాలని ఒక పట్టుదల. తనకి జరిగిన అన్యాయానికి జవాబు చెప్పాలనే ఒక ఆవేశం. పరిస్థితి అందుకు సహకరించదు. ఆఫీసుకి టీ తేవడం అందరికీ కప్పులు పెట్టి తియ్యడం వరకే అతని డ్యూటీ. ఇలా ఒక ఏడాది గడిచింది. ఈ ఏడాదిలో ఆ ఆఫీసులో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమి చేస్తారు, ఎలా లంచాలు తీసుకుంటారు, ఎవరికి ఎక్కడ అక్రమ సంబంధాలు ఉన్నాయి ఇవీ అతను పోగేసిన సరంజామా. ఆఫీసర్ని కలవాలంటే ఇతనికి మామూలు ఇవ్వడం అన్న సంగతి మామూలు అయ్యింది. అలా పోగేసిన డబ్బులతో అతను lottery , మట్కా జూదం లాటివి ఆడుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు ఏదో కొంత వచ్చేది, ఎక్కువ సార్లు డబ్బులు పోయేవి. అయినా అతను వదలలేదు. ఈ లోపు steno మహాలక్ష్మి, accountant బ్రహ్మాజీ affair పట్టుకున్నాడు. వాళ్ళిద్దరినీ black mail చేసి డబ్బు గుంజుతూ ఉండేవాడు. ఇంకొన్నాళ్ళ తరువాత భయపెట్టి మహాలక్ష్మి జీవితాన్ని quadrangle love story చేసేసాడు. పతి ,పత్ని మళ్ళీ వీళ్ళిద్దరూ(బ్రహ్మాజీ, వెంకట్రావు). ఈ మధ్యలో వెంకట్రావు అద్దెకుంటున్న ఇంటి ఎదురుగా ఉన్న ఫ్లాట్ లో ఉన్న మార్వాడి అమ్మాయితో ఇంకో love affair స్టార్ట్ చేశాడు. మార్వాడి ఫ్యామిలీ తో మంచి relations maintain చేస్తూ వాళ్ళ ఇంట్లో ఒకడిలా మసలుతూ ఖాళీ టైములో మార్వాడి తల్లిని కూడా ముగ్గులోకి దించేశాడు. అన్నీ చోట్ల అందరిని grip లో పెట్టుకుని తనకి కావలిసిన డబ్బులకి విలాసాలకి లోటు లేకుండా నడుపుతూ ఉండేవాడు. ఇంకొనాళ్ళ  తరువాత మార్వాడి తల్లి సాయం తో మార్వాడి తండ్రిని చంపేసి మార్వాడి కూతుర్ని పెళ్లి చేసుకుని మార్వాడి అల్లుడు అయిపోయాడు. 
మార్వాడి వాడు పోగేసిన లక్షల ఆస్తి ఒకేసారి చేతికందడంతో లక్షాధికారి అయిపోయాడు వెంకట్రావు
లక్షాధికారి వెంకట్రావు జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం అయ్యింది. అతనికి డబ్బు సంపాదనే ధ్యేయం. ఉన్న లక్షలని కోట్లు ఎలా చెయ్యాలని ఆలోచన. ముందు share markets , తరువాత banks దగ్గిర అప్పులు, ఎగ్గోట్టడాలు ఇలా కొంత కాలం గడిచిన తరువాత అతని దగ్గిర మరికొంత డబ్బు పోగయ్యింది. ఆ తరువాత ఒక financing company, ఆ డబ్బుల  వసూలికి  ఒక పిల్ల  rowdy batch   తయారు  చేశాడు. నెమ్మదిగా భూ కబ్జాలకి దిగాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు అతనికి politicians కి డబ్బులు ఇవ్వాలిసిన అవసరం వచినప్పుడు అనిపించింది తనే politics లోకి దిగితే ఎలా ఉంటుంది అని . ఇంకేముంది మెల్లిగా national level పార్టీ కార్యకర్త కింద join అయిపోయాడు. ఆ తరువాత కాలం పరిగెత్తింది. ఈ సంపాదించినా డబ్బులతో business , business లో వచ్చిన డబ్బులతో  politics , politics లో వచ్చిన డబ్బులతో expansion of business, తరువాత సినిమాలు, దినపత్రికలు, టీవీ ఛానళ్ళు ఒకటేమిటి వెంకట్రావు conglomerate owner అయిపోయాడు. ఆ తరువాత అతను నెమ్మదిగా politics లో ఎదిగాడు. MLA అయ్యి minister కూడా అయ్యాడు.


ఈ మధ్యలో వెంకట్రావు personal life అంత పెద్దగా పట్టించుకోలేదు. అలాగని అతనికి పెద్ద problems ఎదురు కాలేదు. అన్ని facilities ఉన్న ఇంట్లో అణిగి ఉండే భార్య అతనికి plus point అయ్యింది. అతని జీవితంలో అతను కోరుకున్న కాంతలూ, కనకం అతనిని వరించాయి. ఇంకా అప్పుడు కీర్తి వెనక పడ్డాడు. ఇప్పుడు వెంకట్రావుకి ఉన్న సమస్య ఎలా గొప్ప పేరు సంపాదించాలని. ఈ సమస్యతో వెంకట్రావు ఒక multi speciality hospital , ఒక అనాధ శరణాలయం, ఒక school , college , blood bank   అన్నీవరసగా  open చేశాడు. ప్రతీ రోజు అతని పత్రికలలో, అతని TV channels లో అతని programs  ప్రసారం అయ్యేవి. ఇక్కడే వెంకట్రావు విదేశీ links start అయ్యేయి. అతనికి ఆ links నించి వచ్చిన direction , inspiration  తో మత మార్పిడి చేసుకొని Mr . Joseph Vankaayala  అయ్యాడు.

Mr . Joseph Vankaayala  జీవితంలో అలా ముఖ్యమైన నాలుగో అధ్యాయం మొదలైంది. మతం మారినంత మాత్రం చేత గతం మారదు కదా. స్వభావం అసలే మారదు. అతను చేసే వ్యాపారాలు ఇంకా కొత్త పుంతలు తొక్కాయి. high level lobbying , contracts ఇప్పించడం, hawaala transfers ,  రక రకాల scams , black money in swiss bank , foriegn collaborators తో india లోకి రకరకాల సరుకులు దించడం, మత మార్పిడులు ప్రోత్సహించడం, డబ్బొచ్చే పని ఏదీ వదలలేదు. అలాగ అంగ బలం, అర్ధ బలం పెంచిన Mr . Joseph వంకాయల తొందరోలోనే తన రాష్ట్రానికి CM అయిపోయాడు. అతను CM అయిన తరువాత opposition మనుషులని వాళ్ళ పార్టీ ని తొక్కి తొక్కి వదిలాడు. అతను శాంతి భద్రతలని సుస్థిరం చేస్తున్నాడని ప్రచారం జరిగేది. అలా మహామనిషి లా మారిన Joseph ని ఒక రోజు ప్రజా సదస్సు లో గుర్తు తెలియని వ్యక్తులు shoot చేసి చంపేశారు. opposition చంపిందని కొంతమంది , విదేశీ హస్తం ఉందని కొంతమంది, అతను అణగ తొక్కిన gangs  revenge తీసుకున్నారని కొంత మంది, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అనుకున్నారు. నిజం మాత్రం Joseph నమ్మిన దేముడికే ఎరుక.  అతని చావు కి ప్రతీకారంగా వారం రోజులు రాష్ట్రం అట్టుడికి పోయింది. అక్కడ జరగని దొంగతనం లేదు, లూటీ లేదు, murder లేదు, మానభంగం లేదు. Central governament special forces దింపితే మరో మూడు రోజులకి  రాష్ట్రం కొంచం సద్దు మణిగింది. ఆ సంతాపంలో ఎంతో మంది తమ ప్రియతమ నాయకుడి మరణాన్ని భరించలేక కన్ను మూసారు. అట్టుడికి పోవడం తో సంతాపం తో చచ్చిన వాళ్ళ లెఖ్ఖ ఎక్కువే తేలింది. ఇంతవరకు కథ చెప్పిన భేతాళుడు అడిగాడు విక్రమ్ ని.
" Now you tell me Vikram whether Mr . Joseph succeeded or failed in life ". 
విక్రమ్ ఏమి చెప్పకుండా భేతాళుడి వైపు బ్లాంక్ గా చూడడం మొదలెట్టాడు. భేతాళుడు కి  doubt వచ్చింది. విక్రమ్ ని ఒక కుదుపు కుదిపాడు. అప్పుడు విక్రమ్ అన్నాడు. నువ్వు story మొదలు పెట్టినప్పుడే అన్నావు వీడు overaction చేసి ఓడిపోయాడని . నువ్వు ఓడిపోయాడు అని decide చేసిన తరువాత నన్నెందుకు అడుగుతావు అని. భేతాళుడు ఖంగు తిన్నాడు. నేనేదో అన్నాను మాట వరసకి . నువ్వు నీ opinion చెప్పొచ్చు అన్నాడు. విక్రమ్ చెప్పడం మొదలు పెతాడు. 

నా blog చదివే నా friends కి - విక్రమ్ ఏమి చెప్పి ఉంటాడు - -మీ అభిప్రాయాలూ నాకు comments కింద పోస్ట్ చేస్తే సంతోషం. 


Tuesday, October 5, 2010

Kotta Bhetala Kathalu - AppaRao the Monk - Conclusion

20-06-2009
హలో బ్రదర్స్
మీరింకేం ముగింపు చెప్పరు - ఆ విషయం నాకర్ధం అయ్యింది
ఆళ్ళ వాస్తులు ఏదో ముగింపు చెప్పారు - నాకు అర్ధం కాలేదు
సుత్తి ఎందుకు - రచయిత అనుకున్న ముగింపు చెప్తాను 

విక్రమార్కుడు ఇలా చెప్పాడు 
అప్పారావు దేశాలు పట్టి పోయిన తరువాత ఎన్నో రకాల మనుషులని, ఎన్నో విచిత్ర పరిస్థితులని చూసాడు 
అతనికి ఈ ప్రపంచం లో అర్ధం కనపడలేదు  - 
అతనికి ఎందుకు బ్రతకాలో కూడా తెలియలేదు - 
చస్తే ఏంటో కూడా తెలియలేదు - 
కష్టం అతని శరీరానికి పడదు - 
ఐహిక సుఖం  పొందడానికి పోరాడే ఓపిక లేదు  - ఏమి చెయ్యాలి 
అప్పారావు బుర్రలో ఒక మెరుపు మెరిసింది 
మనుష్యుల బలహీనతలలో భయం పునాది 
ఎవడైనా పరిస్థితి, వాడి ఆలోచనలని, బుద్ధిని దాటి వస్తే, దాన్ని ఎలా పోరాడాలో తెలియక పొతే  - చివరిగా వాడికి తెలియని శక్తి, భగవంతుని, శరణు లోకి పోతాడు  - 
స్వామీజీలా మారిపోతే ????
కష్ట పడక్కరలేదు  - అందరూ గౌరవం ఇస్తారు - కానుకలకి కరువు ఉండదు  - తిండికి లోటు ఉండదు  - శిష్య గణం ఎలాగా ఉంటారు , సేవలకి - బయటకి ఎలా కనపడినా - లోపాయకారీగా మనకి నచ్చినవన్ని చేసుకోవచ్చు  - భగవద్గీత లో రెండు శ్లోకాలు , మధ్య మధ్యలో ఉపనిషత్తులు అంటూ  - పంచతంత్రం కథలు రెండు చెప్పేస్తే సరిపోతుంది 
ఇంకా చావాల్సిన అవసరం ఏముంది 
ఇలా అలోచించిన అప్పారావు బాబా లా మారిపోయాడు 

ఈ సమాధానం తో బేతాళుడు చేట్టేక్కేదమనుకున్నాడు  - కాని కుదర లేదు  - ఎందుకంటే విక్రమార్కుడు సమాధానం ఆపలేదు 
విక్రమార్కుడు కి అనుమానం వచ్చింది - 
అప్పుడు భేతాళుడు ని  అడిగాడు 
"ఔను భేతాళ , ఒకవేళ నిజంగానే అప్పారావుకి భగవంతుడు కనిపించి ఉంటాడేమో?? ఏమంటావు??? అన్నాడు 
భేతాళుడు ముఖం చిన్న బుచ్చుకుని " ప్రశ్నలు అడగాల్సింది నేను, సమాధానం చెప్పాల్సింది నువ్వు  - అంతే కాని నువ్వు ప్రశ్న అడిగితే నేనేం చెప్పలేను - అన్నాడు 

దానికి విక్రమార్కుడు " ఓరి వెర్రి  భేతాళ సంత్సరాల తరబడి నువ్వు అడగడము, నేను చెప్పడము  - కొంచం ఆలోచించు  - చిరాకు అనిపించటం లేదూ  - అందుకనే మార్పు కోసం నేను నిన్ను అడుగుతున్నాను చెప్పు అన్నాడు 

భేతాళుడు బిక్క చచ్చి పోయి " నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను , నన్ను మాత్రం ప్రశ్నలు అడగకు అన్నాడు"

ఇంతకీ ఈ భేతాళ కథకి పరస్పర విరుద్ధమైన ముగింపు సూక్తి

"అడిగేవాడికి చెప్పేవాడు లోకువ"
"చెప్పేవాడికి వినేవాడు లోకువ "

Kotta Bhetala Kathalu - AppaRao the Monk - 4

08-06-09
హలో బ్రదర్స్
భేతాళుడు కథ కొనసాగించాడు

అప్పారావు విలాసాలకి విరక్తి చెంది అప్పారావు పెళ్ళాం అతనితో దేబ్బలాటలకి  దిగేది
నన్ను నా పిల్లలని చంపేయ్ అన్నంతగా
ఇంట్లో పోరు పెరిగే సరికి అప్పారావు మరింతగా ఇంటితో విరక్తి చెందాడు
అలవాట్లు మానలేదు కానీ ఇంటికి రావడం తగ్గించాడు
దాంతో అలవాట్లు అవసరాలుగా మారిపోయాయి
మళ్లీ మొదటికి వచ్చింది అప్పారావు జీవితం
దీనికి తగ్గట్టు అతని వ్యసనాలు కొత్త స్నేహితులని చేర్చాయి
కొత్త స్నేహితులు అతనికెంతో ఆప్తులుగా కనపడ్డారు
ఆ స్నేహితులలో రెడ్డి ముఖ్యుడు
రెడ్డి కి వాళ్ళ నాన్న వంద ఎకరాల మాగాణి వదిలి వెళ్ళాడు
దాంతో రెడ్డికి కష్టం తెలిసేది కాదు - అప్పారావుకి కరువు ఉండేది కాదు 
కాని పరిస్థితులు ఎల్ల కాలం ఒకేలా ఉండవు 
రెడ్డికి కొత్త స్నేహితులు కలిశారు
దాంతో అప్పారావు తో స్నేహం తగ్గించాడు 
ఈలోగా అప్పారావు భార్య పిల్లలు అతనిని వదిలేసి వెళ్ళిపోయారు 
అప్పారావు ఒంటరివాడైపోయాడు
ఇప్పుడు అప్పారావుకి కావలిసినంత స్వేచ్చ 
అతనిని ఆపేవారు అడిగేవారు లేరు
అలాగే అతని అలవాట్లకి సాయం చేసేవారు లేరు
ఉద్యోగంలో లంచాలు పడుతున్నాడని అప్పారావుని ఉద్యోగంలోంచి తీసేసారు
అప్పారావు గురించి తెలిసిన వాళ్ళు అతనికి ఉద్యోగాలివ్వలేదు
వ్యసనాలకి ముందు స్నేహితులు, వ్యసనాలలో స్నేహితులు  అందరు ప్పారావుని దూరంగా ఉంచేవారు 
అప్పారావు దీన్ని భరించలేకపోయాడు 
అప్పారావు ఆ ఊరు వదిలి వెళ్లి పోయాడు
ఎటో వెళ్ళిపోయాడు - దేశ దిమ్మరిలా తిరిగాడు  - 
కొన్నాళ్ళకి జ్ఞ్యానోదయం కలిగింది - అది ఏ రకమైన జ్ఞ్యానమో ఎవరికీ తెలియదు   
తన ఊరి లోనే బాబా అవతారంలో ప్రత్యక్షమయ్యాడు 

ఇంతవరకు కథ చెప్పిన భేతాళుడు విక్రమర్కుడితో 
"ఓ విక్రమార్క ఇంతకీ అప్పారావుకి ఏమి జ్ఞ్యానం కలిగిఉంటుంది, దీనికి సరైన సమాధానం తెలిసి కూడా చెప్పక పోయావో నీ తల వెయ్యి  ముక్కలవుతుంది అన్నాడు "

హలో బ్రదర్స్
ఈ కథ లో భేతాళ ప్రశ్నకి సమాధానం మీరు చెప్పండి  - 
మీ ముగింపు కోసం వెయ్యి  కన్నులతో


భేతాళ కథ ముగిసింది  - నా థాట్ ప్రాసెస్ (ఊహల స్రవంతి ) వేరే రకాలుగా కంటిన్యూ అవుతుంది  - 

Kotta Bhetala Kathalu -AppaRao the Monk -3

08-06-09
హలో బ్రదర్స్

భేతాళుడు కథ కొనసాగించాడు

ఆ తీవ్రమైన పరిస్థితులలో అప్పరావుకి ఏమి చెయ్యాలో తోచలేదు
ఉన్న ఊరు వదిలి వెళ్ళడానికి మనసు ఒప్పటంలేదు
అలవాటైపోయినవి వదలవు - కానీ కుదరవు
దేనికైనా దేముడి మీద భారం వేసి వదిలే తత్త్వం కాదు
సాయం చెయ్యాలంటే మిగత వాళ్ళు కూడా తానున్న పరిస్థితులలోనే ఉన్నారు
పెళ్ళాం పిల్లల ఆకలి బాధను తీర్చడానికే అప్పారావు తన శక్తి యుక్తులన్నీ ప్రయోగించాడు 
ఇలా దిన దిన గండం లా కొంత కాలం  నడిచింది
కాలచక్రం ఎప్పుడు ఒకేలా ఉంటుంది కాని జీవిత చక్రం అలా కాదుగా
తిరిగి కొంత కాలానికి పరిస్తితులు చక్కబడ్డాయి
కరువు కాటకాలు తగ్గాయి 
అప్పారావు కి కొంత వెసులుబాటు దొరికింది
తిరిగి సలహా ఇచ్చే స్నేహితులు , అవసరానికి  అదుకోమనే ఆర్తులు మొదలయ్యారు
అప్పారావు మళ్లీ నా అంతటి వాడు లేడు - నేను ప్రపంచాన్ని చూశాను , అందుకే మళ్లీ నా సొంత ప్రతిభ తో సాధించాను అని అనుకోసాగాడు
ఈ సారి మునుపటి కంటే ఎక్కువగా విలాసాలకి ఖర్చు చెయ్యడం మొదలెట్టాడు
(సశేషం)