Tuesday, October 5, 2010

old thought process - -14

27-09-2009
ఆదిశంకర విరచిత వివేక చూడామణి అవతారిక 

జన్తూనాం నరజన్మ దుర్లభమతః పుంస్త్వం తతో విప్రతా 
తస్మాద్వైదిక ధర్మ మార్గపరతా విద్వత్వ మస్మాత్పరం 
ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి 
ర్ముక్తిర్నో శత కోటి జన్మ సుక్రుతైహ్ పుణ్యైర్వినా లభ్యతే

తా|| సకల స్థావర జంగమ రూప భూతములలో మనుష్య జన్మ దుర్లభము. ఆ నరజన్మ నందు పురుష శరీర ప్రాప్తి దుర్లభము. పురుష శరీరము కలిగినను  వేద ప్రతిపాద్యాధ్యయనాధ్యాపనాది షట్కర్మ మార్గ సనాతన ధర్మ పరాయణత కలుగుత దుర్లభము. వైదిక ధర్మాచరణము కలిగియున్ననూ విద్వత్వము కలుగుట దుర్ఘటము. పరోక్షజ్ఞ్యానము కలిగిననూ ఆత్మానాత్మ వివేచనము కలుగుట కష్టము. అట్టి వివేకము కలిగినను ఆత్మ యొక్క యదార్ధ జ్ఞ్యానము కలుగుట దుర్ఘటము. ఆత్మానుభవమును పొంది  నిరంతరమూ నిరంతరాయముగా ఆత్మ స్థితుడై సంపూర్ణ జీవన్ముక్త్యవస్థ నుండుట అత్యంత దుర్లభము. నూరు కోట్ల జన్మములందు చేసికొనిన పుణ్య పరిపాక వశమున కానీ మోక్షము లభించదు.

దీని మీద మీ అభిప్రాయాలూ చెప్పండిరా - - ఇంత కష్టపడి ఆ ఆనందాన్ని పొందడమా లేక ????

No comments:

Post a Comment