Monday, October 4, 2010

naa paata kavitvam - 7

15-10-99 - టైం 23 .20hrs
మధ్యాహ్నం కల వచ్చింది. ఆ కల చాలా గాడంగా ప్రభావం చూపింది. కల ముగిసిపోతూండగా మెలుకువ వచ్చింది. చాల సేపు దాని గురించి ఆలోచించాను. తరువాత పనిలో పడ్డాను. రాత్రి ఆలోచిస్తూ.... ఏదో ఆవేశం పొంగింది. సరే ఖరాబ్ కార్యక్రమంలో పడ్డాను. రెండు కాగితాలు చింపాల్సి వచ్చింది. నిజంగా వ్రాసింది, వ్రాసినంతసేపు బాగుండి,  తరువాత చదివితే నన్ను నేను అందులో చూసుకుని తట్టుకోలేకపోయాను. అందుకే చింపాను. సరే దురద తీర లేదు. ఎలా....ఆ...మధ్యాహ్నం కల పేపర్ మీదికి  ఎక్కిద్దామని ప్రయత్నం మొదలు పెట్టాను. ఆ కలలో ఆఖరికి నేను ఏదో పోయిందని వెతుకుతున్నట్టుగా గుర్తు. అది కూడా భావనలా మిగిలింది. కల మాత్రం గుర్తు రాలేదు.
ఏదో లీలగా ఆ కల తాలూకు అవశేషాలు. ఎక్కడికో హడావిడిగా వెళ్లాను. ఏదో పోయిందనిపించి దాని కోసం తిరిగి వస్తుంటే, చీకటిలో ఎవరో మనుషులు, ఒకరి తరువాత ఒకరు ఎదురు పడ్డారు. నేను ఆ మనుషులని అంత పట్టించుకోలేదు. కాని వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళలా అనిపించారు. తీర ఎక్కడ బయలుదేరానో అక్కడికే వచ్చి వెతుకుతున్నాను. అవి దొరకలేదు. అవి దొరకలేదని ఒక అయోమయంలో అందరి వైపు చూడడం మొదలు పెట్టాను. అంతే కల ముగిసింది. ఎందుకో మెలుకువ వచ్చిన తరువాత నా కల నాకు బాగా అర్ధమైనట్టు అనిపించింది. రాత్రికి మరిచిపోయా. 

No comments:

Post a Comment