Tuesday, December 28, 2010

Saturday, December 11, 2010

పరస్పర డబ్బా

నాకూ నా friend రాంబాబుకి అప్పుడప్పుడు పిచ్చి లేచినప్పుడు ఒక debate లాటిది జరుగుతుంది. ఎవరు positive ఎవరు negative అని అనుకోకుండా ఏదో side తీసుకుని తన్నుకు చస్తాము - కాలక్షేపానికి - మా తన్నులాటలో కొన్ని రసవత్తర ఘట్టాలు.
Latest తన్నులాట
బావా మరో కాపీ  - వాడు వ్రాసింది 
మనసు ని వెన్నెల లా చేసి చూడు..
జీవితం మనం అనుకోనేంత 'చిక్కుముడి' కాదు
మన నెత్తి మీద బండ రాళ్ళు ఏమి లేవు..
మన చుట్టూ మనకు మనమే గీసుకున్న లక్ష్మణ గీతలు తప్ప...!!
మన' రంగుల కలలే 'మనకు భారం కాకూడదు ,
చితాకోక చిలుక ని చూడు ..రంగుల దుప్పటి కప్పుకొని ఎంత స్వేచ్చగా ఎగురుతుందో!!
మనం ఎవరికోసమో ఎదురు చూడటం మన అవివేకం !
గడ్డి పువ్వు'ని చూడు ..దేవుడి పూజకు పనికి రాకున్నాఉదయ కాలపు మంచు లో ఎలా మెరిసిపోతుందో !!
జీవితం లో దేనినీ ఆశించ వద్దు ....శాసించు !!
నీవు కోరుకున్న జీవితం ..నీ కాళ్ళ ముందు మోకరిల్లుతుంది ..!
నేను వ్రాసింది 
మనసు వెన్నెలే - కానీ అమావాస్య ఎందుకుంటుంది??
ఇది ప్రకృతి గురూ - 
నీకు అనిపించింది నువ్వు చెప్తే - నా అనుభవం నేర్పింది నేను చెబుతా
అసలు ముడే లేదు - చిక్కు ముడి ఎక్కడ గురూ
రాళ్ళు లేవు - కానీ నెత్తురు ఉంది,చెమట ఉంది,కన్నీళ్ళు ఉన్నాయి - లేవా??
గీతల సంగతి సరే - రాతల మాటేంటి గురూ??
ఇది నిజం - కలలు కనడం భారం కాకూడదు - నీ ఆశని, ఊహని ఆపగలవా??
చూపుల కన్నా ఎదురుచూపులే తియ్యన - ఏ మహాకవి అనుభవం లోంచి జాలువారిందో
శాసించడానికి నువ్వు నేను ఎవరం - విడుదలైన రంగుల బొమ్మలం 
ఎన్ని శాసనాలో మట్టిలో కలిసిపోయాయి - 
పైవాడు చేసిన శాసనాన్ని తెలుసుకోక  - మిద్యావరణ ఇచ్చాప్రయత్నబలం తో ఎగిరిపోదామనే అమాయకులం
నిజానికి - నీకు తెలిసింది ఎంత నిజమో - నాకు తెలిసింది అంతే నిజం
నీ అనుభవం లోకి రానంత వరకు నువ్వూ నమ్మలేవు - నేనూ చెప్పలేను
ఇది నువ్వు నేను బ్రతికి, చూసి, అనుభవిస్తున్న ప్రపంచం  - ఇదింతే
ఇది ఎవరికైనా నచ్చినా నచ్చకపోయినా - ఇది కూడా ఇంతే