జీవితాన్ని ఆనందిస్తే
ఏమీ తెలియని ఒక
మహా సముద్రపు లోతుల్లో ఈత
జీవితాన్ని విశ్లేషిస్తే
కోసి తెరిస్తే
పరిశీలిస్తే ఆనందం
అప్పుడు రెలటివ్ టర్మ్
రెండూ జరుగుతాయి
ప్రక్క ప్రక్కగా , ఖంగారెందుకు
అనుకుంటే అది
ఏమీ తెలియని ఏమీ తేలని
చిక్కు సమస్య
దేన్నీ సాధించలేక
అది సాధించడానికి కూడా
ఈ జీవిత కాలం సరిపోక
మౌనం వహిస్తే
అది ఓటమా లేక తపాస్సా
సాంద్ర తమస్స
సాహసమంటే
వివేకం లేని వ్యర్ధ ప్రయత్నమా
Dec1992
పైన తిరిగే పంఖా రొదలో
మిద్యా పరివేష్టిత స్వాతిశయ కారకాలు
ఖండించబడి
తెగిపడి విసిరివేయబడుతున్నాయి
సమీరణోర్మికల కలిపే
తమిస్ర సైకత తీరం సరిహద్దుల
ప్రవాసి ఐన నా ప్రవాళం
ప్రకాశించ దారి లేదు
(పటనానంతరం: ఏడుపుకి ఇంత సీన్ అవసరం లేదు )
No comments:
Post a Comment