Sunday, November 28, 2010

ఆలోచనల స్రవంతి - 14

గృహ హింస
Domestic violence - ప్రపంచమంతటా వ్యాపించి, iceberg  లాగ పైకి పూర్తిగా కనిపించనటువంటి ఒక జాడ్యం.
అహంకారాలతో life partners  పెట్టుకునే చిత్రహింస. ఒకరిని ఇంకొకరు dominate చెయ్యడానికి  చేసే ప్రయత్నంలో జరిగే ఒక బలి. పాతకాలం చాదస్తాలు పోని పితృస్వామ్య వ్యవస్థ లో పెరిగిన మగాడి అహంకారం ఫలితం. ఈ domination తరువాత emotional , physical , sexual abuse గా పరిణమిస్తుంది. పెరుగుతున్న కొద్దీ ఆ మనిషి పెరిగే సంఘం, వాతావరణం ఈ violence ని ప్రేరేపిస్తాయి.
పిల్లల మీద కూడా తల్లితండ్రుల గృహ హింస ప్రభావం చాలా ఉంటుంది. ఆడపిల్లలయితే ఇలాటి వాతావరణంలో పెరిగి ఈ violence కి soft targets అవుతారు.
తాగుడు లాటి వాటికి బానిసలైన వాళ్ళు అయితే తమ స్వేచ్చకి భంగం కలిగిందని ఈ రకమైన ప్రవృత్తికి అలవాటు పడతారు.
ఏది ఏమైనా ఈ రకమైన హింస సమాజానికి చాలా హానికరం.
ఇంతకీ ఇంత ఆవేశంగా ఎందుకు రాయలనిపించిందంటే రోజు రోజుకీ పెరుగుతున్న మానసిక ఒత్తిళ్ళ కారణంగా inter personal relations కూడా affect అవుతున్నాయి. ఒత్తిడిలో ఉన్న మనుషులు తయారు చేసే సంఘం, అలాటి సంఘంలో పెరిగే మనుషులు, వలయాలలో ఈ సమస్యని ద్విగుణీకృతం చేస్తున్నారు.
దీనికి solution ఏమిటంటే  చెడు  అలవాట్లు మాని  సంయమనం నేర్చుకుని,ఆడైనా,మగైనా ఒక క్రమ పద్ధతిలో జీవితాన్ని  సఫలం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
ఇంతకు ముందు ప్రపంచంలో ఉన్న దోపిడీ గురించి చెప్పడానికి try చేశాను. ఇప్పుడు ఆ దోపిడీ వ్యవస్థ కి మూల కారణమైన మనిషి ప్రవృత్తిని గురించి నా ఆలోచనలు పంచుకుందాం అనిపించి  చేస్తున్నప్రయత్నం ఇది.
ఇలాగే నాకు అనిపించిన మరికొన్ని ఆలోచనలు  దీని continuation లో.


సశేషం

Sunday, November 7, 2010

ఆలోచనల స్రవంతి - 13

Reality shows
వీటి మీద ఏమి వ్రాయాలో అర్ధం కాలేదు. ముగింపు సంగతి తరువాత అసలు ఎలా మొదలు పెట్టాలో తెలియటంలేదు. వ్రాయమని request OK . ఎందుకంటే ఇవన్నీ కాలక్షేపం బఠానీలు. timepass programs .
పాటల, ఆటల,వంటలు, dance, sports competitions,  ఇవి కాక big boss type ప్రోగ్రామ్స్ - అంటే రక రకాల మనుషులని ఒక glass house లో బంధించేసి hidden cameras తో  వాళ్ల తాలూకు movements /moments ని క్యాచ్ చేసి presentations,splitsville లాటి  love / hate relationships in enclosed environments ఇంక వేరే వేరే  competitions వీటి మీద నిజంగా ఏమి వ్రాయాలో తెలియ లేదు. తీసే వాళ్ళు తీస్తారు, చూసే వాళ్ళు చూస్తారు. మన శిల్ప శెట్టి లాగ ఈ shows నించి celebrities అయిపోయేవాళ్ళు కొందరు.
అసలు ఈ idiot box ఒక cigarette , alcohol లాటి మత్తు. ఒక వ్యసనం. Life is a habit అన్నాడు ఒక మహానుభావుడు. మనం మన అలవాట్లని ఎలా shape చేసుకుంటే అలా ఉంటాయి. ఇంతకు ముందు పుస్తకాలు చదవడం ఒక universally accepted and good hobby .అలాటి పరిస్థితులలో నేను స్కూల్ పుస్తకాలు కాకుండా వేరే ఏమైనా చదువుతుంటే మా అమ్మ చదువు మానేసి ఈ చెత్తంతా ఎందుకు అని తిట్టేది. ఇప్పుడు మంచో, చెడో తెలియదు TV watch చెయ్యడం చాలా సహజం  అయిపొయింది. cheap అండ్ best . ఇంక ఏ ఏ programs watch చెయ్యాలో ఆ తల్లీ తండ్రుల వాళ్ల వాళ్ళ అభిరుచుల మీద ఆధార పడి వాళ్ళ పిల్లలకి అలవాట్లలోకి మారిపోతాయి. ఇన్ని రకాల reality shows వచ్చాయి అంటే జనాలు కావాలని అడిగినట్టే.


ప్రతీది ఇలాగే. variety కోసం ఎవడో ఏదో మొదలెడతాడు. జనాలకి నచ్చుతుంది. బోర్ కొట్టకుండా ఉండడానికి టీవీ వాళ్ళు ఆ shows కి రకరకాల మసాలాలు జోడిస్తారు. నచ్చుతున్న కొద్ది పెంచుకుంటూ పోవడమే. కొన్నాళ్ళకి వెగటు పుట్టినా TV వాళ్ళు మార్చరు. ఎందుకంటే అప్పటికి sponsors , vested interests అన్నీ చేరి program జనాలని హింసించే levels లో ఉన్న ఆపే పరిస్థితి ఉండదు. అవి కొన్నాళ్ళు నడిచి తరువాత వాటి చావు అవి చస్తాయి. తరువాత వీళ్ళు మంచివి చూపించటం లేదని జనాలు, జనాలు మేచ్చేవి చూపిస్తున్నామని టీవీ వాళ్ళు  - ఈ గొడవ మామూలే. TV అనే కాదు - -అంతకు ముందు సినిమాల గురించి కూడా ఇదే గొడవ.


మారుతున్న కాలానికి, అభిరుచులకి తగ్గట్టుగా ఈ వినోద సాధనాలు.
నేను నా ఫ్రెండ్ మొన్న దూరదర్శన్ లో starting లో వచ్చిన serials హమ్ లోగ్  , ఏ జో హాయ్ జిందగీ, show theme గురించి మాట్లాడుకుంటూ అప్పట్లో ఎంతో బాగుండేవి ఇప్పుడు ఎలా అయిపోయాయి అని తెగ feel అయిపోయాము.


నేను HBO , Star movies లోనో Truman show అని ఒక సినిమా చూశాను. అందులో హీరో Jim carrey అనుకుంటాను, వాడి  చిన్నప్పుడే ఒక camera ,mike ఏదో implant చేసేసి వాడి జీవితాన్నే ఒక live show  లాగ  మార్చేస్తారు. వాడు ఆఖరికి ఏడ్చుకుని చచ్చి చెడి ఒక emotional climax లో ఆ show close చేసేస్తారు. అందులో last లో  ఏదో ఒక argument కూడా ఉన్నట్టు గుర్తు. real life కంటే ఈ virtual fabricated life better అని. కానీ ఏదో జరిగి చివరికి వాడు real life లోకి అడుగు పెడతాడు
ఇంకొన్ని రోజులలో నిజ జీవితం తో విసుగెత్తి జనాలు ఈ virtual reality లో బతికేస్తారు అనిపిస్తుంది.


ఈ ఆకలికి కూడా ఏదైనా virtual భోజనం ఉండేటట్టు అయితే  బాగుండేది. ఇంకా కష్ట పడవలిసిన అవసరం ఉండదు.


కొన్ని ఇళ్ళల్లో ఇంకా వీలు కుదిరేటట్టయితే  computer with net connection  common అయిపొయింది. సరే అదో అల్లరి.


కానీ ఒకటి నిజం. ఈ science advancement  చాలా మంచిది. మనిషిని దేముడికి దగ్గరగా తీసుకు వెళ్ళేది అదే.
అది ఎలాగ అని నేను అనుకుంటున్నానో ఇంకో సారి.


సశేషం

ఆలోచనల స్రవంతి - 12

మొన్నటి దాకా వ్రాసినవి చూసుకుంటే ఇంతకు ముందు ఒక సారి అనిపించింది మళ్ళీ నాకు అనిపించినదేమిటంటే నాలో ఎందుకనో చాలా ద్వేషం ఉందని. ఎవడి మీదో కోపం. ఎందుకో చిరాకు. ఒక పెచ్చు మీరిపోయిన స్వాతిశయం, ఒక restlessness .
అసలు నాలో ఒక positive side అనేది ఉందా అని నా మీద నాకే doubt వచ్చేసింది.
మళ్ళీ నాకు నేనే justification ఇచ్చుకున్నాను.  మంచి కోరుకునే కదా ఇవన్నీ వ్రాస్తున్నాను.
అవును ఏం మంచి నేను కోరుతున్నాను. ఒక ద్వేష రహిత సమ సమాజం. అందరూ సుఖంగా ఉండే ఒక స్వర్గం.
నిజంగా అన్ని అందరికి సుఖంగా అమరిపోతే ఇంక problems ఉండవా?
ఈ వ్యత్యాసాలు ఉండబట్టి ప్రపంచం ఇంత variety గా ఇన్ని రంగులతో ఉంది కానీ లేకపోతే   - ఆంతా బాగుండే మాటైతే  నిజంగా utopia అయితే మొదటి రోజు పండగ,  రెండో రోజుకి bore కొడుతుందేమో!
ఈ ప్రపంచం ఇలాగే correct ఏమో?
ఆంతా ఒకేలా ఉంటే తరువాత చెప్పుకోడానికేమీ ఉండదు.


అసలు అందరి బుద్ది ఒకేలా ఉండవలిసిన అవసరం ఏమిటి.
అందరూ ఏ ఏ points లో కలవాలి? దేనిలో differ అవ్వొచ్చు ?

మళ్ళీ అనిపించింది నేను మొత్తం bottom దాకా చూసి ఇంకా తెలుసుకోవడానికేమి లేవనిపించి, ఆచరించడానికి ఓపిక, interest లేక, మళ్ళీ ఇంకో logic తీసి కాలక్షేపం చేస్తున్నానేమో అని. 

ఎందుకంటే,  వివేకానంద పుస్తకాలు - రామకృష్ణ మఠం ప్రచురణలు  - జ్ఞ్యాన యోగం , కర్మ యోగం, భక్తి  యోగం, రాజ యోగం, అనుష్టాన వేదాంతం ఇలా కొన్ని  పుస్తకాలు చదివాను. చదివినంత  సేపు ఒక ఫీలింగ్ నేను గొప్ప జ్ఞ్యానం  పొందుతున్నాను అని. చదివిన తరువాత నేను అందరి  వేపు ఒక బాబాలా అర్ధ నిమీలిత నేత్రాలతో చూద్దామని  ఫీలింగ్.  అవి ఎంత వరకు ఆచరించాను అని ఎవరూ అడగలేదు. నేను ఆచరించినట్లు నాకు కూడా అనిపించలేదు. తరువాతఆ పుస్తకాల్లో  ఏమి వ్రాసి ఉందో గుర్తుకు   తెచ్చుకుందామన్న గుర్తుకు రాలేదు.  కొన్నాళ్ళు అది శంకరుడు వ్రాసిన వివేక చూడామణి చదివి "తితిక్ష" అని గెంతాను. ఈ "తితిక్ష" అంటే ఎలాటి పరిస్థితినైనా సంఘటనైనా నిర్వికారంగా గ్రహించగలిగే ఒక అవస్థ. సాధన ద్వారా కలిగే మానసిక స్థితి . మళ్ళీ ఏదో విషయంలో కొంచం చిరాకు  రాగానే వెర్రి కోపం వచ్చేసి  అరుపులు , గెంతులు.  
అప్పుడు అనిపించింది చదవడం వల్ల కలిగే ప్రయోజనం దారి తెలుసుకోవడం అయితే దాన్ని ఆచరించడం వల్ల పరిపూర్ణత్వం సిద్ధిస్తుందని. 
సరే ఆచరిద్దామని కొన్నాళ్ళు ప్రయత్నించాను. కొంత బద్ధకం, కొంత పరిస్థితి -  నా డబ్బా logic నాకు కరెక్ట్ - అన్నీ వదిలేశాను.  అందుకే అలా కాలక్షేపం చేస్తున్నానేమో అనిపించింది. 

"అర్ధం లేని ఈ జీవితంలో కాలక్షేపమే కదా  పరమార్ధం" - మరి నేను ఎంచుకున్న కాలక్షేపం మంచిదే కదా - అందరికీ ఏదో చెప్దామని - మళ్ళీ అనిపించింది - ఆచరించని దానిని అవతలి వాడికి నీతి బోధలా చెప్తే conviction ఉండదు - నాకే తెలియదు దాని అర్ధం ఏమిటో - ఇంక చెప్పడం ఎందుకు అని 
గౌతమ బుద్ధుడు, రామకృష్ణ పరమహంస, మహాత్మా గాంధి వీళ్ళ వ్యక్తిత్వం అందుకే అంత ఉన్నతం ఏమో?  ఆచరించి తరువాత చెప్పడానికి ప్రయత్నించారు. 



మొన్న ఒక బిచ్చగాడి మీద నా friend చిరాకు పడడం చూశాను. వీడి మీద ఇంకొంత మంది నా friends చెడ్డగా అనుకుంటుంటే విన్నాను.  పోనీ ఆ ఫ్రెండ్స్ జీవితాలు ఏమైనా correct గా ఉన్నాయా అంటే అదీ కనపడలేదు. పోనీ correct  గా  లేవు అనడానికి నాకున్న తెలివితేటలూ సరిపోలేదు.
అయినా ఎవడి జీవితాన్ని define చెయ్యడానికి ఎవడికి అర్హత ఉంది. ప్రతీవాడి జీవితం లోను రకరకాల కోణాలు. ఎవడి జీవితాన్ని వాడు బాగు చేసుకోగలిగీ, బాగుచేసుకోని బలహీనతలు.  ఆలోచిస్తూ పొతే అన్నీ నిజం, సరైనవే అనిపించే కారణాలు.
ఇవన్నీ మిధ్య అనుకుంటే  problem లేదు. మిధ్య అనుకుంటే అసలు ఇంక ఆలోచించవలసిన అవసరమే లేదు.
ఇవన్నీ మిద్యా? ఏమో ఎవడికి తెలుసు.


ఇంతకు ముందు ఈ పరలోకం concept తో ప్రజలు కొంత భయం తో పక్కవాడికి ఇబ్బంది పెట్టకుండా బతికే వారు.సాయం చేస్తూ బతికే వారు. పుణ్యం వస్తే స్వర్గం వెళ్ళొచ్చు అని.  ఇప్పుడు ఆ నమ్మకం తగ్గి బతికున్నప్పుడే సుఖపడాలి అని తెగించి ప్రయత్నాలు.
చచ్చిన తరువాత ఏమి జరుగుతుందో తెలియదు, నమ్మకం లేనప్పుడు - -తెగించినప్పుడు ఇదింతే.


అసలు విషయమేమిటంటే ఎవడికైనా ఇప్పటి పరిస్థితులలో డబ్బు అవసరం. అది ఉంటే 95 % problems solve అయిపోతాయి. balance 5 %  కోసం ఈ  Abraham నుండి pope వరకు   - శంకరుడి  నుండి latest స్వామీజీ వరకు 
ఒక రేంజ్ దాటితే నీతులు చెప్పడానికి బాగానే ఉంటాయి కానీ, ఆచరించడానికి పనికిరావు. 




అసలు chemical locha నాలోనే అనుకుంటాను. ఈ అశాంతి నుంచి ఎలా బయట పడాలి. తెలియదు.
ఇంతకు ముందు కొంత శాంతి ఉండేది. ఏదో కావాలని పని కల్పించుకుని పనిలో పడి ఈ ఆలోచనలన్నీ మరిచిపోఎవాడిని. అంటే escapist పద్ధతి అన్నమాట.
ఈ బ్లాగ్ నించి అది కుదరటం లేదు.దీంట్లో  వ్రాసినవన్నీ ఎప్పటికప్పుడు మళ్ళీ చూడటం. ఏదో కొత్తవి వ్రాద్దామని ప్రయత్నాలు.

In the lighter vein ఈ సారి న ఫ్రెండ్ RK గాడిని ని కుమ్మేయ్యాలి. నా weakness వాడు పట్టేసాడు. నా ఈ literary interest -  అది నాకు ఎందుకుందో తెలియదు  - అక్కడ కొట్టాడు - ఈ blog ఒకటి అంటించాడు. 


నా శ్రీమతి నా  blog మీద ఒక మంచి satire కొట్టింది. retirement తరువాత చెయ్యాల్సిన పనులు మీరు ముందే ఎందుకు చేస్తున్నారు అని.


సశేషం

Monday, November 1, 2010

ఆలోచనల స్రవంతి - 11

చాలా రోజుల తర్వాత net తీరికగా open చేశాను.  ఏదో వ్రాద్దామని ఆలోచిస్తే ఏమీ తట్టలేదు.
మత గురువుల గురించి వ్రాద్దామనుకున్నాను. మత గురువులు అని specific కాకపోయినా మతం గురించి నాకు తెలిసిన cynic launguage లో ఏదో చెప్దామనిపించింది.
కానీ దానికి mood set అవ్వటం లేదు. మళ్లీ నాకనిపించింది అవన్నీ వ్రాయడానికి కావలిసింది mood కాదు information అని.
తెగించి మొదలెట్టాను.


"మనిషి తన భయాన్ని పోగొట్టుకోవడానికి సృష్టించుకున్న ఆయుధం భగవంతుడు".
వేరు వేరు చోట్ల ఎదిగిన నాగరికతల్లో వేరు వేరు దేముళ్ళు.
ఒక రకం దేముడిని ఫాలో ఆయిన వాళ్ళందరిది ఒక మతం.
ఒక్కొక్క  తెలివైన వాడు ఒకో మతానికి నాయకుడు.  వాడిని ఆశ్రయించుకుని బ్రతికే వాళ్ళు , వాడిని ఉపయోగించుకుని బ్రతికేవాళ్ళు  , వాడి చుట్టు పక్కల బ్రతికే వాళ్ళు, వాడి కనుసన్నలలో బ్రతికే వాళ్ళు , మళ్ళీ ఇందులో కులాల కలకలంతో,  రకరకాలతో ఒక సంఘం.
ఈ మతాలనించి , సంఘాల నించి - - ఉద్యోగాల కోసం, ఉదర పోషణార్ధం ఇంకా ఇతర అవసరాలకి ఏర్పడ్డ ఒక సమాజం.
ఈ సమాజాల్ని, సంఘాల్ని మళ్ళీ మతం పేరుతొ వేరు చేసే ఒక అయోమయం.


అసలు మతం దేనికి అవసరం??
మనిషి ఆలోచనలని, అలవాట్లని ఒక క్రమ పద్ధతిలో ఉంచి, తన చుట్టు పక్కల ఉన్న ప్రపంచంతో ఒక understanding  ఉండేలా చేసి  - ఒక సుఖమైన జీవితాన్ని ఏర్పాటు చేసే ఒక విధానం. ఒక పద్ధతి. ఒక నమ్మకం. ఒక దృష్టి. ఒక ఆచరణ.
అందుకే అందరూ దాని వైపు అంతలా ఆకర్షించ బడతారు. మతం ఒక సంఘంలో ఇచ్చే comfort zone ఆంతా ఇంతా కాదు.
అది సరి ఆయిన వాళ్ల పర్యవేక్షణ లో అడుగులు వేస్తే శుభం.


లేకపోతే అది సృష్టించే భీభత్సం ఆలోచించడానికి ఊహ కూడా సరిపోదు. hydrogen bomb నీకు అర్ధం అయ్యే లోపే చంపేస్తుంది. ఈ మత మౌడ్యం  నిన్ను హింసించి చంపుతుంది.  నిన్ను బాధ పెట్టి చంపుతుంది. దీనికి ఫత్వాలు, గోధ్రాలు, 26 /11 లు , ఇవే proof .


చరిత్రలో అవలోకిస్తే apart from కీర్తి , కాంతా, కనకం, యుద్ధం చెయ్యడానికి ఈ మతం కూడా ఒక కారణం .
తెలివైన వాళ్ళు ప్రపంచాన్ని  గుప్పిట్లో పెట్టుకోవటానికి వాడే tools and tackles లో ఈ మతం ఒకటి.
కాకపొతే ఈ మత మార్పిడులు దేని కోసం జరుగుతున్నాయి.
ఘజని, గోరీల కాలంలో ముస్లిం మతంలోకి, బుడత కీచుల కాలం లో christianity లోకి జబర్దస్తీ చేసి ప్రజలని మతాలు మార్చేవారట. దేని కోసం???
దేవాలయాలని పడగొట్టి సమాధులుగా  మార్చేవారుట - ఇక్కడినించి ఎన్నో విగ్రహాలు, సంపద దోచుకు పోయారు. అప్పుడు అడగడానికి ఓపిక లేదు. ఇప్పుడు చెయ్యగలిగేది ఏమీ లేదు.
ఇప్పుడు కూడా ఈ మత మార్పిడులకి బోలెడంత డబ్బు ప్రవహిస్తోంది. దేని కోసం????


నిజంగా ప్రజల సుఖం కోరే వారే అయితే మతాలు మార్చఖ్ఖరలేదు. Governance మారిస్తే చాలు. 


ఒక్కొక్క మతం లో పుట్ట గొడుగుల్లా గురువులు తయారడి పోయారు. వాళ్ళు ఉదయాన్నే ఈ టీవీ-media లో ఏం వాగుతారో, అవి చూసి ఎంతమందికి నిజం గా ప్రశాంతత కలుగుతున్నదో తెలియదు  కానీ ప్రతీ వాడి సభలో , అది ఏ మతమైనా కానివ్వండి , ఇసకేస్తే రాలనంత జనం. ఎంత restlessness create అయ్యి ప్రజలు ఎంత peace of mind కోరుకుంటున్నారో దీని బట్టి తెలుస్తోంది.
మనిషి మీద మనిషికి నమ్మకం ఏ మాత్రమేనా వాడి విచక్షణ తో కలిగి ఉంటే, ప్రస్తుత పరిస్థితులలో అది పోయింది.


ఒక దేశంలో ఆర్ధిక పరిస్థితులని అక్కడి తెలివైన self -centered వెధవలని ఎగదోసి వాళ్ళ గుప్పిట్లో పెట్టించి - వాళ డబ్బులని బ్యాంక్స్ లో పెట్టించి - ఆ banks ని  మళ్ళీ తమ గుప్పిట్లో పెట్టుకుని -అక్కడ governament ని ఈ వెధవల గుప్పిట్లోకి తోసి -ప్రపంచ బ్యాంక్లు పెట్టి ఆ దేశం అభివృద్ధికి???? ధన సాయం చేస్తూ -అప్పులకి వడ్డీలు లాగుతూ  - governament ని  ఇరికించి -ఇంకో రకంగా డబ్బులిచ్చి దేశాలలో  bombs పెట్టి మారణకాండలు జరిపి, కబ్జాలు చేసి  ఒక అశాంతిని రేపి   - అక్కడ ప్రజల అశాంతిని డబ్బులతో ప్రవహించే ఈ మతాల మార్పిడిలో కూరుకు  పోయేలా చేసి - మత గురువులని  - ఆ మతం యొక్క ఆలయాలని ముందే డబ్బులతో కొనేసి -  మత మౌడ్యం తలకెక్కిన తరువాత , ప్రజల సాయంతో governament ని control చేస్తూ - governament సాయం తో ప్రజలని కంట్రోల్ చేస్తూ, వీళ్ళిద్దరి సాయం తో వెధవలని కంట్రోల్ చేస్తూ - -wonderful power play -


మళ్ళీ  ఇప్పుడు జరుగుతున్న పరస్థితి - చిన్న చిన్న groups  లో  ఇదే తరహా చిన్న స్థాయిలో  - international levels లో పెద్ద స్థాయిలో - ఇది minimum  ఆటవిక న్యాయం కూడా లేని ఒక భయంకరమైన అమానుషం - జంతువులలో  విచక్షణ అన్నది  కనిపించదు. విచక్షణ తెలిసిన మనిషి ప్రవర్తన ఈ రకంగా ఉంటే దానిని ఏమనాలి.


చరిత్రలో నాగరికతల గురించి, మతాల గురించి  నేను చదివిన పుస్తకాల సారం, ఎరిగిన చరిత్రా జ్ఞ్యానం తో నాకు అర్ధమైనదేమిటంటే అప్పుడూ కొద్ది పాటి తేడాతో ఇలాగే ఏడిసింది - వేరు వేరు కాలాలలో ఎవడి ఓపికని బట్టి వాడు యుద్ధాలు - -ఇంక రెచ్చిపోయి ప్రపంచ యుద్ధాలు జరిగాయి  - అందరికి చావు తప్పి కన్ను లొట్ట పోయినంత పరిస్థితి - పెద్దలందరూ కూర్చుని ఇలా కాదు - తన్నుకుంటే పరిస్థితి బాగులేదు అని  ఒక శాంతి ఒప్పందం చేసుకుని నడిపిన, నడుపుతున్న ప్రపంచం -


- నిజంగా నాకు భయం, బాధ, విరక్తి, చిరాకు - వెంటనే ఒక ఆవేశం, కోపం, పట్టుదల , ఏదో చేసేద్దామని - ఒక పిచ్చి కోరిక ప్రపంచం ప్రశాంతంగా ఉండాలని - అది నా జీవిత కాలంలో జరగదేమోనని ఒక నిరాశ - మనమందరం ముందుకు పోతున్న తీరులో ఒక అనిశ్చితి  - ఒక పక్క సైన్సు పురోభివృద్ది చూసి ఆనందం - దాన్ని వాడే విధానం చూసి ఆందోళన  - మతాల విధానాలని స్వార్ధ ప్రయోజనాలకి అనుగుణంగా వాడుకుంటున్న తీరు
నేను ఏడుస్తున్నానంటే  ఏడవను మరి. ఈ కొద్దిపాటి సుఖం మళ్ళీ హరించుకుపోతుందని. నా ఒక్కడి కోసం కాదు నా జాతి మొత్తం కోసం.


నిజంగా దేముడుంటే  - ఇదంతా చూస్తుంటే  - ఇదంతా ఆయన సృష్టి విలాసం అయితే - confusion లేదు - ఎందుకంటే మంచో చెడ్డో ఆయనే పడతాడు
అది కాకపొతే నిజమగా మనమందరం తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం - ఆ భగవంతుడిని సృష్టించుకున్న మనిషి ఆయన్ని మంచికి వాడుకోవాల్సిన సమయం - 



నేను కొంచం ఎక్కువుగా ఊహించుకుంటున్నాను అనిపిస్తే - -మీ కళ్ళ ముందు జరుగుతున్నదే మీకు సాక్ష్యం


సశేషం