Friday, June 29, 2012

Science & Philosophy - 15


మా అమ్మ నా చిన్నప్పుడు ఇంట్లో జరిగే పూజలలో, వచ్చిన బ్రాహ్మణుడికి, మాది ఋగ్వేదం అని చెప్తూ ఉండేది. నేను అడిగాను అసలు ఎందుకు అలా చెప్తున్నావు అని. ఆవిడకి అర్ధం అయినంత మటుకు, ఆవిడ నాతో అన్నదేంటంటే మన పూజా విధానాలు వేరుగా ఉంటాయి. చేయించే తంతులు, చదివే మంత్రాలు మారతాయి అని. నాకు doubt వచ్చేది, అసలు అందరూ పూజించేది అదే దేవుడిని అయినప్పుడు ఈ వేదాల, మంత్రాల, తంతుల గోల ఏంటని. ఆ మంత్రాలు చదవడానికి సోమశేఖరం అన్న ఆయన వచ్చేవాడు. ఆయన ఏదో సణుగుతూ చదివేవాడు. అవి అర్ధం కూడా అయ్యేవి కావు. ఏదో ఇక్కడ పెట్టండి, అక్కడ పెట్టండి, పువ్వులు వెయ్యండి ఇవి మాత్రం అర్ధం అయ్యేవి. అనుకునేవాడిని ఇప్పుడు అతను చేయిస్తున్న పనులకీ ఋగ్వేదానికీ ఏమిటి సంబంధం అని. నాకు అనిపించేది ఏదో భృతి గడవడానికి పూజలు చేయించేవాడు కానీ, అసలు అతనికి అతను సణుగుతున్న దానికి అర్ధం తెలియదేమోనని. ఆ తరువాత ఎవరినీ అడగడం మానేశాను. కానీ నా బుర్రలో అది ఉండిపోయింది. దాని గురించి ఆలోచిస్తూనే ఉండేవాడిని. దొరికిన పుస్తకాలని చదువుతూ, నాకు నచ్చిన inferences తీసుకుంటూ, వాటి అర్ధాలు ఏమై ఉంటాయా అని అనుకుంటూ,topic పంచుకోవడానికి సరైన company లేక, అలా జరుగుతూ పోయింది. Parallel గా చదువు, ఉద్యోగం, పెళ్లి ఇంకొన్ని social obligations వాటి మానాన అవి అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ Science & Philosophy post లో నేను చెప్పేవి నా ఆలోచనలు,నా inferences నుంచి నాకు అనిపించిన నా అభిప్రాయాలే. దీనికి మహాత్ములెవరైన వేరే కోణం కూడా చెప్పగలిగితే నన్ను నేను update చేసుకుంటాను. ఇక విషయానికి వద్దాం.

నేను last post లో మన వాళ్ళు ప్రపంచం గురించి ఇచ్చిన analysis అన్నాను. అసలు మన భారత దేశం లో ఎవరైతే తపస్సు చేసి జ్ఞ్యానం సంపాదిస్తారో వాళ్ళని ఋషులు అనడం పరిపాటి. కానీ ఇప్పటి కాలానికి వాళ్ళని scientists అంటే అందరికీ అర్ధం అవుతుందేమో. కానీ ఒక మహర్షిని scientist అంటే మహర్షి తాలూకు విలువని తగ్గించడమే. ఎందుకంటే ఒక స్థితిని పరిపూర్ణత్వం తో చూసి చెప్పగలిగేవాడు మహర్షి. పరిస్థితి ఏదైనా దానిని సిద్ధాంతంతో హేతుబధ్ధంగా, భౌతికంలో దాని results బట్టి analyze చేసి చెప్పేవాడు scientist. భౌతికమైన ఈ science తో అనుభవైకవైద్యమైన విషయాలను చాలామటుకు విశదీకరించడం కుదరదు. మహర్షులు చెప్పే విషయాలు చాలా మటుకు సామాన్యుడికి అర్ధం కాకుండా పోతాయి. అప్పట్లో మరి మహర్షులు తమ అనుభవాలని, జ్ఞ్యానాన్ని పంచే  ప్రయత్నంలో వాటిని మంత్రాలుగా మార్చి, గుర్తు పెట్టుకోవడానికి సులువు చేసి, తరం నించి తరానికి అనుశ్రుతాలుగా నేర్పించారు, తాళపత్రాలు వచ్చేవరకు.
అప్పుడు మాహర్షులు చెప్పేవి సామాన్యులకి ఎలా అర్ధం కావో అలాగే ఇప్పుడు scientists E=mc2 అంటే కొంత subject తెలిస్తే తప్పితే అది అర్ధం కాదు. ఇప్పుడు science ఎంత advance అయిపోయిందంటే ఆ మాత్రం ఈ మాత్రం చదువుకున్న వాడి ఊహాకి కూడా అందదు. కానీ ఆ revelations నించి వచ్చే applications & products మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. వీటి వల్ల మన environment, జీవన విధానం కూడా మారుతూ ఉంటాయి. కానీ మనవాళ్లు చెప్పేవి ఈ ప్రకృతిని గుర్తించి, దానిని పాడుచెయ్యకుండా, దానిలో మమేకమవుతూ జీవించే ఒక పధ్ధతి. ఇప్పటి మేధావులు మళ్ళీ తిరిగి Ecoliteracy, Sustainability theory అని చెప్తున్నవి అవే.
మనవాళ్లు కాలమానం, , universe కి సంబంధించిన theories, theory of evolution, geography, medicine, yoga ఇలాటి వాటి గురించే కాదు almost మనిషికి సంబంధించిన అన్ని subjects ని touch చెయ్యడం జరిగింది. అవే వేదాలు, ఉపనిషత్తులు, యోగాలు etc.,.  మనవాళ్లు even ఈ మంత్రాల ఛందస్సు, వాటి మాత్రలు, వాటిని ఉచ్చరించే పధ్ధతులు, అవి చదవడం ద్వారా మనిషికి ఒక relaxation కలిగించే విధానం అన్నీ పొందుపరిచి పెట్టారు. ఇంతకుముందు posts లో ఋగ్వేద సూత్రాన్ని, భగవద్గీతనీ quote చేస్తూ బ్రహ్మ గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఇప్పుడు నా జీవితంలో నేను విన్నవి, చదివినవి వేరే విషయాల గురించి చర్చించుకుందాం.

మన వాళ్ళ కాలమానం,  Geography అన్న విషయం నాకు ఎక్కడ తట్టిందంటే మా ఇంట్లో జరిగే పూజలలోనే. వినాయక చవితి కి చేసే పూజలో పూజకి ఆరంభంలో శుక్లాంబరధరం చదివిన తరువాత ప్రవర్తమానస్య, ఆద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, ...... కలియుగే, ప్రధమ పాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరత ఖండే,..... అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన..... శుభవాసరౌ, శుభ తిధౌ...... అని చెప్పేవారు.
అప్పుడు మనం ఉన్నది కలియుగం, రాముడు త్రేతా యుగం, కృష్ణుడు ద్వాపర యుగం మా అమ్మ చెప్పడం చిన్నప్పటి నించి వినడం వలన వాటి గురించి గోల లేదు కానీ ఈ పరార్ధం ఏమిటి, కల్పం అంటే ఏమిటి, మన్వంతరం అంటే ఏమిటి, జంబూద్వీపం అంటే ఏమిటి అని doubt వచ్చింది. 

Monday, June 25, 2012

Kotta Bhetala kathalu – Tyagi the opportunist


శవం concept close అవ్వడం తో ఏమీ తోచని భేతాళుడు కాలక్షేపం కోసం కొండపూర్ లో ఉన్న విక్రమ్ ఇంటికి వెళ్ళాడు. విక్రమ్ చాలా relaxing mood లో ఉండి “ఏంటి భేతాళా ఇలా వచ్చావు, టీ ఏమైనా తాగుతావా” అని అడిగాడు. భేతాళుడు సరే అనడంతో విక్రమ్ టీ, biscuits తెప్పించాడు. టీ తాగిన తరువాత విక్రమ్ “ఏంటి విషయాలు భేతాళా” అని అడిగాడు. “ఏముంటాయి, ఇంతకు ముందు నువ్వు శవం వెతుక్కుంటూ రావడంతో నాకు నిన్ను వెతికే అవసరం లేకపోయేది. ఇప్పుడు నువ్వు ఆ పధ్ధతి మార్చడంతో నేను నిన్ను వెతుక్కుంటూ రావలసి వస్తోంది. నా గురించి తెలిసింది నువ్వోక్కడివే. అందుకే ఇలా” అన్నాడు. దానికి విక్రమ్ “సరే బాధపడకు. అవసరం అన్నది ఎవడి చేతైనా, ఎంత పనైనా చేయిస్తుంది”. ఇప్పుడు నువ్వు కూడా exception కాదని తేలిపోయింది. సరే ఇంతకీ కథ ఏమైనా చెప్తావా, లేకపోతే మనం latest movie దేనికైనా వెళ్దామా. ఎందుకంటే ఇప్పటి సినిమాలు అన్నీ horror పుట్టిస్తున్నాయి. మనిద్దరికీ శ్మశానం feel కూడా వచ్చేస్తుంది” అన్నాడు. దానికి భేతాళుడు ”వద్దు నా మీద ఏమైనా కోపం ఉంటే, పొమ్మంటే పోతాను, శ్మశానం కంటే భయంకరమైన విషయాలు నాకు చెప్పకు”అన్నాడు.”అయితే దేని మీద కథ చెప్తావు” అని అడిగాడు విక్రమ్.” నువ్వు అవసరం అన్నావు కదా, అవసరం కోసం ఎవరినైనా వంచించగలిగే సూచిత్ త్యాగి కథ చెప్తాను విను”అని భేతాళుడు కథ చెప్పడం మొదలెట్టాడు.
Bus stop లో wait చేస్తున్న నీలమ్ కి తన boy friend వస్తున్న జాడ కనపడటం లేదు. ఎప్పుడూ late చెయ్యని అతను ఇవాళ ఎందుకు ఇంత late అవుతున్నాడో అంతు పట్టటంలేదు. నిన్న అతను ఏదో సరదా పడదాం అంటే పెళ్ళికి ముందు ఇవన్నీ తను వద్దంది. అందుకనేమో రాలేదు అనుకుంది. తనేమో bank ఉద్యోగి. మరి అతను ఇప్పుడు రికామీగా తిరుగుతున్నాడు. అతనికున్న time తనకి ఉండదు. ఇప్పటికే bank manager దృష్టిలోకి తను వెళ్లిపోయింది late comer అని. మరి ఇతనేమో అన్నీ easy గా తీసుకుంటాడు. సరే ఇంకొంతసేపు wait చేసి చూద్దాం అనుకుంది. ఆ తరవాత ఒక గంట గడిచింది. నీలమ్ కి ముందు వెనకా ఎవరూ లేరు. ఒంటరి జీవితం గడిపే ఆడపిల్ల ఎన్ని కష్టాలు పడుతుందో అన్నీ అనుభవించింది. కానీ ఎప్పుడూ తను గాడి తప్పలేదు. తన bank manager కూడా ఇన్నిసార్లు తనని క్షమిస్తున్నాడంటే కారణం అర్ధం చేసుకోలేనంత చిన్న పిల్ల కాదు. కానీ ఇప్పుడున్న boy friend తన మాటలతో, చేతలతో తనని చాలా impress చేశాడు. సరే office hours అయిన తరువాత అతని ఇంటికి వెళ్ళి చూస్తే సరిపోతుందని అనుకుని auto తీసుకుని office కి బయలుదేరింది.
భర్త పోయినతరువాత కోమల్ త్యాగి తన కొడుకు మీదే ప్రాణం పెట్టుకుని బ్రతుకుతున్నాది. వాడు చదివినంత కాలం బాగానే ఉండేవాడు. Degree పూర్తి చేసిన తరువాత వాడు ఇంటికి ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు వెళ్తాడో, ఏమి చేస్తున్నాడో, ఏమీ తెలియటం లేదు. ఏమైనా అడిగితే విసుక్కుంటున్నాడు. ఏదైనా ఉద్యోగం చూసుకుంటే బాగుండేది వీడు. భాద్యత తెలిస్తే కొంత కుదుట పడుతుంది.తన ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. ఇప్పుడా అప్పుడా అన్నట్టు ఉంటున్నది. వీడు వస్తే బాగుండును.  కోమల్ త్యాగి నిట్టూర్చింది
సరితా మల్హోత్రా కి నిన్న రాత్రి జరిగింది తలుచుకుంటుంటే మంచి relaxing గా అనిపించింది. తన భర్త రాకేష్ ఎప్పుడూ business పనుల మీదే ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాడు. తనకేమో ఇక్కడ local office లో in charge కింద ఉంచాడు. నిన్న interview కి వచ్చిన కుర్రాళ్లలో ఒకడు బాగా impress చేశాడు. రాత్రి office hours అవ్వగానే hotel కి వెళ్ళి అక్కడ room లో అతను తనని escort చేసిన విధానం, శారీరకంగా, మానసికంగా అతను తనతో ప్రవర్తించిన విధానం, తనకి ఎంతో నచ్చింది. అతనిని office లో పెట్టుకుంటే తనకి అన్నీ రకాలుగా ఉపయోగపడతాడు.  ఇన్నాళ్ల బట్టీ life లో ఉన్న vacuum పోతుంది అనుకుంటూ కార్ start చేసి office వైపు పోనిచ్చింది.
రాజేష్ తన friend కోసం wait చేస్తున్నాడు. వాళ్ళ వీధి కోసన ఉండే ఇంట్లో ఉండే తన ఫ్రెండ్ చాలా కాలం నించి తన చెల్లెలితో చూపుల సందేశాలు నడపడం తన దృష్టిని దాటి పోలేదు. వాడు నిన్న నాకు ఉద్యోగానికి అవసరం రా అని కొంత డబ్బులు అడిగాడు. తన చెల్లెలి పెళ్లి కోసం ఉంచిన డబ్బుఉంది అని చెప్పడంతో నీ చెల్లెలిని పెళ్లి చేసుకుంటాను నాకు ఇప్పుడు నువ్వు సాయం చెయ్యి, ఉద్యోగం రాగానే పెళ్లి అని confident గా చెప్పడంతో ఆ డబ్బు తీసి ఇచ్చాడు. ఇవాళ వాడు ఇంకా కనపడలేదు. ఏం జరిగుంటుందో, ఎప్పుడు వస్తాడో ఏంటో అని తన ఇంటి ఎదురుగా ఉండే బడ్డీ కొట్లో సిగరెట్ కాలుస్తూ కూర్చున్నాడు.
సోనాలీకి గాల్లో తేలిపోతున్నట్టు ఉంది. తన తండ్రి పెద్ద business magnet. అయనకి తెలియకుండా తను పెళ్లి చేసుకోబోతుంది. ఇవాళే registrar  office లో పెళ్లి. ఇంట్లోంచి తన నగలు, కొంత డబ్బు pack చేసుకుని బయలుదేరింది. ఇంకొద్ది గంటలు అంతే. తరువాత సినిమా లో చూపించినట్టు అతన్ని ఇంటికి తీసుకు వెళ్ళి daddy కి పరిచయం చేస్తుంది. అతను కూడా smart. ఇన్నాళ్ళు తను అడిగినదేదీ daddy కాదనలేదు. ఇది కూడా కాదనడని తనకి తెలుసు.
Registrar office దగ్గిర నిల్చున్న సూచిత్ త్యాగి ఆలోచనలు రకరకాలుగా సాగుతున్నాయి. ముందు నీలమ్ తో జీవితం అనుకున్నాడు. కానీ సోనాలీ కలిసిన తరువాత life లో security ఉంటుందనిపించింది. నీలమ్ తో అయితే తను middle class కిందే settle అవ్వాల్సి వస్తుంది. అదే సోనాలీ అయితే ఒక్కతే కూతురు. పెళ్లి చేసుకుంటే సోనాలీ తండ్రి కూడా కాదనడు. ఇంక సరిత తో తన setup అలా సాగుతుంది. ఒకసారి పెళ్లైతే రాజేష్ డబ్బులు తీర్చేస్తే వాడు కూడా ఏమీ అనుకోడు. వాడి చెల్లితో చూపులే తప్పిస్తే commitment ఏమీ లేదు. అప్పుడు తన తల్లి గురించి ఆలోచించొచ్చు. ఇంకొద్ది గంటలు అంతే. తను ఎవరినీ మోసం చేయలేదు. ఇవన్నీ అవసరానికి ఏర్పడ్డ సంబంధాలు. నీలమ్ కూడా ఏముంది. తరువాత ఎవరినో చూసుకుని settle అయిపోతుంది.
ఇంతవరకు కథ చెప్పి భేతాళుడు ఆగాడు. విక్రమ్ ప్రశ్నార్ధకంగా చూశాడు కథ అయిపోయిందా ఏంటి అన్నట్టు. భేతాళుడు లేదు ఇంకా ఉంది అన్నట్టు సైగ చేసి కంటిన్యూ చేశాడు.
ఆ తరువాత సంఘటనలు చాలా తొందరగా జరిగాయి. సోనాలీ ని పెళ్లి చేసుకున్న త్యాగి ని సోనాలీ తండ్రి ఇంట్లోకి రానిచ్చాడు ఇల్లరికం రావాలనే ఒక షరతుతో. కొన్ని రోజుల తరువాత ఎక్కడున్నాడో అని వెతుక్కుంటూ అతని ఇంటికి చేరిన నీలమ్ కి ఆ ఇంటికి తాళం వేసుండడంతో enquiry చేసుకుంటూ రాజేష్ చెల్లెలి విషయం రాజేష్ ద్వారా తెలిసి ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. నీలమ్ వ్యవహారంతో అనుమానం వచ్చిన రాజేష్ ఆరా తీస్తే త్యాగి వేరే పెళ్లి చేసుకున్నవిషయం తెలిసి, అతనింటికి వెళ్తే, అక్కడ సోనాలీ రాజేష్ ద్వారా త్యాగి విషయం తెలుసుకుని అతనితో తెగ తెంపులు చేసుకుంది. సోనాలీ తండ్రి త్యాగిని ఇంట్లోంచి బయటకి గెంటేశాడు. ఉన్న డబ్బులు కూడా పోయాయి అని తెలుసుకున్న రాజేష్ తన చెల్లెలికి వేరే సంబంధాలు వెతకడం మొదలెట్టాడు. తరువాత కొన్నాళ్లు సరిత దగ్గిర పనిచేసిన త్యాగిని, తన సరదా తీరడంతో, సరిత కూడా తన security ఆలోచించుకుని త్యాగిని ఉద్యోగంలోంచి తీసేసింది. ఇంటికి తిరిగి చేరిన త్యాగికి తన తల్లి కనపడకపోవటంతో ఇరుగుపొరుగు వాళ్ళని కనుక్కుని ఎట్టకేలకు తన తల్లి చేరిన old age  home చేరేసరికి తల్లి మరణించిన వార్త విని బాధపడ్డాడు. నీలమ్ ఎప్పటికప్పుడు త్యాగి గురించి కనుక్కుంటూనే ఉంది. ఇలా ఆరు నెలలు గడిచిన తరువాత తిరిగి ఉద్యోగాల వేటలో bus stop కి చేరిన త్యాగికి నీలమ్ కనపడింది. త్యాగి తననే సమీపిస్తుండడంతో అతని వైపు భావరహితంగా చూసింది.
మళ్ళీ భేతాళుడు ఆగాడు. విక్రమ్ ఇప్పుడేంటి అన్నట్టు చూశాడు. భేతాళుడు అడిగాడు “ఇప్పుడు నీలమ్ ఏం చేస్తే correct?”.  విక్రమ్ నవ్వాడు – “నువ్వు త్యాగి జీవితం మీద question వేస్తావు అనుకున్నాను. నీలమ్ గురించి అడుగుతున్నావు” అన్నాడు. సరే ఏదో ఒకటి చెప్పు “ఇప్పుడు నీలమ్ ఏం చేస్తే correct?”. విక్రమ్ అన్నాడు” అసలు కథలో stuff లేదు భేతాళా, ఇలాటి delusions నువ్వు ఎన్నో సంవత్సరాలుగా చెప్తున్నావు. నీలమ్ ఏది తోస్తే అది, ఏదైనా చెయ్యొచ్చు.ఇందులో controversy ఉన్న point ఏమీ లేదే.” అన్నాడు. భేతాళుడు సర్దుకున్నాడు. “ పోనీ త్యాగి లాటి మనుషులు ఈ society కి అవసరమా”. విక్రమ్ అన్నాడు” నేనెవడిని అది finalize చెయ్యడానికి. ఈ society నించి వచ్చిన product త్యాగి. అంటే అలాటి వాడిని తయారు చేస్తున్న ఈ society కి వాడి అవసరం ఉండే ఉంటుంది. ఇందులో నన్నేమిటి చెప్పమంటావు. ఆస్థులు పంచుకుని బాధ్యత వదిలేసే కొడుకులు,కూతుళ్ళు, చిన్న చిన్న కోరికల కోసం జీవిత భాగస్వాములని మోసం చేసే సంసారులు, జీతాలు తీసుకుని పైరాబడి కోసం ఆశపడే ఉద్యోగులు, స్వంత లాభం కోసం దేశాన్ని కూడా తాకట్టు పెట్టగలిగే entrepreneurs, రాజకీయ నాయకులు, అవసరం కోసం స్నేహాలు చేసే friends, అసలు ఎవడు opportunist కాదు. అందరూ అంతే. చిన్న శృతి భేదాలు. Opportunist అనేవాడు ఎవడూ లేని కాలం అంటూ ఏమైనా ఉందా. ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందన్న త్రేతా యుగంలో, రామ పట్టాభిషేకం సమయంలో లక్ష్మణుడు నవ్వితే, అక్కడ ఉన్న విభీషణుడు, అంగదుడు, హనుమంతుడు, రాముడు మిగతా పరివార జనాలే కాదు ఆఖరికి సీత కూడా తల వంచుకుందిట. వాళ్ళల్లోని opportunist ని చూసి లక్ష్మణుడు నవ్వాడని. ఏ కాలంలో opportunist లు లేరు భేతాళా? ” “అయితే నువ్వు opportunist ని సమర్ధిస్తావా” అని అడుగుదామనుకున్న భేతాళుడు  ఆవేశంగా సాగుతున్న విక్రమ్ ఉపన్యాసం తో గాభరాపడి conclusion తీసుకోకుండా, చెప్పా పెట్టకుండా మాయమైపోయాడు.  

Thursday, June 21, 2012

Kotta Bhetala kathalu -Ramakrishna the Dreamer




పట్టువదలని విక్రమ్ తన laptop తీసి అందులో భేతాళ శవం తాలూకు details కోసం surfing మొదలెట్టాడు. Google search లో భేతాళ శవం అని type కొట్టగానే ఆంధ్ర communist వరవరరావు వ్రాసిన కవిత open అయ్యింది.అది చదువుతూ కాసేపు కూర్చున్నాడు. ఆ కవితలో అదేదో lockup శవం అనగానే విక్రమ్ కి అనుమానం వచ్చింది తను police stations చుట్టూ తిరగాల్సి వస్తుందేమోనని. మళ్ళీ తను శవాన్ని తీసుకుపోవడం, మళ్ళీ తనకి మౌనభంగం అవ్వగానే శవం ఏ mortuary లోకో, చెట్టు మీదకో పోవడం తో విసుగెత్తి, విక్రమ్ కి తెలియకుండా భేతాళుడు ఈ sequence break చెయ్యడానికి శవాన్ని ఎక్కడో దాచేసి ఉంటాడనిపించింది. అసలు ఇన్నాళ్ళు “ఈ శవాన్ని వెతకడం, మొయ్యడం , అది మళ్ళీ మాయమవ్వడం” ఈ confusion లో పడి అసలు తనకి శవం అవసరం ఏమిటో మర్చిపోయాడు. ఎవడికి కావాలి ఈ శవం, అసలు ఈ గొడవ అంతా ఎందుకూ? ఎంచక్కా ఏదైనా pub కి వెళ్ళి ఒక chilled beer తాగి అప్పుడు ఆలోచిద్దామని తన Toyota car తీసుకుని pub కి వెళ్ళాడు. అక్కడ beer order చేసి కూర్చున్నాడు. “Yes విక్రమ్ ఏంటి సంగతి –శవాన్ని వదిలేసి నువ్వే శవం అయిపోడానికి ఏదో తాగుతున్నట్టు ఉన్నావు –శవాల వేట మానేశావా ఏంటి” అని ఒక గొంతు వినిపించింది. విక్రమ్ కి అర్ధం అయ్యింది అది భేతాళుడి గొంతే అని. తను తాగుతున్న మందు glass మీద నుంచి దృష్టి మరల్చకుండా “ఈ శవాన్ని మోసే అవసరం నాకు లేదు, నేను ఎందుకు మోస్తున్నానో నాకే తెలియదు. నువ్వేదో కథ అంటావు, జవాబు చెప్పగానే అది మాయమైపోవడం. నాకేమో శవాన్ని మోస్తూ కథ వినడం ఎందుకు, మోత దండగ. ఇప్పటి నించి నువ్వు కథలు చెప్పు నేను జవాబులు చెప్తాను. శవం గోల వదిలేద్దాం , అవును నీకేమైనా కావాలా తాగడానికి అన్నాడు. అప్పుడు భేతాళుడు “ok so be itlet me also have one chilled” అని తన గ్లాస్ కూడా నిండగానే ఒక గుక్క తాగి కథ start చేశాడు.
రామకృష్ణ నవ్వుకున్నాడు. అతని చేతిలో ఆనాటి దినపత్రిక రెపరెపలాడింది. ప్రజలు మూర్ఖులు. వీళ్ళు ఎవరైతే తమని దోచేస్తారో వాళ్ళకే ఒట్లేసి గెలిపిస్తారు. లేకపోతే ఈ జనాలు ఒక CM కోసం చావడం ఏమిటి. వాడి కొడుకు black money మీద enquiry వేయించిన ఇంకో black money party ని ఓడించి వాడి కొడుకుని గెలిపించడమేమిటి. ఈ పత్రికల వాళ్ళు వాడిని ఆకాశానికి ఎత్తడమేమిటి. ఉన్న రాజకీయ పార్టీలన్నీ ex –CM కొడుకు party లాటివే. ఎవడిని గెలిపించాలి, గెలిపించకూడదు అని కూడా వదిలేస్తే అసలు “ఈ ప్రజలు” - వీళ్లకేమి కావాలో వీళ్లకే తెలియదు. కానీ తనకి తెలుసు. అందుకే Orissa border దగ్గర మొదలుపెట్టిన తన “ఆంధ్రా cycle యాత్ర” లో రకరకాల గ్రామాలు సందర్శించి, అక్కడి ప్రజలకి నిజాన్ని తెలియబరుస్తూ సాగుతున్నాడు. ఈ జనాలని చైతన్యపరిచి ఈ క్షుద్ర రాజకీయాల నడ్డి విరవాలి. ఈ సమాజంలో ఒక విప్లవం రావాలి. అందుకు ఈ cycle యాత్ర ఒక మైలురాయి కావాలి. దీనికి prologue లో రామకృష్ణ “The motor cycle diaries” పుస్తకం చదువుతున్నాడు. “Ernesto Che Guevara” అంటే అతనికి విపరీతమైన అభిమానం ఏర్పడింది.
విక్రమ్ కి విసుగొచ్చింది, భేతాళుడితో” నువ్వు కూర్చున్న place కి, తాగుతున్న మందుకి, ఇప్పుడు చెప్తున్న కథకి ఏమైనా match అయ్యిందా. ఉన్న mood పాడు చెయ్యడం కాకపోతే” అన్నాడు. అప్పుడు భేతాళుడు “ఏం బాబు విప్లవం కథలు bar లో వినకూడదని ఏమైనా rule ఉందా “కథ చెప్తున్నాను కదా –cool గా మందు కొడుతూ విను –లేకపోతే మళ్ళీ శవం మోస్తూ వింటావా  -అది నీ ఇష్టం” అన్నాడు . విక్రమ్ అయిష్టంగానే వినడం మొదలెట్టాడు.
ఎలాగైతే Che Guevara motorcycle మీద తిరుగుతూ జీవితానికి ఒక అర్ధం కనుక్కున్నాడో అలాగే తను cycle మీద తిరుగుతూ జీవితాన్ని సార్ధకం చేసుకోవాలని బయలుదేరాడు. ఎంత వరకు సాధిస్తాడో కాలం నిర్ణయిస్తుంది. ముందుగా సోంపేట లో చిన్న బడ్డీకొట్టు meeting పెట్టాడు. అప్పుడు అక్కడ 2640 MW coal based power plant పెట్టకూడదని జనాలు ఆందోళన జరుగుతున్నది. కాకరాపల్లి, సోంపేట power plants కి environmental clearance ఎవరు ఇచ్చారు. ఆ factory లు అక్కడ పెడితే అక్కడి నీటిలో arsenic, lead లాటి విష పదార్ధాలు పెరిగిపోయి జనజీవితాలు అస్తవ్యస్తమైపోతాయని జనవాక్యం. ఆ బడ్డీకొట్టు meeting లో రామకృష్ణ government ని దాని policies ని తూర్పార బట్టాడు. జనాలు మౌనంగా విని టీ తాగడం అవ్వగానే “బాగా చెప్పావు బాబు” అని రామకృష్ణ తో అని వెళ్ళిపోయారు. రామకృష్ణ కి బోలెడంత ఉత్సాహం వచ్చింది. Yes ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు అని అలా ముందుకి సాగాడు. విజయనగరం చేరగానే అక్కడ పరిస్థితి ఆరా తీశాడు. అక్కడ Centre లో ఉన్న ruling party తాలూకు ఆంధ్ర local party chief , CM ఇద్దరు liquor scam అని ఒకళ్ల మీద ఒకళ్లు బురద చల్లుకుంటూ పత్రికల ద్వారా బండబూతులు తిట్టుకుంటూ కనపడ్డారు. వెంటనే రామకృష్ణ అక్కడ cinema hall  బయట ఉండే వెరుశెనగబడ్డీ దగ్గిర తన వాక్ప్రవాహంతో జనాల్ని కట్టి పడేశాడు. అసలే NTR భీష్మ సినిమా ఆడుతోంది. మంచి ఓపిక మిగిలిపోయిన ముసిలివాళ్ళందరూ చూడటానికి వచ్చారు. అంతా విన్న ఇద్దరు మూసిలాళ్ళు మాకు వినబడటంలేదు,కొంచెం గట్టిగా చెప్పమన్నారు. రామకృష్ణ వాళ్ళ స్వార్ధరహిత కుతూహలాన్ని గమనించి మరింత ఉత్సాహంతో గట్టిగా అరిచి చెప్పడం మొదలెట్టాడు. ఇంకొక మూసిలాయన “గొంతెడిపోద్ది బాబూ, సోడా తాగు“ అని సోడా కూడా ఇప్పించాడు. అలాగ అక్కడినించి విశాఖపట్నం చేరే సరికి అక్కడ ఒక super land scam గురించిన వార్త చదివాడు. VUDA వాళ్ళు అప్పుడే ప్రపంచాన్ని చూసినట్టు” ఏమిటి ఋషికొండ, మధురవాడ, ఎండాడ, పరదేశిపాలెం, కూర్మన్నపాలెం, పేదవాల్టేర్ ఇన్ని చోట్ల భూ కబ్జానా” అని ఆశ్చర్యపోవడం –VUDA vice chairman, మినిస్టర్ అందరూ enquiry జరిపిస్తామని హామీ ఇవ్వడం, ఇవన్నీ చదివి రామకృష్ణ ఉడికిపోయాడు. ఎవరి సొమ్ముని ఎవరు తినేస్తారు. ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలి అని VUDA ఆఫీసు బయట బజ్జీ  తయారు చేసేవాళ్లకి, xerox shop వాళ్ళకీ హోరాహోరీ వివరించాడు. వాళ్ళు కూడా RTO office shift చెయ్యడం నించి కలిగిన సాధకబాధకాలు అవి చెప్పుకుని బాధపడ్డారు. ఇలాగే గోదావరి జిల్లాల్లో liquor scam లు,bank fraud లు వీటి మీద ఉపన్యసించి గుంటూరు చేరేసరికి అక్కడ ఇందిరమ్మ housing scam లు, దేవాదాయ భూముల scam, ఆఖరికి నీళ్ళలో కలిపే Alum కూడా scam చేసేస్తుంటే బాధ భరించలేకపోయాడు. నెల్లూరు,చిత్తూర్, కడప లో జరుగుతున్న భూ కబ్జా,  money circulation & laundering, micro financing scam లు,  మహబూబునగర్ లో counterfeit currency, mining scam లు ఇవన్నిటి మీద వేరు వేరు ప్రదేశాలలో మాట్లాడి హైదరాబాద్ చేరేసరికి ex – CM కొడుకు ఓదార్పు యాత్ర ముగించి black money scam ని handle చేస్తున్నాడు. ఇవే కాకుండా national level లో Raja spectrum scam,  Laloo fodder scam, Harshad Mehta share market scam, Telgi stamp papers, Bofors, Common wealth games scam etc., ఇవీ చాలావన్నట్టు question paper కొనేసి పరీక్షలు రాయించే schools, colleges వల్ల చదువుల్లో కూడా scam అయిపోయి భావి తరాలు నాశనమౌతుంటే  రగిలిపోయిన రామకృష్ణ టాంక్ బండ్ మీద నిలబడి తనలోని ఆవేశాన్ని, విప్లవాన్ని కలగలిపి చెప్తూ ఉంటే, ఆ ప్రవాహానికి ప్రజలు మా leader నువ్వే అని హారతి పడుతుంటే, ఇంతలో police van వచ్చి అక్కడ ఆగింది. అందులోంచి దిగిన పోలీసులు జనాలని చెదరగొట్టి రామకృష్ణ ని jail లో పడేశారు. అప్పుడు అతని లోని Che Guevara విజృంభించి ధనమదాంధులైన బూర్జువా పాలక వర్గం కీళ్ళు విరిచే విధంగా guerilla warfare start చేశాడు.
“రామకృష్ణా” అన్న పిలుపుతో తనున్న upper primary school 8th std లో ఈ లోకం లోకి వచ్చిన రామకృష్ణ మాస్టర్ class వైపు నిర్వేదంగా చూశాడు. Principal తన వైపు తీక్షణంగా చూస్తుండడంతో, తడబడుతూ “చెప్పండి సార్ “అన్నాడు. అప్పుడు Principal “చూడు రామకృష్ణా, మీ నాన్న మంచి దేశభక్తుడు, నాకు close friend. అందుకే నువ్వేన్ని సార్లు class room లో నిద్రపోతున్నా నిన్ను క్షమిస్తున్నాను. నీ emotion నాకు తెలుసు. Class room లో నిద్రపోయి కొన్ని సార్లు నువ్వు పిచ్చి పిచ్చిగా కలవరించావు. అప్పుడు నాకు అర్ధం అయ్యింది. ప్రపంచం గోల మనకెందుకయ్యా. ముందు class ముగించి ఇంటికి నడు. ఇంట్లో కూడా రాత్రుళ్లు నిద్రలో పెద్ద పెట్టున అరుస్తున్నావట. ఎవరైనా మంచి doctor కి చూపించుకో” అని ఒక ఉచిత సలహా పారేశాడు. రామకృష్ణ తన చూపులతోనే “మనం బ్రతుకుతున్నది ఈ ప్రపంచం లో కాదా, ప్రపంచం గోల మనకెందుకంటావు, నీకు అసలు social awareness ఉందా” అన్నట్టు చూశాడు. Principal” చూసింది చాలు, నేను చెప్పింది చెయ్యి ”అని వెళ్లిపోయాడు.
ఇంతవరకు కథ చెప్పిన భేతాళుడు విక్రమ్ వైపు చూశాడు. అప్పుడు విక్రమ్ “కథ బాగుంది ఇంతకీ నీ question ఏంటి అది చెప్పి తగలడు” అన్నాడు.భేతాళుడు “రామకృష్ణ ఏమి చేస్తే correct” అని అడిగాడు. దానికి విక్రమ్ “ఏడ్చినట్టే ఉంది నీ question. రామకృష్ణ దేశభక్తుడి కొడుకు, బడిపంతులు కాబట్టి కలలు కంటున్నాడు. అదే businessman అయితే ఇలాటి కలలు కంటాడా. వాడికి పని తప్పితే ఆలోచించడానికి కూడా తీరిక ఉండదు. కలలు కనే outlet కూడా లేకపోతే రామకృష్ణ కి పిచ్చి ఎక్కుతుంది. మనిషి ఆశాజీవి కాబట్టి రామకృష్ణ కలలు కనడమే ఉత్తమం. ఇప్పుడున్న ప్రపంచంలో విప్లవాలు రావాలంటే ఇంకా పాకం బాగా ముదరాలి. అప్పుడు రామకృష్ణ కి జీవితం నిత్యసమరమైపోయి కలలు కనే అలవాటు, ఆలోచించే ఓపిక రెండూ పోతాయి. ఇంతేనా ఇంకేమైనా ఉందా” అన్నాడు. విక్రమ్ మందు పూర్తి చేసేలోపల భేతాళుడు నవ్వుకుంటూ మాయమైపోయాడు.

Tuesday, June 19, 2012

New Poetry - 16

Catharsis



ఒకసారి ప్రపంచమంటావు ఒకసారి మనుష్యులంటావు
వేదాంతం ఒకసారైతే ఒకసారి సంగతులంటావు
కనపడేది, వినపడేది కనపడకుండా కదిలించేది
మాటలలో చెప్తానంటావు, మౌనంగా దుఃఖిస్తుంటావు

అంతరంగాన్ని అంతరిక్షాన్ని కలిపి శోధించానంటావు
విడదీసి  పెనవేసి రెండిటిపై పట్టు సాధించేనంటావు
ఎందుకీ ఎగురుడు సామీ నీకేమి రహస్యం తెలుసని
మాటలలో చెప్తానంటావు, మౌనంగా దుఃఖిస్తుంటావు

ఇంతమంది, ఇంత మేధ, ఇంత క్రాంతి, ఇన్ని వెలుగులు
అంత సులువుగా తేలేదైతే ఇన్నాళ్ళు ఎందుకాగిందంటావు
ప్రపంచ పరిణాహంలో ప్రస్థానమెటో తెలియని జీవుల కథ
మాటలలో చెప్తానంటావు, మౌనంగా దుఃఖిస్తుంటావు

ఎందుకయ్యా అంత తపన అందరూ గుర్తించాలనా
కవ్వించి ఊరించే ఘనకీర్తికాంత నిన్నే వరించాలనా

Monday, June 18, 2012

Science and Philosophy -14


నేను last post లో చెప్పిన దానిలో చిక్కుంది.
అదేంటంటే higher energy source లో కలిసిపోవడం ముక్తి, నిర్వాణం అయితే మరి దానికి శరీరాన్నిఆధీనంలోనికి తెచ్చుకుని, బుధ్ధిని ఇంతలా వికసింపచేసి ముక్తి పొందడం ఎందుకు? నువ్వు చెప్పేది ఒక పధ్ధతి. నేను ఆ పధ్ధతిలో ముక్తి పొందను. ఈ science ఇంకొంచం అభివృధ్ధి చెందిన తరువాత ఎవడో ఏదో machine కనిపెడతాడు. ఆ machine సహాయంతో ముక్తి పొందుతాను.  
నిజమే పొందొచ్చు. కానీ అది సంసారం చేస్తే పిల్లలు పుట్టడానికి, test tube baby ని పుట్టించడానికి ఉన్న difference లాటిది. రెండు పధ్ధతులలోను పిల్లలు పుడతారు. మొదటి పధ్ధతిలో పుట్టిన పిల్లలతో తల్లితండ్రులకి ఒక రకమైన emotional bonding ఉంటుంది. రెండో దాంట్లో ఒక scientist కి తన ప్రయోగం success అయిన feeling ఉంటుంది. మరి ఆ test tube పిల్లలకి ఎవరితో attachment ఉంటుంది?
 ఆ ఏముంది పిల్లలు పుట్టక, దత్తతకి తీసుకున్న పిల్లలకి తల్లితండ్రులు ప్రేమ పంచటంలేదా అంటే – అవును నిజమే పంచుతున్నారు. మరి నీ దేముడు/భగవంతుడి concept ఎక్కడ నిలుస్తుంది? అంటే సమాధానం ఉండదు.
ప్రపంచం మారుతూ ఉంటుంది అని నువ్వే అన్నావు. మారుతున్న ప్రపంచంకి తగ్గట్టుగా మనిషి adjust అవుతూ వెళ్తున్నాడన్నావు - అవును అన్నాను.
మరి మారనీ. మధ్యలో భగవంతుడు అదీ ఇదీ అని ఎందుకు confuse చేస్తావు?
నేననేది ఏమిటంటే ఈ భగవంతుడి concept ఇప్పటి సమాజాన్ని ఒక equilibrium లో ఉంచుతున్నది. అది లేకపోతే?
లేకపోనీ  - భగవంతుడు  మనిషి తాలూకు సృష్టి అని అన్నప్పుడు వాడికి అది అవసరం లేనప్పుడు వాడు వాడుకోడు. మొత్తం బలం ఉన్నవాళ్ళు , తెలివి ఉన్నవాళ్ళు నీలాటి concepts, contradictions మానేసి సమాజాన్ని వాళ్ళకి నచ్చినట్టు నడిపిస్తారు. దీనివల్ల గొడవలు వస్తే రానీ, యుధ్ధాలు వస్తే రానీ. దేముడు ఉన్నాడనుకున్నప్పుడు కూడా తన్నుకు చచ్చారు కదా. ఇప్పుడు లేడు అనుకుని తన్నుకు చస్తాం. ఏదో ఉన్నాడు, లేడు అనే ఒక feeling తప్ప ఇంక ఆలోచించేది ఏదీ లేనప్పుడు, మారేది ఏదీ లేనప్పుడు argument ఎందుకు?  మళ్ళీ అవసరం వస్తే వాడుకుంటాం.
వలయాలు మనిషిని నడిపిస్తాయి అన్నాను. ఒక చిన్న వలయం చూద్దాం. ఇప్పటి ప్రపంచంలో మనిషి ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేడు. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే సరి అయిన ఆలోచన రాదు. సరి అయిన  ఆలోచనలేని మనుషులు నడిపించే సమాజం సరిగ్గా ఉండదు. మరి ఈ ఆరోగ్యం ఎందుకు పాడు అవుతుంది. ఒకటి మనం చెట్లుచేమలు కొట్టేసి industrialization కి వంత పాడుతున్నాం. దీని వల్ల ozone పొర దెబ్బ తిని cosmic rays వల్ల మనిషి శరీరం పాడు అవుతున్నది. భూమి తాలూకు ఉష్ణోగ్రత పెరిగి మంచు కరిగిపోతున్నది. జలప్రళయం వచ్చి తాగడానికి నీరు దొరక్క మొత్తం ఉప్పు నీటి మయం కావొచ్చు. ఇప్పటిలా పంటలు అవీ ఉండవు. ఉన్న పంటలు కూడా నాశనం అవుతాయి. ఈ జీవాలన్నీ నాశనమవుతాయి. Science advancement నించి Industrialization నించి greenhouse affect నించి వాతావరణం కలుషితమై దాన్నించి ఇప్పుడున్న species ఇబ్బంది పడి extinction దిశగా అడుగులు వేస్తే అది సరైనదేనా? ఈ ప్రకృతిని ఇలా మనం పాడుచేస్తే దాని వల్ల వచ్చే విపరీతానికి ఈ ప్రపంచం నాశనమైపోతే మంచిదా?
అవ్వనీ. నీకు optimistic view లేదు. మనమేమీ చేయకుండా కూర్చున్నా మార్పు వస్తూనే ఉంది కదా. మారుతున్న ప్రతీ మార్పు మంచికని ఎవడన్నాడు. మరి ఆ మార్పు మీద మనిషికి control లేనప్పుడు అదేమిటో తెలుసుకోడానికి ప్రయత్నించడం, అది control చెయ్యాలనుకోవడం తప్పులేదు కదా. మరింకేంటి నస? మార్పుని control చెయ్యగలిగితే మంచి జరుగుతుంది. Experiments జరుగుతాయి. ఒకవేళ అవి తిరగబెట్టి మొత్తం నాశనం అయిపోతే అయిపోనీ. ఎప్పుడో నాశనం అయ్యేది ఇప్పుడే నాశనం అయిపోదాం.
ఇలాగ మాట్లాడటం మొదలెడితే చెప్పడానికి ఏమీ లేదు. దేముడు ఉన్నాడు లేడు అన్నది పక్కన పెడితే, ఎన్నో జీవితాలు, ఎన్నో తరాలు, ఎన్నో సమాజాలు, ఎన్నో నాగరికతలు, లెఖ్ఖ లేనన్ని ఎన్నోలు కాల గర్భంలో కలిసిపోయాయి. కనీసం ప్రస్తుతం ఉన్న మనకి తెలిసిన ఈ చిన్ని ప్రపంచం సుఖంగా బ్రతకడానికి యోగ్యంగా ఉండేలా చూసుకోవడం తప్పో ఒప్పో మనమే దిశానిర్దేశం చేసుకోవాలి అని మాత్రమే అనగలను.
Next post లో నాకు తెలిసిన ఇప్పటిదాకా మనవాళ్లు ప్రపంచం గురించి ఇచ్చిన analysis, latest science advancement స్టేటస్ చెప్పుకుందాం. 

Thursday, June 14, 2012

Science and Philosophy -13


Current affairs, Human psychology గురించి మాట్లాడుకునే ముందు Science advancement to God గురించి నేను ఎందుకు అలాగా అనుకున్నానో చెప్పి, ముగిస్తే బాగుంటుంది అనిపించింది. ఇది కూడా ఇప్పుడు ఎందుకు చెప్పాలనిపించిందంటే  నిన్న rk, god particle కనిపెట్టబడింది Europe లో నీకు తెలుసా అని అడిగాడు. ఇంకోటి నేను ఇంతకు ముందు posts లో Spiritual plane అని ఒక answer చెప్పి దాని తరువాత అలాటి plane లేదని వ్రాశాను. దాన్ని కూడా clarify చేద్దామని అనిపించి ఈ ప్రయత్నం. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఇంతకు ముందు చెప్పబడిందే. మళ్ళీ పునరుశ్చరణ. భగవంతుడి definition ఏంటి అని నన్ను అడిగితే “ ఈ ప్రకృతి మూలమైన, అనంతమైన శక్తి స్వరూపమే భగవంతుడు”. నిరాకారుడైన భగవంతుని గురించి చెప్పగలిగేది ఇది. ఇదే అనాదిగా వస్తున్నది. అదే నిజం. ఇంకో రకంగా  “ మనిషి తనకు అర్ధం కాని, భయపెట్టే విషయాన్ని అధిగమించడానికి తనలోని మంచి లక్షణాలని, ధైర్యాన్ని కలబోసి సృష్టించుకున్న అవతారం భగవంతుడు”. ఈ భగవంతుడికి మనిషి తనకు తెలిసిన మంచి లక్షణాలు, తన ఊహకి అందగలిగిన ఎన్నో అద్భుతమైన లక్షణాలు అన్నీ ఆపాదించాడు. తనకి భయం కలిగినప్పుడు ఈ భగవంతుడిని శరణు వేడితే రక్షిస్తాడని ఒక నమ్మకాన్ని ఏర్పరుచుకున్నాడు. నిజానికి ఈ బ్రహ్మాండం అనంతమైన శక్తి స్వరూపం. ఈ శక్తి స్వరూపం తనలోని వేనవేల రూపాలని రకరకాల సంయోగాలతో వేరు వేరు రూపాలని ప్రదర్శిస్తుంది. అందులో మనిషి ఒకడు. ఈ వేరు వేరు రూపాలన్నీ తిరిగి నశించి ఆ బ్రహ్మాండమైన శక్తిలో లీనమవ్వడమే. ఇది మన పూర్వీకులు తమలోని అంతర్గత శక్తిని ఈ విశ్వరూపానికి అనుసంధానం చేసి కనుక్కున్న గొప్ప సత్యం. ఆ అంతర్గత శక్తిని జాగృతం చేసి ఈ బ్రహ్మాండం లోని అనంతమైన శక్తికి అనుసంధానం చేసినప్పుడు తనకి కలిగిన అనుభవాలని క్రోడీకరించానికి మనిషి చేసిన ప్రయత్నం లోని భాగాలే వేదాలు, సంహితలు అన్నీ. అవి సాధించడానికి ఈ శరీరాన్ని తయారు చేసే విధానాలే ఈ యోగాలు. ఆ శక్తిలో లీనమవ్వడమే మనిషి తాలూకు పరమార్ధం. అయితే దానికి ప్రయత్నం ఎందుకు, ఏ పని చేసినా, ఎలా బ్రతికినా అందులో కలుస్తూనే ఉంటాడు అన్నప్పుడు దాని కోసం ఈ వెతుకులాట, ఇంత సంఘర్షణ అవసరమా అనిపిస్తుంది. నిజంగా నాకు తెలిసి అవసరం లేదు. కానీ సుఖాన్ని, ఆనందాన్ని వెతికే మనిషి నిరంతరము ఆ అనంతమైన శక్తికి తన అంతర్గత శక్తిని అనుసంధానం చెయ్యడంలోనే ఆనందం ఉందని తెలుసుకుంటే దానికే ప్రయత్నిస్తాడు. అది కాదన్నప్పుడు అది తెలుసుకునే దాకా ఈ భౌతికమైన ప్రపంచంలో వెతుకుతూనే ఉంటాడు. ఎప్పుడైతే తన కంటికి కనపడుతూ ఉన్న ప్రపంచంలోనే వెతుకుతూ ఉంటాడో, ఏవైతే శరీరానికి సుఖాన్ని ఇచ్చే వస్తువులతో తన ఆత్మశక్తికి మబ్బు పట్టిస్తాడో, అంతవరకు ఈ నిజం అతనితో దొబూచులాడుతూనే ఉంటుంది. కావలిసినవి దొరికినప్పుడు ఆనందం, దొరకనప్పుడు బాధ, దుఃఖం, ఇంకొకడికి దొరికితే ఈర్ష్య, ఈ సంఘర్షణలో క్రోధం అన్ని రసాలు, తనుకు తానుగా తయారు చేసుకుంటున్న పరిస్థితులని తానే పరిష్కరించుకుంటూ, కొంత ప్రకృతి చేత, కొంత తనచేత ఒత్తిడి చేయబడి మార్పులకి గురికాబడుతున్న ప్రకృతికి తిరిగి adjust అవుతూ, ఆ మార్పులని తిరిగి analyze చేసి దాని లక్షణాలని కనుక్కుంటూ ఎంతో long march చేసి కొత్తవి కనుక్కుంటున్నాను అని భ్రమ పడడమే తప్పితే కొత్తగా సాధిస్తున్నదేమీ లేదు. ఇంతకు మునుపు అంతర్గత శక్తులని క్రోడీకరించే పనిలో అంతర్గత శక్తులకి కుండలినీ వగైరా పేర్లు పెట్టిన మనిషి ఇప్పుడు science అభివృధ్ధిని సాధించి బయట ప్రపంచం నించి శక్తులని తెలుసుకుని primordial soup, black hole, quasar, neutron star, supernova, galaxy ఇలాటి పేర్లతో గుర్తించి వాటి ద్వారా మనిషిలోని ఈ అంతర్గత శక్తిని define చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ నిజం కనుక్కోగలిగినా ఆఖరికి మనిషి అది తన దగ్గిర ఉన్నదేనని తెలుసుకుంటాడు.  వేల సంవత్సరాల నించి ఈ భగవంతుడు ఉన్నాడని నమ్మి, రకరకాల మతాలతో విధానాలతో,సిధ్ద్ధాంతాలతో ఆ ఆనందాన్ని పొందడానికి ప్రయత్నించిన మనిషి, తిరిగి హేతువాదం, భౌతికవాదం అని మొదలు పెట్టి, science ని అభివృధ్ధి పరిచి తిరిగి ఆ అనంతమైన శక్తి స్వరూపాన్నివేరే పధ్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే నేను science advancement leads to God అన్నాను. Spiritual plane అన్నదాని definition భగవంతుడిని, ఆ శక్తిని, మనం తెలుసుకోవడానికి మనం అనుసరిస్తున్న విధానాలని బట్టి మారుతూ ఉంటుంది. కృష్ణుడు భగవద్గీత చెప్పినా, శంకరాచార్యుడు అద్వైతం అన్నా, రామానుజాచార్యుడు విశిష్టాద్వైతం అన్నా, మధ్వాచార్యుడు ద్వైతం అన్నా, నింబార్కుడు ద్వైతాద్వైతం అన్నా, బుధ్ధుడు ధర్మాసూత్రాలని చెప్పినా, మహమ్మద్ ప్రవక్త కొరాన్ చెప్పిన, క్రీస్తు బైబిల్ చెప్పినా ఎవరు చెప్పినా ఇదే చెప్పారు. ఇప్పుడు మనం science experiments చేసి ఆధారాలతో prove చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాం.
దీనినే ఈశావాశ్య ఉపనిషత్తు లో మనవాళ్లు మంచి శ్లోకంలా చెప్పారు.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే
ఓం శాంతిః శాంతిః శాంతిః “



Monday, June 11, 2012

ఆలోచనల స్రవంతి -34


Communism కి కంచుకోటలా ఉన్న Russia ముక్కలు ముక్కలు అయిపోయింది. అయితే నిజంగా communism ఈ ప్రపంచానికి పనికిరాదా అని అనుమానం కలగక మానదు. Communism ప్రపంచానికి పనికివస్తుందా, పనికిరాదా అని తేల్చుకునే ముందు అసలు అదంటే ఏమిటి అని తెలియాలి.ఏ ఏ కాలాలలో ఏ రకమైన definitions ఉన్నప్పటికీ Communism అంటే మార్క్స్ ప్రకారం “తరతమ భేదాలు లేని వ్యక్తులు అవసరమైన దాని కంటే కూడా ఎక్కువ సరుకులు తయారుచేయగలిగే శక్తి కలిగి తయారు చేయబడిన వస్తువులు ప్రతి ఒక్కరికీ అవసరానికి తగ్గట్టుగా పంచేటటువంటి ఒక దశ”.  “Socialism అన్నది communism సాధించే దారిలో ఒక దశ”. తరతమ బేధాలు లేకపోవడమంటే  ప్రతీ వ్యక్తి కుల, మత, జాతి బేధాలు లేకుండా, తనదంటూ వేరే ఆస్థిపాస్తులు ఉంచుకోకుండా, తనకంటే ముందు తను బతుకుతున్న సమాజం కోసం శ్రమించడం. వినడానికి ఎంత బాగుంది. మరి ఈ పధ్ధతిలో గొడవేలేదు. పైన చెప్పిన definition follow అవ్వగలిగితే అద్భుతమే. మరి ఇప్పుడు communism అంటే communist parties పరిపాలనలో ఉన్న దేశాలలో, వాళ్ళు అవలంబించిన విధానం. ఇది మార్క్స్ విధానాలతో సంబంధం లేదు.
సరే ఇందులో తెలుసుకోవలసినదేమిటంటే అసలు మార్క్స్ ప్రకారం communism స్థాపనకి కావలిసినది ఏమిటి? ప్రతి ఒక్క వ్యక్తి ఒక మహర్షి లాగా ప్రవర్తించగలగాలి. అది కుదిరే పనేనా? ఇక్కడ అసలు పునాది లోనే తేడా ఉంటే భవంతి ఎలా నిలబడుతుంది. ఏ వ్యక్తి అయినా సరే తనకంటే ఎక్కువగా తను ఉన్న ప్రపంచాన్ని ప్రేమించగలడా? మిగతా Das Kapital definitions అన్నీ నూటికి నూరు పాళ్ళు నిజం అయ్యి ఉండొచ్చు. కానీ ఏదైతే implementation కావలిసిన ముఖ్య వనరు -  “మనిషి” -  వాడి definition తప్పుగా తీసుకుంటే అసలు ఎలా కుదురుతుంది. నా చిన్నప్పుడు మా master “స్పర్ధయా వర్ధతే విద్యా” అని చెప్పారు. విద్య అనే కాదు దేనిలోనైనా స్పర్ధ అన్నది లేకపోతే ఎదుగుదలే లేదు. మరి ఏ స్పర్ధ లేకుండా మనుషులు ఉండగలరా. ఉన్నా మరమనుషులలాగా బ్రతికితే ఏమైనా సంతోషం ఉంటుందా. తెలివిలేనివాడు పైన చెప్పిన communism definition తో సుఖపడతాడు. కానీ తేలితేటలు ఉండి ఎక్కువ సాధించగలిగినవాడు ఎందుకు తన సుఖాన్ని త్యజించి వేరే వాడి కోసం తన సుఖాన్ని పంచుకోవాలి? అలా చెయ్యాలంటే వాడు మహర్షి కావాలి. పోనీ చంపో, చచ్చో మనిషిని తొక్కి పెట్టి బలవంత పెట్టి అందరినీ ఒక common goal వైపు తీసుకు వెళ్లగలమా? ఒకవేళ తీసుకువెళ్లేటట్టు అయితే అదెంతకాలం? ఎవడికీ తెలియదు. అలాగని తెలివైన వాడిని ఎంతకాలం ఆపగలం. తొక్కిపెట్టబడిన తెలివైనవాడు తన స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలి అని ఇంకో పదిమందిని వెంట వేసుకుని తిరగబడితే మళ్ళీ ఒక revolution.   కాబట్టి ఈ communism అన్నది concept బాగుంటుంది కానీ ఆచరణయోగ్యం కాదు. మరి ఇన్నాళ్ళు ఈ communism flourish అయ్యింది. చాలా సంవత్సరాల పాటు ఎంతో మంది intellectuals ని కుదిపేసింది. ఒక philosopher’s utopia ని చూపించింది. ఇప్పుడంటే ఎవరో కుట్ర చేసి కూల్చేశారు అని నువ్వే అంటున్నావు అని నన్ను అడిగితే – history duping జరిగింది అక్కడే అని నేను అంటాను. లెనిన్, స్టాలిన్ అసలు నిజంగానే communism తాలూకు నిజమైన definition follow అయ్యారా అన్నది పెద్ద అనుమానం. ఎందుకంటే ఒక రకమైన నిరాశలో, నిస్పృహలో ఉన్న సామాన్య ప్రజలు ఎవరు తమ కష్టాలు తీరుస్తారు అని wait చేస్తూ, ఆ కలల సాకారం వైపు తీసుకెళ్తానన్నవాడిని మార్గదర్శకుడు అనడం సహజం. వాడి వెంట నడుస్తారు కూడా. ఎంతవరకు అంటే తమ నమ్మకం సదలనంత వరకు. మరి ఆ మార్గదర్శకుడికి  తెలుస్తుంది సాకారం దిశగా పయనించడానికి, system ని implement చెయ్యడానికి ఉండే నొప్పి ఏంటో, నొప్పి ఎంతో. అలాటి మార్గదర్శకులైన లెనిన్, స్టాలిన్ మార్క్స్ తాలూకు communism’s definition ఎంతవరకు implement చేసుంటారో మనకు తెలియదు. Result ని బట్టి inference తియ్యడం తప్పిస్తే. అంతవరకు ఎలాగో నెట్టుకువచ్చిన Russia ఎప్పుడైతే perestroika అని ప్రజల మాటకి విలువ ఇవ్వడం ప్రారంభించిందో ఇంక అంతవరకు ఆ ప్రజలలో ఉన్న అసంతృప్తిని ఆపడానికి అడ్డుకట్ట లేకపోయింది. సరే అంతవరకు ఒక ఇనప పిడికిలితో communism ని implement చేసిన Russian government అసలు ఈ perestroika అని ఎందుకనాలి అన్నప్పుడు, అందులో విదేశీ హస్తం తాలూకు ఛాయలు కనపడతాయి. ఇప్పటి దాకా నేను చెప్తున్న History అంతా అలాగట, ఇలాగట, అలా అయ్యి ఉండొచ్చు, ఇలాగ జరిగి ఉండొచ్చు అనే ఎందుకు నడుస్తున్నదంటే, నాకు నిజంగా నిజం తెలియదు, simple గా నేను చదివిందానికి, విన్నదానికి, నా analysis జోడించి, నేను అనుకుంటున్నది చెప్పడం వల్ల. ఈ Russian అనే కాదు, French revolution, Chinese history, Japanese history ఏదైనా తీసుకుంటే నిజం వేరు, చదివేది వేరు.
అందుకే శ్రీశ్రీ వ్రాసిన దేశచరిత్రలు పద్యం నాకు చాలా ఇష్టం. అంత సునిశితంగా ప్రపంచ చరిత్ర గురించి వ్రాసిన శ్రీశ్రీ “లెనిన్ ద్యుమణి” అంటే నిజమనుకున్నాను. కానీ ఇక్కడ చూడాల్సింది శ్రీశ్రీ కూడా ఒక మనిషే. కవిత్వం పక్కన పెట్టేస్తే అందరిలాటివాడే. కానీ నేను నా ఆలోచనలలో ఆయనకి ఇచ్చిన స్థానం అది నా ఊహ. నిజం ఏంటంటే మనం ఎప్పుడు ప్రస్తుతంలో బ్రతకాలి. History - నిజమో, అబఢ్ధమో ఏదైతే అది. దాన్ని ఒక నీతి పాఠంలాగ తీసుకుని ఇప్పటి పరిస్థితికి ఏది మంచి అనిపిస్తే అది చెయ్యడం ఉత్తమం.
History outline గురించి అభిప్రాయాలు చెప్పుకున్న మనం -current affairs గురించి మాట్లాడుకుందాం next posts లో
సశేషం 

Saturday, June 9, 2012

Memories of my life - 4


Russian history గురించి నాకు తెలిసింది చెప్పాలనుకున్నప్పుడు Communism గురించి నా జీవితంలో నేను ఏర్పరుచుకున్న అవగాహన కొంత చెప్పాలనిపించింది. Russian history గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. 1983-1989 లో నేను చదివిన శ్రీశ్రీ, 1987 లో చదివిన dialectical materialism మీద పుస్తకం, 1988 లో చదివిన కార్ల్ మార్క్స్ వ్రాసిన capital తెలుగు అనువాదంలో కొంత భాగం, 1989 లో newspapers లో వచ్చిన perestroika మీద కొంత details, 1990 వరకు నేను చదివిన social books లోని history ఇంతే నా knowhow. నాకు history మీద తిరిగి interest కలిగేలా ప్రపంచ చరిత్ర చెప్పిన నా స్నేహితుడు రామకృష్ణ కి సదా ఋణపడి ఉంటాను. చరిత్ర అందరూ చెప్తారు. దాన్ని కొంతమందే అర్ధం అయ్యేలా మనసుకు హత్తుకునేలా చెప్పగలరు. ఆ కొద్దిమందిలో నా స్నేహితుడు రామకృష్ణ మాస్టర్ ఒకడు అని సగర్వంగా చెప్పగలను.  నేను 7th std లోనే దక్షిణ భారత్ హిందీ ప్రచార్ సభ పరీక్షలు వ్రాయటం మొదలెట్టాను. నేను 9th std కి వచ్చేసరికి ఈ హిందీ ప్రచార్ సభ పరీక్షల్లో  “రాష్ట్ర” level లోనో, “విశారద” level లోనో  ఉండేవాడిని. హిందీ తో పాటు అందులో తెలుగు పరీక్షలు కూడా ఉండేవి. తెలుగు text book లో కవిత్వం ఉండేది. కుందుర్తి ఆంజనేయులు వ్రాసిన “నగరంలో వాన”, తిలక్ “అమృతం కురిసిన రాత్రి” , శ్రీశ్రీ వ్రాసిన “జగన్నాధ రధచక్రాలు” పద్యాలు ఉండేవి. అందులో శ్రీశ్రీ వ్రాసిన జగన్నాధ రధచక్రాలు నాకు బాగా నచ్చింది. చదవడానికి ఒక rhythm ఉండేది. నేను ఆ పద్యం బట్టి పట్టేశాను. 9th std లో మాకు R.S.ప్రసాదరావుగారు సోషల్ టీచర్. ఆయన నేను communist ని అంటుండేవాడు. వెంపటాపు సత్యం చచ్చిపోయినప్పుడు మా class లో బుర్ర పట్టుకుని కూర్చున్నాడు. ఆయన నాకు శ్రీశ్రీ పద్యం వచ్చు అంటే, class లో లేచి నిలబడి చెప్పమన్నారు. నేను జగన్నాధ రధచక్రాలు చెప్పిన తరువాత నన్ను చాలా మెచ్చుకున్నాడు. ఆయన ప్రభావం నామీద చాలా ఉండేది. ఆ తరువాత Intermediate కి వచ్చిన తరువాత ఏ కవిత్వం లేకుండా గడిచిపోయింది. మళ్ళీ ఆకలి రాజ్యం cinema చూసే దాకా నాకు శ్రీశ్రీ గురించి మళ్ళీ flash అవ్వలేదు. రాంబాబు కలిసిన తరువాత మేమిద్దరం కలిసి కొన్న మొదటి పుస్తకం శ్రీశ్రీ మహాప్రస్థానం. ఆ తరువాత శ్రీశ్రీ, నగ్నముని, చెరబండరాజు లాటి కవులు వ్రాసిన విరసం ప్రచురణలు దాదాపు అన్నీ చదివాను. నేను శ్రీశ్రీ ప్రభావంలో ఉండేటప్పుడు communism అంటే ఒక స్వర్గాన్ని తయారుచేసే tool అనుకునే వాడిని. శ్రీశ్రీ ఏకంగా “గర్జించు రష్యా గాండ్రించు రష్యా “,  “లెనిన్ ధమని, లెనిన్ ద్యుమణి “, అని వ్రాస్తే నేను ఎప్పటికైనా ప్రపంచమంతా communism వచ్చేస్తుంది అనే నమ్మకంలో ఉండేవాడిని. కాళీపట్నం రామారావు గారు వ్రాసిన communist tint లో realistic base ఉన్న “యజ్ఞ్యమ్” & “కుట్ర” కథలు బాగా నచ్చాయి. 1988 లో Andhra university లో ఏదో radicals meeting అంటే ఈ పుస్తకాల ప్రభావం లోనే వెళ్ళాను. వాళ్ళు mess లో chicken పెట్టలేదు-warden పని పట్టాలి, ఇంకెవడో తప్పు మాట్లాడాడు - వాడిని తన్నాలి ఇలాటి discussions చేస్తుంటే విసుగెత్తి వచ్చేశాను. నా engineering friends కూడా నేను ఈ communism topics పెట్టి కుమ్ముతుంటే వాళ్ళు కూడా భయపడి నా దగ్గిరకి వచ్చేవారు కారు. భారత దేశం లో ఈ communist principles follow అయినవాళ్ళు naxalites అన్నప్పుడు, నాకు naxals మీద కూడా ఒక గౌరవం ఒక soft corner ఉండేది వాళ్ళతో ఏ రకమైన link లేకపోయినా.  Communism గురించి ఆంధ్ర లో చేసే పోరాటాలలో communists తమ ఆస్థులు కూడా ధారపోసి ఒక ఉద్యమానికి ఊపిరి పోస్తున్నారంటే గౌరవం కలిగేది. మధ్యలో వాళ్ళకి ఉన్నది అంతా ఉమ్మడి సోత్తే - భార్యలతో సైతంగా అన్నప్పుడు గాభరా అనిపించింది. Perestroika తరువాత, Russia ముక్కలైపోయినప్పుడు ఇదేమిటి ఇలా జరిగింది ఇలా జరగకూడదే అనుకున్నాను. అప్పుడు newspapers లో వచ్చినవి చదివి అసలు చరిత్రలో నిజం అంటూ ఏమైనా ఉందా?communism ఎంతవరకు ఆచరణయోగ్యం అనే సందేహం కలిగింది. తరువాత నేను ఉద్యోగంలో పడ్డ తరువాత తదనంతరం పెళ్ళైన తరువాత అసలు communism అన్నది నా memory లోంచి పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. 

Friday, June 8, 2012

ఆలోచనల స్రవంతి - 33


Inflation is general rise in the level of prices and services over a period of time. అసలు Inflation కి వేరు వేరు కాలాలలో వేరు వేరు definitions ఉండి, ఇప్పుడు ఈ ముందు చెప్పిన definition “పరిమిత కాలంలో నిత్యావసర సరుకుల, వినిమయ వస్తువుల, సేవల లేదా స్థిరాస్తుల ధరల తాలూకు పెరుగుదల” ని inflation అంటున్నారు. దీన్ని control చెయ్యడంలో economy తాలూకు ఆరోగ్య పరిస్థితి బయట పడుతుంది. ఇది ఎంత తక్కువలో స్థిరంగా ఉంటే అంత మంచిది. దీన్ని అదుపులో ఉంచగలిగితే రూపాయి విలువ పెరుగుతుంది. నాకు తెలిసినవేంటంటే
1.     దిగుమతి తగ్గించి ఎగుమతి పెంచాలి – ముఖ్యంగా దిగుమతి చేసుకునేది oil products కాబట్టి అవి తగ్గించాలంటే alternate energy sources మీద దృష్టి పెట్టాలి –ఉదాహరణకి solar energy, wind energy ని use చేసుకోవచ్చు. దీనికి technology improvement & implementation అవసరం. ఇది ఇప్పట్లో జరిగేలా కనపడటం లేదు ఎందుకంటే alternate use చెయ్యడం మొదలెడితే ఎంతో మంది vested interests దెబ్బతింటాయి. వాళ్ళు పడనివ్వరు.
2.    మనవాళ్లు మన దగ్గిర ఉన్న dollar reserve అమ్మేసి తాత్కాలికంగా రూపాయి విలువ పెంచొచ్చు. కానీ తరువాత imports కి కట్టడానికి foreign exchange reserve తగ్గిపోతే కష్టం. So అదీ immediate గా జరగదు.
3.    ఏవైతే company లు dollar accounts maintain చేస్తున్నాయో అవి ఆ dollars ని rupees లోకి convert చేసి మన market లోకి pump చెయ్యాలి. వాళ్ళు చెయ్యరు.
4.    Government కానీ company లు కానీ రూపాయి విలువ తగ్గినప్పుడు తీసుకున్న అప్పులు తీర్చకూడదు. పెరిగినప్పుడు తక్కువ రూపాయిలతో ఎక్కువ అప్పు తీర్చొచ్చు. అప్పిచ్చిన వాడు ఊరుకుంటాడా ఊరుకోడు.
5.    మన company లకి విదేశాల్లో అప్పులు చెయ్యడానికి rules లో వెసులుబాటు కల్పించాలి. అప్పుడు వాళ్ళు ముందు అప్పు తీసుకుని రూపాయి బలపడ్డప్పుడు అప్పు తీరిస్తే సారి. మరి రూపాయి విలువ తరువాత ఇంకా పడిపోతే ఆ company పరిస్థితి? అది company తాలూకు policy మీద ఆధారపడి ఉంటుంది. ఎంత వరకు జరుగుతుందో తెలియదు.
6.    Government విదేశీ పెట్టుబడిదారులని ఆకర్షించి ఎక్కువ పెట్టుబడులు పెట్టించాలి. అప్పుడు కొంత ఆగుతుంది కానీ control ఇంకోడి చేతుల్లోకి వెళ్లిపోతుంది. Already వెళ్లిపోయింది, ఇంకా మిగిలింది ఏమైనా ఉంటే అది కూడా పోతుంది.
7.    మనవాళ్లు agriculture production పెంచి నిత్యవసర సరుకుల ధరలు తగ్గించి, తద్వారా ప్రజలకి ఒక awareness తెచ్చి, ఇంకా మన మేధావులు వలస పోకుండా ఆపి, కొత్తగా వస్తున్న technology ప్రజల శ్రేయస్సుకి ఉపయోగించి విదేశాలు కూడా మన technology మీద ఆధారపడేలా చేసి మన సరుకుల నాణ్యత పెంచి etc.,
అంటే ఎవడూ రూపాయి పడిపోవడాన్ని ప్రస్తుత పరిస్థితులలో రక్షించలేడు.
కానీ మనం రక్షించొచ్చు. గాంధీ గారి style. విదేశీ కంపెనీలు తయారుచేసిన సరుకులు వాడకూడదు. ఇది కొంత వరకు రూపాయి పడిపోకుండా కాపాడుతుంది. చెయ్యొచ్చు. ఈ సలహా face book, twitter account ఉన్న ప్రతి భారతీయుడికి తెలుసు. “If you love India please share” అని ఎవడో అంటాడు, తెగ share చేసుకుంటారు. ఎవడూ follow అవ్వడు. అసలు ఏంటి మన national psychology అని ఎవడికైనా doubt వస్తుంది. ఈ history duping గురించి నాకు తెలిసిన మరో రెండు మూడు సంగతులు చెప్పుకుని అప్పుడు psychology మీద పడదాం.
నా inference ఏంటంటే ఏ దేశమైన  ఒక limit తరువాత saturate అయిపోతుంది. పెరుగుతున్న జనాభా కి తగ్గట్టుగా వనరుల ఉత్పత్తి పెంచుకుంటూ పోతే, కరువు ఉండదు. జనాభా అదుపులో ఉంటే పరవాలేదు. కానీ మన ఉత్పత్తి కంటే వాడకం ఎక్కువ అయితే అప్పుడు కష్టం. ఎప్పుడైతే మన దగ్గిర సరుకులు అయిపోతాయో అప్పుడు పక్కవాడివి కూడా మనం తినడం మొదలెట్టాలి. Ecological balance ఎలా maintain అవుతుందో అదే principle economic balance కి కూడా. ఇది అమెరికా,UK, ఆస్ట్రేలియా, జర్మని వంటి ఆగ్ర రాజ్యాలు ఎప్పుడో గుర్తించాయి. అందుకే వారి దేశం కొంత సౌకర్యంగా ఉండడానికి మిగతా దేశాల economy ని చప్పరించుకుని తినేస్తాయి. అన్ని రకాల bullying techniques ఉపయోగించి USA తన ఆధిక్యం ఈ రోజు నిలబెట్టుకుంటున్నది. మన మీద వాళ్ళ పరిస్థితి మెరుగే కానీ వాళ్ళ దగ్గిరా పూర్తి solution లేదు. Canada వెళ్ళిన నా friend చెప్పాడు. Medical facilities USA కంటే Canada లో బాగుంటాయి, insurance లేకపోతే USA లో ఏదైనా treatment ఖర్చులు తట్టుకోలేము అని. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి వేరే దేశాలలో వాళ్ళు జరిపే మారణకాండలు ప్రపంచమంతా తెలుసు. కానీ అందరికీ ఒక భయం. ఒక stand తీసుకోడానికి భయం. నిజం నిర్భయంగా చెప్పడానికి భయం. మన దేశం వాళ్ళు ఏమి తక్కువ కాదు. ఈ USA example తో మనవాళ్లు శ్రీలంకలో ప్రదర్శనకి దిగితే వాళ్ళు తరిమి కొట్టేరు, LTTE ని. మరి దీని అర్ధం ఏంటి అంతే “చీమా కుడుతుంది, పామూ కుడుతుంది. చీమ కుడితే మనం చీమను చంపుతాము. అదే పాము కుడితే మనము చస్తాము”. ఇది ప్రపంచం. Survival of the fittest అంతే. మరి ఇందులో duping ఎంటయ్యా అంటే చెప్పేది ఏంటంటే, media లో ప్రచారం జరిగేది ఒకటి. అసలు ఆంతర్యం ఇంకోటి.
 Russia perestroika తరువాత ముక్కలు ముక్కలు అయిపోయింది. ఇది కొంత వాళ్ళ స్వయంకృతం, communism లో ఉన్న loopholes, మిగిలింది వాటిని exploit చేసే sam పెద్దన్న ఆశీర్వాదమేనని నా నమ్మకం. Russian history గురించి next post లో.
సశేషం

Wednesday, June 6, 2012

ఆలోచనల స్రవంతి -32


Globalization తరువాత ప్రతీ దేశం తమ ఉనికిని కాపాడుకోవడానికి imports & exports మీదే ఆధారపడుతుంది. అవి రెండు balanced గా ఉన్నంత కాలం ఏ ఇబ్బంది లేదు. ఎప్పుడైతే imports exports కంటే పెరిగిపోతాయో ఆ దేశం తాలూకు మారకం విలువ పడిపోతుంది. అంటే మనము అవతలవాడికి అమ్మే దాని కంటే కొనేవి ఎక్కువ అయ్యాయి. ఆదాయం కంటే వ్యయం పెరిగితే అప్పుల పాలే.  

ఇప్పుడే కాదు భారత దేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గిర నించి ఇదే పరిస్థితి. మనది Mixed economy. అంటే కొన్ని పరిశ్రమలు government run చేస్తుంది, కొన్ని private parties run చేస్తాయి. కారా మాస్టర్ కుట్ర లో చెప్పినట్టు మన దేశం భ్రష్టు పట్టి పోవడానికి కారణం మన policies & decision making. Heavy industries అంటే భార పరిశ్రమలు అన్నీ government, Corporate Industries అంటే భారీ పరిశ్రమలు అన్నీ private. అంటే ప్రజల సొమ్ముతో పెట్టిన పరిశ్రమలు అన్నీ private పరిశ్రమలుకి ముడి సరుకులు అందించే పరిస్థితే గానీ మన దగ్గిర ఉన్న low technology తో తయారైన heavy industrial goods కి globalగా demand లేదు. తయారుచేసినవి బయట అమ్ముకోలేక, అమ్ముకోవడానికి మన దేశంలో ఉండే పెట్టుబడిదారులు ఎవరూ ముందుకి రాకపోతే వాళ్ళకి concessions ఇచ్చి, అప్పులు ఇచ్చి వాళ్ళని కోటీశ్వరులు చెయ్యడం తప్పితే ప్రజలకి ఒరిగిందేమీ లేదు. Liberalization పేరుతో Capitalist agenda ని అద్భుతంగా అమలుపరచడం, దాన్ని ఏదో గొప్ప achievement అని ప్రచారం చేసుకోవడం తప్ప నిజంగా ప్రయత్నిస్తే రూపాయి విలువ పడిపోకుండా ఆపొచ్చు అన్నది మన నాయకులకి తట్టదు, అనిపించదు. ఎందుకంటే వాళ్ళ agenda యే వేరు. ఇప్పటికీ మనం technology వేరే దేశాలపై ఆధారపదడమే కానీ indigenous technology కి సంబంధించి ఏమీ positive steps తీసుకున్న దాఖలాలు కనపడవు. అప్పుడప్పుడు పృథ్వీ, అగ్ని అనడమే అంతే. మన దేశంలో పుట్టి, మన దేశంలో చదువుకుని, విదేశాలకి లాభం చేకూర్చడమే కానీ, మన దేశపు మేధావులు మన దేశానికి చేస్తున్నదేమీ లేదు. కారణం ఏమిటంటే ఇక్కడ వాళ్ళ తెలివితేటలకి గౌరవం లేదు. వసతులు లేవు. పైపెచ్చు ఇక్కడ ఏమైనా చేద్దామనుకున్నవాడికి unnecessary harassment. పరిపాలిస్తున్న నాయకులకి ఏమి చేస్తే దేశానికి మంచి జరుగుతుందో తెలియదా తెలుసు కానీ వాళ్ళ గొడవలు వాళ్ళకి ఉన్నాయి. దీనికి తోడు 90% మనకి బుర్రలు లేని నాయకులు. బుర్ర ఉండి commitment ఉన్నవాడిని రానివ్వరు. బుర్ర ఉన్నా అది వాడే అవసరం ఉండదు. ఇంకా ఏమైనా చేద్దామనుకున్న కొందరు మనకెందుకులే అని ఈ international power play politics లో నలిగి ఊరుకోవడం. Balance ఏమైనా మిగిలిపోతే అవి regional, communal politics లో నలిగి నాశనం. ఇంక మిగిలినవి మన private పెట్టుబడిదారులు మూసేశారు. అదీ పరిస్థితి.
ఇప్పటికీ భారతదేశం produce చేసే సరుకులకి demand లేదు. మన crudeoil imports రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ crude oil reserves ని control చేస్తున్న USA తాలూకు dollar కి పరువు, బరువు. అమెరికా ఇరాక్ లో చేసిన యుధ్ధం అంతా దీని గురించే. కారణం ఏదైనా చెప్పొచ్చు. నిజంగా ఈ petrol, diesel లేకపోతే పని నడవదా? నడుస్తుంది కానీ competition పెరిగిన ప్రపంచంలో ఎవడి ఉనికి వాడు నిలబెట్టుకోవడానికి scooter, ఇంకా status కూడా add అయితే car తప్పవు. ముందు వీటిని అమ్మితే వీటి ఇంధనం కోసం చచ్చినట్టు petrol, diesel కొనడమే. ఏ దేశమైతే resources control చేస్తుందో దానిదే పైచెయ్యి. కొన్ని మనకి అవసరం లేకపోయిన బలవంతంగా మన జీవితాలలోకి  ప్రవేశపెట్టబడతాయి. ఉదాహరణకి toothpaste, brush లేకపోతే పళ్ళు తోముకోలేమా? నా చిన్నప్పుడు మా తాతగారి ఊరిలో వేప పుల్లలు, లేదా ఉప్పు,కచ్చిక(కొబ్బరి డొక్కలు కాలిస్తే వచ్చేది) పెట్టి పళ్ళు తోముకునే వారు. అప్పుడూ పళ్ళు శుభ్రం గానే ఉండేవి. ముందు status symbol గా అందరి జీవితాలలోకి ప్రవేశించిన ఈ toothpaste ఇప్పుడు నిత్యావసరం లోకి మారింది. ఇప్పుడు అది ఏ పల్లెటూరు అయిన brush, paste compulsory. ముందు అలవాటు చేసి, తరువాత ధర పెంచడం, అవసరం లేని వస్తువుని ప్రవేశపెట్టి అవసరంగా మార్చడం అదో marketing strategy.  marketing గురించి మాట్లాడుకుంటే అదో మహాసముద్రం. ఇప్పుడు industrialization దెబ్బకి చెట్లు కూడా లేవు వేప పుల్లలు దొరకవు. రేపటి రోజున ఎవడో ఒకడు “nature in its original form –herbal cure for teeth and gums – Neem stick” అని వేపపుల్లని toothpaste కంటే ఎక్కువ rate కి అమ్మేసినా ఆశ్చర్యపోవఖ్ఖరలేదు.
 crude దెబ్బ అక్కడితో ఆగదు. దీనివల్ల LPG ధర పెరుగుతుంది, రవాణా ఖర్చులు పెరుగుతాయి, నిత్యావసర వస్తువుల ధర పెరుగుతుంది, చివరిగా మనం తినే తిండి ధర మనం భరించలేనంతగా పెరుగుతుంది. ఏదో విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో చదువులు అంటే మానేయొచ్చు కానీ తిండి మానడం కుదరదు కదా. ఇంతకుముందు చరిత్రలో ఇలాటివి జరగలేదా అని question రావోచ్చు. నూటికి నూరు శాతం వచ్చి ఉంటాయి. కానీ చరిత్రలో అవి రాసుకోరు. ఒకవేళ రాసుకున్నా దాని గురించి మాట్లాడుకోరు. ఉదాహరణకి మన విజయనగర సామ్రాజ్యంలో అంగట్లో రత్నాలు అమ్మేవారుట. Persia నించి వచ్చిన అబ్దుర్ రజాక్  చెప్పాడు కాబట్టి కొంత నమ్మోచ్చు. కానీ నాకు చిన్నప్పుడు మా class teacher విజయనగర సామ్రాజ్యంలో ముత్యాలు, వజ్రాలు,రత్నాలు road పక్కన కుప్పలు పోసి అమ్మే వారని చెప్పింది. నేను చిన్నప్పుడు నోరు వెళ్లబెట్టాను. ఇలా కూడా ఉంటుందా అని. ఆవిడ కూడా ఏ ఉత్సాహంకల చరిత్రకారుడు చెప్పిన చరిత్ర విని ఉంటుంది.   ఆ తరువాత రాయల సామ్రాజ్య పతనం, విజయనగర దుస్థితి, అది ఎంత హీనదశ చూసింది, ఎవడో రాసే ఉంటాడు కానీ మనకి అఖ్ఖరలేదు. ఎందుకంటే మొదటి విషయం ఇచ్చిన kick రెండో విషయం ఇవ్వదు. ఇది బాబు చరిత్ర.
మన రూపాయి విలువ inflation వల్ల పడిపోయింది.

మళ్ళీ history duping కి వెళ్ళేముందు next post లో inflation అంటే ఏంటి, ఏమి చేస్తే రూపాయి విలువ పెంచొచ్చు, American economy/ current history  తాలూకు అసలు స్వరూపం ఏమిటి కొంత తెలుసుకుని Russian history లోకి గెంతుదాం.