Thursday, October 7, 2010

ఆలోచనల స్రవంతి - 4

నాకు KTC తో మాట్లాడుతుంటే ఇంకోటి అనిపించింది. అసలు ఎవడికి ఈ system తప్పు అనిపించటం లేదు ఏమో. అందుకే ఎవరు తీవ్రంగా దీన్ని మార్చాలి అనుకోవటం లేదు అనిపించింది. మార్చాలి అని అనుకున్నాడు అంటే, వాడు ఎంతో కొంత ఆలోచించే వాడే అవుతాడు. ఆలోచించగలిగే వాడు అయితే చచ్చే దాకా logic ఆలోచిస్తూ కూర్చోడు. ఏదో ఒకటి చెయ్యడానికి ప్రయత్నిస్తాడు. ప్రయత్నించాడు అంటే ఎంతో కొంత సంపాదిస్తాడు. జీవితం లో కొంత stability వచ్చిన తరువాత ఆలోచించాల్సిన అవసరం కనిపించదు. ఎవడి domestic life  లో వాడు పడిపోతాడు. ఉన్న జీవితమే చాల చిన్నది. ఆ మాత్రం ఈ మాత్రం సెటిల్ అవ్వగలిగిన వాడు, ప్రపంచం తీరు తెలిసిన వాడు, ఎందుకు తన లైఫ్ confuse చేసుకోవాలి అని అనుకున్నాను.
అప్పుడు Kameswararao the philosopher (Mr . KTP ) బయటికి వచ్చాడు. ముందు నా ధోరణిలో నేను గుర్తు పట్టలేదు.తరువాత KTC shape మార్చాడేమో  అనుకున్నాను. కానీ వాడు మాట్లాడడం మొదలు పెట్టిన తరువాత తెలిసింది, వాడు ,వీడు వేరని.
వీడు "నాయనా" అన్నాడు. ఏమిటి చెప్పు. నీ చుట్టు పక్కల ఉన్న వాతావరణం ఆంతా భయంకరంగా ఉంటే నువ్వేమి సుఖపడతావు నాయనా.నేను సుఖపడక పొతే సుఖం ఉండే చోటు వెతుక్కుంటూ పోతాను అన్నాను. వాడు అలా పరిగెత్తుకుంటూ ఎక్కడికి పోతావు నాయనా అన్నాడు. ఎక్కడికైనా నాకు నచ్చిన చోటికి అన్నాను. ముందు నీ సుఖం నువ్వు define చేసుకో బాబూ. KTP వెళిపోయాడు.
 నాకు భయం వేసింది. KTC మళ్ళీ నిద్ర లేస్తాడేమోనని. మళ్ళీ అనిపించింది  నేను KTC లా  మాట్లాడాను  కాబట్టి ఈ philosopher గాడి entry అనమాట. OK నిన్న మనిషికి ఆహార, నిద్రా, మైధునాలు basics అని మొదలెట్టి - -ఆహారం గురించి మాట్లాడే లోపు మనిషి గురించి మనిషి psychology గురించి ఆలోచించాల్సి వచ్చి  - మనిషి గురించి మొదలెట్టగానే నేను నా స్వార్ధాన్ని justify చేసుకోవడం మొదలు పెట్టాను.
 KTP తగలక  పొతే సంఘం గురించి  ఆలోచించాల్సి వచ్చేది కాదు - అసలు ఇంత చిన్న దానికి నేను నా స్వార్ధం చూసుకునేటట్టు అయితే  - నా కంటే తెలివైన వాడు వాడి చాకచక్యం తో సంపాదించినా డబ్బులు , సంపద అందరితోనూ కలిసి ఎందుకు పంచుకోవాలి. ఎందుకు వాడు అందరి బాగు కోసం పాటు పడాలి. అక్ఖర లేదు. ఆ cynic నువ్వు సుఖపడుతున్నావా అని అడుగుతాడు. philosopher సుఖం define చెయ్యమంటాడు. సరే సుఖం define చేస్తే మిగతావి line లో పడతాయన్న మాట అనిపించింది.
 సరే  start the list of సుఖం.
నాకు నేను ఏది సుఖమనుకుంటున్నాను.నాకు బోలెడు -
౧. కీర్తి - మనసుకి , అహానికి సుఖం   - -నిద్ర పట్టాలంటే మనసు సుఖంగా ఉండాలి కదా
౨.  కాంతా - - శరీరానికి సుఖం  - -మైధునం కి
౩.  కనకం.  - ఇంక మిగిలినవేమైన ఉంటే అవి కూడా పొందడానికి  - తరగని ఆహారం సమకూర్చుకోడానికి, నలుగురి మీద పట్టు, మళ్ళీ కీర్తి, కాంత  కూడా కనకాన్ని ఫాలో అవ్వడమే  - -అంటే కనకం ఉంటే సరిపోతుందా??
౪. మరి ఆరోగ్యం??? - -అవును ఇది కూడా కావాలి - ఎందుకు శారీరిక బాధ లేకుండా పై మూడు అనుభవించడానికి.
అనుభవం - -పై నాలుగుటివల్ల  వస్తుంది  - -అవి పుష్కలంగా ఉంటే అందమైన అనుభవం - -లేకపోతే ఏమిటో ???


కీర్తి -  సంఘం లో అందరూ కాకపోయినా కొందరు నిన్ను పోగడాలన్నమాట. అదేగా కీర్తి - అంటే సంఘం కావాలా???
కాంత - నీ సంఘం లో ఒక భాగం - -భార్య అయితే నీ జీవితంలో సగ భాగం. అన్య కాంతలు ??? - అంటే ఇక్కడ కూడా సంఘం కావాలా???
కనకం - బోలెడు డబ్బు సంపాదించు- దీని పరమార్ధం కూడా సంఘం లోంచి నీకు కావలిసిన వాటిని తీసుకోవడానికే.
ఆరోగ్యం - -ఈ pollution గురించి అందరికిచేప్పి ఆపమంటే కొంత ఆరోగ్యం బాగుపడుతుంది ఏమో  - అంటే సంఘాన్ని ఒప్పించాలి


అసలు నేను ఈ మనుషుల మధ్యన ఉన్నాను కాబట్టి ఇవన్నీ అవసరం - -అదే ఈ అడవిలో ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటే - వీటి గొడవే లేదు కదా - ఇది నిజమే బాబూ - మరి అడవులన్నీ మనుషులు నరుక్కుంటూ పోతున్నారు కదా - -
మరి నీ తపస్సుకి  అడవి ఎక్కడనింది వస్తుంది????
మరి అడవులు కాపాడాలంటే - -అడవులు నరికే  వాడిని ఆపాలి - -వాడిని ఆపాలంటే వాడు నీ మాట వినాలి - -నీ మాట వినే పరిస్థితులలో వాడు ఉండాలంటే - నీకు మళ్ళీ కీర్తి,కనకం etc .,., - -విసుగేసింది - వలయాలలో తిరిగి, తిరిగి  - -తిరిగి అదే - ఇంకేదో ఉదాహరణ తీసుకున్న మళ్ళీ  అక్కడికే వస్తున్నాను -
అంటే నా సుఖం సంఘం లోనే ఉందా?? - మరి సంఘాన్ని నాకు నచ్చినట్టు మార్చుకునేదేలా - అందరినీ ఒక త్రాటిపై తీసుకు వచ్చి - తీసుకు రావాలంటే - వాళ్ళకి మంచి ఏదో చెడు ఏదో చెప్పాలి  -వాళ్ళని ఆలోచింప చెయ్యాలి-


ఆలోచనా??? - అసలు సుఖాన్ని define చేసేది ఇదే అనుకుంటా


ఈ విశ్వం లో కొన్ని standards ఉన్నటున్నాయి. లేకపోతే అందరికి పంచదార తియ్యగాను, చింతపండు పుల్లగాను etc .,,ఎలా ఉంటాయి. సరే ఈ common principles ఉన్న మనుషులకి ఒక కామన్ way of living నేర్పితే  - KTP sudden entry కొట్టాడు. అదే నాయనా మతం చేసే పని - అది మనుషులకి ఒక క్రమ పద్ధతిని నేర్పుతుంది.
 డిషుం,  డిషుం,డిషుం భీబత్సంగా sounds వినపడ్డాయి. నాలోనించి బయటకు వచ్చిన  KTC గాడు KTP ని చితక్కోడుతున్నాడు. "బుద్ది ఉందిరా నీకు  - మతం పేరు చెప్పుకుని చచ్చి పోతున్నారు తెలుసా - ఇది సరిపోదన్నట్టు కులాలు కూడాను - -ఏ మతం ఫాలో అవ్వమంటావురా - ఏంట్రా నీ తొక్క వేదాంతం. ఏ మతాన్ని  follow అవ్వమంటావురా???
KTP నిజంగానే తొణక లేదు. నువ్వు అసలు ఎందుకు ఆవేశ పడుతున్నావు. నేను ఈ మతం  అని పేరు చెప్పలేదే - "మనుషులందరికీ ఏది హితమో అదే మతం" అన్నాడు.
మళ్ళీ  డిషుం,  డిషుం,డిషుం - ఈ ప్రపంచంలో రకరకాల భౌగోళిక పరిస్థితులు, రకరకాల మనుషులు, రకరకాల అలవాట్లు - అందరూ ఒకేలా ఎలా అలోచిస్తారురా అన్నాడు KTC .ఇంకా అసలు నీకు చరిత్ర తెలుసా ?? తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు అని కూడా అన్నాడు.
నాకు చిరాకేసింది - ముందు మీరిద్దరూ పొండి ఇక్కడినించి - మీరిద్దరూ తన్నుకుని నన్ను అలిసి పోయేలా చేస్తున్నారు. ఇందాక నాకు, ఆలోచన basics ని పట్టుకుంటే  సుఖం - సుఖం definition పట్టుకుంటే - మనిషి, సంఘం అందరూ పద్ధతి లోకి వస్తారు అనిపించింది. నా ఆలోచనలేవో నేను ఆలోచించుకుంటాను. మళ్ళీ రమ్మనే దాకా మీరిద్దరూ రావద్దు. నాకు నిద్ర వస్తుంది. నేను రేపు చూసుకుంటాను - -మీరు మాత్రం రావద్దు అని నిద్రకి ఉపక్రమించాను.
సశేషం








No comments:

Post a Comment