Sunday, April 17, 2011

naa paata kavitvam - 29

1988
చిన్ని చిన్ని పదాలతో ఊహల మాలికలల్లి
ఆ వరసలు చూసి మురిసిపోతూ
ఆలోచనలకు రూపమిచ్చే ప్రయత్నంలో
కలం కదిలించి అలిసిపోతూ
నరాలపై మ్రోగే జంత్ర వాద్యానికి
పల్లవి పాడలేక అవిసిపోతూ
నిశ్శబ్దంలో ఏకాంతంలో......నేను


ఇంకోసారి పాతది reproduce చేద్దామని వ్రాస్తే ఇంకోటి తేలింది
2009
చిన్ని చిన్ని మాటలతో  ఊహల మాలికలల్లి మురిసిపోతూ
అనంతమైన ఆలోచనల ఝరిలో ఎదురీది అలిసిపోతూ
నిశ్శబ్దంలో
ఏకాంతంలో 
నేను


కవన సుధామృత కళా కేళిలో కరిగి పోతూ
నాద పరిచుంబిత అలౌకికానంద లహరిలో తేలిపోతూ
వశం తప్పిన 
పరవశంలో 
నేను


1987
ఎక్కడ ఉన్నా చెలి తలపే
మరిపిస్తోంది నన్ను చెలి వలపే
తట్టాలి చెలి నా వలపు తలుపే
తెలపాలి నాకు తన వలపు తలపే


1988
శీకరమ్ములు    చిందులాడే
జలధరమ్ములు  నింగి  ముసిరి 
హృదయ శ్లథ  శకలముల తోడ
దవిలిన నయనముల నీడన
ప్రరోహ కవన మసృణ చణము 
1988
కరుణ రసాత్మకమైన కావ్యమింకేల
చాలదా చరమ సీమల  శ్లథ జీవనమ్ము 
1988
"నిన్ను నువ్వు తెలుసుకో" కి 
గీటురాయి ఎక్కడ 
చేవుంటే చెప్పు
ఈ చిక్కుని విప్పు
1988
తెరవని కిటికీలకు
దక్షిణ మారుతమైతేనేం
లాభం లేదు లేదు
చెరగని విధి గీతకు 
చీల్చే సౌదామనులేల 
భ్రమే నిజమై తేలే 
ఈ మిథ్యా ప్రపంచంలో
చీకటైతెనేమిటి
చూసే కనులుంటే కదా 
కప్పే సమాదికిక 
నిలబెట్టే పునాదేందుకు
1988
ఋతం
ఏదీ లేదు
ఏదీ కాదు
శాంతి
ద్వందాతీతమైన లయలో
ఈ విపంచి శృతి కలిసే క్షణాన ప్లవించే కాంతి
నా నీడని నేను కౌగిలించుకొనే క్షణం
నాకు నిజమైన శాంతి విశ్రాంతి
౧౯౯౨
ఊపిరందక గిలగిలమని
ప్రాణం నీ కన్నుల 
కొసల కదలాడినా
వెన్నెల అలలు అవలోకించే
ఉన్మత్త ఊహా మరుత్తువి......

తకిట తకిట తక  ధింతానా    
నిజాల నించి
ఇజాల నించి
పారిపోలేవు రామారావ్


ముసుగులు వేసీ
తలుపులు మూస్తే
నిజం దాగునా రామారావ్


ధీరుడవోయ్
శూరుడవోయ్
ఉక్కు కత్తుల రామారావ్


చీకటి శ్లేషల
శ్లేష చీకటుల
వేకువ నీదోయ్ రామారావ్


ఆకలి వేస్తె
మొక్కలు పాతే
గొప్ప తెలివిగల రామారావ్


భావుకత నీకు
ఆరో ప్రాణం
అసలైదేక్కడ రామారావ్


అన్నీ తెలుసనీ
ఏమీ తెలియని
తెలిసీ తెలియని
ఫిలాసఫీ తో
పొడి పొడి కత్తులు
విడుపనిషత్తులు
భగవత్గీతలు
తిలక్, చెలాలు
వీరేన్, శ్రీశ్రీ
వీడా వాడా
ఎవడని  చెప్పను
అందరినీ
ఔపోసన పట్టి
బ్రతుకంతా
ఒక చాపన చుట్టి
చంకన పెట్టి
ఎడారి ఇసుకలో
బిడారి గుంపుతో
ఒయసిస్సుకై
చూస్తున్నావా రామారావ్
ఇంతేనా ఇది
ఎలా సాగేది
కటి చీకటిలో రామారావ్
శూన్య నిశీధిలో రామారావ్


హైకూ to అమ్మలు 
ఛోళే  పూరి
మిరపకాయ బజ్జి
ఫ్రైడ్ రైస్
చెనా బథురా


డాల్ఫిన్ హోటల్
ఫస్ట్ షో సినిమా
బైక్ షికారు
మహా హుషారు


పంతాలు సగం
కొండంత అహం 
ఒంట్లో నీరసం
అయినా ఆగం

ఒక్కొక్క సారే
ఏదైనా సరే
అంతం లేనిది
ఈ "ఒక్కసారే"

ఒళ్ళే వంచం
వంచనే వంచం
తిండీ, మంచం
ఇదీ ప్రపంచం

చేత రిమోటు
ఇస్తే ఒట్టు 
అది అడిగావా
నీ గతి డౌటు

అమాయకత్వం 
అతి ఆవేశం
ఏది తెలియని
అతి మూర్ఖత్వం

అర కప్పు స్వార్ధం
ఒక కప్పు బద్ధకం
కలియ తిప్పితే
ఈ అవతారం

చెబితే కోపం
అంటే నేరం
చెప్పకపోతే
గొప్ప అనుమానం


1991
ఆగమని తెలిసినా ఆగని కథ
జ్ఞ్యాన సముపార్జనమొక తీరని వ్యధ 

2010 (ద్విపద)
చెర వీడి చెర చెర చెరలాడు చెలులు 
వలరాజు వలిగొను వలవంత కలలు
(ఇది వ్రాసినందుకు రాంబాబు నాకు పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు)

Tuesday, April 12, 2011

Memories of my life - 3

2nd std అయిపోయిన తరువాత 3rd std  కోసం మమ్మల్ని VT కాలేజీ main branch నించి శివాలయం branch కి transfer చేశారు. అక్కడ నాకు ప్రసాద్ అని class mate ఉండేవాడు. మాకు 3rd std లో English Fay teacher చెప్పేవారు. ఆవిడ class లో  నేను ఈ ప్రసాద్ last bench లోకి చేరి ఆవిడ notes చెబుతుంటే class work లో సున్నాలు చుట్టడం మొదలెట్టాం. ఒకళ్ళని ఒకళ్ళు చూసుకోవడం, నవ్వుకుంటూ చెలరేగి సున్నాలు చుట్టేయడం. ఆ frenzy ఏ స్థాయికి చేరిందంటే teacher వచ్చి పక్కన నించున్నాపట్టించుకోవడం మానేశాం. ఆవిడకి కోపం వచ్చి ఇద్దరినీ scale తో బాదింది. నేను ఏడవడం మొదలెట్టాను. వాడు ఏడ్చినట్టు ఏడ్చి నేను ఏడుస్తుంటే నన్ను చూసి నవ్వడం మొదలెట్టాడు. Fay teacher కి ఇంకా కోపం వచ్చి వాడి half pant విప్పేసింది. నేను భయపడిపోయాను. వాడు ఏడుస్తూ నవ్వుతూ, రకరకాల mixed expressions మొదలెట్టాడు.  ఆవిడకి  విసుగొచ్చి ఆవిడ క్లాసు అయిపోయే వరకు మా ఇద్దరినీ గోడ కుర్చీలు వేయించింది. 


మా ఇంట్లో క్రింద portion లో చట్టి సన్యాసిరావు doctor గారు అద్దెకి ఉండేవారు. వాళ్ళ పిల్లలు బుజ్జి, చిన్ని, రాము, శ్యాము. వాళ్లతో ఎన్నో ఆటలు ఆడేవాళ్ళం. అందులో best game పేక మేడలు కట్టడం. వాళ్ళ families లో పండగలకి పేకాట ఆడేవారు. అలాగా ఆడి వదిలేసిన ఎన్నో పేక సెట్లు వాళ్ళ ఇంట్లో ఉండేవి. వాటితో మా ఓపిక కొద్దీ మేడలు కట్టడమే. ఒక్కొక్క సారి ఉదయం మొదలెడితే సాయంత్రం వరకు అదే పని. 3rd std half yearly సెలవలకి  బుజ్జి గాడి వాళ్ళ బావ చక్రి, shillong నించి వచ్చాడు.  వాడు మాకు towering inferno అనే సినిమా కథ చెప్పాడు. ఎంత బాగా expressive గా dramatize చేసి  చెప్పాడంటే వాడు వెళ్లి పోయిన కొన్ని నెలల వరకు మేము అదే మాట్లాడుకున్నాము. 


ఈ మధ్యలో నా తమ్ముడు మురళీవి కొన్ని పిల్ల episodes ఉండేవి. వాడు ఏదో జెర్రిని చూస్తూ మా ఇంటి ఎదురుకుండా  గ్రంధివారి అరుగు మీద నించి కుళ్ళు కాలవలో పడిపోయాడు. ఆ దెబ్బకి వాడి చెయ్యి విరిగింది. దానికి మా నాన్న గారి ఒకే ఒక్క vizag  friend , చింతకాయల లక్ష్మి నారాయణ( తాతాజీ అని పిలిచే వాళ్ళు) దగ్గిరకి పరిగెత్తి వెళితే వాడి చేతికి కట్టు వేసి ఇంటికి పంపించారు. ఇంకో సారి వీధి క్రాస్ చేస్తూ ఉంటె వీడిని ఒక సైకిల్ వాడొచ్చి గుద్దేశాడు. బుర్ర మీద బొప్పి కట్టింది. తరువాత అందులో నల్లగా blood చేరి ఆ బొడిపి పొంగడం మొదలెట్టింది. డాక్టర్ బుచ్చిరాజు దగ్గిరకి తీసుకు వెళితే వీడికి cyringe పెట్టి బుర్రలోంచి ఆ కుళ్ళు blood తీశారు. 
వాడి జీవిత చరిత్ర ఘట్టాలన్నీ ఎప్పటికప్పుడు climax లాగ ఉండేవి.

నేను అంత గొప్పగా కాకపోయినా బాగానే చదివే వాడిని. మామూలుగా క్లాసు లో second rank వచ్చేది. ఒక సారి వసంతరావు వారి ఇంట్లో బొమ్మల కొలువు పెట్టినప్పుడు అక్కడ ఆడవాళ్ళు అందరు ఒక దగ్గిరకి చేరి ఎవరి పిల్లల గురించి వాళ్ళు గొప్పలు చెప్పడం మొదలెట్టారు. మా అమ్మ నా గురించి గొప్పలు చెబుతూ మా వాడికి క్లాసు లో 1st rank అని  చెప్పింది. నేను వెంటనే "అదేంటమ్మా నాకు 2nd కదా" అన్నాను. పాపం మా అమ్మకి ఎలా cover చేసుకోవాలో తెలియలేదు.  వీడికి ఏమి మాట్లాడాలో తెలియదు అనేసి నవ్వేసి ఊరుకుంది. 

3rd class సెలవలకి అనుకుంటాను మా అమ్మ బిళ్ళకుర్రు ముందే వెళ్ళిపోయింది. నన్ను మా చంటి మావ ఆ సెలవలకి తాతగారింటికి తీసుకు వెళ్ళాడు. మా చంటి మావ అప్పట్లో AU లో MSc చేసేవాడు. సామర్లకోట వరకు train లో ప్రయాణం చేశాము. అక్కడినించి bus లో రాకూర్తివారిపాలెం (రావులపాలెం ముందు stop ) వరకు. రాకూర్తివారిపాలెం లో బల్లకట్టు ఎక్కి పాయని క్రాస్ చేసి అక్కడ నించి నడకతో బిళ్ళకుర్రు. ఈ train ప్రయాణంలో మా ఎదురు సీట్లో ఒకాయన కూర్చున్నాడు. కాసేపు పోయిన తరువాత నాతొ సరదాగా discussion start చేశాడు. నీ పేరేంటని అడిగాడు.  M . కామేశ్వర రావు అని చెప్పాను. కానీ నేను ఈశ్వరరావు M .Com అని పిలుస్తాను అని ఆట పట్టించటం మొదలుపెట్టాడు. నేను బుర్ర అడ్డంగా ఊపాను. కానీ అతను ఎందుకు అలా పిలవకూడదు అన్నాడు. నేను కాసేపు బుర్ర అడ్డంగా ఊపుతూ "మీరన్నది ఏమీ సబబుగా లేదు " అన్నాను. అతను కొంతసేపు తేరుకోలేదు. నేను అంత పెద్ద మాట వాడతానని అతను అనుకోలేదు. నేనన్నది అర్ధం అయిన తరువాత అతను పెద్దగా చాల సేపు నవ్వి దిగిపోయేటప్పుడు టాటా చెప్పాడు. మా చంటి మావ మా తాతగారి ఊళ్ళో నా ప్రతాపం కథలు కథలుగా చెప్పాడు.

ఇలాటి సెలవల్లో ఆ బిళ్ళకుర్రులో పెద్ద పిల్లల ముఠా ఒకటి తయారయ్యేది. మా పెద్ద తాతగారికి ఏడుగురు పిల్లలు ఇరవై మంది మనవలు. చిన్న తాతగారికి ఇంచుమించు అంటే పటాలం. ఇది కాక ఆ ఊళ్ళో ఒక పదిహేను ఇళ్ళు మా చుట్టాలు లేకపోతె బాగా closely knitted families ఆ ఊరి పెద్దలు.మా నాన్నగారి  families కూడా దగ్గిర బంధువులే అవ్వడంతో Jamshedpur నించి ఇంకొన్ని families with పిల్లలు దిగేవారు. ఆటలాడేటప్పుడు అందరూ పోగైపోయే వారు. ఒక నలభై, ఏభై మంది పిల్లలం ఉండేవాళ్ళం ఆ పండగలకి. సత్రం భోజనం మఠం నిద్రలా ఉండేది. సాయంకాలం వరకు ఏవో ఆటలు, సాయంతం పెరట్లో ఒక ఏభై మడత మంచాలు వేసేవారు. ఎవరి convenience కి వారు adjust అయిపోయి వాటి మీద పడుకోవడం. ఆ సెలవల్లోనే మా తాతగారి ఇంట్లో మా ప్రసాద్ మావ "మాయల ఫకీర్" వేషం వేశాడు. మొత్తం ఒళ్ళంతా బొగ్గు రాసేసుకుని ఒక పంచె కట్టుకుని చేతిలో ఒక ఇనప రోడ్ పట్టుకున్నాడు. ఈ పిల్లల పటాలాన్ని radio గదిలో కూర్చో బెట్టి lights ఆర్పేశారు. చిన్నరాంబాబు బావ ఆ lights ఆర్పుతూ వెయ్యడం. " మాయల ఫకీరుకి  తిరుగులేదు కదూ" అని మా ప్రసాద్ మావ గట్టిగా నవ్వుతూ మా మీద పడిపోయినంత పని చేసే సరికి, నేను గట్టిగా అరిచి " నేను వెళ్ళిపోతాను" అని అరవడం మొదలెట్టాను. వెంటనే వాళ్ళు అసలు ఇంత భయమైతే ఎందుకు వచ్చావు అని అని బయటికి పంపించేశారు. 




Wednesday, April 6, 2011

New poetry - 3


mail ద్వారా పంపించిన ఈ wishes అందరూ నచ్చాయి అని చెప్పడంతో blog లో పెడితే బాగుంటుంది అనుకుని  ---


అందరికీ శ్రీ ఖర నామ సంవత్సర శుభాకాంక్షలు 

అవలోకించి చరిత్ర నిజాలు, విశ్లేషించి పరి పరి విధాలు
ప్రశ్నించాలి సహేతుకంగా, ప్రసంగించాలి సాధికారంగా
వీడని మనోధైర్యంతో, వాడని క్రొత్త తలపులతో 
మలుపులలో మలగని క్రొత్త ఆశలతో, ఊహలలో
క్రాంతి నింపే ఆలోచనల స్రవంతిలో ప్రవహిస్తూ
శ్రీ ఖర నామ సంవత్సరం అందరికీ తరగని ఆనందం మిగల్చాలని నా కామన 

అనంత కాలం నుండి ఎన్నో ఉగాదులు కాలం తో పాటు మారుతూ
చెక్కు చెదరని మానవుడి ఆకాంక్ష వెలుగుల తీరం చేరుతూ

Monday, April 4, 2011

Science and Philosophy - 11

Before writing about further science let me sneak a look into the philosophy and how it progressed using logic and rational arguments and further how it got completely taken over by maths and modern science and still where the philosophers are having space for them after so much science advancement.  Philosophy term originated from Greek word "philosophia" meaning love of wisdom, and what I feel in its true sense is " knowledge of any kind and endless" and Philosophy is just a word to communicate this.


Science has to still explore space and travel of energy in multiple dimensions other than identified now. If this is clarified and established then it will through light on so many unanswered questions regarding rebirth,faith healing in realistic terms,ESP (extrasensory perception) and premonition etc.,. 


Before starting the history of Philosophy world wide, let me express my views of how this unexplored space and multiple dimensions help to fit in logic of rebirth etc.,. The wording which I am using to explain my view is limited and cannot express the thing in its true sense, but it needs to be understood not limited to the words which I am using.


Basic particles evolved mix up in various combinations to give ultimate varieties of beings in which a particular energy source "life" if added results in living beings. If we observe life,  it is in cycles from evolution to destruction and evolution again. All the other materials of the body are held by life together like the thread in pearl chain. As the cycle comes to the end and other materials of the body get destructed and unable to contain the energy source it just travels in its own dimensions and space and it may get dissipated or split into smaller fragments, or adds up with more energy and gets attracted towards the possible "material combination" which can contain it. I feel the path it traverses is not specifically guided and it is random. If the energy is fragmented or not disturbed and if it is travelling in smaller loops/cycles it gets attracted there and if it is attracting/sucking more energy which smaller loops cannot contain then it skips the orbit and moves out where it can get stable. The particles which carry the flavor, mass, charge and spin will last for some time in the new combination till they lose/modify their characteristics to adapt to the new environment. This is how logic helps to define the rebirth or rather soul/atman in modern scientific terms. Only thing is life/soul/atman in its basics to be defined by using subjects like maths, physics, chemistry and biology.
If the energy levels in current life are improved to such an extent by any given external process they can sense the happenings of future not exactly but in their outline, which supports premonition, ESP, healing etc.,. We will again discuss in detail in later posts regarding these.


Before discussing something on Indian Philosophy let us check how this Philosophy progressed In various part of the world. There were different philosophers like Socrates,  Plato, Aristotle, Confucius, Abubacer,Spinoza, Berkley, Kant, Galileo, Newton, Rousseau, Montesquieu,Nietzsche, Freud, Marx, Darwin, Copernicus to name a few whose names came to my mind immediately and there are many more.


It is Socrates of Greek philosophy who laid foundations of Western philosophy. Socrates way in which any problem will be addressed is by dividing it into a series of questions and the answers to which will lead to the solution. It was not known whether in his life time he was able to find answers for his fierce questions, but it was through Plato's literary works the world came to some understanding about works of Socrates. Socrates believed the best way for the people to live is self development than pursuing material benefits of life. Socrates is best known for his paradoxical statements and the heralding one is "I only know that I know nothing" and other famous dialogue of him not paradoxical is " A person who only sees with his eyes is blind"

Friday, April 1, 2011

Memories of my life - 2

నేను V.T. College లో Matriculation వరకు చదివాను. నన్ను మూడేళ్లకే school కి పంపించింది మా అమ్మ.  అప్పట్లో LKG , UKG అని ఉండేవి కావు. మొదటిసారి 1st std కంటే ముందు baby class అని introduce చేశారు. అందులో join చేసింది. Mary Cooper మా class teacher . ఆవిడ photo film roll (అప్పట్లో agfa film roll అది, బెత్తెడు వెడల్పు లో ఒక పక్క red గా రెండో పక్క black గా ఉండేది) ని పొడుగ్గా సాగదీసి నిన్ను పొడిచేస్తాను అని నన్ను భయ పెట్టింది. నేను భోరు మని ఒకటే ఏడుపు. ఇంటికి వచ్చి school కి వెళ్లనని గోల. మర్నాడు మా అమ్మ school కి వచ్చి ఆ టీచర్ ని దెబ్బలాడి నన్ను కూర్చోపెట్టింది. ఆ తరువాత Mary teacher నాకు chocolates ఇచ్చేది. కొంచం ఊహ వచ్చిన తరువాత నాకు అనిపించింది ఆవిడ సరదాకి అలా చేసిందని.


1std లో మాకు ఆదిలక్ష్మి teacher తెలుగు చెప్పేది, సరోజినీ teacher లెఖ్ఖలు చెప్పేది. ఆదిలక్ష్మి గారు పిక్క పాయసాలు పెడితే, సరోజినీ గారు duster తో కొట్టేది.   ఒక రోజు ఎందుకో సరోజినీ teacher కి నా మీద కోపం వచ్చి duster తో బుర్ర మీద కొట్టింది. బుర్ర కన్నం పడి రక్తం కారడం మొదలైంది. ఆ సాయంత్రం అమ్మ అడిగింది ఏమైంది అని. సరోజినీ teacher కొట్టింది అని చెప్పాను. మళ్ళీ మర్నాడు అమ్మ school కి హాజరు. సరోజినీ teacher ని  నిలదీసింది. ఆవిడ నా వైపు గుడ్లు ఉరిమి చూసి " ఏరా నేను నిన్ను కొట్టానా" అని అడిగింది. మీరే అంటే మళ్ళీ కొడుతుందేమో అని భయం వేసింది. అమ్మకి "ఈవిడ కాదు ఆదిలక్ష్మి teacher" అని చెప్పాను. వెంటనే అమ్మ ఆదిలక్ష్మి teacher  దగ్గిరకి తీసుకెళ్ళింది. ఆవిడ కూడా గట్టిగా అడిగే సరికి మళ్ళీ భయపడి "ఈవిడ కూడా కాదు" అని చెప్పాను. మా అమ్మ నా మీద విసుక్కుని ఇంటికి వెళ్ళిపోయింది. నేను ఎందుకు అలా చేసాను అని చాలా సార్లు అనుకున్నాను. 

నాకు 2nd క్లాసు లో రవికుమార్ అని ఒక friend ఉండేవాడు. వాడి ఇద్దరు అక్కలు మా class లోనే చదివేవారు. వాళ్ళ పేర్లు బేబీ రాణి, వాణీ కుమారి. వీడు వాళ్ళ చెడ్డీలు వెనకనించి లాగి చూపిస్తూ ఉండేవాడు. చిన్న పిల్లడినని మా అమ్మ వీళ్ళతో tie up , నన్ను ఇంటి దగ్గిర దింపడానికి. నన్ను వాళ్ళందరూ "పొట్టీ" అని పిలిచేవారు. ఒక రోజు నేను కూడా ఉత్సాహం ఎక్కవ అయిపోయి వెనక నించి బేబీ రాణి చెడ్డీ లాగేను. వెంటనే బేబీ రాణి నన్ను "పొట్టీ మీ అమ్మకి చెప్తాను ఉండు" అని భయ పెట్టింది. ఇంటి వరకు ఒకటే tension బేబీ రాణి చెప్పెస్తుందేమోనని. కానీ ఎందుకో ఆ అమ్మాయి చెప్పలేదు. బతుకు జీవుడా అనే feeling అప్పుడు తెలిసింది.

సెలవలకి అమ్మ బిళ్ళకుర్రు మా తాతగారి ఇంటికి తీసుకు వెళ్ళేది. మా తాతగారు అక్కడ మూడు ఊళ్ళకి కరణం. 2nd class సెలవలలో అక్కడికి వెళ్ళినప్పుడు మా తాతగారి ఊళ్ళో సానిమేళం పెట్టారు. ఊళ్ళో మగాళ్ళందరూ ఆ మేళం చూడొచ్చు. ఆడవాళ్ళు, పిల్లలు చూడకూడదు. మా బావ పెద్ద నర్సింగుని అడిగాను "నేను చూడచ్చా?" అని. వాడు చిన్న పిల్లలు చూడకూడదు అన్నాడు. వాడు అప్పట్లో half pants వేసుకునేవాడు. నేను అడిగాను "నువ్వు పెద్దవాడివా?" అని. వాడేదో గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. సరే ఎలాగైనా అదేంటో తెల్సుకోవాలనుకున్నాను. మా చిన్న తాతగారి ఇంటి డాబా పైనించి ఆ program కనపడుతుంది. వీళ్ళందరూ ఇంట్లోంచి బయటికి వెళ్ళిన తరువాత ఎవరికీ కనపడకుండా మేడెక్కి చూడ్డం మొదలెట్టాను. ఆ మేళంలో ఆడవాళ్ళు తాగేసి సినిమా పాటలు పాడుతూ డాన్సులు.ఒక అమ్మాయి ఒక కర్ర ముక్కని ముందు పెట్టుకుని, ఒక సినిమా పాట parody, "లేగిసేస్తుంది లేగిసేస్తుంది మావయో" అని డాన్సు చేసింది.ఈ లోగా మా సుందర దొడ్డమ్మ వాళ్ళు వచ్చి "ఎవర్రా అది" అని అరవడంతో silent గా కిందకి దిగి వచ్చేశాను. మర్నాడు మా చంటి మావా వాళ్ళు  తాతగారి గది పక్కనే ఉండే నడవలో ఆ మేళం గురించి మాట్లాడుకుంటుంటే ఊరుకోలేక "నేను చూశాను" అని చెప్పాను. "ఏం చూశావురా" అని అడిగారు వాళ్ళు. నేను వెంటనే ఒక చీపురు పుల్ల ముందు పెట్టుకుని నేను చూసిన sequence పాట పాడుతూ repeat చేసాను.వాళ్ళందరూ నవ్వులు. "మళ్ళీ చెయ్యి, మళ్ళీ చెయ్యి " అన్నారు. నేను మళ్ళీ మొదలెట్టాను. ఈ లోగా మా అమ్మ radio గదిలోంచి ఆ నడవలోకి వచ్చి నా విన్యాసాలు చూసింది. నన్ను రెండు తిట్టి, నా రెక్క పట్టుకు లాక్కు పోతూ, మా చంటి మావకి రెండు అక్షింతలు వేసింది.

సశేషం