Tuesday, October 12, 2010

ఆలోచనల స్రవంతి - 8

మీడియా 
అసలు  మీడియా  అంటే  ఏమిటి ???
నాకు తెలిసింది చెప్పే ముందు - Wikipedia లో ఏమి ఇచ్చాడు చూద్దామని అనిపించింది. ఎందుకంటే అందులో అన్నీ update అవుతాయి. ఏ detail కావాలంటే అది దొరుకుతుంది అని కొద్దో గొప్పో net surfing తెలిసిన నా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. Encyclopedia Britannica అని ఉండేది.   అందులో అన్నీ రకాల events ,details update చేస్తూ ప్రతీ సంవత్సరం  publish చేసేవారు.     నా చిన్నప్పుడు Manorama year book అని కూడా ఉండేది. ఇప్పుడు ఉండే ఉంటుంది . ఇది అలాటి నెట్ లో పెట్టిన encyclopedia అన్నమాట. Detail తెలిసిన ప్రతీవాడు update చేస్తూ ఉంటాడు.ఎవరో ఆ site open చేసిన వాళ్ళు  regulate చేస్తూ ఉంటారు. ఆ Wikipedia లో చూస్తే  advertising media , braodcast media , digital media , electronic media , hyper media , mass media , multi media ,news  media , print media , published media ,  recording media , social media etc .,etc .,అన్ని  ఉన్నాయ్.
నేను ఏది రాద్దామనుకున్నానో మరిచిపోయి ఇవన్నీ చదువుతూ కూర్చున్నాను. కొంత సేపటికి తేరుకుని ఇదేమిటి ఆలోచనల స్రవంతి అని మీడియా మీద text book లాటిది prepare చేసైడానికి ప్రయత్నిస్తున్నాను అని అనిపించింది. సరే ఇప్పుడు దేని గురించి చెప్దామనుకుంటున్నాను  అని చూశాను. Simple గా మనం చూసే TV , News paper , cinema అంటే మాస్ మీడియా లో news media ,broadcast media , print media , published media గురించి అన్న మాట.ఇప్పటి దాకా చెప్పింది చాలా గాభరాగా ఉంది కదూ - 
నాకూ చాలా గాభరాగా  అనిపించింది ఒక దాసరి నారాయణ రావు dailogue లాగ. అంటే stuff ఉండదు కానీ చేంతాడంత dailogue ఒకే మాటని తిప్పి తిప్పి వాడేస్తూ చెప్పేయడమే. 
Simple గా మనమనుకున్నది అవతలి వాళ్లకి తెలియచెయ్యడానికి ఉపయోగించే సాధనం ఈ medium . అది ఏదైనా  ఈ పైన చెప్పిన వాటిలో ఏదో category లో ఉంటుంది. నా చిన్నప్పుడు మా అమ్మ ఎవరికైనా నా గురించి చెబుతూ, మా అబ్బాయి ఇంగ్లీష్ మీడియం అంటూ ఉండేది.
సరే  ఇక విషయానికి వస్తే ప్రపంచం మొత్తం గురించి తరువాత ముందు అన్నపూర్ణ ఆంధ్ర గురించి చెప్పుకుందాం.
కారా మాస్టర్ గారు ఆయన కథ"కుట్ర" లో  "ప్రెస్ అంటే పాలక పక్షం కొమ్ము కాసే తెర  వెనక పాలకుల చేతి  ఆయుధం".  - -press briefing అన్న మిష తో ఈ పాలకులు ప్రెస్ వాళ్ళని ఏదో రకం గా సంతృప్తి పరిచేవారు అని వ్రాసారు. అది ఎప్పుడో news  paper అన్నది ఒక seperate entity లా ఉన్నప్పటి మాట.ప్రెస్ అంటే fourth estate అన్న సంగతి.  ఇప్పుడు ఆ definition కూడా మారిపోయింది.
మన political parties ప్రతీది ఒక సొంత TV channel , ఒక news  paper , సినిమా తియ్యడానికి ఒక gang రెడీ  గా పెట్టుకున్నాయి.ఇంకొన్ని స్వతంత్రంగా టీవీ చానల్స్ కూడా ఉన్నాయి - అవన్నీ టైం ని బట్టి ruling party లో దూరి పోతూ ఉంటాయి. 
అసలు న్యూస్ పేపర్ గురించి ముందు చెప్పుకుందాం. 
నేను 9th క్లాసు చదివే రోజుల్లో NTR పార్టీ పెట్టారు. అప్పుడు ఒక దినపత్రిక వారు - ప్రచారంలో  NTR , స్నానం చేస్తున్న NTR , తుడుచుకుంటున్న NTR అని publicity - సరి NTR bumper majority తో గెలిచారనుకోండి -నేనూ ఆ రోజుల్లో NTR వీరాభిమానిని. తరువాత చాలా కలం ఆ రకమైన న్యూస్ లే కంటిన్యూ అయ్యాయి. తరువాత కొన్ని సంవత్సరాల  మృత్యుంజయుడు చంద్రబాబు అని న్యూస్. అయిన ఆ సారి elections లో చంద్రబాబు గారు గెలవ లేక పోయారు.
 అంతవరుకు మూడు రంగుల జండా పార్టీ వారు ఖజానా లో ఉన్నదే ఖర్చు  పెట్టే వారు. తరువాత పసుపు రంగు వారు అధికారంలో వరల్డ్ బ్యాంకు, ADB నించి అప్పులు తెచ్చి ఖర్చు  పెట్టడం మొదలెట్టారు. అంటే అప్పు చేసి పప్పుకూడు అన్నమాట. మన అప్పటి CM గారు AP కి ఒక CEO లాగ బిల్ క్లింటన్ తో సదస్సు, బిల్ గేట్స్ తో సమీక్ష ఇలా వెళ్ళింది.  ఇప్పుడు మళ్ళీ మూడు రంగుల వారు కొన్ని లక్షల కోట్లతో budget .  అసలు మన budget కి సున్నాలతో సంబంధం లేదు. జనరల్ గా ముందు ఒకటి పెట్టి తరువాత ఎవరు ఫైనాన్సు మినిస్టర్ ఎవరు అయితే వారు ఓపికని బట్టి సున్నాలు చుట్టుకుంటూ పోవడమే. 
అప్పుడు సెంటర్ లో ఉన్న శ్రీ రాముడి పార్టీ వారైతే " భారత దేశం వెలిగి పోతున్నదన్నారు. అఫ్ కోర్సు మూడు రంగుల వారు "మండి పోతోంది , కాలిపొతోంది" అని అన్నారనుకోండి.  మరి వీళ్ళు వెలిగిపోతే వాళ్ళకి కాలదండీ. అదన్నమాట.
అప్పట్లో సెంటర్ లో ఉన్న ఆ పార్టీ వాళ్ల agenda భారత దేశం నలు మూలాలకి హై వేస్ వేసేసి connect చేసేయ్యడమే - తరువాత toll పెట్టి వసూలు చేస్తే ఈ అప్పులు అనుకున్న time కి తీర్చేయచ్చు. concept బాగానే ఉంది. నేను Sr .manager గా పని చేసే కంపెనీ లో ఓ GM నేను వాదించుకున్నాము. అది successful plan అని ఆయన. As usual   నేనో cynic బాబా ని కాబట్టి మనవాళ్ళు పడనివ్వరని నేను. ఇప్పుడు ADB వారు, వరల్డ్ బ్యాంకు వారు ఆంధ్ర కి అప్పులు ఇవ్వాలంటే ఇప్పటి దాకా ఇచ్చినవి తీర లేదు, పైపెచ్చు ఇక్కడ జీవన ప్రమాణాలు సరిగా లేవు అని regect చేస్తున్నారు. అంటే తాగు నీరు, sanitation వగైరా వగైరా  సరిగా లేవు. ఇవనే కాదు అసలు అన్ని projects పరిస్థితి అదే. ఇవన్నీ న్యూస్ పేపర్స్ లో గాని, టీవీ లలో గాని నిజం విశ్లేషించే విధంగా రావు. political situation బట్టి ఈ highlighting  ఉంటుంది. 
నేను వీటి మీద వ్రాయడం మొదలెడితే నేనో యెర్ర comrade పేపర్ run చెయ్యాలి. Comrade అంటే గుర్తు వచ్చింది, ఆంధ్రలో Communist పార్టీస్ ఇంతకు ముందు Russia వైపు చూపించే వారు -ఇప్పుడు ఆ ఫోర్సు లేదు  - ఒక సరైన agenda లేదు  -  పొత్తులు - విబేధాలు  -వాళ్ళు convenience బట్టి direction తీసుకుంటున్నారు - లాజిక్ ఎవడైనా చెప్పొచ్చు - -కళ్ళ ముందు కనిపించే నిజం ఎవడూ మార్చలేదు కదా -  Ruling లో ఉన్న పసుపు, మూడు రంగులు వీళ్ళందరూ  కలిసి, combing అని naxalites ని ఏరి పారేశారు. ఇప్పుడు ఇంక వాళ్లకి పరిస్థితి బాగులేదు - ఇప్పడు వేరే తెలంగాణా అని మొదలెట్టారు  - ఇంతకు ముందు ఉన్నంత గ్రిప్ లేదు - ఏదో నడుస్తుంది - ఏదో సినిమాలో ఒక విప్లవ  సాహిత్యం పాట తాలూకు line కాపీ కొడితే  - ఆ పాట నాది అని ఆ prodcuer ఇంటి ముందు ధర్నా - ఇది పరిస్థితి  - వారేదో నచ్చ చెబితే నవ్వుకుంటూ ఇంటికి పోవడం. 
సరే ఆంధ్రలోని మూడు రంగుల వారు ఒక  పేపర్, టీవీ చానల్ పెట్టారు. పసుపు వారు స్టూడియో X అని additional గా పెట్టారు . ఇంక నాకు ఈ classification చేసే ఓపిక పోయింది. ఎవరి ఓపికని బట్టి వాళ్ళు టీవీ చానల్స్ చూస్తే, న్యూస్ పేపర్స్ చదివితే, వాళ్ళకే తెలిసిపోతుంది - అది ఏ పార్టీ కి చెందినవో అని - ఇప్పుడు కొత్తగా పింక్ పార్టీ వారు, గ్రీన్ పార్టీ వారు   - ఎవరిదీ ఏ కులతత్వ పార్టీ నో మళ్ళీ వేరేగా చెప్పక్కరలేదు. general observation లో కనిపెట్టేయోచ్చు.  ఇంతకు ముందు చానల్స్ కి , పేపర్ కి కొంత decency ఉండేది - -ఇప్పుడు అది లేదు - 
టీవీ  వాళ్ళు  ప్రసారం చేసే చేసే చెత్త ప్రోగ్రామ్స్ - టీవీ న్యూస్ వాళ్ళు ఎక్కడో కుక్కకి కాలు విరిగితే ఉదయం నించి సాయంత్రం దాకా కుక్క మీద రన్ చేసే scrolls (కొంచం ఘాటుగా ఉంటుందని ఇలా వాడాను - ఎందుకంటే అసలు విషయాలు జనానికి నిజం చెప్పి చైతన్య పరచవలిసిన అంశాలు ఎన్నో ఉండగా - వాళ్ళు అలాటివి చెప్తారని) - ప్రజలకి విసుగు వస్తుంది. 
నిన్నో, మొన్నో ప్రతిపక్ష నేత గిరిజన యువతితో అసభ్యం గా ప్రవర్తించాడని ఒక ఛానల్ తిడితే - ఆ గిరిజన యువతితో interview - ఈ అసభ్య news ప్రచారం చేస్తున్న ఎడిటర్ జీవితం మీద parody - మిగత చానల్స్ యథా శక్తి సమర్పయామి - 
దీని బదులు-  ఒకొక్కడు mike పట్టుకుని రోడ్ల మీద దొర్లుతూ కొట్టుకుంటూ , బండ బూతులు for ex : నువ్వు లం...., నువ్వు లుచ్చా, నువ్వు లఫంగా, నువ్వు మదర్ చొ....నువ్వు బహన్ కే dash  అని తిట్టుకుంటూ ఉంటే కొంత వినోదం అయినా దక్కుతుందేమో. ఇది మన ఆంద్ర పరిస్తితి. మిగత రాష్ట్రాలు మనకంటే తక్కువేమీ కాదు - ఫాలో అయితే కోకొల్లలు. 
నిన్న కర్ణాటక అసెంబ్లీలో ఎడ్ద్యురప్ప విజయం అని చూపిస్తూ - కర్ణాటక అసెంబ్లీ లో మైకులు పగలగొట్టి shirts చింపుకుని  tables మీద కెక్కి ఎవడో  - -ఆ భీబత్సం ఏమిటో ??  
బీహార్ లో అసలు ఎవడు చెప్పఖ్ఖర లేదు. యాదవ్ గార్లు తయారు చేసిన నరకం. 
గుజరాత్ లో అయితే మోడి గారు - నువ్వు ముగ్గురిని చంపితే నేను నలుగురిని చంపుతా - నువ్వు బస్సైతే నేను ట్రైన్ - గోధ్ర ఎవరికైనా గుర్తుంటే ఆ తరువాత జరిగిన సంఘటనలు ఎవరైనా recollect చేసుకోగలిగితే - ఆయన style ఆయనది. 
నేషనల్ లెవెల్ లో అదో పెద్ద turf drama - Madam గారు వారి పుత్రా, పుత్రికా, వారి కోటరీ  - మన ఎకనామిస్ట్ PM గారు - మాతాజీ ప్రెసిడెంట్ గారు - ఆ management ఏమిటో - ఏ direction తీసుకుంటున్నారో - వారికే తెలియాలి - ఇప్పుడు ఏమి పెద్ద issues , స్కామ్స్ highlight అవ్వటంలేదు అంటే బాగున్నట్టా - -లేక తుఫాను ముందు ప్రశాంతతా??
ఆయన హయాం లో రెండు సార్లు మన మార్కెట్ మీదకి లేచి కింద పడిపోయింది - పడిపోయిన ప్రతీ సారి ఆ డబ్బంతా ఎటు పోతోంది -  మన ఎకనామిస్ట్ PM గారు ఏమైనా చెప్పగలరా - నాకు తెలిసిన నిజాలు ఇంకోసారి ఎపుడైనా  - ఇప్పుడు మీడియా గురించి నా మనోగతం కదా అందుకు.
మీడియా లో ఇవన్నీ వచ్చాయి అనుకుంటే (నేను చూడకపోయుంటే - నేను సర్వాంతర్యామిని కాదు కదా అందుకు) - రాజకీయ పార్టీలకి తప్పితే ఎవడికీ స్పందన లేదంటే  - ప్రజలు ఈ రకమైన నాటు చెత్తకి అలవాటు పడిపోయారనమాట. 
International లెవెల్ లో ఇప్పుడు మనము, చైనా తప్పితే మిగతా economies అన్నీ American economy తో పాటు లేస్తాయి పడుకుంటాయి  - ఇది నా observation   - పెద్ద పెద్ద economists లోతు పాతులు తెలిసిన పెద్దలు ఏమంటారో?
ఇంతకూ ముందు కొంత జపాన్, జర్మనీ, Europe , Britain కొంత డిఫెన్సు ఇచ్చాయి  - పాకిస్తాన్ సంక నాకిపోయిన తరువాత ఇప్పుడు Indian economy performance చూడాలి.      చైనా సంగతి తరువాత 
Latest గా మొన్నటి వరకు జరిగిన Global melt down కథ అందరికీ తెలిసిందే - Capitalism తాలూకు miracle  touch . ఒబామా గారు markets లోకి డబ్బు పంప్ చేసి ఊపిరి పోస్తున్నారు.ఎంతవరుకు revive అయ్యాయో ఎవడికి తెలుసు. పాపం మొన్న ఏదో channel లో చూపించారు - నాకు ఎవరూ గౌరవం ఇవ్వలేదని ఆయన వాపోయారు - అంటే ప్రపంచాన్ని almost శాసిస్తున్న అమెరికా ప్రెసిడెంట్ ఎవరి గౌరవం కోసమో పరితపిస్తున్నాడంటే  - పవర్ ఎక్కడ ఉన్నట్టు - ఏ ఫామిలీల చేతిలో నలుగుతున్నట్టు - 
Forbes lists చూస్తే మనకి అర్ధం అవుతుందనుకుంటాను.
న్యూస్ చానల్స్ లో పత్రికలలో ఇవన్నీ presentations వేరే రకంగా ఉంటాయి .
ఇంత analysis నాకు తెలియదు అనుకుంటే - నా చిన్నప్పటినించి నాకు తెలిసిన ప్రపంచం గురించి చెప్తాను. 
నా చిన్నప్పుడు Rs .2000 /- వస్తే చాలు అనుకునేవారు. ఇప్పుడు Rs .20 ,000 /- వచ్చినా ఆ రెండువేలతో వచ్చిన comforts రావటం  లేదు. అంటే మనం ఎటు ప్రయాణం చేస్తున్నట్టు. 
National ,International levels లో  న్యూస్ చానల్స్ - ఇంకో కొత్త పద్ధతి మొదలెట్టాయి - అన్ని పార్టీల వాళ్ల representatives ని పోగేసి TV స్టేషన్ లో కూర్చో బెట్టి - ఒక వెధవ టాపిక్ మీద ఒక non sense కార్యక్రమం  - ఇదో regular feature - ఆ reprsentatives తిట్టు కుంటూ వాళ్ల హావ భావ ప్రకటనలు -  instant celebrities లాగ చిరు నవ్వులు - news channels వాళ్ళు ఏదో సాధించినట్టు ముసి ముసి నవ్వులు - డోకు 
వీటన్నిటి  కంటే సినిమా కి పోవడం బెటర్ అనిపించింది కదా. ఈ మధ్య ఒక రెండు మూడు సినిమాలు కొంచం కాన్సెప్ట్ తోనే తీసారు - యువ దర్శకులు వాళ్ల వేడి వాళ్ళు  చూపించారు  - ఈ సినిమా గురించి detailed గా మరెప్పుడైనా చెబుతాను. 
ఈ మధ్య రెండు మూడు సినిమాల్లో ఒక క్యారెక్టర్ మీడియా  దగ్గిరకి వెళ్తాను అని బెదరించడం - -కొంతమంది హీరోలైతే hidden cameras పెట్టేసి విలన్ని మీడియా లో expose చెయ్యడం -  
మీడియా అంటే ఒక CBI +Police +detective +parallel governance వాళ్ళు ఏది చూపిస్తే  governament కూడా భయపడి   పనిచేయాలన్నట్టు చూపించారు. మరి ఇలాటి మీడియా తమ చేతుల్లో ఉన్న పెద్ద మనుషులు సమాజం పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరించాలి. ఆలోచించి అనుగుణంగా ప్రవర్తిస్తే ఆనందం అందరికీ. 


సశేషం 













1 comment:

  1. According to me these are entertainment channels.
    I'd like to know your thoughts about reality shows in Telugu channels.

    ReplyDelete