Monday, October 4, 2010

naa paata kavitvam - 23

1990
అనుభవాల సారంతో 
తెగ అలసిన నా హృదయపు
నిర్లిప్తపు పొరల కింద 
ఏదో మెదిలింది చటాలున 
ఏదో మెరిసింది
వెతికి వెతికి వెలికి తీసి 
శోధించగ సాధించగ
ఏమీ లేదు పోమ్మందది
మూసి నీవు చూడలేవు
తెరిచి చూస్తె కనపడదది
ఇదే సత్యం
ఇదే నిత్యం
ఇదే జీవన్ముక్తికి సూత్రం
1989
ప్రతి వర్ణం ప్రతి శబ్దం
శబ్దార్ద్రపు వైచిత్ర్యం
వర్ణార్ణవ    వైశిష్ట్యం
ప్రతి కదలిక ప్రతి భావం
భావాంతర రూపాంతర
అంతరాళ గతి మూలం
ప్రతి జీవన గమనంలో
చూపించును ప్రభావం 
1989
చావలేక బ్రతుకుతున్నా  
బ్రతకడానికి 
కారణాలు వెతుకుతున్నా
చచ్చినా ఏమీ లేదని 
బ్రతికినా నే 
ఏమీ జరగదని తెలిసే
బ్రతుకుతున్నా
బ్రతకడానికి సరికొత్త 
కారణాలు వెతుకుతున్నా

ఇప్పటికీ ఆశ్చర్యమే 
సొంత భావాలు లేకుండా
ఏ ఆలోచనలూ లేక
ఎలా పెరిగెను నేనని, అది
ఇప్పటికీ అనుమానమే
ఇప్పుడు మాత్రం ఎందుకు
అని సరి పెట్టుకుని నేను
ఆలోచించకుండానే బ్రతికేస్తా

సమ హయ ప్రచార పూర్ణ రగడ 
రహస్యమది దొరకనిదని
విషాదమా విలాపమా 
కాలపు పరిహాసమా 
లేనిదాని కోసమా
మనుగడ ఇక సాధ్యమా 
గణపద సమద్విరదగతి 
లలితా పద 
యుగళమది 
కందళిత 
జలజమది
చిరునగవు 
చూచి మది 
పులకించే
నెందుకో
తెలిసినది
విఫలమని 
భావుకత 
బతకదని
చేదు విధి 
వాస్తవం 
అసమ ద్విరద గతి 
ఏ రీతి 
ఏ గీతి ఈ వీణ 
పలికించగలవేమో, శోధించు నా మనసు 
అలసినా 
సోలిసినా ఎదురీత 
ఆగదని సాగునని బోధించే నా మనసు 
ఈ సుధా 
పూరమున, సారమే 
లేకున్నా, సారమెందుండునని తలిచేవు
నడికడలి
నిలువీత , అరగజం
మునుచనక అర ఘడియ తీరికని కనలేవు
తీరమే తీరునని పొగిలేవు
1988
(పది రూపాయల కోసం పావుగంట దెబ్బలాడి ఏడ్చి ఒక కవిత మూలిగాను )
నీది అన్నది  లేదు 
నీకున్నది నీడ తప్ప 
దారి అన్నది లేదు 
పోడానికి చావు తప్ప
అహం ఎందుకు కామా 
అవసరం  తీర్చని నాటకం లో 
తల్లీ తండ్రులు పాత్రధారులు
డబ్బు ఒకటే సూత్రధారి
లౌక్యమే గతి ఇహం పరమున
స్వచ్చత కానరాదే జగమున
ఎలా కోపం ఎలా శాంతం
ఎందుకీ శుష్క రసావిష్కరణం 

No comments:

Post a Comment