Monday, October 4, 2010

naa paata kavitvam - 2

1991
కళ్ళు మూసి కల కంటే 
వాస్తవం కనిపించింది
వాస్తవం లో వెతికితే 
శాశ్వతత్వం పరిహసించింది 
31 .05 .2001
నా కలలు నీ కన్నులలో తారకలై మెరిసి 
నీ వలపు నా భావనలో విరిజల్లై కురిసి 
సొగసే సిగ్గిల్లె నీ వదనం హరివిల్లై విరిసి
మౌనానికి భాష్యం చెప్పావా ఓ నా ప్రియ సఖీ
2001
ఉపమానం దొరకని ఊహలలో నీ రూపం
సందేహం తీరని దారులలో నా లోకం
1997
కలవని సమాంతర రేఖలని 
ఏకాగ్రతతో కలుపుతున్నాను
తెరుచుకోని తలుపుల్ని తెరవను 
ఖాళీ లోంచి జారిపోతున్నాను 
మెత్తటి సిల్క్ పరదాలలో 
సుఖంగా రాసుకుంటూ తోసుకుంటూ
నిరంతరంగా అంతరంగాల 
అగాథం లోకి సున్నితంగా
ప్రవహిస్తూ కన్నీటి చుక్కల్లా
నునుపైన పాలరాయి 
గుండెమీద పాముకుంటూ 
తేలిపోతూ గాలిలో
ఊపిరాడక మునిగిపోతూ 
స్పర్శ లేని శూన్యం లో 
ఎలాగోలా ఎలాగోలా ఎలాగోలా ఎలా ఎలా ఎలా

No comments:

Post a Comment