Tuesday, October 5, 2010

old thought process - -12

27-06-09
హలో బ్రదర్స్

ఉద్యోగపు రాపిడికి మధ్యలో ఆగిన ఊహల స్రవంతిని ఆగనియ్య కూడదని అనిపించి మళ్ళీ వ్రాస్తున్నాను 

చందమామ కథలు, ఇంద్రజాల్ కామిక్స్, మధుబాబు , యండమూరి, యెర్రంశెట్టి , చెలం , శ్రీ శ్రీ , తిలక్,etc చివరిగా వివేకానంద  - ఇంక ఏమి చదవాలనిపించడం లేదు 
జీవితం తన సుడిలోకి ఎలా లాగేస్తుందో చూస్తూ, అనుభవిస్తూ కొట్టుకు పోవడం తప్పిస్తే  - ప్రయత్న బలంతో బయటకి రావడం ఎలాగో తెలియడం లేదు

ఆలోచన, పరిణతి ఒకటి
పరిస్థితి, ఆచరణ ఇంకొకటి
వృత్తికి , ప్రవృత్తికి బాలన్స్ కుదరడం కష్టంగా ఉంది
"లైఫ్ ఈజ్ అ పారడాక్స్"  - ఇది నా ఒక్కడికే సంభందించినది కాదేమో 

ఆలోచన సరే అనుభవాల సారం, పరిణతి అనుభవాల పరిణామం, ఆచరణ మనం సమాధానపడిన జీవన విధానం , మరి పరిస్థితికి కారకులు ఎవరు ????
ఈ పరిస్థితి ఎవరి దయ ??? 
ఈ కబోదులు ఎవరి స్వార్ధం కోసం వాళ్ళు తయారుచేసిన ఒక జడ పదార్ధం  - ఈ పరిస్థితి 
వీళ్ళు మారాలి  - మారరు  - మారిపోతే వాళ్ళ ఉనికి పోతుంది 
కారా మాస్టర్ గారు అన్నట్టు - నాలుగు  పక్కలా మూసేసి ఉన్న ఒక్క కంతకీ మంచం అడ్డు పెట్టేస్తే మరి లోపలున్నోడికి గోడ కూల్చడం ఒక్కటే మార్గం - 
నేను విప్లవాన్ని సపోర్ట్ చేస్తున్నానా  - 

నాకు  బాగానే జరుగుతోంది కాబట్టి  - నేనొక కల్చర్డ్ రీడర్ని , రైటర్ని 
మరి జరగనివాడికి ????
విప్లవం - జరగనివాళ్ళ మూకుమ్మడి దాడి 
మొత్తం శిధిలం చేసినతరువాత విప్లవ యోధులకీ తెలియదు  - తరువాత ఏమి చెయ్యాలో 
కూల్చడానికి ఆలోచన ఎందుకు - 
కట్టడానికి  -ఒక మంచి ఆకృతిలో నిలబెట్టడానికి కావలి - ఆలోచన, దీక్ష, సహనం, సంస్కారం , దక్షత , etc

ఈ విషయాలలో ఏకం అవ్వడానికి కుదరనివ్వరు - ఎందుకూ కుదరదు 
మనిషి మూలాల్లోనే ఉందొ, మరి ఈ ప్రకృతి తీరే అంతో 
ఒకరిని ఒకరు ఒరుసుకుంటూ, తోసుకుంటూ, దొర్లుకుంటూ వలయాలలో, అంతం కనపడని ఒక దిక్కుకి, దిక్కులు లేని ఒక అనంతానికి 

ఇది వ్రాస్తుంటే నాకు ఎందుకో కళ్ళల్లో నీళ్ళు  - భయపడో , బాధపడో తెలియదు  

No comments:

Post a Comment