కవితా గోరీ
ప్రాస కోసం
భాష ఖూనీ
భావమేంటో క్లియార్ గా లేదు
అలాగైన
వదలనేను
వదులుతానా చించి పారేస్తా
నేను నేనే
భాష పాలిట
యముడు నేనే చీల్చి చెండేస్తా
ఆహా ఆహాహహః
ఇహి ఇహిహిహి
ఓహో ఒహోహోహో
ఇది ఒక కవితే
ఒప్పుకోరా
డిప్పకాయా
నచ్చలేదా చచ్చిపోతావు
అదీ సంగతి
చదవకింకా
చాలులేబే పెద్ద చదివావు
September 2nd 1993
అదాటున చిన్న అలజడి రేగితే
కడపట్టిన గుండె సవ్వడిని
కన్నుల జారే జాలి సెలయేరుని
ఏమార్చాలని ఎంతో ప్రయత్నించా
నిన్ను ప్రేమించలేదు
నిన్ను కామించలేదు
నా కోసం నేను చేసిన
నా అహాన్ని సంతృప్తి పరిచే చర్య
నిన్నెంత బాధించి ఉంటుందో కదా
ఇది కూడా నా ఊహే
ఏదీ కనిపించని నీ గాజు కళ్ళల్లో
నే వెతికేస్తే ఏం ప్రయోజనం
నీ భావాన్ని నేనెప్పటికీ
అర్ధం చేసుకోలేను
నీవు నేను కాలేను
మరి నా ఆలోచనలని ఎలా చెప్పను
నీవు రావన్న నిజం తెలిసి
కన్నీరు రెప్ప దాటాక ముందే ఇంకి పోయింది
ఏదైనా ఆశ ఉంటే కదా
బాధపడటానికి నేను
ఏదైనా ఓదార్పు ఉంటే కదా
మనసార ఏడ్వటానికి నాకు
నా ఆశా/ఊహా బానిసలు చేసే
ఆఖరి తిరుగుబాటును
కర్కశంగా అణిచేస్తున్నా
కనీసం స్వప్న గానాల్ని కూడా
పాడకుండా
గొంతు నులిమేస్తున్నా
మరనైపోతున్నా , ఐపోతున్నా
ఈ చీకటిలో
నాకు నీ నీడైనా చాలు
కనీసం వెలుగుందన్న
నమ్మకం మిగిలిపోతుంది
నాకు నువ్వున్నావన్న
భావననైనా మిగుల్చు
ఈ గుండెలో
కోటి నక్షత్రాల కాంతి
ఇమిడి పోతుంది
1994
తిలక్ అమృతం తాగాడంటే
మరి అది నిజమేనేమో
ఆకలి తీరిన వాడికి
అవసరం ఎప్పుడూ
స్వాతిశయాన్ని చంపనప్పుడు
అన్నీ అందంగా అమరిన వాడికి
ఆలోచించి సుందరమైన
భావ కవిత్వం దాని సొగసులతో
వ్రాయగలిగినప్పుడు
మరి అమృతం త్రాగడం
నిజమే కదా
వాస్తవంలో దొరకని దాన్ని
అందంగా చెప్పగలిగినవాడు
అందరి కంటే గొప్పవాడు
No comments:
Post a Comment