నీ కోసం నన్ను నేను చంపుకుని
కలిసి విడిపోయే పెదాల
ఎగసి మెరిసి విరిసే
ఆనందం అంచున
వేచి ఉంటాను వస్తావు కదూ
1987
ఆలాపనే ఆనంద మధువు
ఆలాపనే ఆనంద మధువు
చిందించు వేళ మోదం
ఆధారాల అంచున ఒక గీతం
మూతపడు కనురెప్పల వీడుకోలు
సంధ్యా గగన సంవర్తపు ఖేదం
06 -04 -1992
అమందానందమా అది ఏమి
ఆలోచనామ్రుతములో ఈదులాడ
విధి విచిత్ర విన్యాస గీతికల విభావరి
విలాపమా అది ఏమి
నిద్రాణ నిషధ తమము
నవ్య కళాన్వేషితాంబరమున
కార్మోయిలై క్రమ్ము నైరాశ్యం
ఎన్ని రీతులు
శూన్యావిర్బావమైన ఈ సృష్టిలో
కలిసి విడిపోయి
నిరంతర కాల ప్రవాహ గతిలో
మారి మమేకమౌ
శక్తి స్వరూపాలు
సమ ద్విరద గతి త్రిగుణ వివృత
మనసు నీ వయసుతో జత కూడనీ
సడి లేని కాలమును అట సాగని
చింతలును వంతలును చెరలాడ, నీ
నిగుడు ధైర్యమే విధి చెనకనీ
వలరాజు జలతారు వల వేయగా
శ్యామ శబలము దాన్ని కెరలించగా
జరటమౌ జీవితమూ పులకించగా
ఊపిరిని కళ చేసి సాగిపోనా
1992
నా కవనముత్పల ద్యుమణి కిరణాల
క్రమ వికసితోద్భాసితంబైన రీతి
నా సంకీర్ణ సంకల్ప ద్యుతిలో
ప్రస్తరించును గాక అద్యంతమై
No comments:
Post a Comment