అబ్బ తెల్లారిందా
మళ్ళీ మొదలురా బాబు
అన్నీ అవే ముఖాలు
మచ్చు కైనా తేడా లేని
మళ్లీ అవే ముసుగులు
అదే దారిన అలాగే
ఎప్పటిలాగే విసుగు లేకుండా
ఎంత బాధాకరమైన
భయంకరమైన సంఘటనైనా
నన్ను కదిలించదు
ఎందుకూ - నేను కదలను
మూస్తేనే ఇంత నిరాసక్తత
మరి విప్ప తీస్తేనో
తప్పు సోదరా నటించాలి
చచ్చే దాకా ఇదో అలవాటు
పొరపాటున పుట్టేననుకోకు
మరి నువ్వు ఆశావాదివి కదా
అందుకన మాట - నువ్వు బ్రతకాలి
నీ తల్లీ, తండ్రీ, సంఘం
ఇంకా ఎందరో ఆప్త మిత్రులు
ఏమి పోతారనుకుంటున్నావు
వీళ్ళందరూ - -అందుకే
నువ్వెంత వేదాంతి వైనా
బ్రతకాలి బాబూ -
మరోప్పుకున్నావు కదా
కాబట్టి ఖాళీ కాగితమెందుకు
కొంచెం రంగులేసుకో
ఎండిపోయిన బెరడులోంచి
కొంచం రసం పిండు
పక్కవాడి త్యాగం అంగీకరించు
కానీ వాడికి ఏ కష్టం
కలగ కూడదు సుమా
అది నీ విధి నీ బాధ్యత
అప్పుడు చేరుతారు స్వామీ
నీ చుట్టూ నలుగురు
ఓసోస్ ఏంట్రా బాబూ
బ్రతుకులో ఇంత వెలుతురు
అనుకుంటావ్ - అదీ
వాడి కోసమే - - ఇంక నీ కోసం
ఏం మిగిలిందీ అంతే
సంచి తెరిచి చూసుకుంటే
పక్కవాడి కోసం బతుకు - అనే
చెత్త ఇండియన్ ఫిలోసోఫి
No comments:
Post a Comment