26-11-99
అమ్మలుకి
కలువల చెలువంపు సిరుల
మనసున మకరంద ఝరుల రాజిల్లు చెలీ
కులుకుల మిటారి నడకల
తరగని మొహమున ముంచు రమణీ వల్లీ
కేందామరలు విరిసినవి
సుందరి నీ మందహాస కాంతులతో, నీ
అందాలు చిందు నగవుల
బృందావని నాట్యమాడు కిన్నెరసానీ
వెన్నెల వేళల్లో , చలి
తిన్నెల చేరి కులక వలచితి, చెలి నీ
చిన్నెల అన్నులు మరచితి
కన్నుల కాంక్షాంబరాలు వీక్షించితినే
సిరి సిరి మువ్వల సడులే
స్వరాలుగా మారి పాట గళమున పలికే
వలపుల రవ్వల జడులే
పదాలుగా కందళించి మధువులు చిలికే
No comments:
Post a Comment