1993
నేను చచ్చిపోయాను
మాటల గారడీ అనవసరం
చెప్పేదేదయినా ఉంటే
సూటిగానే చెప్తాను
నా రక్తం నా ఆలోచనా
నా పద్ధతీ నన్ను
ఎలా ప్రేరేపిస్తే
అలా చెయ్యాలని
చాల ప్రయత్నించాను
ఈ సంఘాన్ని నాతొ తీసుకుపోలేక
ఈ సంఘంలో ఇమడలేక
దాని జడత్వం వదల్చలేక
ఇంక ఏమీ చెయ్యాలో తెలియక
సిగ్గుతో చచ్చాను
విసుగుతో, భయంతో చచ్చాను
చచ్చిపోయి కూడా ఇక్కడ
సుఖంగా బ్రతుకుతున్నాను
నిజం, నా చావు ఎంత అబద్దమో
ఇది అంత నిజం
నమ్మలేకపోతే చూడండి
గాజు కళ్ళతో , విసుగులేని
నవ్వు ముఖంతో
విశాఖ పుర వీధులలో
విరామం లేకుండా
తిరుగుతూ ఉంటాను
ఆనంద తాండవం
ఆ కళల పెన్నెరులు విరుల తెమ్మెరలు తలపు తాకినవిగా
మనసు రేయలిసి మరులతో కలిసి కలవరించినవిగా
శుకము శుకపికము మరుని పంజరపు తెరిచినదిగా
వెలుగు ధవళిమల సంజె అరుణిమల నడుమ నే నిలిచి
ప్రక్రుతి తో కలిసి, ఇరుల కనుమలను కలిపివేసితిని గా
ఈ ఝరిని నేనైతి , గిరిని నేనైతి, పుడమి చీల్చినా సిరిని నేనైతి
శిశువు నేనైతి, నిసువు రోదనా హళిని నేనైతి
కలికి కన్కోసల మెరుపు నేనైతి
యమకమేనైతి, లయన మేనైతి
కళా రూపముల శక్తి నేనైతి, కాంతి నేనైతి, శాంతి నేనైతి
జీవ చైతన్య గాన మాధుర్య సరళ గంభీర మూర్తి నేనైతి...........
యతి కుదరని చంపక మాల
తెలిసిన మేధతో జగతి జాగృతి సేయ తలంచి పొరగా
మిగిలెను వేదనాభరిత శోధన సారము జీవితాన, నే
అలసిన జీవ నాడులు విధించిన భీకర తోలు ఖైదులో
పడి విలపించినాను కరుణించి సుఖంబును నించు రామయా
my dear friends students and every one
ReplyDeletelet me tell you one thing right away. the person here is no way an ordinary mortal. he is person behind my reformation. it takes time to realize what we are upto. with this blog on i firmly believe wr are on the track to learn what we re up to
rama krishna
ashram