Tuesday, October 5, 2010

Kotta Bhetala Kathalu - AppaRao the Monk - Conclusion

20-06-2009
హలో బ్రదర్స్
మీరింకేం ముగింపు చెప్పరు - ఆ విషయం నాకర్ధం అయ్యింది
ఆళ్ళ వాస్తులు ఏదో ముగింపు చెప్పారు - నాకు అర్ధం కాలేదు
సుత్తి ఎందుకు - రచయిత అనుకున్న ముగింపు చెప్తాను 

విక్రమార్కుడు ఇలా చెప్పాడు 
అప్పారావు దేశాలు పట్టి పోయిన తరువాత ఎన్నో రకాల మనుషులని, ఎన్నో విచిత్ర పరిస్థితులని చూసాడు 
అతనికి ఈ ప్రపంచం లో అర్ధం కనపడలేదు  - 
అతనికి ఎందుకు బ్రతకాలో కూడా తెలియలేదు - 
చస్తే ఏంటో కూడా తెలియలేదు - 
కష్టం అతని శరీరానికి పడదు - 
ఐహిక సుఖం  పొందడానికి పోరాడే ఓపిక లేదు  - ఏమి చెయ్యాలి 
అప్పారావు బుర్రలో ఒక మెరుపు మెరిసింది 
మనుష్యుల బలహీనతలలో భయం పునాది 
ఎవడైనా పరిస్థితి, వాడి ఆలోచనలని, బుద్ధిని దాటి వస్తే, దాన్ని ఎలా పోరాడాలో తెలియక పొతే  - చివరిగా వాడికి తెలియని శక్తి, భగవంతుని, శరణు లోకి పోతాడు  - 
స్వామీజీలా మారిపోతే ????
కష్ట పడక్కరలేదు  - అందరూ గౌరవం ఇస్తారు - కానుకలకి కరువు ఉండదు  - తిండికి లోటు ఉండదు  - శిష్య గణం ఎలాగా ఉంటారు , సేవలకి - బయటకి ఎలా కనపడినా - లోపాయకారీగా మనకి నచ్చినవన్ని చేసుకోవచ్చు  - భగవద్గీత లో రెండు శ్లోకాలు , మధ్య మధ్యలో ఉపనిషత్తులు అంటూ  - పంచతంత్రం కథలు రెండు చెప్పేస్తే సరిపోతుంది 
ఇంకా చావాల్సిన అవసరం ఏముంది 
ఇలా అలోచించిన అప్పారావు బాబా లా మారిపోయాడు 

ఈ సమాధానం తో బేతాళుడు చేట్టేక్కేదమనుకున్నాడు  - కాని కుదర లేదు  - ఎందుకంటే విక్రమార్కుడు సమాధానం ఆపలేదు 
విక్రమార్కుడు కి అనుమానం వచ్చింది - 
అప్పుడు భేతాళుడు ని  అడిగాడు 
"ఔను భేతాళ , ఒకవేళ నిజంగానే అప్పారావుకి భగవంతుడు కనిపించి ఉంటాడేమో?? ఏమంటావు??? అన్నాడు 
భేతాళుడు ముఖం చిన్న బుచ్చుకుని " ప్రశ్నలు అడగాల్సింది నేను, సమాధానం చెప్పాల్సింది నువ్వు  - అంతే కాని నువ్వు ప్రశ్న అడిగితే నేనేం చెప్పలేను - అన్నాడు 

దానికి విక్రమార్కుడు " ఓరి వెర్రి  భేతాళ సంత్సరాల తరబడి నువ్వు అడగడము, నేను చెప్పడము  - కొంచం ఆలోచించు  - చిరాకు అనిపించటం లేదూ  - అందుకనే మార్పు కోసం నేను నిన్ను అడుగుతున్నాను చెప్పు అన్నాడు 

భేతాళుడు బిక్క చచ్చి పోయి " నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను , నన్ను మాత్రం ప్రశ్నలు అడగకు అన్నాడు"

ఇంతకీ ఈ భేతాళ కథకి పరస్పర విరుద్ధమైన ముగింపు సూక్తి

"అడిగేవాడికి చెప్పేవాడు లోకువ"
"చెప్పేవాడికి వినేవాడు లోకువ "

No comments:

Post a Comment