Sunday, March 17, 2013

ఆలోచనల స్రవంతి -43

అసలు ఈ Toba catastrophe గురించి ఎందుకు చెప్పుకోవడమంటే రామకృష్ణ raise చేసిన point “ the volcanic eruptions filled the Gondwanaland with invaluable nutrients” అన్నదాని మీద clarity తీసుకోవడం కోసం.
Toba catastrophe అంటే Toba super eruption theory. Lake Toba అన్నది Indonesia లో ఉన్నది. 60000 నించి 70000 సంవత్సరాల క్రితం అక్కడి అగ్ని పర్వతం బద్దలై ఒక 15 cms మందంలో volcanic ash, Indian ocean, Arabian sea, South China sea ఇంకా వాటి మధ్యనున్న భూభాగం అంతా పరుచుకు పోయింది. దీని వలన ఈ భూమి మీద ఉష్ణోగ్రతలు బాగా తగ్గి ఒక volcanic winter, Ice age లాగా తయారు అయింది అని theory. ఇంకా దీని continuation లో Genetic bottleneck theory అన్నది ఒకటి ప్రచారం జరిగింది. ఈ theory ప్రకారం ఈ భూమి మీద ప్రాణి కోటి almost అంతరించి ఒక 3000 నించి 15000 మంది Africa, South India లో జ్వాలాపురం అనే ప్రదేశాలలో మాత్రమే మిగిలారు అని దాని conclusion. theory ప్రకారం, ఇప్పుడు మనం చూస్తున్న మనుషులు అందరూ ఈ Africa, South India నించి పెరిగిన సంతతి అని, వాళ్ళే ఈ భూమి మీద నాలుగు మూలలకి migrate అయ్యారు అని ఒక inference. ఈ పైన చెప్పిన విషయాలు correct అని చెప్పడానికి కావలిసినంత research జరిగి at least Eruption అయ్యింది, volcanic ash పరుచుకుంది, temperature variations వచ్చి జనాభా సంఖ్య గణనీయంగా పడిపోయింది అని ఒప్పుకోక తప్పదు. సరే ఇక ఈ గోండ్వానా land అంటే ఏమిటయ్యా అంటే, నేను అర్ధం చేసుకున్న భూగోళ చరిత్ర ప్రకారం,tectonic plates కదలికల వల్ల ఖండాలు కలుస్తూ, విడిపోతూ అప్పుడప్పుడు ఒక super continent (అన్ని continents లేదా majority కలిసి ఉన్నది) గా ప్రదర్శితమై తరువాత వేరువేరుగా విడిపోతూ ఉంటాయి. ఈ రకంగా Rodinia అన్న super continent ఒక billion సంవత్సరాల క్రితం భూమి తాలూకు అన్ని కనపడే భూభాగాలను కలిగి, తరువాత 600 million సంవత్సరాల క్రితం మళ్ళీ 8 ఖండాల క్రింద విడిపోయి, తిరిగి ఒకటై Panagaea అనే super continent క్రింద ఏర్పడి, తిరిగి విడిపోయి Laurasia గా (North America & Eurasia), మరి మిగిలిన ఖండాలన్నీకలిపి గోండ్వానా క్రింద వ్యవహరించబడ్డాయి.

Panagaea Super Continent 


 మరి అలాటిది Eurasia అనుకున్నా, గోండ్వానా అనుకున్నా అంత invaluable nutrients తో నిండిపోయిన ఈ దేశం అన్నపూర్ణ లాగ ఎలా మారింది. దానికి ఉన్న geographical advantage ఏంటి? అన్నది అర్ధం చేసుకోవాలి. ఇక మనకి ఘనమైన చరిత్ర ఉందని అందరూ ఒప్పుకోవలసిందే. Geographical advantage ఉన్న ప్రతీ చోట glorious past & great history ఉంటాయి. పశుపక్ష్యాదులు, సకల మానవాళి సుఖం కోసం అక్కడ చేరవలసిందే.
ఉదాహరణకి ఇప్పుడు అందరూ US కానీ,Australia కానీ ఇలాటి developed countries ఎందుకు చేరుతున్నారు. అక్కడ 24 hrs power, fresh drinking water, ఇంకా ఎన్నో facilities ఉన్నాయట. తెలివైన వాళ్ళందరికీ అక్కడ మంచి మర్యాద జరుగుతుందిట. Michio Kaku అనే ఒక leading scientist US గురించి అక్కడ US లో settle అయి చెప్పాడు కాబట్టి సరే. ఇంకో రకంగా చూద్దాం.

Friday, February 22, 2013

New Poetry -21


ఏదో మళ్ళీ mood తెచ్చుకుని వ్రాద్దామంటే బయటపడింది అదే గోల ఇంకోలా

కనికరం లేని ఈ నిశీధిలో,పోకారు బ్రతుకు కలల కాణాచి
ఈరువు కోరలు ఆసరాకలిగి, నరాలరవాలు హృదయభేదకం 
శ్వాసవేడిలో కరిగి నీరవం, కనులనేమార్చి వడచు కన్నీట
పసరించి వెలిసి, పొరాడి అలిసి, బయటపడలేక భయపెడుతోంది
ఆ చిరునవ్వుకి, ఆ పులకింతకి, ఈ వలవంతకి, ఈ పెనుబాధకి
ఘనీభవించిన కాఠిన్యానికి కారణభూతం ఏ మూర్తి తత్వం
అర్ధం కానిది అర్ధమైనదని, తెలుసనొకసారి, తెలియకోసారి
విధి అభేద్యమని విసిగివేసారి, తడబడి విడివడి బుగులు మేదస్సు
ధనం మదంతో గడిపి కొన్నాళ్లు, ఇంద్రియ సుఖమే పరమావధిగా
అధికారంలో కులికి కొన్నాళ్లు, ఏదో కోరిక తీరినట్టుగా
వినోదమొకపరి, విషాదమొకపరి, ఏదో అవసరమొచ్చినట్టుగా
పరుగిడి పరుగిడి వగర్చుకుంటూ, ఐహిక వాంఛల తెరలు బాధలకు
నలిగి నీరైన సగటు జీవితం, రాలి మోడైన నిష్ఫల వృక్షం
ఆనందంగా బ్రతుకుతున్నట్టు కృత్రిమ వేషం అభినయించనిక
సమాజ శ్రేయం, పరోపకారం, ఆత్మ సంస్కార యోగ విధానం
ఒకటా రెండా ఎన్నో రీతులు, కళల గొణగొణలు చరమ గీతికలు
ఈశ్వర ధ్యానం జగదానందం, సంత జనుడనని పాకులాడనా
వైరాగ్యంతో బ్రతకడమొకటే ముక్తి మార్గాల గొప్ప సూత్రమా
ఆశ చావకా, ఆర్తి తీరకా, కాలాలు కలుపు, వాలారు తలపు
ఉద్వేగంతో ఊగించి లేపి, నిరాకారమై వెలసి ప్రవహించు
విరతి విరమింప భ్రమని కల్పించి, నిరతి పెంపొంద చింత చిందించు  
ఇంకెంతవరకు ఈ వెతుకులాట, ఏ రసాయనం, ఏ ధ్వని సారం
వాయు ప్రవాహం, జ్ఞ్యానం, శాస్త్రం,  వెలువరించేది ఏ పరమార్ధం
వలయ వీచికల తేలియాడుతూ, కలయ తిరుగుతూ, ఎటు ప్రస్థానం