1988
నింగి నుండి జారే వెలుగుల వాన
కలలు నింపే నేడే కనుపాపలలోన
సందె మబ్బు పాట సాగనీ ఈ వేళ
ఆశ రేపనే నా చెలి పెదవుల
విరి మధువుల ఆ తలపుల జడి
1989
ఆ చూపు
వెన్నెల కిరణం
త్రేతాగ్ని కణం
మలయ మారుతం
హేమంత తుషారం
వాసంత సమీరం
ఝరుల గీతం
అలల సంగీతం
నిభిడాన్ధకారం
జీవన సారం
1988
రేగే వేదననే పాటగా పాడనా
మాయని కాలపు గాయపు నీడల
ముసిరినా చీకటి తెరలో ........
1988
అవునూ.....కదా
ఎప్పుడూ ఇదే కధ
నువ్వు అనగా
నీతి ముసుగు వేసిన
రెండు నర జీవాల
స్వచ్చంద కృషి ఫలమా
ఓయీ మత ప్రవక్తా
ఎప్పుడూ ఇదే కధా ???
విశ్వాసం ప్రకటించడం మానేసి
విశ్వ శాంతి విపాటనకై
సమాధానం లేని సమస్యల
అడుగులు ఊడపీకుతావా
వెన్నెల వేళల్లో విశాల సైకత తీరాల
అలల భాషను ఆత్మ ఘోషను కలిపి
సుందర హసన్మాదురులు చిందించే
నీ గళాన ఈ అపశృతులా ?
1989
చెమర్చిన చెక్కిళ్ళపై పరావర్తించిన కాంతి
చిగిర్చిన పొత్తిళ్ళ విడివడని గుప్పిళ్ళ
స్పృశించి సృజించి స్రవించిన
ప్రాకృత పురాకృత మానవ గాథలు
యుగాలకు యుగాలు గతించినా
ప్రక్రుతి పలుమార్లు ప్రళయాల హసించినా
మారని మానని జడ జీవన వ్యుత్పత్తి
ఆకృతి మారిన చషకంలో
స్ఖలించే పురాతన రసాయనం ...........
No comments:
Post a Comment