04-06-2009
హలో బ్రదర్స్
"ప్రపంచమొక పద్మవ్యూహం
కవిత్వమొక తీరని దాహం "
ఇది ఎవరు అన్నారో మీకు తెలుసు
"మొన్న మూడు కత్తులు తిన్నాను
నా కను రెప్పల పై ఆసిడ్ పోసుకున్నాను
ఇలా చెప్పడం మజా గా ఉంటుంది
కాని ఈ వెర్రి వికటిస్తుంది
ఈ వ్యవసాయం వెర్రి తలలు వేస్తుంది
"అంత్య ప్రాసలు వేసినంత మాత్రాన ప్రోసైక్ భావం పొయిట్రీ కాదు "
కవిత్వం ఒక అల్కేమి
దాని రహస్యం ఒక పెద్దన్నకు తెలుసు
కాళిదాసుకు తెలుసు శ్రీశ్రీ కి తెలుసు"
ఇదేవరన్నారో కూడా మీకు తెలుసు
అద్భుతంగా అందంగా చెప్పగలిగే వాళ్ళు సరే - మరి చెప్పలేని వాళ్ళో
మనసులో మెదిలే భావాలు, అంతస్సంఘర్షణ ఎలా ప్రకటించాలి???
చెపితే వినేవాడు లేనివాడికి, ఎవరైనా ఉన్నా చెప్పలేనివాడికి
వాళ్ళ పరిస్థితి ఏమిటి???
వాళ్ళు ఎలా చెప్పాలి ???
ఏ కళ లోను ప్రవేశం లేనివాడు , ఉద్రేకాన్ని తనలో ఇముడ్చుకోలేని వాడు ఏమి చెయ్యాలి???
ఇది చేతకాని తనమా ???
జీవితానికి ప్రపంచపు గీతలు దాటి అర్ధాన్ని వెతికితే దొరుకుతుందా ???
నిజానికి ఏ ఇజం లోను మజా లేదు - నాకైతే కనిపించలేదు
ఈ కబోదుల గుంపు ఎటు పోతోంది
" సంఘోప జీవి అయిన మానవుడు - సంఘాన్ని విడి మానలేదు, మనుగడ సాగించలేడు"
అన్నిటికి సమాధానం ఆధ్యాత్మికత లోనే ఉంటే -
మరి మిగతా సైన్స్ , చట్ట బండలు ఎందుకు???
మరి శ్రీవారు దీనికి ఏమంటారో ???
No comments:
Post a Comment