Friday, October 8, 2010

ఆలోచనల స్రవంతి - 5

సరే ఆలోచన గురించి ఆలోచించాలి అనుకున్నాను.
ఇవి మన బుర్రలో పుడతాయి.లోపల రసాయనిక చర్యలు, వెలుపల నుంచి వచ్చే సంకేతాల interaction ఫలితాలు.  
దీనిని define చెయ్య గలిగితే సగం సమస్యలు తీరిపోయినట్టే. అసలు పుట్టుక తోనే లోపల రసాయనాలు తీసుకుని పుడతాం. ఇవి ఇంత మాత్రమె వీడిలో ఉండాలి అని ఎలా నిర్ణయించబడుతుంది.
మనం మన తల్లీ తండ్రుల రసాయనాల మిశ్రమాలం .వెలుపల ఉండే వాతావరణం నీ తల్లి , తండ్రుల genetics వాళ్ళ ఆరోగ్యం ప్రభావితం చేస్తూ - -నువ్వు పుట్టడానికి కావలిసిన మిశ్రమాల నిష్పత్తిని డిసైడ్ చేస్తాయి.
ఆ మిశ్రమాలతో పుట్టిన నువ్వు మళ్ళీ  వెలుపలి వాతావరణం లో ఇంటరాక్ట్ అవుతూ నీ జీవితాన్ని define చేసుకుంటావు. నీ తల్లి తండ్రుల chemistry ఎవరు finalize చేసారు - - వాళ్ళ తల్లి, తండ్రీ  - -
ఇలా చెప్పుకుంటూ పొతే మనువు, darwin theory దాటి ఇంక వెనక్కి వెళ్లి భూమి పుట్టుక వెతకాల్సి వస్తుంది - -మరి భూమి ఎలా పుట్టింది అంటే మన వాళ్ళు ఎప్పుడో శూన్యం నించి ఆవిర్భవించింది అని చెప్పారు.
సంహితలు - వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు,  శ్రుతులు, స్మృతులు అన్నీ వ్రాశారు. ఇంతకు ముందు గురువులు తరన్నించి తరానికి ఇవన్నీ అనుశ్రుతాలుగా, తరువాత తాళపత్రాల మీద చెప్పి, వ్రాసేవారు. ఇప్పుడు గురుకులాలు  లేవు ఆ వ్యవస్థ కూడా నాశనం ఐపోయింది. 
మనవాళ్ళు ఏమి చెప్పారో పూర్తిగా అధ్యయనం చేసిన వాళ్ళు చాలా  కొద్దిమంది. వాళ్ళు ఎంత చదివి ఉంటారు అంటే అసలు మాట్లాడరు కూడా.హిందూ సైద్ధాంతికులు, వేదాంతులు చెప్పినవి ఎవరికి అర్ధం అయ్యాయో  తెలియదు. ఎవడి interpretation వాడిది.  ఆంతా తెలియక పోయిన తెలిసినంతలో మంచి చేద్దామనుకునే వాళ్ళు ఏదో ప్రజలకి వాళ్ళకి తెలిసిన interpretations తో చెప్తున్నారు. విన్న వాళ్ళు వింటారు లేని వాళ్ళు లేదు.
సరి ఇవన్నీ ఎవడైనా ఊహించి రాశారా లేక పొతే మనవాళ్ళు వ్రాసిన వాటికి ఖచ్చితమైన లెఖ్ఖ ఉందా ఎవరికి తెలియదు. అప్పట్లో Wright brothers విమానం కనిపెట్టారు అంటే మా రామాయణం లో పుష్పక విమానం ఉంది అనడం తప్ప , విమానం లేపాలంటే దానికి తగ్గ సైన్సు మన దగ్గిర ఉందా ఏమో ఎవరికీ తెలియదు. దానికి తగ్గ ఉపమానాలే నేటి కాలం లో కూడా ఇవ్వొచ్చు మన వాళ్ళ గురించి. 
 కానీ ఒక మనిషికి మనసుకి  శాంతి కావాలంటే ఏమి చేస్తే వస్తుందో మనవాళ్ళు ఆ జీవన విధానాలిని, నియమాలని, పద్ధతులని బాగా చెప్పారు.ఈ ముస్లిం దండయాత్రలలో, ఆంగ్ల సామ్రాజ్యంలో మన దేశం పూర్తిగా భ్రస్టు పట్టిపోయింది. ఆలోచనలకి మూలం ఆలోచించడం తరువాత,  అసలు ఆలోచించడం మర్చిపోయారు. ఇప్పుడు మనవాళ్ళకి western countries ని అనుకరించడం తప్ప ఏమి తెలియదు. కొద్దో గొప్పో తెలివైన వాడు ఈ దేశం లో పరిస్థితులకి విసుగెత్తి, విదేశాలలో తన తెలివి తేటలు ప్రదర్శించి అక్కడే సెటిల్ అయిపోతున్నారు.
దీని వలన మనకి జరిగింది తెలియదు, జరుగుతున్నది అర్ధం కాదు, జరగబోయే దానితో సంబంధం లేదు  - దీని వల్ల ఒక rich culture పరిరక్షించడం కుదరదు - -మనవాళ్ళు ఏమి చెప్పారో కొన్నాళ్ళకి మరిచి పోతారు - -ఎందుకంటే వాళ్ళు ఇక్కడి వాళ్ళే అయినా అక్కడి వాతావరణం లో , అక్కడి సంఘం లో, సమత్వం పొందడానికి ప్రయత్నించి, పొందుతారు. 
Hindus , Muslims , Christians ది కూడా మతం మంచిదే  - -కానీ దాన్ని ఆచరించే వాళ్ళ వివేకాన్ని బట్టి ఉంటుంది. 
ఎవరి మతాన్ని, అభిమతాన్ని వారిని ఆలోచించనివ్వకుండా, పాటించానివ్వకుండా  - ఇదేంటో???
 సరే మరి దేశ విదేశాలలో కూడా మహానుభావులు ఉన్నారు. దీని గురించి బుర్రలు బద్దలు కొట్టుకుంటూనే ఉన్నారు.ఇప్పుడు stephen hawking లాటి scientists -  big bang theory , black holes ని propose చేసారు.string theory కూడా ఉంది. ఇంకెవరో neuron ని కనిపెట్టాం -   ఆలోచనలకి మూలం అదే అన్నారు.  కానీ దేనికి ఒక finality లేదు.  ప్రతి దానికి కావలిసినన్ని gaps. ఒక complete unified theory కోసం ప్రయత్నం. త్వరలోనే అది సాకారమవ్వాలని ప్రయత్నం. అయితే సంతోషం .
అంటే ఇప్పుడు ఆలోచనలకి మూలం మనకి తెలియదు. కానీ ఆలోచనల నించి ప్రభావితమయ్యే అన్నింటిని మేధావులు వర్గీకరించారు. freud , Jung లాటి వాళ్ళు psychology , pyscho analysis , interpretation of dreams అని  - ఈ కలల తాత్పర్యాన్ని, ఆలోచనల మూలాన్ని వారి వారి దృష్టి కోణంలో explain చేసారు.Aristotle కాలం నించి ఈనాటి వరకూ ఆ మహాత్ములు అందరూ ప్రపంచాన్ని వారి వారి దృష్టి తో చూసి చెప్పారు. 
ఈ isms అన్నీ వారి నించి వచ్చినవే. communism >>>> objectivism etc ., అంటే ఎవడికి అర్ధమైన ప్రపంచాన్ని వాడు చెప్పాడు.
ఇప్పుడు మనమేది follow అవ్వాలి.  communism / socialism  కుప్ప కూలింది, capitalism దే రాజ్యం. మనలాటి mixed economy గాళ్ళు ఎవరిని కష్ట పెట్టకుండా చూసేద్దాం అనుకుంటారు గాని చివరిగా capitalism దే పై చెయ్యి. మరి ఈ capitalsim అంటే తెలివైనవాడు/ వాళ్ళు తెలివి లేని వాడిని దోచుకునే ఒక గొప్ప మంత్రం. కొంత మందికి వాళ్ళు  దోచుకో బడతారని కూడా తెలియదు.
మరి వాళ్ళు అన్నీ తెలివితేటలతో/ ఆలోచనలతో పుట్టి/ పెరిగి అర్ధం చేసుకొని ఎవరి సంపదని వారు పెంచుకొని పోతున్నారు తప్పితే - ఈ సమాజానికి వాళ్ల ఆలోచనలు ఎంతవరకు ఉపయోగ పడుతున్నాయో అని ఆలోచించే వాడు ఎవడైనా ఉన్నాడా  ఉన్నా ఈ capitalist competetiveness వాడిని వాడిలా ఉండనివ్వదు. 
నాలాటి వాడు రక రకాల పుస్తకాలు చదివేసి - -అర్ధమైనంత అర్ధం చేసుకుని నేనెంతో  గొప్పగా ఆలోచిస్తున్నానని  - intellectual లాగ feel అయిపోయి ఇలాటి blogs లో వ్రాసి తృప్తి పడడమే. 
ఎవడో తుపాకి పట్టి, అడవులు పట్టి, ఈ సొసైటీ లో దెబ్బలాడి - చస్తాడు - వాడి గురించి పట్టించుకునేవాడు ఉండదు - -ఆలోచించే వాడు ఉండదు - -ఎవడికీ తీరిక లేదు - 
ఇంకొకడు నేను ప్రపంచాన్ని జయిస్తాను అని బయలుదేరుతాడు - ఒక Hitler లా, ఒక Napoleon లా, Mussolini  లా, Alexander లా - పర్యవసానాలన్నీ మనకు తెలుసు.


ఈ శాఖా చంక్రమణం వల్ల ఏమి అర్ధం అయ్యింది - 
కొంచం ఆగి నేను వ్రాసింది నేను చదివాను - 
"ఆలోచన" దాని సృష్టి మూలం తెలియదు - మన సైన్సు అంత అభివృద్ది చెందలేదు -
కానీ ఆలోచనలని ప్రభావితం చేసే - సమాజం, ఒక ఆరోగ్యకర పర్యావరణం సృష్టి, ఒక శాంతియుత సహజీవనానికి కావలిసిన సూత్రాలు  - ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటే చెయ్యొచ్చు - 
అధికారం, సంపద ఉన్న అయ్యలందరూ ఆలోచించవలసిన సమయం. మన ఈ చిన్ని ప్రపంచం పూర్తిగా నాశనం కాక ముందే కళ్ళు తెరవాల్సిన సమయం. 
పూర్తిగా నాశనం అంటే గుర్తుకు వచ్చింది  - 2012 లో మన భూమి సఫా ఎవడికైనా  తెలుసా - -మొన్నే సినిమా చూశాను - దీని  గురించి నా ఆలోచన మళ్ళీ  వ్రాస్తాను. అంతవరకూ సెలవు.


సశేషం

1 comment:

  1. me ramesh. friend of ramakrishna sir. following you

    ReplyDelete