పట్టు వదలని విక్రమ్ తన toyoto car లోంచి దిగి mortuary freezer లో పెట్టిన శవాన్ని పైకి లాగి తన వెంటే తెచ్చుకున్న పెద్ద PVC bag లో pack చేసి కార్ డిక్కీ లో పడేసి తిరిగి car start చేసి బయలుదేరాడు. అప్పుడు కార్ బ్యాక్ సీట్ లో బేతాళుడు cuban cigar తాగుతూ చూస్తుంటే ఇంతకు ముందు నీలాగే over action చేసి ఓడిపోయిన Mr . Joseph Vankayala కథ గుర్తుకు వస్తోంది. "If you have enough time I can tell you the story " అన్నాడు
దానికి విక్రమ్ "yes please go ahead " అన్నాడు
Mr. Joseph Vankayala అసలు పేరు వంకాయల వెంకట్రావు. అతని తండ్రి గాజుల మల్లారం పట్టుకుని ఇంటింటికీ తిరిగి అమ్ముతూ ఉండేవాడు. పెద్ద సంపన్నులు కాకపోయినా కూడు,గూడు, గుడ్డకి లోటు ఉండేది కాదు. వెంకట్రావు తల్లి ఒక సాధారణ గృహిణి. అతని చిన్నతనం ఆనందంగా గడిచిందనే చెప్పాలి. ఒకడే కొడుకు కావడం మూలాన చాలా గారాబంగా పెంచారు. దాని కారణంగా వెంకట్రావు చాలా మొండివాడుగా తయారయ్యాడు. ఏది కావాలంటే అది దెబ్బలాడి కొనిపించుకోవడం, అడిగినది ఇవ్వకపోతే ఏడ్చి గోలపెట్టి యాగీ చెయ్యడం అలవాటయిపోయింది. తల్లి తండ్రులకి అతని చిన్నప్పుడు అల్లరి చేస్తే ముద్దు అనిపించేది. కానీ అతను పెరిగి పెద్దవుతున్నకొద్దీ వాళ్ళు అతని అల్లరి భరించలేక పోయేవారు. కానీ ఒకడే కొడుకు మూలాన ఏమీ అనలేకపోయేవారు. వెంకట్రావు చదువు సంధ్యలలో బాగానే ఉండేవాడు. పెంకితనం మూలంగా బడిలో కూడా ఉపాధ్యాయులతో దెబ్బలు తింటూ ఉండేవాడు. అలాగే వెంకట్రావు జీవితం పదిహేను ఏళ్ళ వరకు సుఖంగానే గడిచింది. అతని జీవితం లో అప్పుడు కోలుకోలేని పెద్ద దెబ్బ తగిలింది. అతని తల్లి కాలం చేసింది. తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లిని ఆ వయసులో అతను భరించలేకపోయాడు. అందుకని వీలయినంత ఇంటికి రాకుండా తిరిగే వాడు. అలాటి సమయంలో అతనికి చాలామంది స్నేహితులు దొరికారు.
స్నేహితులే ప్రాణం, ప్రపంచం అయిపొయింది అతనికి. తండ్రి ఇలా తిరిగితే పెద్దయిన తరువాత నువ్వేమి అవుతావురా అని బాధపడేవాడు. కానీ ఎందుకో వెంకట్రావు కి సమాధానం చెప్పాలనిపించేది కాదు. పట్టించుకునే వాడూ కాదు. ఇలా ఇంకో అయిదేళ్ళు గడిచింది. వెంకట్రావు తండ్రి కాలం చేశాడు. వెంకట్రావు కి ఇంకా ఆ ఇంటితో సంబంధం తెగిపోయింది. ఈ ఆవేశాలలో పడి చదువు కూడా అలక్ష్యం చేశాడు. కానీ తెలివైనవాడు కావటం మూలాన ఏదో అత్తెసరు మార్కులతో డిగ్రీ పాస్ అయ్యాడు. తండ్రి పోయిన తరువాత సవతి తల్లి ఆస్తి లో చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. ఇతను అడగలేదు. ప్రాణమని నమ్మిన స్నేహితులు ఎవరి కారణాలు చెప్పి వారు తప్పించుకున్నారు. అతను తిండికి లేక బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. అతను చదివిన డిగ్రీ తో ఒక ప్రైవేటు కంపెనీ లో బాయ్ కింద జాయిన్ అయ్యాడు. అలా మొదలైంది వెంకటరావు ప్రస్థానం.
విక్రమ్ ఆపుకోలేక అడిగాడు "ఇందాక ఏదో పెద్ద english professor లాగ english లో మాట్లాడవు. ఇప్పుడేమిటి తెలుగులో కథ చెబుతున్నావు "
దానికి భేతాళుడు "You see Mr . Vikram don 't interrept the flow of narration - నువ్వు మాట్లాడితే నేను చేట్టేక్కాలి - కానీ నాకూ చెట్టెక్కి చెట్టెక్కి bore కొట్టింది. Anyway your Toyoto seems to be comfortable than tree. So I will excuse you for this time . Don 't make noise and listen to the story .
Vikram వీడితో మనకెందుకని వినడం మొదలెట్టాడు.
వంకాయల వెంకట్రావు కి జీవితంలో చాలా తొందరగా ఎదిగిపోదామని కోరిక. తానేమిటో నిరూపించుకోవాలని ఒక పట్టుదల. తనకి జరిగిన అన్యాయానికి జవాబు చెప్పాలనే ఒక ఆవేశం. పరిస్థితి అందుకు సహకరించదు. ఆఫీసుకి టీ తేవడం అందరికీ కప్పులు పెట్టి తియ్యడం వరకే అతని డ్యూటీ. ఇలా ఒక ఏడాది గడిచింది. ఈ ఏడాదిలో ఆ ఆఫీసులో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమి చేస్తారు, ఎలా లంచాలు తీసుకుంటారు, ఎవరికి ఎక్కడ అక్రమ సంబంధాలు ఉన్నాయి ఇవీ అతను పోగేసిన సరంజామా. ఆఫీసర్ని కలవాలంటే ఇతనికి మామూలు ఇవ్వడం అన్న సంగతి మామూలు అయ్యింది. అలా పోగేసిన డబ్బులతో అతను lottery , మట్కా జూదం లాటివి ఆడుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు ఏదో కొంత వచ్చేది, ఎక్కువ సార్లు డబ్బులు పోయేవి. అయినా అతను వదలలేదు. ఈ లోపు steno మహాలక్ష్మి, accountant బ్రహ్మాజీ affair పట్టుకున్నాడు. వాళ్ళిద్దరినీ black mail చేసి డబ్బు గుంజుతూ ఉండేవాడు. ఇంకొన్నాళ్ళ తరువాత భయపెట్టి మహాలక్ష్మి జీవితాన్ని quadrangle love story చేసేసాడు. పతి ,పత్ని మళ్ళీ వీళ్ళిద్దరూ(బ్రహ్మాజీ, వెంకట్రావు). ఈ మధ్యలో వెంకట్రావు అద్దెకుంటున్న ఇంటి ఎదురుగా ఉన్న ఫ్లాట్ లో ఉన్న మార్వాడి అమ్మాయితో ఇంకో love affair స్టార్ట్ చేశాడు. మార్వాడి ఫ్యామిలీ తో మంచి relations maintain చేస్తూ వాళ్ళ ఇంట్లో ఒకడిలా మసలుతూ ఖాళీ టైములో మార్వాడి తల్లిని కూడా ముగ్గులోకి దించేశాడు. అన్నీ చోట్ల అందరిని grip లో పెట్టుకుని తనకి కావలిసిన డబ్బులకి విలాసాలకి లోటు లేకుండా నడుపుతూ ఉండేవాడు. ఇంకొనాళ్ళ తరువాత మార్వాడి తల్లి సాయం తో మార్వాడి తండ్రిని చంపేసి మార్వాడి కూతుర్ని పెళ్లి చేసుకుని మార్వాడి అల్లుడు అయిపోయాడు.
మార్వాడి వాడు పోగేసిన లక్షల ఆస్తి ఒకేసారి చేతికందడంతో లక్షాధికారి అయిపోయాడు వెంకట్రావు
లక్షాధికారి వెంకట్రావు జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం అయ్యింది. అతనికి డబ్బు సంపాదనే ధ్యేయం. ఉన్న లక్షలని కోట్లు ఎలా చెయ్యాలని ఆలోచన. ముందు share markets , తరువాత banks దగ్గిర అప్పులు, ఎగ్గోట్టడాలు ఇలా కొంత కాలం గడిచిన తరువాత అతని దగ్గిర మరికొంత డబ్బు పోగయ్యింది. ఆ తరువాత ఒక financing company, ఆ డబ్బుల వసూలికి ఒక పిల్ల rowdy batch తయారు చేశాడు. నెమ్మదిగా భూ కబ్జాలకి దిగాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు అతనికి politicians కి డబ్బులు ఇవ్వాలిసిన అవసరం వచినప్పుడు అనిపించింది తనే politics లోకి దిగితే ఎలా ఉంటుంది అని . ఇంకేముంది మెల్లిగా national level పార్టీ కార్యకర్త కింద join అయిపోయాడు. ఆ తరువాత కాలం పరిగెత్తింది. ఈ సంపాదించినా డబ్బులతో business , business లో వచ్చిన డబ్బులతో politics , politics లో వచ్చిన డబ్బులతో expansion of business, తరువాత సినిమాలు, దినపత్రికలు, టీవీ ఛానళ్ళు ఒకటేమిటి వెంకట్రావు conglomerate owner అయిపోయాడు. ఆ తరువాత అతను నెమ్మదిగా politics లో ఎదిగాడు. MLA అయ్యి minister కూడా అయ్యాడు.
ఈ మధ్యలో వెంకట్రావు personal life అంత పెద్దగా పట్టించుకోలేదు. అలాగని అతనికి పెద్ద problems ఎదురు కాలేదు. అన్ని facilities ఉన్న ఇంట్లో అణిగి ఉండే భార్య అతనికి plus point అయ్యింది. అతని జీవితంలో అతను కోరుకున్న కాంతలూ, కనకం అతనిని వరించాయి. ఇంకా అప్పుడు కీర్తి వెనక పడ్డాడు. ఇప్పుడు వెంకట్రావుకి ఉన్న సమస్య ఎలా గొప్ప పేరు సంపాదించాలని. ఈ సమస్యతో వెంకట్రావు ఒక multi speciality hospital , ఒక అనాధ శరణాలయం, ఒక school , college , blood bank అన్నీవరసగా open చేశాడు. ప్రతీ రోజు అతని పత్రికలలో, అతని TV channels లో అతని programs ప్రసారం అయ్యేవి. ఇక్కడే వెంకట్రావు విదేశీ links start అయ్యేయి. అతనికి ఆ links నించి వచ్చిన direction , inspiration తో మత మార్పిడి చేసుకొని Mr . Joseph Vankaayala అయ్యాడు.
Mr . Joseph Vankaayala జీవితంలో అలా ముఖ్యమైన నాలుగో అధ్యాయం మొదలైంది. మతం మారినంత మాత్రం చేత గతం మారదు కదా. స్వభావం అసలే మారదు. అతను చేసే వ్యాపారాలు ఇంకా కొత్త పుంతలు తొక్కాయి. high level lobbying , contracts ఇప్పించడం, hawaala transfers , రక రకాల scams , black money in swiss bank , foriegn collaborators తో india లోకి రకరకాల సరుకులు దించడం, మత మార్పిడులు ప్రోత్సహించడం, డబ్బొచ్చే పని ఏదీ వదలలేదు. అలాగ అంగ బలం, అర్ధ బలం పెంచిన Mr . Joseph వంకాయల తొందరోలోనే తన రాష్ట్రానికి CM అయిపోయాడు. అతను CM అయిన తరువాత opposition మనుషులని వాళ్ళ పార్టీ ని తొక్కి తొక్కి వదిలాడు. అతను శాంతి భద్రతలని సుస్థిరం చేస్తున్నాడని ప్రచారం జరిగేది. అలా మహామనిషి లా మారిన Joseph ని ఒక రోజు ప్రజా సదస్సు లో గుర్తు తెలియని వ్యక్తులు shoot చేసి చంపేశారు. opposition చంపిందని కొంతమంది , విదేశీ హస్తం ఉందని కొంతమంది, అతను అణగ తొక్కిన gangs revenge తీసుకున్నారని కొంత మంది, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అనుకున్నారు. నిజం మాత్రం Joseph నమ్మిన దేముడికే ఎరుక. అతని చావు కి ప్రతీకారంగా వారం రోజులు రాష్ట్రం అట్టుడికి పోయింది. అక్కడ జరగని దొంగతనం లేదు, లూటీ లేదు, murder లేదు, మానభంగం లేదు. Central governament special forces దింపితే మరో మూడు రోజులకి రాష్ట్రం కొంచం సద్దు మణిగింది. ఆ సంతాపంలో ఎంతో మంది తమ ప్రియతమ నాయకుడి మరణాన్ని భరించలేక కన్ను మూసారు. అట్టుడికి పోవడం తో సంతాపం తో చచ్చిన వాళ్ళ లెఖ్ఖ ఎక్కువే తేలింది. ఇంతవరకు కథ చెప్పిన భేతాళుడు అడిగాడు విక్రమ్ ని.
" Now you tell me Vikram whether Mr . Joseph succeeded or failed in life ".
విక్రమ్ ఏమి చెప్పకుండా భేతాళుడి వైపు బ్లాంక్ గా చూడడం మొదలెట్టాడు. భేతాళుడు కి doubt వచ్చింది. విక్రమ్ ని ఒక కుదుపు కుదిపాడు. అప్పుడు విక్రమ్ అన్నాడు. నువ్వు story మొదలు పెట్టినప్పుడే అన్నావు వీడు overaction చేసి ఓడిపోయాడని . నువ్వు ఓడిపోయాడు అని decide చేసిన తరువాత నన్నెందుకు అడుగుతావు అని. భేతాళుడు ఖంగు తిన్నాడు. నేనేదో అన్నాను మాట వరసకి . నువ్వు నీ opinion చెప్పొచ్చు అన్నాడు. విక్రమ్ చెప్పడం మొదలు పెతాడు.
నా blog చదివే నా friends కి - విక్రమ్ ఏమి చెప్పి ఉంటాడు - -మీ అభిప్రాయాలూ నాకు comments కింద పోస్ట్ చేస్తే సంతోషం.
success is defined by society and if society approves a persons rise with all the ills whom we are to differ.
ReplyDeleteRead a long time ago in readers digest---a farmers management of a large familyand his skills and commitment. In that essay the writer declares the farmer lived a complete life and made every one happy and his was a succesful life. One of my learned friends asked is the farmer happy? i replied rather vaguely perhaps completing a full life term and making every one happy be the rule for success there. If it was vague that day it is true today.
joseph vankayala lived in a society that made him rise and all his ills are pushed back. He was shot dead during his prominence leaavving back his legacy to be carried by his next gen.
Its pure success.
from personal point of view ----- joseph vankayala did everything deliberately and results he derived are fruits of his own doings. therefore he would have never felt sad.
Frm moral and other points----that ground never exists in this story.
i agree with RK even my thoughts are also similar to him.
ReplyDeletevery good.....bagundhi..
ReplyDelete