నా స్నేహితుడు రామానికి ఈ కింద ఇచ్చిన conversation , personal గా ఉండాలని feeling . నేను ఎప్పటికప్పుడు అందరితో పంచుకోవాలని
వాడి permission లేకుండా పెడుతున్న ఈ క్రింద conversation వాడు క్షమిస్తాడని అనుకుంటూ. ఇది కూడా సరదాకి వ్రాసిందే తప్పితే ఇందులో ఎవడి మీదా వాడివి కానీ నావి కానీ పర్సనల్ opinions కావని మనవి చేసుకుంటూ - పరస్పర డబ్బా ఇదే ఆఖరి episode - ఇంకెప్పుడూ పెట్టను
రామం : ఓ మనీషి, రుషి , మహర్షి ,
వాడి permission లేకుండా పెడుతున్న ఈ క్రింద conversation వాడు క్షమిస్తాడని అనుకుంటూ. ఇది కూడా సరదాకి వ్రాసిందే తప్పితే ఇందులో ఎవడి మీదా వాడివి కానీ నావి కానీ పర్సనల్ opinions కావని మనవి చేసుకుంటూ - పరస్పర డబ్బా ఇదే ఆఖరి episode - ఇంకెప్పుడూ పెట్టను
రామం : ఓ మనీషి, రుషి , మహర్షి ,
నీ అనుభవం నీదైన, నా అనుభవం నాదైన,
నిప్పు ముంటుకుంటే కాల్తాదని రుజువు కోసం నిప్పునీ తాకల్సిన అవసరం లేదోమో!
ముడుళు చిక్కు ముడిలే లేకపోతే , నీబాధ నాబాధ లేక నీ బోధ ఇన్ని సొదలు ఎందుకు?
ఎలఎటి పాట
నేను : సామీ
తెలివైనోడు తాకడుఒప్పుకోలేనోడు తాకుతాడు
బుర్రలేనోడు అందులో దూకుతాడు
ఇది నీకు సెప్పాలన్నసొద కాదు - ఎవడికి సెప్పడానికి ఎవడెంతోడు
ఇదంతా నా బరువు దింసుకోడం అంతే
మన్నించు సామీ మాట పొరబడితే
రామం :ఓ పండితా ,
సొద అన్నది ప్రాస కోసం గాని, వేరొకటి కాదు
ఎలనాగ
నేను : సామి సెబితే సరే
సామి కోపం ముసురే
సామి నవ్వు సిగురే
నా సామి రతనాల సామి
ఎదిరి లేని ఎంకన్న సామి
నేను : కానరారేరీ కవిగారు
రామం : కవి గారు , చనిరి అరకు
నేను : తవుడు గాడు తెచ్చిన తగువు
సుబ్బడి మాట బిగువు
అర్ధరాత్రి కిశోరన్నగుబులు
ఊడిపోయిన రాంబాబు టవలు
బాబన్న కోసం పరుగులు
డోర్మటోరీ లో అరుపులు
వాచిపోయిన కిశోరన్నకన్ను
దావీదు విసుగుతో ఊరుకుండెను మిన్ను
అయోమయం మైదానం కామేసు
అరకు ప్రయాణం అంతే ఇంతే కామోసు
నేను : కవీ నీ
కళా కాహళ
హళా హళిలో
కలిసిపోతిని
కరిగిపోతిని
కానరాకే
కదిలిపోతిని (అని శ్రీశ్రీ అన్నట్టు)
ఏరీ కవిగారు
నేను : ఏం కవీ - కథ చెప్పనా
గూఢచారి 116 దొంగని వెతుక్కుంటూ ఎక్కడెక్కడ తిరిగాడో తెలుసా
పాకిస్తాన్
బెలూచిస్తాన్
ఆఫ్ఘనిస్తాన్
ఖజ్హకిస్తాన్
కబరిస్తాన్ - ఇలాగ వాడు వెతికిన తరువాత వాడు ఎక్కడ ఉంటాడో తెలిసిందా - హిందూస్తాన్
హిందూస్తాన్లో
హైదరాబాదు
సికిందరాబాదు
ధనబాదు
ఫరీదాబాదు
బొందబాదు
శార్ధం బాదు - కానీ వాడికి ఆఖరికి తెలిసిందేమిటంటే వాళ్ళు ఇసాపట్నంలో ఉన్నారని
ఇసాపట్నం లో
పప్పులవీది
చట్రాజువారి వీధి
కోట వీధి
బొబ్బిలివారి వీధి
వసంతరావు వారి వీధి
రామాలయం వీధి
శివాలయం సందు
ఇలా సందులు, గొందులు తిరిగిన తరువాత తెలిసిందేమిటంటే - ఇంతకుముందు వాడు గొల్ల వీధిలో ఉండేవాడని కానీ ఇప్పుడు గణేష్ బార్లో ఉన్నాడని
ఇప్పుడు కవిగారికి ప్రశ్న - -వాడి పేరేమి???
నేను: పడుకున్న కవిగారు
ఎపుడు లేస్తారు
కప్పేసిన దుప్పటీ
ఎపుడు తీస్తారు
రమ్మన్నప్పుడు రారు
పోమ్మన్నప్పుడు పోరు
చెప్పమంటే చెప్పరు
ముళ్ళున్నాయంటారు విప్పరు
కాలుతుందంటారు
పేలుతుందంటారు
ఏం జరుగుతున్నదో తకరారు
వారి జాబు రాకపోతే మాకు బేజారు
రామం: చలంగారి భాష్యం ప్రకారం
తవుడు గాడు తంతరి
సుబ్బడు క్రోధి
కిశోరన్న పిరికి
రాంబాబు గాడు చవట
దావీదు గాడు జ్ఞ్యాని
కామేష్ గాడు .......
నేను: కామేష్ గాడు .......పెద్ద మైదానం
ఇంతకు ముందే చెప్పాగా
No comments:
Post a Comment