Tuesday, January 25, 2011

Science and Philosophy - 2

flash backs లోంచి కొంత వెనక్కి వచ్చి మళ్ళీ నా opinion about science వ్రాద్దామని ప్రయత్నం.


"A brief history of time "by Stephen hawking చదివిన తరువాత నా మనో నేత్రం ముందు ఎప్పుడూ ఒక picture కనపడేది. నా మీద ఆ పుస్తకం తాలూకు impact అనుకుంటాను. ఇప్పటికీ అ ఊహ/ఆలోచన/ఆ దృశ్యం నాకు అనిపించి కనిపించడం మానలేదు.
అదేమిటంటే ఏమి లేని శూన్యం లోంచి ఒక విస్ఫోటనం, దాంతో వెదజల్లబడిన మెరుపులు, వలయాకారాలలో తిరుగుతూ, పెరుగుతూ, తిరిగి sudden గా కుచించుకు పోయి శూన్యం అయిపోయి, ఇంకొక angle లో తిరిగి విస్ఫోటనం చెంది మళ్ళీ వెదజల్లబడి  - దీనికి అంతం లేదు. అది శూన్యం అయినప్పుడు ఒక ఉద్విగ్నత, అది విస్ఫోటనం చెందినప్పుడు ఒక జలదరింపు, ఆ శూన్యంలో పయనించేటప్పుడు  ఒక నిరామయత్వం - ఈ feeling నన్ను వదలలేదు. వదలటం లేదు.
నేను అదే నిజమని తీవ్రంగా నమ్మి దాన్నే ఆలోచిస్తూ ఉంటే నా ఊహల్లో అదే కనపడిందేమో. నాకు తెలియదు. అదొక్కటే justification అనిపించింది. నా logic కి అంత కంటే ఏమి తోచలేదు. కానీ ఆ భావ తరంగాలు నన్ను ఎప్పుడూ ఒక అలౌకిక ఆనందానికి గురి చేస్తాయి. నా అనుభవం నాకు నిజం. science గురించి వ్రాద్దామని మొదలెట్టి నా personal experiences వ్రాస్తున్నానేమిటి అనిపించింది.
ఇప్పుడు science గురించి  ఎలా మొదలుపెట్టాలనేది తెలియక  కొట్టుమిట్టాడి  ఎక్కడో అక్కడ start చేస్తే పోలా, అదే flow లో వచ్చేస్తుంది అనుకుని మొదలుపెట్టాను. మనిషి తనకున్న logic , reasoning తో తన చుట్టుపక్కల ఉన్నవాటిని discover చేస్తూ, వాటి ఆకృతి మార్చి కొత్తవి invent చేస్తూ , తను discover ,invent చేసినవి మనిషి అవసరాలకి సరిపడేలా ఉపయోగిస్తూ, తయారు చేస్తూ - ఇదొక నిరంతర ప్రవాహం.
నిప్పుని కనిపెట్టక ముందు కూడా నిప్పు ఉంది.ఇప్పటికి ప్రతిపాదించబడిన  theory ల ప్రకారము big bang మొదలైనదే నిప్పుతో or rather అగ్నితో.  విపరీతమైన వేడితో శూన్యం లోంచి  వెలువరించబడిన  ధూళి మేఘాలు మండుతూ  నిరంతర fission , fusion reactions తో కొత్త కొత్త అణు, కణ సముదాయాన్ని తయారు చేస్తూ , చల్లబడుతూ-వేడెక్కుతూ-తిరిగి చల్లబడుతూ , నిరంతరము వ్యాకోచం చెందుతూ , galaxy లై  తమ కక్ష్యలలో పరిభ్రమించుతూ ఈ ప్రపంచానికి తెర తీసాయి. ఈ సంయోగ వియోగాలతో భూమిపై సృష్టించబడిన జీవి తన ఉనికిని పెంచుతూ, వాతావరణానికి తగ్గట్టుగా మార్పు చెందుతూ, ఈ రోజుకి ఆలోచించగలిగే మనిషిగా, మనం చూస్తున్న మానవుడిగా మిగిలింది. మొదట్లో జంతువులా బ్రతికిన మనిషి, తనకున్న survival instincts తో, ఆలోచనా పటిమతో తన చుట్టు పక్కల ఉన్న వాటిని పరిశీలించి, అవగాహన చేసుకుని తనకి సరిపడేటట్టు వాడుకోవడం మొదలెట్టాడు. ఇప్పటికీ పైపొర చల్ల బడినా భూమధ్యంలో ఉండే lava , volcano ల ద్వారా ఈ వేడిని వెలువరిస్తుంది.  lava అంటే ద్రవ రూపంలో ఉండే రాయి.  మనకున్న ఆధారాల ప్రకారం ఈ నిప్పుని మనిషి  1 ,25 ,000 ల సంవత్సరాల క్రితమే control చెయ్యడం నేర్చుకున్నాడు. వాడి ఆహారపుటలవాట్లలోను(పచ్చివి తినడం మాని ఉడకబెట్టినవి, కాల్చినవి తినడం), జీవన విధానంలోను (రాత్రి వేళల పురుగులు, క్రిమి కీటకాల బారి నుండి కాపాడుకోవడానికి, చలి కాచుకోవడానికి etc .,) , వీటిలో మార్పు తెచ్చిన major discovery ఇది. కాలక్రమేణా నిప్పుని ఆయుధం క్రింద use చెయ్యడం నేర్చుకున్నాడు. మనిషి నిప్పు నించి విద్యుత్ produce చెయ్యడం మొదలెట్టాడు. ఇప్పుడు thermal power plants దీనికి ఉదాహరణ. నిప్పుని రాజేయ్యడానికి కావలిసిన ఇంధనాలు వెతుకుతూ ముందుగా కర్ర, వరుసగా బొగ్గు, ముడిచమురు ఉత్పత్తులైన, petrol , deisel , మళ్ళీ gas etc .,కనిపెట్టాడు. మళ్ళీ ఈ కనిపెట్టిన ఇంధనాల ప్రయోగాలతో వేరు వేరు అవసరాలకి రకరకాలుగా వాడుకుంటున్నాడు, చివరికి అంతరిక్షం లోకి ప్రయాణం చేసే రాకెట్ fuel లాగ కూడా. 


సశేషం 

1 comment:

  1. a very good topic and suggestible read for all. This seems to have an approach of romila thapar (who gave popuplar audience history of india).
    And my one: After the glacial age man faced his major problem, raw flesh being spoilt and contaminated. all the faculties of man came to work to find solution for this "major" problem. and it lead to discovery of fire in mesolithic age(middle stone age)

    ReplyDelete