Saturday, January 22, 2011

Friends and Friends Association - 2

f&f వారి ఆఖరి హంగామా


Dec 31st in townhall


మొదటిగా రాంబాబు గాడి మేడ మీద ఇచ్చిన ప్రదర్శనతో ఉత్సాహం చెంది రెండో సంవత్సరానికి తెర తీసాము. రాంబాబుకి వాడెక్కడ చూస్తాడో తెలియదు కానీ presentation విషయంలో ఒక funda ఉంది. తాటాకుల మీద invitation card అని మొదలెట్టాడు. వాడి fancy range చెప్పడానికి తాటాకుల కంటే ముందు జరిగిన సంఘటన. నా చేత రాత్రి పూట నా రక్తం తో love  letter వ్రాయించాడు. దానికి నెమలి పించం ఒకటి sharp చేశాడు వ్రాయడానికి. blade sterilize చేశాడు నా చెయ్యి నేను కోసుకోడానికి.రాత్రి ముహూర్తం. అయితే ఆ పించం తో వ్రాయడం అవ్వకపోతే దానితో ఒక love symbol వేసి ఊరుకున్నాము. మిగతాది మామూలుగానే వ్రాసాము. అయితే అప్పటి నా ఫ్రెండ్ "నీకిదేమి పిచ్చి" అని అడిగింది. నాకు వెర్రెక్కి అ letter కాలవలో పడేసి, వీడి collar పట్టుకుని లేపి ఒక గట్టు మీద పడేసాను. తరువాత వీడు నాకు మోచేతి వరకు పెద్ద bandage వేయించాడు. అది వేరే విషయం. ఈ ఆవేశంలో కిశోరన్న వాడి special friend కోసం  వేరే letter ఒకటి రాసి వాడి రక్తం తోనే - last లో సంతకానికి ముందు వాడికి doubt వచ్చింది. balance రక్తం ఏమి చెయ్యాలి అని. డేవిడ్ గాడు, రాంబాబు కూడా ఉన్నాడు అనుకుంటా, కిశోరన్నకి సలహా ఇచ్చారు. "ఇది నా రక్తం" అని వ్రాయమని. అది వ్రాసినా ఇంకా రక్తం మిగిలిపోతే మళ్ళీ అన్నగారికి doubt ఇదేమి చెయ్యాలి అని. అప్పుడు వీళ్ళ సలహా తాగేమని ఒకడు, అది ఆ letter లో జల్లీ మని ఇంకొకడు. అన్నగారి రక్తం ఆ తరువాత ఏమైందో నాకు గుర్తు లేదు. అంతకు ముందు ఏమైనా సినిమాల్లో ఈ రక్త పిపాస love letters ఉన్నాయేమో తెలియదు, కానీ తరువాత చాలా సినిమాల్లో ఈ రక్త పిపాస love letters ని వెటకారం చేస్తూ చాలా scenes ఉన్నాయి. రాంబాబు గాడి fancy thoughts చెప్దామని ఇంకేదో చెబుతున్నాను. ఇదనే కాదు వాడికి ఇలాటివే ఎన్నో ఆలోచనలు. ఎప్పుడూ ఏదైనా ఏదో variety చేద్దామనే వాడి తాపత్రయం. వాటి గురించి వాడి blog లో వాడే రాస్తాడు.
ఈ వెరైటీ లోంచి పుట్టుకొచ్చిందే ఈ తాటాకు మీద ప్రింట్. దీనికి డేవిడ్ గాడు  ఏరాడలో తాటాకులు నరికి తెస్తే వాటిని ఎండబెట్టి "ప్రకాష్  బుక్  స్టోర్స్" లో printing అనుకుంటా. మళ్ళీ వీటికి ముఖమల్ cover వాటికి మెరుపుల తాళ్ళు, పూసలు. కార్డు వరకు ఆదరగోట్టాము. ఇంకెవరో నాకు తెలిసిన "నాట్యమయూరి" group వాళ్ల చేత భరతనాట్య ప్రదర్శన. వాళ్లకి memento లు ఇచ్చాము. ఏవో ఒకటి రెండు డ్రామాలు వేసాము. అవి కూడా బాగానే నడిచాయి.
 ఆ తరువాత orchestra . ఇక్కడ farce మొదలైంది. ఈ orchestra కి prologue . నేను అప్పట్లో రెండు నెలలు ఏదో guitar నేర్చుకున్నాను. పూర్తిగా రాదు. ఏదో వానాకాలం చదువు లాటి guitar . మాకు lead singer అప్పలరాజు అని ఇంకో friend. voice బాగానే ఉండేది,  చిన్న ఉచ్చారణ దోషం. ప్రతి line వెనకాల "అం" అని మింగేవాడు. female voice కోసం మా ఇంటి పక్కనే ఉండే అమ్మాయి ప్రవీణ అని మాకేక్కడో దూరపు చుట్టాలు, ఆ అమ్మాయికి చిన్న నత్తి - "ప్రేమ పావురాలు"  సినిమాలో ఒక పాట లో" న్యా మనసేమో, న్యా మాటే వినదంటా" అని పాడేది.ఆ అమ్మాయిని పట్టుకున్నాము. ఇంకో female singer సునీత ( నవనీతం - ఆ అమ్మాయికి  nick name ) అని మా friend ఓ మోస్తరుగా బాగానే పాడేది.ఈ అమ్మాయి కిశోరన్న లిస్టు లోనే. కానీ డేవిడ్ గాడికి  special friend. తబలా వాయించడానికి పైడిరాజు అని అప్పల రాజు friend . వీళ్ళతో లింక్ లేని  బాబీ అని నాకు flute ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వాడి tuition సెంటర్ లో నేను classes కూడా చెప్పేవాడిని. వాడి ఫ్రెండ్ జోసెఫ్ అని violin వాయించే వాడొకడుమధ్యలో. వాడు ఏమైనా అంటే నేను jumping run వాయిస్తాను అనేవాడు. ఈ f & f  వారి orcheshtra  మినీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ ట్రూప్, రాజమండ్రి లాటిది.
నాకూ ఏమి చెయ్యాలో తెలియదు. ఎవడికి తెలియదు. మా ఇల్లు "లక్ష్మి విలాస్- రాతి మేడ " లో  orchestra rehearsals . ఈ మధ్యలో ఇంకెవరో reference లో ఒకతను casio వాయిస్తాను అని వచ్చాడు. ఆయనకి  తెలిసిన అమ్మాయిలు, వాళ్ల చేత కూడా పాడిద్దామని అతని ప్రయత్నం. వాళ్ళు గీతాంజలి సినిమాలో "ఓ పాప లాలీ" పాటలో chorus ఉంటుంది. ఓ పాప లాలీ అనగానే     " హా" అని - వాళ్ళు అది అంటారు అన్నాడు. మేము సరే అన్నాము. practice ఏమి చేసామో గుర్తు లేదు. లక్ష్మి విలాస్ ఆంతా సందడి. కలగా పులగం. Dec25th christmas రోజున మా పెద్ద మామ్మగారు చనిపోయారు. ఈ rehearsals మధ్యలో. ఆవిడ చనిపోయే ముందు మా singer అప్పలరాజు తో "పయనించే ఓ చిలుక " అనే పాట పాడించుకుని విన్నారు. చచ్చే ముందు ఆవిడ మనశాంతి పాడు చేసానేమోనని  నాకు ఎప్పుడూ ఒక guilty feeling . దాని నించి rehearsals కి break పడింది .
సరే అలాగే stage ఎక్కేసాము. ఇక్కడ సుబ్బడి గురించి కొంత చెప్పాలి. వాడు almost opposition leader నించి ruling party  leader అయిపోయాడు . నేను, కిషోర్, రాము ఒక పార్టీ అని, మిగిలిన మా ఫ్రెండ్స్ అందరూ ఒక పార్టీ అని తేల్చారు. అందుకనే వాడి participation ఈ ఫంక్షన్ కి ఏమి పెద్దగా లేదు. ఏదో last moment లో వచ్చి వాడి range హంగామా వాడు చేశాడు. సుబ్బడి emotions కానీ, వాడి ఆవేశం కానీ extremes లో ఉండేవి. మా friends కి almost అందరికీ వాడి style నచ్చేది. ఇప్పుడు వాడిని చూసిన వాళ్ళు ఎవరైనా ఆశ్చర్యపోయే అంతలా. ఆ projection ఎలా వచ్చింది అంటే కిషోర్ గాడి opponent సుబోద్ అనేలా. డేవిడ్ గాడు కూడా loyalties change చేశాడు. అలాగని కిశోరన్న ని బాధ పెట్టలేదు. అలాగ చిన్న split . కానీ ఎవడిని ఎవడూ వదలలేదు. ఎన్ని తన్నుకున్నా కలిపే తన్నుకున్నాం. 
ఇంకో పిట్ట కథ ఉంది. రాంబాబు గాడు dec31st కి అందరి దగ్గిరా collections అని మొదలెట్టాడు. ఎవడు డబ్బులిస్తే వాడికే కార్డు, పాస్. అందరూ collections చేశాము. చాలా మంది friends మేమేమి చేస్తామో చూద్దామని, డబ్బులు కట్టేరు. ఈ లోపల vizagapatnam క్లబ్ వాళ్ళు, మందు party with heavy music బయట పెట్టారు. ఆ sound భరించలేక మేము తలుపులు మూసేసాము. సరే జనాలు orchestra ఎలా ఉంటుందా అని కూర్చున్నారు. మొదటి దెబ్బ, mikes పని చెయ్యడం మానేశాయి. ఎవడైనా కెలికాడో కావాలని, లేదా అవే చచ్చాయో తెలియదు. అవి సెట్ చేసేసరికి screen లేవ లేదు. secretary రాంబాబు screen లాగ డానికి try చెయ్యడం. ఆ తతంగం అయ్యింది. మళ్ళీ   mikes పని చెయ్యలేదు. ఈ లోపుల మా orchestra ట్రూప్ ఏమి చెయ్యాలో తెలియక ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోవడం మొదలెట్టారు. మిగతా friends , families తో వచ్చిన వాళ్ళు గోల. తలుపులు మూసేసి ఈ తతంగం ఏమిట్రా అని. నేను బాధ భరించలేక బయటకి వెళ్లి కూర్చుని ఏడవడం మొదలెట్టాను. నేను అంత ఏడుపుగొట్టుగాడినని  నాకే తెలిసిన క్షణం అది. అప్పుడు నా friends అందరూ నన్ను ఓదార్చడానికి బయటకి వచ్చారు. hall లో ఎవడు చచ్చాడో , ఎలా చచ్చాడో తెలియదు.
ఈ సందట్లో నా సిగేరేట్ ప్యాకెట్ కొట్టేసిన వాడొకడు. ఆఖరికి ఆ casio వాయిద్దామని వచ్చిన అయన ఏవో రెండు పాటలు పాడి జనాలకి అయ్యింది అనిపించాడు . ఆ తరువాత సమోసాలు దొరకలేదని ఒకడు, గులాబ్ జామూన్ దొరకలేదని ఒకడు. డబ్బులు కట్టాం మాకేవీ అని ఒకడు. అదో రసాభాస. మొదటి సంవత్సరం function కి ఎంత సంతోషించానో ఈ రెండో సంవత్సరం అంత బాధ పడ్డాను. 
నాకు గుర్తున్నంత మటుకు ఆ function details అవి. మిగిలిన నా friends ఎవడి view point వాడికి ఉంటుంది. వాళ్ళు ఇంకో రకంగా వాళ్ళ అనుభవం ఆ రోజుది ఉండొచ్చు. ఇంకేమైనా విశేషాలు ఉంటే మళ్ళీ తరువాత గుర్తుకు వస్తే రాస్తాను.


సశేషం 

5 comments:

  1. f & f name bagundi
    ippude oka website lo f and f ki ichina acronyms:
    F&F Friends and Family (mobile phones)
    F&F Fast and the Furious (movie)
    F&F Furniture & Fixtures
    F&F Fox and Friends (TV show)
    F&F Forgive and Forget
    F&F Full and Final (settlement)
    F&F France and Flanders
    F&F Fire & Forget
    F&F Florence and Fred (UK clothing brand)
    F&F Fuzing and Firing
    F&F Fix and Follow Vision
    F&F Feetsinkers & Friends
    F&F 1st and 15th Entertainment (record label

    in memory of the youth ful josh

    http://www.youtube.com/watch?v=A1H6Ycm6BoY&feature=related

    ReplyDelete
  2. Dec'31st (Town Hall Function)... Aa roju.. naaku gurthunna .. nenu involve ayyina sangathulu

    Town Hall lo function cheddamu anukunna taruvatha, first permission isthara anna tension. Appudu maa inti eduruga (okappudu) vunna corporator gaari recommendation to nana patlu padi permission teesukunnamu, adi kooda town hall lo vantalu cheyyakoodadu and bhojanalu pettakoodadu anna condition to.

    Asalu meeku permission yevadisthadra anna vallu andharu aa debbaki adiri poyaru, kontha mandi kullukunnaru kooda. Kaani, ippativaraku baaganey vunna naaku yemayyindo sarigga teliyadhu (mana bhaashalo cheppalantey, pilakalu touch ayyi); function activities lo participation taggi poyindhi.

    Finally on 31st morning, total batch antha town hall decoration lo involve ayyi vuntey nenu mathram jaya gaadni venteskuni voorantha baladurga tirigi finally jaya gaadi nanna garu daachukunna VAT 69 bottle kottesi, Sridhar (Malyali) gaadi roomlo taaga galiginantha taagi appudu town hall lo entry icchhanu.

    Nenu enter ayyesariki, andharu balloons kaduthunnaru. Nenu mathram stage meedha Krishna paramathma phose lo padukuni vuntey Kishore anna vacchhi yekkadako velli yedho teesuku rammannadu. Appudu naa general style lo D_ _ _ ey ani anagaani okka sari bittara poyi, naa vaipu oka puruguni choosinatlu choosi chee anukuni vellipoyadu.

    Situation ardham ayyi migatha vaalu Jaya gaadiki nannu teesuku pora ani indicate chestey, akkadi nunchi bayatiki poyanu.

    Program:
    Reception committee: David Gaadu & Navaneetham ani mundu decide chesaru.. Kaani tharuvatha Kishore Anna manipulation to Adhi Kishore anna and ex ga maarindhi. Ofcourse ex final moments lo oppukokapothey, baadhakaramaina sannivesala madhya david and ex ga maarindhi.

    Boniye adbhutham ra anukuntoo vuntey orchestra start cheyyadaaniki mundu, mana pratyardhulu chaala mandhi (For ex: Chetta Pattina Kukka batch) kusintha kullu thonu, kusintha athrutha thonu (Manam yemi podichesthamo ani) hall lo enter ayyi vunnaru.

    Chaala expectections madhya orchestra start ayyindhi. Mana appalaraju bhayya with navaneetham, munduga (On public demand) “Jivvu mani konda gaali ..mmm” paata modhalu pettadu. Aaa pata poortheyyasarikey, mana prathyardhula mohallo oka china pati velugu kanipinchadam nenu gamaninchaanu. Ayina sarey.. appal bhayya rendo paata start chesadu. Ee saari thana favorite Baalayya baabu cinema lonchi (muddula mavayya anukuntanu) “Welcome andhaamoyi anna paata modhalu pettadu. Chaalu .. aa debbaki mana janalu antha haahaakaaralu… prathyardhulu vikataatahaasalu chesaaru. Aa tharuvaatha jariginadhanta pedda farce..

    Sudhadhnyasa, Naata raagallo violin, Neninthey style lo casio chelaregi ardhantaranga orchestra aapi arupulu gandhragolam Madhya David gaadi break –Dance introduce chesaka, Stage meedha tannukuney prayatnalu, tavudu gaadi savaallu… abbo chaala chaala.

    Kaakapothey aa roju hit ayyina vishayam yemitantey.. manamu town hall baabayi to tayaaru cheyyinchina veru senga pappu samosa and his tea.

    Migatha vishayalu mana janabha yevaraina chepithey baaguntundhi.

    ReplyDelete
  3. ముసాఫిర్ అఫ్ ఇండియా కి

    ఒరేయ్ బావా నాకు గురుతున్నతవరకు మొత్తం మూడుసార్లు F & F
    కార్యక్రమాలు జరిగాయి, రెండు సార్లు మా మేడమీద ఒకసారి townhall

    ReplyDelete
  4. okka vishyam cheppali...
    aaa functionlo edi chettakani farse kani ledu manaku teliakunda, vunna takkuva resourcesto takkuva budgetto, manakunna takkuva knowledgeto chalaa baga chesamu...

    rambabu gadi intidaggar.. vadevadu... cinemavallaki training istadu kadaa.. institute kuda vundi.. vadu mana programmeni chusi.. thrill ayyadu.. meeru inka kodiga practice chesta baga chestaru annadu..

    Thatiakula meda invitation ippataki oka innovation... appalaraju patlu, navaneetam lady singer oka nutana prayagam... I CAN PROUDLY SAY THAT WE MADE AN EXPERIMENT.

    Mana programme elavundi ante Indialo recent ga aiyna common wealth gameslaa.. PROGRAMME SUCCESS... kakapothe konni vuntayi kada. Lekapothe ivvanni eeroja ila matladukom kada...

    I have those invitations with me.. total 3 years invitations. 1. Thatiakulu inkokati patha rajulakalamlo RAJAPATRAMULA vunde model... We have done a fantastic job..

    Mana pata friends(I townlo) ippataki gurthuchesukuntaru aa functionlu... aa invitationlu...

    Chala mandi manam invitation ivvaledani feelaina vallu....

    State decoration kosam Muncipal park goda duki mokkali tevatam..

    Kamudu cheppina raktacharitra(BLOODTO LOVE LETTER)... appataki adi trend..

    LET ME SHARE YOU ONE QUOTATION ABOUT OUR FRIENDS.

    NEVER LEAVE A RELATION FOR FEW FAULTS
    NOBODY IS PERFECT
    NOBODY IS CORRECT
    AT THE END
    AFFECTION IS ALWAYS GREATER THAN PERFECTION..

    MARI KONNI VISHYALUTO

    ReplyDelete
  5. thnx anna - even if we are poles apart we should thank internet for giving this platform to share our thoughts with all - please see all the comments in the various posts - monna rambabu - ninna subbadu - ivala nuvvu - repu davidgaadu - very happy and special thnx to rk for introducing me to blog

    ReplyDelete