Thursday, January 20, 2011

Friends and Friends Association - 1

నా సినిమా blog posts అందరికీ నచ్చి వాళ్ళ పాత జ్ఞ్యాపకాలు చెప్పడంతో - నేను నా పాత జ్ఞ్యాపకాలకి వెళిపోయాను. అందులో కొన్ని అందరితోను పంచుకుందాం అనిపించి ఈ ప్రయత్నం.

మా స్నేహ బృందం ఇంతకు ముందు friends & friends association అని ఒకటి పెట్టాము. దానికి మా బాబన్న president , రాంబాబు secretary , నేను treasurer. ఈ association కి నాకు గుర్తున్నంత మటుకు agenda అంటూ ఏమి లేదు. Just కాలక్షేపం. దీనికో prologue ఉంది. నేను రాంబాబు ముందు ఏదో చేద్దామనే తాపత్రయం తో మాకు తెలిసిన lawyer దూర్వాసుల దక్షిణామూర్తి గారి దగ్గిరకి వెళ్లి," sir మేము ఒక trade union పెడదాము అనుకుంటున్నాము" అన్నాము. అతను మా వైపు జాలిగా చూసిన చూపు నాకు ఇంకా గుర్తే. అతను సరే ఐతే మీరు trade union పెట్టలేరు. ఒక సాంస్కృతిక సంస్థ పెట్టగలరు అన్నాడు. వెంటనే registrar office కి  వెళ్లి application తెచ్చి fillup చేసి register చేసాము. ఈ prologue కి ఒక prologue ఉంది. నాకు గుర్తున్నంత మటుకు ఇది వినాయక చవితికి వైజాగ్, గంగాబత్తుల వారి వీధిలో bobby (సింగరాచారి)గాడి ఇంటిముందు మొదలైంది. వినాయక చవితి ముందు రోజు మేము చిన్న పెండల్ వేసి అక్కడ విగ్రహం పెట్టి దాని decoration కి friends అందరమూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చేశాము. అందరిలోనూ ఒక చిన్న spark - ఆ సరదా ని కొనసాగించడానికి ఏమి చేస్తే బాగుంటుంది, ఇంకా big scale లో అని ఆలోచిస్తే వచ్చిన idea  ఈ association మొదలెట్టడం. ఈ f &f వారి మొదటి సాంస్కృతిక కార్యక్రమం -- రాంబాబు గాడి డాబా మీద.
దీనికో interlude కూడా ఉంది. మా ఫ్రెండ్స్ అందరిలోనూ కిశోరన్న girl friends విషయంలో యువకిశోరం - వాడి పుణ్యమా అని రాంబాబుగాడు ఎప్పుడూ ఒక fascination లో ఉండేవాడు. వాడికి అప్పటికే ఒక fail sequence ఉండేది. వాడి దృష్టిలో కిశోరన్న hero .నేను కూడా వాడి fancy ని క్యాచ్ చెయ్యడానికి రెండు మూడు, అబద్ధం ప్రేమకథలు కల్పించి నా జీవితంలో జరిగినట్టు   చెప్పాను. ఈ అబద్ధాలు చాలా రోజులు continue చేసిన తరువాత, నాకు ఆ అబద్ధాల బరువు ఎక్కువైపోయి townhall లో రాంబాబుకి confess అయిపోయాను ఏడుస్తూ. వాడు కూడా నన్ను ఓదార్చాడు. తరువాత కిశోరన్న మాకందరికీ ఎవరో ఒక girl friends ని తగిలించాడు. అప్పట్లో మాకు girl friends ఉండేవారంటే అది వాడి పుణ్యమే. వాడు వాడి సామ్రాజ్యం, దాని నిండా అమ్మాయిలు. కిశోరన్న వెనక వందమంది పడితే, వీడో అమ్మాయి వెనక పరిగేట్టేవాడు. అదో పిట్ట కథ. డేవిడ్ గాడు మాకు VTcollege  class mate . వాడు, కిశోరన్న కరాటే నేర్చుకుంటూ ఉండేవారు. కిశోరన్న అప్పట్లో break dance కూడా నేర్చుకునే వాడు. సరే ఈ girl friends అందరిని రాంబాబు గాడి డాబా మీదకి పిలిచాము. మా ప్రతాపాలు చూపించడానికి.
సుబ్బడి entry మా స్నేహ బృండంలోకి ఎలా జరిగిందో నాకు సరిగ్గా గుర్తులేదు. ఈ function time కి వాడు కూడా ఉన్నాడు. వాడి రూటే సెపరేటు. కిశోరన్న ruling party అయితే వీడు opposition లీడర్. కానీ అందరిని కలిపే ఒక మిడిల్ క్లాసు, ఇంకా చదువు, love failure links చాలా ఉండేవి. ఎంత కొట్టుకున్నా ఒకళ్ళని ఒకళ్ళు ఒదులుకోలేకపోయాము  . ఎన్ని భీబత్సాలు జరిగినా సరే. 
ఇంకా రాంబాబు గాడి డాబా మీద f &f వారి కార్యక్రమాలు.
1. నేను, రాంబాబు  script వ్రాసి  తయారు చేసిన డ్రామా, ఇంకొకటి -  రెండు ప్రదర్శన ఇచ్చాము.
ఒక దాంట్లో యువత కి సందేశం. చెడు అలవాట్లు నేర్చుకోవద్దని. ఇందులో మధ్యలో సుబ్బడు ఏదో టేబుల్ మీద కూర్చోవాలి. sudden  గా అది పడిపోయింది. వెంటనే సుబ్బడు, రాంబాబు అప్పటికప్పుడు కొన్ని dialogues mix చేసి interrruption లేకుండా  డ్రామాలో కలిపేసారు. next minute  లో  current పోయింది. మళ్ళీ current వచ్చిన తరువాత అదే scene start చేశాము. అందులో టేబుల్ పడిపోయే dialogues లేకుండా వెళ్ళిపోయింది  . నీలిమ అని మా friend కి doubt వచ్చింది. ఇదేంటి ఇలా మారిపోయింది అని. సుబ్బడు అప్పుడు వాడి skill గురించి చిన్న చిరునవ్వుతో explain చేశాడు.
రెండు భరాగో వారి ఏదో డ్రామాలో ఒక పోర్షన్ తీసుకుని - అందులో almost నేను ఏక పాత్రాభినయం. మీసాల వెంకటసామి పోర్షన్. మధ్యలో dialogues మర్చిపోయాను. వెనకనించి రాంబాబుగాడి prompting . అందరూ నవ్వులు.
2. నీలిమ తమ్ముడు నవీన్ భరతనాట్య ప్రదర్శన. అదివో అల్లదివో అని. అది బాగా జరిగింది.
3. రాంబాబు magic show - వాడికి మేజిక్ ఏమి రాదు. ఏదో పెద్ద suspence లో పెట్టి సరదాకి చేశాడు. 
4 . నేను ఇది సరిపోదన్నట్టు పాటలు పాడటం. 
కిశోరన్న తమ్ముడు బుజ్జి తో "we are the world " ఇంగ్లీష్ సాంగ్- 
ఇంకెవరిదో పాట నాదని చెప్పి రాంబాబు  గాడిని నమ్మించేసాను-అది  "ఏ కోనలో విరబూసినావో కదా" అదొకటి - 
ఇంకో సాంగ్ హిందీ" ఎహసాన్ మేరె దిల్ పే". 
నిజంగానే మిగతా వాళ్లకి ఆ రోజు ఎలా గడిచిందో తెలియదు. నాకు మాత్రం fantastic evening . ఈ కింద లింక్ లో అ హిందీ పాటని చూడొచ్చు.
http://www.youtube.com/watch?v=AqZjKe8p1gI
ఇది నిజంగా, మనస్పూర్తిగా నా friends కోసమే ఈ song
ఆ తరువాత సంవత్సరం ఇంకా హంగామా చేశాము. అదే f &f వారి ఆఖరి హంగామా . దాని గురించి next post లో.


సశేషం 

4 comments:

  1. relive those treasured moments
    call every one associated with it to a gathering on a specific day.
    the agenda should be simple. to relive and get back to the great memory
    open a fand f account in face book
    open a f and f in picassa. ask every one to post their pics in it.
    many ideas to relive. heart matters.

    true kamesh

    bodisatva once preached: fear nothing but time. it engulfs you into its fold and you wonder where your precious years were lost.

    ReplyDelete
  2. memories to cherish for a long time
    RK sir thought line is good. But it all depends whether all respond in the same wave length.
    yes.
    i have that buddhist story about time about which RK sir is refering . if anyone is interested i will post it in this comment section

    ReplyDelete
  3. dear mohan
    please post what ever you like
    no bar - this blog is for us
    what ever story, letter you want to share in personal or with everybody no issue- don't think- just flow

    ReplyDelete
  4. Anna

    Balla meeda nenu kaadu koorchunnadhi. Adhi nuvve.. Naa pathra kastha pakkaga chiraggey vundey pathra. For a better clarification, i will try to recollect all the characters in the drama:

    01. Subba (Antey nenu): Drug Addict, endukantey naa charater ki intlo vallatho relation sarigga vundahu.

    02. Kishore Anna: Love Failure candidate

    03. David (Konda gadu): Freak guy (Ammayila Venuka)

    04. Prakash (Tavudu gadu): Ayomayam character

    05. Kamesh (antey nuvvu): Preacher, endukantey nee pathra maa andhariki ila vundodhhu ala cheyyoddhu ani cheppey character.

    Rambabu (alla varu): Prompter cum narrator.

    Oka scene lo migatha pathralanni vundaga nuvvu drama lo ki entry isthavau. Entry lo nee dialogues cheputhu vacchi table ki anukuntavu.. ayityhey, table balance leka adhi koncham vorigithey, janalu navvuthu, navvabothu vuntey, appudu nenu aa table kuntidhani telusu kadhara malli daniki yendu anukuntavu ani cover chesanu..

    Ayithey, current poka mundhu adhey scene lo nenu cigareete kalusthunnattu natinchali..

    Kaani drama ni advantage ga teesukuni, andhari mundhu nenu cigarette nijamganey veliginchi rendu moodu dammulu voodhi paresanu. Hee Hee.

    Aa roju mana janala girl friends mathramey kaadhu, David gaadi ammagaru, lydia aunty ithyadi pedda vaallu kooda mana pratbhani veekshinchadaniki vacchharu.

    Aa roju chaala mandhiki night 12.00 clock ki hangama ayipoyindhi. kaani manaki start ayyindhi. Chetta gaallu for ex:- babayi gaadu vagaira kaalusthunna more black cigarette lanu , manamu manesthunnamani declare chesi pareyinchadamu.. tellavaru jamu varaku ardham pardham leni hasku tella vareyka, yarada nunchi tteesuku vacchina sound boxes tirigi ivvadaniki nenu-tavudu, babai-david, naa priya scoote and baabai valla anna lml-vespa meedha velli, yaarada local hotel lo Rs.130/- tiffin cheyyadamu (a life time experience for that hotel owner, becoz, we 4 have finished the entire tiffin prepared by him that day).. etc.

    More nostalgia..

    Bye

    ReplyDelete