Tuesday, January 11, 2011

Movies in my life - 1

సినిమా
దీని గురించి తెలిసిన వాడు, తెలియని వాడు, నాలాటి వాడు అందరూ ఉద్గ్రంధాలు వ్రాసేశారు.Drama శకం నించి  మూకీలు ఎలా మొదలయ్యాయి, ఎవడు కనిపెట్టాడు,మొదటి టాకీ, ఆర్వో కలర్, గేవా కలర్, eastman కలర్,scope, 70MM,stereo , dtx , sfx etc.,
అందరూ చెప్పేశారు. నేను చెప్పడానికి ఏమీ  లేదు. కానీ నా జీవితంలో నేను చూసిన సినిమాలు, అప్పటి సంఘటనలు, వాటిలో నేను మరిచిపోలేనివి, నన్ను కదిలించినవి నేను మాత్రమే  చెప్పగలను. అవే అందరితో పంచుకుందాం అనిపించి ఈ ప్రయత్నం.
నాకు నచ్చినవి చాలా సినిమాలే ఉన్నాయి. నన్ను ప్రభావితం చేసినవి కూడా చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను చెప్పే సినిమాల తో నా జీవితంలో సంఘటనలు కూడా ముడిపడి ఉన్నాయి.


నాకు బాగా గుర్తుండి  పోయిన మొదటి సినిమా సీన్  - మా  టాటా శ్రీనివాస్ అన్న నేను 3rd std లో ఉన్నప్పుడు నన్ను, నా తమ్ముడు మురళి వచ్చాడో లేదో గుర్తుకు లేదు, తీసుకు వెళ్ళాడు. 1977 అనుకుంటా విశాఖపట్నం, అలంకార్ ధియేటర్ లో push back సీట్స్ వైజాగ్ లో 1st time introduce చేసారు . అడవి రాముడు సినిమాలో NTR మొదటి డైలాగు - ఎవడో అమ్మయిని chase చేస్తూ ఉంటాడు - వాడిని ఒక తన్ను తన్ని ( NTR face చూపించరు  - NTR కాళ్ళు మాత్రం కనపడతాయి-చేతిలో belt )  ........... ఈ అడవికి రాముడ్ని అంటాడు. అందులో పులితో fight , ఏనుగులు circus లో చూపించే feats బాగా enjoy చేశాను.. 
ఆ తరువాత VT college ,శివాలయం branch  లో   నా class leader గిరిధర్ నన్ను అడిగాడు, "నువ్వు ఎవరి favourite " అని, 
"అంటే" అన్నాను -
"నీకు ఎవరంటే ఇష్టం" అని అడిగాడు -
" ఏమో తెలియదు" అన్నాను - 
మళ్ళీ అడిగాడు "NTR లేదా ANR ఎవరు" అని అడిగాడు -
obvious choice NTR - అలా నేను NTR అభిమానిగా మారాను.


1979 లో శంకరాభరణం సినిమా రిలీజ్ సంగం-శరత్ లో అయ్యింది. మా నాన్నగారు అసలు నాకు ఊహ తెలిసిన తరువాత ఎప్పుడూ సినిమాకి వెళ్ళడం చూడలేదు. మా బలవంతం మీద రెండో మూడో సినిమాలు చూసారు. అలాటి మనిషి 30 times చూసిన ఏకైక సినిమా. నా ఫ్యామిలీ మొత్తం including మా పెద్ద మామ్మగారు కూడా చూసిన సినిమా. మూడు టికెట్స్ 1st క్లాసు, రెండు టికెట్స్ balcony అది మా నాన్నగారు బ్లాక్లో కొని తీసికెళ్ళిన సినిమా. మా పెద్ద మామ్మగారు మా బాల్కనీ లో మడత మంచం మీద పడుకుని  నా చేత ఆ సినిమా పాటలన్నీ పాడించుకుని వింటూ ఉండేవారు. అప్పట్లో ఆ సినిమా అర్ధం కాలేదు. పాటలు పాడేవాడిని అంతే . మా పట్టాభి మావ దగ్గిరకి Bhilai వెళ్ళినప్పుడు, శివాజీ అని అతని ఫ్రెండ్ " హలో శంకర శాస్త్రి"   పాట నా చేత పాడించుకుని రికార్డు కూడా చేశారు. ఆ తరువాత చాలా సంవత్సరాల తరువాత మళ్ళీ చూశాను. విశ్వనాధ్ గారికి ఇదే నా సవినయ నమస్సు. అందులో నన్ను బాగా ప్రభావితం చేసిన dialogue  - శంకర శాస్త్రి తులసిని ఇంటికి తీసుకువస్తాడు - ఆమె తరఫున అతని ఫ్రెండ్ మాధవ, advocate ని కేసు వాదించమంటాడు  . అప్పుడు మాధవ శంకర శాస్త్రితో అంటాడు"లోకమంటూ ఒకటి ఏడ్చింది కదా అని" - దానికి శంకర శాస్త్రి " లోకేశ్వరుడికి  తప్ప లోకానికి భయపడనురా మాధవా" అంటాడు. ఆ ఒక్క డైలాగ్ లో శంకర శాస్త్రి character  అతను నమ్మిన దానిమీద అతని conviction  నాకు బాగా నచ్చింది.


1981 లో ఆకలి రాజ్యం సినిమా రిలీజ్ అయ్యింది. అప్పట్లో అది గొప్ప craze . "సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్" అనే పాటని నేను 7th చదువుతున్నప్పుడు ఏదో పెళ్లి భోజనాలలో మా చుట్టాలతను  పాట  పాడాడు. చాలా నచ్చింది. కానీ ఆ సినిమా నేను 1985 లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు చూశాను. అందులో గుర్తుండిపోయిన scene - కమలహాసన్ శ్రీశ్రీ పుస్తకాలు అమ్ముతాడు. శ్రీదేవి అడిగితే చాలా దుఖంతో చెబుతాడు. "ఆకలి ఊదే నాద స్వరానికి మనిషి ఆడక తప్పదు" అని. శ్రీశ్రీ అభిమాని  క్రింద  మారింది ఆ సినిమా చూసే. ఆ సినిమా అప్పటికి ఇప్పటికీ నా favourite movie . ఎందుకంటే అందులో hero నాలాగ జీవితంలో compromise అవ్వలేదు. అనుకున్న దానికి నిలబడ్డాడు. నచ్చిందే చేశాడు. నా ఫ్రెండ్ రాంబాబు, సుబోద్ చాలా సంవత్సరాల తరువాత  ఏదో ఒక సందర్భంలో అన్నారు - ఇంకా ఏంట్రా ఆ movie అంటే fascination అని. అదేంటో అదంతే . ఇంకా  నా తమ్ముడు మురళి లెఖ్ఖ ప్రకారం నేను ఇంజనీరింగ్ 2nd year -1988 లో ఇంట్లోంచి అలిగి పారిపోయాను -  తినడానికి ఏమి లేక diamond పార్క్ లో కళ్ళు తిరిగి పడిపోయాను.ఏదో హోటల్ లో కప్పులు కడిగాను, వాడు పెట్టే టిఫిన్ కోసం. ఏదో సంఘం వాళ్ళు పెట్టిన  చలివేంద్రం లో  పుస్తకాలు  చదువుకుంటూ కూర్చున్నాను. అందుకే వాడు అది ఆ సినిమా ప్రభావమే అంటాడు. ఎందుకంటే నేను పారిపోయేటప్పుడు నా దగ్గరున్న శ్రీశ్రీ, చెలం పుస్తకాలు తీసుకుని పారిపోయాను. అందుకు.


తరువాత 1983 లో నేను Pre -matric చదువుతున్నాను. ఎందుకో గుర్తు లేదు మధ్యాహ్నం  స్కూల్ నించి ఇంటికి వచ్చేసాను. మా అమ్మ ని "డబ్బులు కావాలి"  అడిగాను. "దేనికి" అని అడిగింది. "సినిమా కి వెళ్తాను" అన్నాను. అప్పుడు శ్రీ కృష్ణ పిక్చర్ ప్యాలస్ లో అభిలాష, చిరంజీవి సినిమా ఆడుతోంది. Rs2.25 balcony ticket . ఆశ్చర్యంగా ఒక్కడివే వెళ్తావా అని కూడా అడగలేదు. మూడు రూపాయలు ఇచ్చేసింది. అది పట్టుకుని స్కూల్ uniform  లోనే  పరిగెట్టాను. ఒక్కడినే చూసిన 1st సినిమా. interval లో బఠానీలు కొనుక్కున్నాను. చిరంజీవి యురేకా సకమికా అనే పాటలో handle వదిలేసి motor cycle నడపడం చూసి thrill అయిపోయాను. 


మరికొన్ని నా జీవితంలో జరిగిన సంఘటనలు, సినిమాలు next post లో 


సశేషం 

2 comments:

  1. cheppanu kada
    this is kamesh for you folks
    these examples made me to think_where iam
    what iam and who iam
    continue dear this is what made me your follower and why i consider you a influence

    ReplyDelete
  2. yes sankarabharanam is one of the excellent movies Viswanath made. The next one is Swathikiranam where-in Mammootty portrayed the jealousness of a teacher.

    ReplyDelete