Monday, January 17, 2011

Movies in my life - 4

సినిమా........contd
నా శ్రీమతి తో సహా అందరూ నచ్చింది అన్నందుకు one more round of సినిమా


నా జీవితంలో నాకు బాగా నచ్చిన నన్ను ప్రభావితం చేసిన ఇంకొక సినిమా "కొడయాట్టం" అనే మలయాళం సినిమా. అందులో గోపి హీరో. director అదూర్ గోపాలక్రిష్ణన్ అనుకుంటాను. ఈ సినిమా నేను దూరదర్శన్ లో ఆదివారం చూశాను.regional film category లో  మధ్యాహ్నం వచ్చింది. నేను అప్పుడు 9th std అనుకుంటాను. ఆ సినిమాలో ముందు హీరో అల్లరి చిల్లరగా తిరుగుతూ జీవితం గడుపుతాడు.అక్క చాటున బ్రతుకుతూ ఉంటాడు. వీడికి పెళ్లి చేస్తుంది. హీరో పెళ్ళాం వీడి బాధ్యతలేని తిరుగుళ్ళు భరించలేక వదిలేసి వెళిపోతుంది. అప్పుడు హీరో భార్య గర్భవతి. అయినా హీరో (వాడి పేరు శంకర్ అని గుర్తు) ఏమి పట్టించుకోడు.  వాడికి తిండి పెట్టే అక్క పెళ్లి చేసుకుంటుంది. వీడంటే అభిమానం చూపించే ఒక విధవ ఎవరిచేతో మోసగించబడి ఆత్మహత్య చేసుకు చచ్చి పోతుంది.ఒంటరివాడు అయిపోతాడు.తరువాత  హీరో ఒక lorry cleaner కింద జాయిన్ అవుతాడు. అష్ట కష్టాలు పడి  ఎలాగో నిలదొక్కుకొని మొదట సంపాదించినా డబ్బులతో పెళ్ళానికి మల్లె పూలు కొని తీసుకు వెళతాడు. అప్పుడు వాడి అత్తవారింట్లో హీరో తన  కొడుకుని ఎత్తుకుని ముద్దాడతాడు. ఇంతవరకే గుర్తుంది. ఇదే  climax అనుకుంటాను. దీని తరువాత గుర్తులేదు. నిజంగా భర్త బాధ్యత తీసుకోవడం లో ఒక life partner పడే సంతోషం, వాడు నిజంగా వాడి కొడుకుని ఎత్తుకునే క్షణంలో వాడి feeling నాకు ఎప్పటికి చెరగని memory . ఈ సినిమాలో గోపి peformance fantastic. subtitles తో సినిమా follow అవ్వడం ఈ సినిమాతోనే నేను మొదలెట్టాను. ఇదే నేను చూసిన మొదటి పరభాషా చిత్రం. ఇంటర్మీడియట్ నించి ఇంక భాష తో సంబంధం లేకుండా సినిమాలు చూడటానికి ఈ సినిమాయే పునాది. కొంచం ఓపిక ఉన్నవాళ్ళు చూడతగ్గ సినిమా.


నవ్వంటే ఇప్పటికి ఎప్పటికి నేను మర్చిపోలేని సినిమా "శ్రీవారికి ప్రేమలేఖ". దీని గురించి నేను ఏమి చెప్పినా తక్కువే. ఇంత నవ్వించగలిగే సినిమా తియ్యడం ఒక్క జంధ్యాలకే చెల్లింది. ఇందులో మనం enjoy చెయ్యలేని సీన్ అంటూ ఉండదు. ఈ సినిమాలో  ఎవడైనా నవ్వలేకపోతే నా అభిప్రాయం ప్రకారం వాడి జీవితంలో ఏదో భయంకరమైన లోపం ఉన్నట్టే. అన్నీ నాకు నచ్చిన సీన్లే. అన్ని dailogues నాకు కంథతా నే.  అందులో లాస్ట్ పావుగంట సీన్ లో పెళ్ళిలో జరిగే అన్ని రకాల farce లు ఉంటాయి.ఒకావిడ పట్టు చీరతో సతమతమైపోతూ ఉంటుంది. పెళ్లి ఉంది అన్నప్పుడు పట్టు చీర కట్టడం. లేదు అనగానే చీర మార్చి మామూలు చీర కట్టడం. ఆఖరికి ఈ తతంగం నాలుగు సార్లు జరిగిన తరువాత మళ్ళీ పెళ్లి cancel అని తెలుస్తుంది. ఆవిడ ఎంతో నిస్పృహతో "మళ్ళీ పట్టు చీర విప్పేయాలా " అని అడుగుతుంది. అప్పటికే వెర్రెక్కిపోయి హీరో తండ్రి (వీరభద్రరావు) అక్కడ ఉన్న ధాన్యం మూటల మీద అయ్యప్ప pose లో  కూర్చొని ఉంటాడు. ఈ మాట వినగానే ఒక్కసారి కిందకి గెంతి "నువ్వు విప్పి నాకు కట్టవే" అంటాడు.
నవ్వుని తెలుగు సినిమా లో define చేసిన జంధ్యాల కిదే నా నీరాజనం.


regional films flow లో నేను చూసిన నాకు బాగా నచ్చిన ఇంకో రెండు సినిమాలు. సత్యజిత్ రే తీసిన "జన అరణ్య " and రిత్విక్ ఘటక్ తీసిన "మేఘే డాక  తార". వీటి గురించి మరోసారి.


సశేషం



1 comment:

  1. dear kamesh
    you took me all the way to my child hood with the reference to the regional cinema.
    its the regional cinema slot in doordarshan every sunday afternoon widened my thought process. my mother used to make me sit and watch those movies so that i can understand various cultures( really great mother-these days mother's allah jaane)
    i fondly rememember oridathu, kanchanaseetha,kummati..( of aravindan.. a master film maker) swayamvaram, kodiyetttam, ellipatthayam)assamese original of saaheb which was remade as vijethain telugu, mrigaya( of mrinal sen) maa uri katha(gautam ghosh).... i can mention a lot.
    here i make a point to remember the quality of tv programmes made those days. let it be soaps like hum-log,bunniyaad, khaandan, or clean enetertainers like ye jo hai zindagi, nukkad, or historicals like discovery of india ( its by shyam benegal) the sword of tippu sultan, chanakya or thought provoking serials like rajani, wagle ki duniya, phatichar or mythlogicals (ramayana, mahabharatha) or timeless classics like malgudi days or kid porogrammes like ek do teen chaar, vikram bhetaal doordarshan made living look purposeful.
    the timings were restricted. weekdays it used to sart at 600pm and end by 1000pm. week ends particularly on sundays programmes were made with as lot care. star trek, cosmos, serials, regional film, a hindi film in the evening made sundays sundays.

    we used to wait for giant robot on wednesday. we used to wait for a lot. to watch those programmes we used to complete our home works and other important works. elders used tv to make the kids more responsible. the programmes were made with responsibilty and entertainment.

    you want to reform the present tv scenario. send them the old doordarshan management lessons

    doordarshan roadened my vision
    can you apply the same to todays innumerable tv channels

    prannoy roy( of ndtv) siddartha basu ( of KBC)shahrukh( fauji and circus) and a many got a boost to their careers from doordarshan.

    cheppanu kadha, ILA ENTA SEPAINA VTASEYAGALANU

    THKS RA kamesh
    you made me remeber my best days in life

    ReplyDelete